ఓ భార్య రాసిన కవిత

అనుసృజన : సత్యవతి కొండవీటి
(రచయిత్రి ఎవ్వరో తెలియదు)

నేను వండిన కూర అతనికి నచ్చలేదు
నేను చేసిన కేకూ నచ్చలేదు
అతనన్నాడు
నేను చేసిన బిస్కట్లు గట్టిగా వున్నాయని
వాళ్ల అమ్మ చేసినట్టు లేవట
నేను కాఫీ కూడా సరిగ్గా చెయ్యలేదట
ప్రేమగా చేసిన స్వీటూ నచ్చలేదు
అతని తల్లి మడత పెట్టినట్టుగా
అతని బట్టలు నేను మడత పెట్టలేదట
నేను వీటన్నింటికి సమాధానం ఏంటి అని వెతుకుతుంటే
ఒక క్లూ కోసం మధనపడుతుంటే
అతని తల్లి చేసినట్టే నేను ఏమైనా చెయ్యగలనా
అని ఆలోచిస్తుంటే
నా పెదవుల మీద చిరుదరహాసం మొలకెత్తింది
ఓ వెలుగు కిరణం నా కళ్ళ ముందు కదలాడింది
ఓ పని ఖచ్చితంగా
వాళ్ళ అమ్మ చేసినట్టు
చెయ్యగలననిపించి
చాచి ఓ లెంపకాయ అతని చెంప మీద  వేసాను
వాళ్ళ అమ్మ ఎప్పుడూ చేసేలా

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

13 Responses to ఓ భార్య రాసిన కవిత

  1. sujata says:

    మంచి పని చెసారు. హా హా హా ! !!

  2. Anonymous says:

    వ.వ…వ చాలా బావుంది.
    ఇక ఇదే అందరం పాటించవచ్చు.
    థాంక్యూ సత్యా.

  3. perugu.sujana says:

    చాచా బాగుంది. ప్రతినిత్యమూ ఎదుర్కొనె సమస్యను చెప్పిన విధానము
    దభినందనలు

  4. bala kishor says:

    చాలా బాగుంది.

  5. sireesha says:

    భలె చెప్పారు.

  6. Anonymous says:

    భలె బాగుంది

  7. ఒక చె0ప అదరహొ..కానీ అమ్మవెంటనె చేరదీసి తల నిమురుతు0ది.

  8. rajeswari says:

    చాల చాలా బాగుంది.

  9. buchireddy says:

    త ల మీ ధ మొ త్థాను అని అంతె బాగా ఉం దు

  10. kedari says:

    కొట్టడం న్యాయం కాదు కదా?
    అలాగే అది సమస్యకు పరిష్కారం కూడా కాదు.

  11. నేనూ మా ఆవిడ కలిసి చదువుకుని హాయిగా నవ్వుకున్నామీ కవిత చదివి.
    డా. దార్ల వెంకటేశ్వరరావు

  12. Pavani says:

    కెవ్వు

Leave a Reply to mohan ram prasad Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.