మహిళలకు అవకాశాలు ఇచ్చి చూడండి

పి. అనిత
నా వయస్సు 43 సంవత్సరాలు. హైద్రాబాద్‌లోని బర్కత్‌పుర ప్రాంతంలో మా నివాసం. నా విద్యాభ్యాసం 8 వరకు కరీంనగర్‌లో, తర్వాత ఎం.కామ్‌ వరకు హైద్రాబాద్‌లో జరిగింది. మా తల్లిదండ్రులు మధ్యతరగతికి చెందినా కూడా ఏనాడూ దేనికి లోటు లేకుండా ఎంతో క్రమశిక్షణతో పెంచారు. ఈ కాలం పిల్లల్లా కాకుండా మా బాల్యం ఆటపాటలతో సరదాగా గడిచింది. అల్లరితోపాటు చదువులో కూడా ముందు ఉండేవాళ్ళం. పెళ్ళి అయ్యేవరకు 2 సంవత్సరాలు రెడ్డి మహిళా కళాశాలలో పార్ట్‌టైం లెక్చరర్‌గా చేశాను. చదువు నేర్చుకున్నచోటే చదువు చెప్పడమనేది గమ్మత్తుగా అన్పించేది. మా ఆయన బిజినెస్‌ + రాజకీయ రంగాలు బిజీ బిజీ. అత్తామామలు లేకపోవడంతో ఇంటి బాధ్యతలు పూర్తిగా నేను చూసుకోవాల్సి వచ్చింది. అందకని పార్ట్‌టైం జాబ్‌ వదిలి ఫుల్‌టైం హౌస్‌వైఫ్‌ కాదు హౌస్‌ ఇంజనీర్‌గా మారాల్సి వచ్చింది. పిల్లలిద్దరు కొద్దిగా పెద్దగా అయ్యాక మా బిజినెస్‌ గోపాల్‌రావు ఉఆస్త్ర (గాస్‌) డిస్ట్రిబ్యూషన్‌ను చూసుకోవడం మొదలుపెట్టాను. ఇక అస్తవ్యస్తంగా ఉన్న ఆఫీస్‌ని మార్చడానికి నడుంకట్టాను. 8 సంవత్సరాల నుండి రెగ్యులర్‌గా 30,000 మంది కస్టమర్ల సర్వీస్‌లో మునిగిపోయాను. రోజూ రకరకాల కస్టమర్స్‌, రకరకాల సమస్యలు. అందర్నీ సమాధానపరచాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి గాస్‌ రాక మా సప్లై 15 రోజులు అవుతుంది. అపుడు కొంతమంది ఆఫీస్‌కు వచ్చి గొడవ కూడా చేస్తుంటారు. అడపాదడపా స్టాఫ్‌ నుండి ఇబ్బందులు. మొదట్లో చాలా కష్టంగా అన్పించేది. ఇపుడు అంతా ఛాలెంజింగుగా తీసుకుని ముందుకు సాగుతున్నాను. ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు ఇదే బిజినెస్‌.
నా దృష్టిలో మనకున్న 24 గంటలలో కుటుంబానికి, ఉద్యోగానికి, సమాజానికి మధ్య సమన్వయం చేస్తే ఒత్తిళ్ళే ఉండవని నా అభిప్రాయం. పిల్లలకు వితిబిదీశిరిశిగి కాదు వితిబిజిరిశిగి శిరిళీలి ఇస్తే చాలు. కుటుంబ సభ్యుల గోరంత సహకారం, ప్రోత్సాహం మహిళలకు చాలా అవసరం. మా హస్పెండ్‌ ఎపుడు పిల్లల గురించిగాని, ఇంటి సమస్యను ఎపుడు పట్టించుకునేవాడు కాదు. ప్రతిదీ నేను చేసుకోవాల్సిందే. ఆర్థికంగా మన కాళ్ళమీద మనం నిలబడాలి. అపుడే మనకు ఆత్మవిశ్వాసం అనేది వస్తుందని నా నమ్మకం.
మహిళా సాధికారత అంటే పెద్ద నిర్వచనాలు రావు. మహిళ ముఖంలో కనబడే ఆత్మవిశ్వాసం. తనకు సంబంధించిన కీలక నిర్ణయాలను తానే స్వయంగా తీసుకోగలదు. ఆ స్టేజికి ఆమె రావాలంటే చదువుతో పాటు ఆర్థికంగా కూడా ఆమె కాళ్ళమీద ఆమె నిలబడాలి. ఏ రంగమైనా సరే ఓ అవకాశాన్ని మహిళలకిస్తే చాలు అసాధ్యాలు సాధ్యాలుగా మారతాయి మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు చాలా ధైర్యంతో, తెగువతో పనిచేస్తారు. మనచుట్టూ చూస్తే ఇంతకు ముందుకంటే మగవాళ్ళు ఇంటిపనిలో పిల్లల విషయంలో సహాయపడుతున్నారు. ఇది హర్షనీయం.                          ఇంటర్వ్యూ : ప్రసన్న

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

One Response to మహిళలకు అవకాశాలు ఇచ్చి చూడండి

  1. JR.NAGABHUSANAM says:

    అనితగారూ,
    మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు చాలా ధైర్యంతో, తెగువతో పనిచేస్తారు అని అన్నారు. మరి ఆ తెగువా, ధైర్యమూ మీవారిని
    ఇంటిపనుల్లో పాలుపంచుకోమని అడగడానికి వుపయోగపడలేదా? స్త్రీ సమానత్వం గురించి మాట్లేడటప్పుడో లేక స్త్రీలు
    సాధించిన విషయాలు ప్రస్తావించేటప్పుడో పురుషుల్ని తక్కువ చేసి మాట్లాడుతూవుంటారు. అలా కాకుండా
    పురుషులకేమాత్రం తీసిపోకుండా అని వాడితే అది స్త్రీ-పురుష సమానత్వాన్ని సూచించినట్టవుతుంది కదా! – భూషణ్,
    హొసూరు.

Leave a Reply to JR.NAGABHUSANAM Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.