మహిళా బ్లాగుల్లో వైవిధ్య ముద్ర!

తెలుగు నవలా  ప్రక్రియలో అగ్రస్థాయిని అందుకున్న ఘనత వనితలది. రచనా పాటవంతో, పఠనీయతతో పాఠకలోకాన్ని వారు మంత్ర ముగ్ధుల్ని చేయడం ఇటీవలి చరిత్రే. ఆ వారసత్వాన్ని స్ఫురింప  చేస్తున్నారు నేటి మహిళా బ్లాగర్‌లు!  భావ వ్యక్తికరణకు అత్యాధునిక వేదికలైన  ‘బ్లాగు’ ను వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. కంప్యూటర్‌లు అలవోకగా ఉపయోగిస్తూ అంతర్జాలపు వాకిళ్ళకు  తేట తెలుగు తోరణాలను ముచ్చటగా అలంకరిస్తున్నారు. వైవిధ్యమైన రాతలతో బ్లాగింగ్‌పై సొంత ముద్ర వేస్తున్నారు.
ఆలోచనలనూ, అభిప్రాయాలనూ చాలామంది విస్మృతి పొరలల్లోకి నెట్టేసి, అవ్యక్తంగా వదిలేస్తుంటారు. సామాజిక కారణాలతోనో బాధ్యతల ఒత్తిళ్ళతోనో ఈ స్థితి స్త్రీలలోనే హెచ్చు.
అయితే మార్పు మొదలైందంటోంది ఆధునిక మహిళ. అక్షర రూపంలో తనను ఆవిష్కరించుకోవడంలోని సంతృప్తిని ఆమె గుర్తిస్తోంది. అందుకే బ్లాగును ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. ఆన్‌లైన్‌లో అక్షర తూణీరాలను సంధిస్తోంది. వివిధ అంశాలపై వ్యాఖ్యల రూపంలో ప్రతిస్పందిస్తోంది.
అంతర్జాలం (ఇంటర్నెట్‌)లో బ్లాగ్‌ ఒక విప్లవం అనుకుంటే అందులో తెలుగు బ్లాగ్‌లు ఒక మేలు మలుపు! ఇవి శాఖోపశాఖలుగా విస్తరిల్లి భావ ప్రకటన సామర్థ్ధ్యానికి గేటు రాళ్ళుగా నిలుస్తున్నాయి. బ్లాగ్లోకంలో  ఎవరి బ్లాగ్‌కు వారే మహరాజులు, మహారాణులు! ఇష్టం వచ్చిన అంశం మీద టపాలు(పోస్టులు) రాసుకునే స్వేచ్ఛ బ్లాగర్లకెప్పుడూ వుంది.
గత  3 ఏళ్ళలో తెలుగులో మహిళా బ్లాగ్‌లు రాశిలో చెప్పుకోదగ్గ  ప్రగతిని సాధించాయి. దాదాపు 2 వేల వరకు  వున్న తెలుగు బ్లాగులలో మూడో వంతు స్త్రీలవే. వీరిలో క్రమం తప్పక రాసే వారు కొందరైతే, సమయం కుదిరినప్పుడు రాసేవారు మరికొందరు. రెండు, మూడు బ్లాగులనూ, గరిష్టంగా ఆరేడు బ్లాగులనూ కూడా అవలీలగా నడుపుతున్నవారు మహిళల్లో ఉన్నారంటే అంతగా ఆశ్చర్యపడనక్కర్లేదు.
రచయిత్రులు, కవయిత్రులే కాదు, ఉద్యోగినులు, విశ్రాంత ఉద్యోగినులు, పాత్రికేయులు, ప్రవాస ఆంధ్రులు, గృహిణులూ  బ్లాగులను సుసంపన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తమ మనో భావాలకు అనుభూతులకు, స్వేచ్ఛగా, అక్షర రూపం ఇస్తున్నారు. ఆసక్తులను, అభిరుచులను ఇతరులతో కలబోసుకుంటున్నారు. తమ రచనా సామర్థ్ధ్యాన్ని అనుకున్న వెంటనే అద్భుత రీతిలో  ప్రస్ఫుటంగా వెలుగులోకి తెస్తున్నారు.
తెలుగు మహిళా బ్లాగులలో గమనించ దగ్గ అంశం వైవిధ్యం.
వంటలు, గార్డెనింగ్‌, సౌందర్యంలాంటి రెగ్యులర్‌ అంశాల గురించి రాసేవారు కొందరైతే పుస్తకాలు, కథలు, కవితలు, వ్యాసాలు రాజకీయ, సాంఘిక అంశాలను స్పృశిస్తూ రాసేవారు మరికొందరు.
ఉద్యోగానుభవాలను ఉత్సుకతతో చెప్పిన ఉద్వేగాలను హృదయంతో పంచుకున్న కొందరు మహిళా బ్లాగర్‌ల రాతల్లో పరిణతి కన్పిస్తుంటుంది.  సాంకేతిక అంశాలను తేలిగ్గా ఎదిరించడం అయినా ధైర్యం నింపేలా  ఉత్తేజకరంగా రాయటం వీరికే చెల్లు అన్పిస్తుంది.  చెప్ప దలుచుకున్న అంశాన్ని బట్టి సూటీగా ఘాటుగా, హాస్యంగా, వ్యంగ్యంగా లలితంగా తమ రచనలను  వన్నెలద్దటంలో వీరు ఆరితేరుతున్నారు. అయితే  ప్రాథమిక స్థాయిలోనే రాస్తున్నవారు కూడా లేకపోలేదు.  కాదేదీ బ్లాగుకన్హరం అంటూ ఏ అంశం గురించయినా వనితలు అలవోకగా రాసేస్తున్నారు. హాస్యాలూ, స్వగతాలూ…
హస్యం రాయటం కష్టమేగానీ, మహిళా బ్లాగర్లు అలవోకగా రాసే హాస్య  టపాలు నవ్వుల్ని పూయించటమే కాక ఆశ్చర్యాన్ని కలిగియిస్తాయి. దాట్ల లలిత నా స్పందన బ్లాగులో కెవ్వుకేక టపా ఈ కోవలోదే.
అప్పుడు ఏమి జరిగిందంటే బ్లాగులో క్రాంతి సునిశిత హాస్యంతో చిరునవ్వులు పంచుతారు.
ఆరేడు బ్లాగులను అవలీలగా నడుపుతున్న గృహిణి వలబోజు జ్యోతి ప్రస్తుతం అందుబాటులో లేని పాత పత్రికల నుంచి సేకరణలను కూడా అందిస్తారు.
ప్రతి విషయాన్నీ కూలంకషంగా పరిశీలించి మెరుగైన భావ వ్యక్తీకరణతో విశ్లేషించే రమణి బ్లాగు మధుర భావాల సుమమాల. మరో మంచి బ్లాగు సౌమ్య తన బ్లాగులో పుస్తకాల గురించీ సినిమా విశేషాల గురించే కాక మ్యూజింగ్స్‌ను చక్కగా రాస్తారు.
నాలో నేను అంటూనే మనకి కూడా ఆ స్వగతాలనూ కబుర్లనూ పంచే మేధ బ్లాగు ఇంకో అణిముత్యం.
మహార్ణవం పేరుతో బ్లాగు నిర్వహిస్తున్న రచయిత్రి టి. శ్రీవల్లీ రాధిక స్వీయ రచనలను దీనిలో అందుబాటులో ఉంచుతారు. ఉపయోగపడే టపాలతో సిద్ధమయ్యే వరూధిని బ్లాగు సరిగమలు జీవిత సారాన్ని కాచి వడబోసినట్లండే లోతైన కవితలతో అలరించే ఉష బ్లాగు మరువం. భావుకత నిండిన కవిత్వంతో కొలువు తీరే నిషిగంధ బ్లాగు ‘మానసవీణ’ సరదా కబుర్లతో నవ్వించే శ్రీవిద్య బ్లాగు ‘బ్లాగువనం’ మరికొన్ని. రచయిత్రులు కల్పనా రెంటాల, చంద్రలత, భూమిక ఎడిటర్‌ సత్యవతిల బ్లాగులు కూడా చూడదగ్గవి.
ఇవే కాక రకరకాల ఆసక్తికరమైన అంశాలతో బ్లాగ్లోకంలో సందడి చేస్తున్న మహిళా బ్లాగర్ల టపాలు చదవాలంటే దిళిళిఖిబిజిరి.ళిజీవీ. గీగీగీ.శీబిజిజిలిఖిబి.బీళిళీ  సెట్లకు  పయనమవ్వాల్సిందే. జల్లెడ ప్రత్యేకంగా స్త్రీ బ్లాగులు పేరుతో ఒక వర్గాన్ని కూడా ఏర్పాటు చేసింది.
కొత్త  మహిళా బ్లాగర్లు కూడా ఉత్సాహంగా అనేక విషయాల మీద చక్కటి టపాలు రాస్తూ తమ సత్తా నిరూపించుకుంటున్నారు. తమ సామర్ధ్యాలను ఆవిష్కరించుకోవటానికి బ్లాగుల రూపంలో అందుతున్న అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. విషయంలో, శైలిలో పదును తేరుతూ ఈ బ్లాగులు మరింత ప్రయోజనాత్మకంగా రూపొందుతాయని వీటి ప్రస్థానం స్పష్టం చేస్తోంది.

ఈనాడు ‘వసుంధర’ సౌజన్యంతో
సహకారం సుజాత

బ్లాగు అంతర్జాలంలో అతివలు

మాలాకుమార్‌
మిట్టమధ్యాహ్నం, ఎండ మండిపోతోంది. చెమటలు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఫాన్‌ గాలి ఏమూలకూ సరిపోవటంలేదు. ఏ.సీ పనిచేయటం లేదు. ఉష్‌, అష్‌ అనుకుంటూ ఆపసోపాలు పడుతుండగా, మా సావిత్రి (మా వంటావిడ) వచ్చి, వేడి, వేడిగా పకోడీలు చేసీనాండీ అని అడిగింది. ఒక్క నిమిషం బిత్తరపోయి చూసి, ఇప్పుడు పకోడీలా? వద్దు అనబోయి, వద్దు అంటే ఆ తరువాతి పరిణామాలను తట్టుకునే శక్తి లేక సరే చేయండి అనేసాను. ఆమెకు తినాలి అనిపించి, చేస్తాను అన్నప్పుడు, నేనూ తినాల్సిందే తప్పదు మరి! వాన పడుతున్నప్పుడో, చలికాలం చిరు ఎండలోనో కూర్చొని, పకోడీలు తింటూ, ఏ యద్దనపూడి నవలో చదువుతూ పకోడీలు తినటం ఎవరైనా చేస్తారు. మండే ఎండలో, చెమటలు కక్కుతూ, వేడి వేడి పకోడీలు తినటం మా ప్రత్యేకత! ఎంతైనా మా స్టైలే వేరు. యద్దనపూడి వ్రాయటం మానేసినంత మాత్రాన ఏమైంది? హాయిగా కూడలిలో విహరిస్తూ, కూల్‌ కూల్‌గా, చల్లచల్లగా అమ్మాయిల బ్లాగులు చదువుదాం అని డిసైడైపోయి, కూడలిలో అడుగుపెట్టాను.
మీరు ఉత్తరాలు రాయగలరా? నాకైతే రాసే ఓపిక లేక, చివాట్లు చాలా తినేదానిని. రాసే ఓపిక లేదు కాని, చిట్టీ అయేగీ అనుకుంటూ ఎదురుచూసి చదివి ఆనందించే ఓపిక చాలా వుంది. అందుకే భావన కృష్ణ గీతంను తరుచూ చూస్తూ వుంటాను.
సరదాగ చిన్న చిట్కాలే కాదు చక్కని కవితలూ అల్లుతారు శ్రీలలిత. శ్రీలలిత గారి కవితలతో అప్పుడప్పుడూ నా సాహితి కూడా తరించిపోతూ వుంటుంది.
ఎపుడైనా మూడ్‌ ఆఫ్‌ ఐందా? ఐతే ఈ లలిత స్పందన చూస్తే సరి. కాకపోతే మన పొట్టలు జాగ్రత్తగా చూసుకోవాలి, చెక్కలైపోతే కష్టం కదా!!
అమ్మ కడుపు చల్లగా అందరూ బాగుండాలి అని దీవించే ఆదిలక్ష్మి గారి బ్లాగు ఇది. ప్రస్తుత దేశ రాజకీయ విషయాల దగ్గర్నుండి, చిన్ని చిన్ని కథలు కూడా చెప్పే అమ్మవొడి ఇది.
మధుర మధురంగా కబుర్లు, పాటలు వినిపిస్తారు మధురవాణి. నాకు బ్లాగులో పాటలు పెట్టాలి అనే కోరిక మధురవాణి బ్లాగు చూసాకే కలిగింది.
యమునాతీరానికి వెళితే ధీరసమీరే యమునాతీరే అని సృజనగీతం పాడుతూ ఓ అందమైన అమ్మాయి, కృష్ణుని వెతుకుతూ కనిపిస్తుంది, తనే సృజనా రామానుజం.
ఎందరో మహానుభావులు, మరెందరో భావకవులు, భావుకులు ఎన్నెన్నో భావాలూ, కవితలు, కొటేషన్స్‌… వాటితో పోలిస్తే నా భావాలు… ఎంత… ఆకాశంముందు………..పిపీలికమంత అప్పుడప్పుడు ఏదైనా చదివినప్పుడు విన్నప్పుడు………… ఆ భావుకతకు… గుప్పెడు మల్లెలు గుబాళించినట్లు మనస్సు ఉప్పొంగుతుంది ఆ పరిమళాన్ని కొందరికైనా పంచాలని కాదు, కాదు, కొందరితోనైనా పంచుకోవాలని ఆశ………….., ఆకాంక్ష.
నేను ఆర్డినరీ వుమెన్‌ని అంటూనే, పెళ్ళిపెటాకులూ, ఇది ఇంతే అని బోలెడు కబుర్లు చెబుతారు సునీత, తన – నేనూనా బ్లాగులో.
ఏ పుస్తకం గురించి వివరం కావాలన్నా సిరిసిరిమువ్వను అడుగుతే చాలు.
మూసిన కనురెప్పల మాటున ఎన్ని స్మృతుల సవ్వడులో.
నేను రౌడీని, బాడ్‌ గర్ల్‌ను అంటూనే బోలెడు కబుర్లు చెపుతుంది ప్రియ, తన ప్రియరాగాలులో. ఏ రోజునైనా నా పోస్ట్‌లో ‘కామెంటక’ పోతుందా అని ఎదురుచూస్తున్నాను.
వాలు కొబ్బరిచెట్టు కింద నిలబడి కబుర్లు చెపుతున్నట్లే చెబుతూనే, నేతిగెన్నతో, గురూజీ ఎప్పుడు నన్ను మొట్టుతారా అని ఎదురుచూస్తూ, తనూ మొట్టికాయలు తింటూ వుంటుంది ఈ సుభద్రమ్మ. కొన్నిసార్లు మొట్టికాయలు తప్పించుకోవటానికి ఒకరికొకరం సాయం కూడా చేసుకుంటూ వుంటాము, ఇది రహస్యం.
శ్రీదేవి, కాని శ్రీదేవి అనకండి, శ్రీ అనండి చాలు. మహా భయస్తురాలు. చాలా బాగా పాడి వినిపిస్తుంది మకరందంలో.
ఏదైనా బ్లాగు ప్రాబ్లమా? దిగులుపడుతున్నారా? ఐనా అండగా బ్లాగు గురువుండగా దిగులెందుకు దండగా!!
నా కోరికలూ, నా ప్రయాణ సాధనాలు అని ఊసులు చెప్పే స్వాతి బ్లాగు ఇదే.
మీకు కవితల మీద ఇంటరెస్ట్‌ ఉంటే తెలుగుకళ, పద్మకళ గారి కవితలు చదవండి.
వెబ్సైట్‌ డిజైన్‌లో ఎక్స్‌పర్ట్‌ జాహ్నవి.
నాలాంటి వారందరికీ అండ, బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ జ్యోతి.
రమ్యంగా కుటీరాన రంగవల్లులు వేస్తారు నీహారిక.
రాధికగారు అల్లుకున్న పొదరిల్లు ఈ అందాల పిల్లనగ్రోవి.
నా స్నేహం నువ్వే, నా ప్రియ శత్రువు నువ్వే, అమ్మా హమ్మామ్మా అంటున్నారు శ్రీ.
శ్రీనిఖ భావనలు తెలుసుకోవాలంటే నా భావనలు చదవాల్సిందే.
టి. శ్రీవల్లీ రాధిక గారి కథలూ, కవితలు, మహార్ణవంలో చదవచ్చు.
నా గురించి చెప్పటం సులువు కాదు, అర్థం చేసుకోవటం కష్టం కాదు అంటున్నారు మోహన.
ఎవరి లైఫ్‌ వాళ్ళది కాదా అని అడుగుతున్నారు చైతన్య.
అమ్మో సెల్‌ఫోన్‌ సెగలొస్తున్నాయి జిగీష నుండి.
”మా ఇంటి దాదా”, ఎవరు? ఏమో? గోదావరిని అడగాల్సిందే!
కబుర్లు చెప్పుకుందాం రండి అనీ, ఆప్యాయంగా పిలిచి, ఎప్పుడూ మంచి విషయాలే మాట్లాడండి, అని కబుర్లు చెపుతారు, సురుచి జ్ఞాన ప్రసూనగారు.
పియస్‌ లక్ష్మి గారి బ్లాగు చదివారా? యాత్రలు చేసి వచ్చి, మనందరికీ ఎలా వెళ్ళాలో సులువుగా చెప్పే గైడ్‌ యాత్ర.
బ్రహ్మకమలం గురించి, మినర్వా పక్కనున్న నాగమల్లి గురించి, రామాంతపూర్‌లోని సంపెంగి తోట గురించీ జూలోని వెదురుపూల గురించీ చెప్పి నన్ను రోడ్‌ ఎక్కిస్తుంటారు మా గోదావరి, సత్యవతిగారు. నాకైతే సత్యవతి గారి బ్లాగులో పూలపరిమళాలు కనిపిస్తాయి. కాని ఆ బ్లాగులో ఎక్కువగా మహిళల అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే సత్యవతి గారు మహిళల కోసం, స్త్రీల అంశాల కోసం తపనపడే కార్యకర్త.
మనసు పలికే ఆలోచనల రూపమే ప్రసీద బ్లాగు.
మామిడిపండు తినగానే, టెంకలో మొలక కనిపించే విచిత్రం తెలుసుకోవాలంటే స్వర్ణమల్లిక చదవాల్సిందే.
పాటలు బాగా వింటుందిట స్రవంతి. మరి పాడి కూడా వినిపించొచ్చు కదమ్మాయ్‌! స్రవంతి బ్లాగు చూడాలంటే రిజిస్టర్‌ చేసుకోవాలట మరి. హాయ్‌ స్రవంతి, మీ బ్లాగు లింక్‌ పట్టేసుకున్నాగా.
విజయభారతిలను హాయ్‌ సెనొరిటా అని పలకరించి, కోనసీమ అందాలను చూసి రండి.
ఎంచక్కా బజ్జొని, బుజ్జి కవితలల్లే సుజ్జిని కూడా పలకరించటం మరచిపోకండే!
బి.టి. వంకాయల గురించి పోరాడటమే కాదు బోలెడు కబుర్లు చెపుతారు చంద్రలత గారు, మడతపేజీలో.
కథకాని కథ, వీడ్కోలులాంటి, కబుర్లూ కాకరకాయలు చెపుతారు మంజు.
ఉల్లాసంగా, ఉత్సాహంగా ఓ అమ్మాయిని చూడొచ్చు, మంజూష, నా అందమైన ప్రపంచంలో.
ళీలిళీళిజీబిఖీ అంటే ఇంగ్లీష్‌ బ్లాగు కాదండీ బాబూ, పార్వతి రాసే అచ్చమైన తెలుగు కవితల బ్లాగు.
రెండు నిమిషాలలో నూడుల్స్‌లా, రెండే నిమిషాలలో, ఏ విషయం మీదైనా కవితలల్లే మరువంను నేను పరిచయం చేయటము సాహసమే!
ఏ విషయం మీదనైనా రోజుకొక టపా అలవోకగా రాసేస్తారు తృష్ణ. ఎప్పటి నుండో వెతుకుతున్న పాత పాటల లింక్‌ను నాకిచ్చి ఎంతో సహాయం చేసారు.
చిన్నిగారి బంగారానికి ఇంకా పేరు పెట్టలేదుట! ఎవరా బంగారం ఏమా కథ అని నన్నడుగుతే ఏం లాభం? ఇక్కడ చూడండి.
మనస్వి జయ, నేను ఎలుకలు తినేదానిలా కనిపించానా, హతోస్మిి, అని వాపోతోంది. ఎక్కడ? ఎందుకు?
”మహేష్‌ బయట ఏమిటి గొడవ?”
ఎవరో నేస్తం జాజిపూలు అభిమాన సంఘం పిల్లకాయలట మేడం. లొల్లి పెడుతుండ్రు, సావిత్రమ్మ, చేసిన వేడి వేడి, ఖారం ఖారం పకోడిలు పెట్టనా మేడం?”
”వద్దులే, పాపం చిన్నపిల్లలు వదిలేయ్‌.”
మానసవీణను మీటే అద్భుతమైన కవితలు, చిన్న కథలు ఇక్కడ.
తూర్పు-పడమర, రెండు తీరాల నడుమ నా శతసహస్ర ఆలోచనల ప్రతిధ్వనులు, అంటున్నారు, కల్పనా రెంటాల.
స్వేచ్ఛగా, సరదాగా, సూటిగా మనసులో మాట చెపుతున్నారు సుజాత.
మాయా శశిరేఖ, బాలాకుమారినంట, చాలా సుకుమారినంట అంటున్నారు సౌమ్య.
నీలి నీలి మబ్బుల్లో తేలిస్తారు సత్యప్రియలో రాధిక.
కబుర్లు, కబుర్లు!, వట్టి కబుర్లే కాదు, తాజ్‌మహల్‌ అందాలను వివిధ కోణాలలో చూసి ఆనందించండి, సుజాత గారి గడ్డిపూలులో.
మధురభావాలతో చక్కటి సుమమాలలు అల్లుతారు రమణి.
తెలుగు సాహిత్యానికి వేదిక మాలతి గారి తెలుగు తూలిక.
ఆనందించే మనసుంటే, అలరించే ప్రయత్నం నేనౌతా అంటున్నారు, ప్రేరణ.
నా భావాలు, అనుభవాలు, ఆలోచనలు, స్పందనలు, జ్ఞాపకాల సవ్వడి అంటున్నారు ఎదసడిలో శిశిర.
రకరకాల కబుర్లతో శరవేగంగా బ్లాగు లోకంలోకి దూసుకుపోతున్నారు, నిఖిత చంద్రసేన.
ప్రకృతి వడిలో, సముద్రపు అలలను కప్పుకొని, హాయిగా నిదురిస్తూ, కలల ప్రపంచంలోకి మనలను కూడా తీసుకెళుతారు స్వప్న.
పల్లెల్లో, గూడేలలో, అడవిలో, సముద్రపు ఇసుకల్లో..ప్రజల జీవితాలని దగ్గరగా చూసిన అనుభవాలు, అరుదైన దారుల్లో ఎదురైన అనుభూతులు, నా మనసును హత్తుకొన్నవి, నాకు స్ఫూర్తినిచ్చినవి ఇవి…దిరిసెన పుష్పాలలా అరుదైనవి, సున్నితమైనవి. వీటిని మీ అందరితో పంచుకోవాలని…అంటున్నారు శిరీష దిరిసెన పుష్పాలులో.
అందమైన కవితలమయం పద్మార్పితం.
చిట్కాలూ, వంటలు ఒకటేమిటి బోలెడు విషయాలు చెపుతారు భవాని మల్లాది.
కవితలతో కొత్తగా బ్లాగు మొదలుపెట్టారు జ్యోత్స్న. ఏమవుతుందో దాని భవిత అని బెంగపడుతున్నట్లున్నారు. ఏమీ కాదని, వేల కవితలతో వర్ధిల్లుతుందని బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెబుదామా!!
సరదా పరదాలు, నచ్చిన పుస్తకాలూ, సినిమాలు ఇలా అన్నిటినీ తట్టుతారు, స్నిగ్ధకౌమిదిలో ప్రణీత స్వాతి. ఈ మధ్య ఆక్సిడెంట్‌ అయ్యి లేవలేక ఎక్కువగా రాయలేకపోతున్నాను అన్నారు ఒక పోస్ట్‌లో. త్వరగా కోలుకొని మరిన్ని రచనలను అందించాలని కోరుకుంటున్నాను.
మరుజన్మలో కూడా ఆడపిల్లగానే పుట్టాలనుకుంటున్నారట, శ్రావ్య వరాళి.
నా చిన్ని ప్రపంచానికి నేనే మహారాణిని అంటున్నారు రాజి.
పిట్ట కొంచెం కూత ఘనంమీ చిన్ని పాప బ్లాగు లహరి.
మరో చక్కటి కవితల బ్లాగు మానస చామర్తి గారి మధుమాసం.
అనుకోకుండా తెలుగు బ్లాగులను చూసి, పాటే నా ప్రాణం అని తనూ బ్లాగు మొదలుపెట్టారట అపర్ణ. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ అపర్ణ.
పచ్చడి మెతుకుల దగ్గర నుండి, (లాప్‌)టాప్‌ భూషణం వరకూ సరదాగా చదవొచ్చు కృష్ణప్రియ డైరీలో.
ఎన్నెన్నో మంచి రచనలను సేకరించి బుక్స్‌ అండ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ బ్లాగు ద్వారా అందిస్తోంది, చైతన్య కళ్యాణి.
నేను సాదా సీదా తెలుగు అమ్మాయిని అంటున్నారు శ్రావ్య వట్టికుటి రవీయంలో.
నేనేమైనా చిన్నదాన్నా? చితకదాన్నా? బోల్డు కుంచం పెద్దదానిని ఆహా ఓహో అంటోంది గీతా ప్రియదర్శిని.
ఆలోచింపచేసే టపాలు నాలో ‘నేను’.
రెండు కథలు రాసానోచ్‌, నేను కాదు రాసింది, సౌమ్య.
నాకు అమెరికా వద్దు, అమ్మకావాలి అంటున్నారు, ఇదీ సంగతిలో జాహ్నవి.
ప్రియదర్శనీయం కళాత్మకం.
నిద్రకోసం, నిద్రే నా ప్రాణం, నిద్రలేక నేను లేను. నేను కాదండి బాబూ. ఆ కబుర్లు చెప్పేది శివరంజని.
అందమైన కవితలు, ఆలోచనలు రేకెత్తించే తెలుగు వ్యాసాలు, ఇంగ్లీష్‌ వ్యాసాలూ, కవితలూ వున్నాయి స్వాతి గారి కల్హారలో.
ఒక పుస్తకం మీ జీవితాన్నే మార్చేస్తుంది అంటున్నారు రుత్‌, ముద్దమందారంలో.
అమూల్య గారి బ్లాగు రామాయణం చదవండి అమూల్యలో.
వెన్నల్లో ఆడపిల్ల కవితనుండి, రకరకాల విషయాలను కిరణ్‌ గారి, వెన్నెలలో చదవచ్చు.
పెళ్ళి మంత్రాలకి వివరంగా అర్థం, + వ్యాఖ్య + చిటికెడు హాస్యంతో కలిసి, పెళ్ళిముచ్చట్లు చదవండి శ్రీవైష్ణవి గారి బ్లాగులో.
అబ్బ ఈ ఫొటోస్‌ ఎంత బాగున్నాయో!
ఆదివారం వెరైటీ లంచ్‌ కోసం ఏం చేయాలా అని తల బద్దలు కొట్టుకోవటం ఎందుకు? సూర్యలక్ష్మి గారిని అడిగేస్తే ఓ పనైపోతుంది కదా!
నీలాకాశంలో ఓ చిన్న మబ్బు తునకనుండి జాలువారిన చిరుజల్లులా హృదయనివేదిత ఈ వనితా వేదిక అంటున్నారు వేద.
ఇప్పుడే నా కంటబడ్డ బ్లాగు నారాతలు.
బ్లాగు కాకపోయినా, కాంతి పాతూరి గారి కౌముది మాసపత్రిక ఎంత బాగుంటుందో!!
అందులోని సుభద్ర వేదుల అగ్రహారం కథలు తప్పక చదవవలసినవి.
నాకు తెలుగు రాదు అంటూ, తెలుగు మీద అభిమానంతో, ఇంట్లోనే తెలుగు నేర్చుకొని, ఫ్యామిలీ రేడియోకు ఈ అనువాద రచన చేసిన కృష్ణవేణి పట్టుదల మెచ్చుకోదగినది.
ఏమిటీ నేనేమైనా పరమానందయ్య శిష్యురాలి ననుకుంటున్నారా? ఇంతమందిని లెక్కపెట్టి నన్ను లెక్కపెట్టుకోక పోవటానికి. ఇది నా సాహితి. చదువుతూ వుండండి…చదువుతూనే వుండండి సాహితిని. అంతే కాదండోయ్‌ మీ అమూల్యమైన అభిప్రాయాలనూ తెలపండి. మీ అభిప్రాయాలే మాకు మహాద్భాగ్యం.
చిన్నగా పకోడీల ప్లేట్‌ తడిమాను. అబ్బే లేవే! ఇన్ని బ్లాగులు చదివే లోపల అన్నీ వూదేసినట్లున్నాను. హుం. సరే కాఫీ తాగేస్తే ఓ పనై పోతుంది కదా. నాతోపాటు చదువరులందరినీ తిప్పాను కదా. పాపం అలసిపోయి వుంటారు. మీరు ఓ కాఫీ కప్‌ తెచ్చుకోండి. (చూడండి నాదెంత ఉదార స్వభావమో, నేనొక్కదానినే తాగకుండా మిమ్మలినీ తెచ్చుకోమన్నాను కదా!)
ఆ(((…ఎన్ని బ్లాగులు చదివాము? డెబ్భై పైనే అనుకుంటా. నేను లెక్కపెట్టలేదు. ఎన్ని రకాల బ్లాగులు! ఎన్నెన్ని ఊసులూ!! ఒక్కో బ్లాగు ఒక్కో రకం. ఒకదానికొకటి పోలికే లేదు. కమ్మటి కబుర్లు కొంతమంది చెపితే, కథలు కొంతమంది రాసారు. కవితలైతే అబ్బో ఎంత భావుకతతో వున్నాయో! నేనూ ఎప్పటికైనా అలా ఓ మంచి కవిత చెప్పగలిగితే నా!! చిన్ననాటి మరుపురాని మధురస్మృతులు, ఉషారైన పోస్ట్‌లు కొన్ని. ఆలోచనలను రేకెత్తించేవి కొన్ని. సమాజంలోని దుస్థితిని ఎత్తిచూపుతూ హం భీ కుచ్‌ కం నహీ అనేవి కొన్ని. పాటలవి కొన్ని, రకరకాల వంటవి కొన్ని, అందమైన ఫొటోలతో కొన్ని, రకాల కళలను నేర్పేవి కొన్ని, పుస్తకాల గురించి వివరించేవి కొన్ని, ఒకటి ఎక్కువ, ఇంకొకటి తక్కువ అనేలా లేవు. దేనికదే గొప్పగా వున్నాయి.
అందరూ రచయిత్రులు కారు. సాధారణ గృహిణి నుంచి, రచయిత్రులు, సంఘసేవిలు, వివిధ వృత్తులలో వున్న వారూ కళాకారులు అందరూ తమదైన శైలిలో తమ తమ భావాలను అందరితో పంచుకుంటున్నారు. ఒక టపాలో శిశిర అన్నారు, ‘అందరూ ఫీల్‌ గుడ్‌ అన్నట్లు అన్ని పాజిటివ్‌ విషయాలే రాస్తారు’ అని. అవును కదా మన సంతోషాన్ని పదిమందికీ పంచాలి. ఇబ్బందిని మనలోనే దాచుకోవాలి అని పెద్దలు చెప్పారు కదా. అదే పెద్దలు, మన కష్టంని ఇతరులకు చెప్పుకొని మనసు తేలికపరుచుకోమని కూడా అన్నారు. కాని ఆ సమయంలో చెప్పుకున్నా, ఆ తరువాత మనం వారి దగ్గర చులకనైపోతామేమోననే భయంతో కూడా అందరికీ చెప్పలేం కదా! ఏమైతేనేమి, మంచి, సరదా విషయాలను చెప్పుకొని, బాధలను మరచిపోయే పసందైన వేదిక బ్లాగు!
ఇంట్లో పని, ఆఫీస్‌లో ఉద్యోగం చేసుకుంటూ తీరిక సమయములోనే రాస్తున్నారు. అమ్మాయిలు చేసే అష్టావధానంలో ఈ బ్లాగింగు కూడా చేరింది! అలసిన మనసులను, అమ్మ కాని అమ్మ గూగులమ్మ వొడిలో సేద తీర్చుకుంటున్నారు. భావాలను పంచుకోవటమే కాదు, కొత్తగా కంప్యూటర్‌ నేర్చుకున్న నాలాంటి వారు టెక్నికల్‌ విషయాలు కూడా తెలుసుకోగలుగుతున్నారు. అంతేనా, ఈ అతివలందరూ ఎవరికైనా ఇబ్బంది వస్తే మేమున్నాం అంటూ ముందుకు వచ్చి వొకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. వారిలో వారికే కాదు సహాయం అవసరమైన వారికి, వృద్ధులు, అనాథలు, వరదబాధితులు మొదలైనవారికి మీకు మేమున్నాం అండగా అంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు ప్రమదావనం సభ్యులు. మేము అచ్చమ్మ, బుచ్చమ్మ కబుర్లు చెప్పుకోమండి, సరదాగా వుంటూనే మాకు చాతనైన సహాయం చేస్తాం అంటున్నారు ఈ అతివలు. అమ్మాయైనా, అమ్మైనా, అలసట ఎరుగని అతివ మనసు ఎప్పుడూ అమ్మతనంతో నిండి వుంటుంది. అందుకే సృష్టిలో అమ్మకు లేదు మారురూపం. అమ్మ అమ్మే.
ప్రమదావనంలో కొత్తగా వచ్చి ఇక్కడ నాకెవ్వరూ తెలీదు అన్నారు కృష్ణవేణి. సరేనండి అని కొంతమందిని పరిచయం చేసాను. మీకు మీరే కాకుండా బ్లాగు ముఖంగా మాకందరికీ పరిచయం చేయొచ్చుగా అన్నారు లలిత డి. కానీయండి అని ప్రోత్సహించారు జ్యోతి. ఊ ఊ కానీయ్‌, నీకు నిండా మా సహాయ సహకారాలుంటాయ్‌ అన్నారు (అందించారు) సుభద్ర, జయ. ఇక చేసేదేముంది? కళ్ళు మూసుకొని రాసేసాను. నన్ను ఈ బరిలోకి దింపిన వీరికి బోలెడు థాంక్యూలు. ‘నా బ్లాగు అంతర్‌జాలంలో అతివలు’, మొదటి, రెండవ, మూడవ భాగాలు చదివిపెట్టిన, స్పందించిన మీకూ బోలెడు బోలెడు థాంక్యూలు. ఇల్లాలి ముచ్చట్లు, మనమీదేనర్రోయ్‌ పేరు, శైలి అమ్మాయి బ్లాగులా అనిపించింది. కాని ఎవరు రాశారో తెలీలేదు. శారద, నన్ను మర్చిపోయారో అని అలిగారు కాని ప్రొఫైల్‌ ఏది? ఊఁ హూ నాకు దొరకలేదే! వాకే వాకే నీలాంబరి గారు దొరికిపోయారు బ్లాగు సోదరి ఈ రోజు బ్లాగు మగ మహారాజుల గురించి రాసి తెలిసిపోయారుగా. ఇదిగిదిగో ఇంకో కథల బ్లాగు జాజిమల్లి కూడా ఇప్పుడే దొరికింది. అలాగే అమ్మాయిలూ, మీ ఎవరిదైనా బ్లాగు పరిచయం ఇందులో లేకపోతే నాకు కామెంట్‌ బాక్ల్‌లోనైనా, మెయిల్‌ ద్వారానైనా తెలపండి. చేర్చేస్తాను. అలాగే నేను మీ బ్లాగు గురించి రాసి పరిచయము ఎవరికైనా నచ్చకపోతే చెప్పండి తొలగించేస్తాను. అంతేగాని నన్ను అపార్థం చేసుకొని మూతి ముడుచుకోకండి. బంగారుతల్లులు కదూ!
అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

5 Responses to మహిళా బ్లాగుల్లో వైవిధ్య ముద్ర!

  1. padmakala says:

    బ్లాగ్లోకం ఒక ఆకాశమైతే , మహిళాబ్లాగర్లు చుక్కలైతే వాటినన్నిటినీ ఏర్చికూర్చి మురిపెంగా ముస్తాబుచేసి అందించిన మాలా కుమార గారు , తరుణీమణులందరిని తళతళలాడించిన సత్యవతి గారు అభినందనీయులు.

  2. Prakash Potluri says:

    ఈ బ్లొగ్గెర్ల లిన్క్స వొక లిస్థు ర్రొపములొ ఇవ్వగలిగిథె చాలా వుపయొగకరముగా వుంతుందని నా భావన.

  3. manjusha says:

    మాల గారి బ్లాగు మాల బాగుంది..

  4. ramanarsimha says:

    అంతర్జాలంలో అద్భుతాలు చేస్తున్న అతివలు..

    అందుకోండి వందనాలు.

  5. Ramnarsimha Putluri says:

    మాలా కుమార్ గారు,

    ” సౌమ్య , వి.బి.సౌమ్య , శ్రీవల్లి రాధిక , సుజాత , మరువం , అమ్మఒడి ” –
    మొదలైన వారి “బ్లాగులు” తరచుగా చదువుతుంటాను..

    మీకు , రచయిత్రులకు అభినందనలు ….

Leave a Reply to Prakash Potluri Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.