సన్నజీవాల సణుగుడు

– దీప్తి

సూర్యుడికంటే ముందే లేచిన భారతమ్మ ఉదయపు వాహ్యాళి స్నానం గట్రా పూర్తి చేసుకొని ఇంకా ప్రయాణపు బడలిక తీరక తాపీగా కాఫీ తాగుతూ పేపర్లో హెడ్‌లైన్స్‌ చూస్తోంది.

ముందుగదిలోంచి కొడుకు సత్యం, కోడలు ప్రియల సంభాషణ పేపరు మీదినుంచి దృష్టి మరలిస్తున్నాయి. అక్కడికీ భార్యా భర్తల మాటలు వినకూడదన్న ఇంగితం అడ్డుపడుతున్నా వాళ్ళ మాటలు చెవులోంచి మెదడుకు చేరుతున్నాయి.

“ఊరినుంచి మీ అమ్మగారు వచ్చారు. చూశారుగా”!

“ అబ్బే! చూడకుండానే రాత్రి స్టేషన్నుంచి వెంటబెట్టు కొచ్చా!”“ఈ వెటకారాలకేం గాని నేను చెప్పేది వినిపించుకునేదుందా! లేదా!”

“తప్పుతుందా! శెలవివ్వు. శిరసా వహిస్తాను”

“ఇవాళ, రేపు బడలిక తీసుకున్నా, ఆ తరువాతన్నా వంటింట్లో కలగజేసుకోక పోరు”

“అయితే ఏమిటటా?”

“ఆ ఖాళీ డబ్బాలు చూసి వూరుకోరు. ఆవిడకు చేతినిండా సరుకులుంటేగాని పని నడవదు. వాళ్ళ కాలం అలా వెళ్ళింది మరి”.

“ఇప్పుడలా వెళ్ళదు మరి. మా బాబో, మీ బాబో పాతరేసి పోలేదు మరి…..”

“ఇప్పుడు చచ్చి స్వర్గాన వున్న వాళ్ళనెందుకీడుస్తారు. ఇంతకూ సరుకులు తెచ్చేదుందా? లేదా?…”

“ఆమాట ముందే అఘోరించక వెధవ పీఠికలెందుకో”

“మరీ మీకీ మధ్య ఈ వెటకారం, కసురుళ్ళు ఎక్కువైపోయాయి. చూస్తా…. చూస్తా… ఓపిక నశిస్తే చీరకొంగు ఫాన్‌కు వేస్తా. ఇవాళ చస్తే రేపటికి రెండు…” చాతకాని కోపమూ దాని వెనక దుఃఖం ముంచు కొచ్చాయి ప్రియకు.

“సరేలే ఏవన్నా అంటే నీళ్ళ కుండలు దిమ్మరించేస్తావు. అవతల అమ్ముంది. వింటే బాధపడుతుంది. ఏం కావాలో చెప్పు…”

“పోనీలే నేనంటే లెక్క లేనేలేదు. పెద్దావిడ కన్నా కాస్త పరువు దక్కించారు. రాసుకోండి.

“పప్పులు నాలుగూ అర్థకిలో చొప్పున…”

“కుదరదు. కందిపప్పు తప్ప అన్నీ వంద గ్రాములు”

“పంచదార నాలుగు కిలోలు…”

“ఒక్కకిలో….”

“ఆవాలు, జీలకర్ర…”

“వందేసి గ్రాములు…”

“ఇలా అన్నీ తగ్గిస్తే నేనెలా వండి తగలడేది?”

“వాడలా రేట్లు పెంచితే నేనెలా తెచ్చి చచ్చేది?”

“……..”

“నువ్విచ్చే లిస్టు తేవాలంటే నావల్ల కాదు”

ఈ సంభాషణ వింటున్న భారతమ్మకు ఆశ్చర్యం వేసింది. ఆ రోజుల్లో సరుకులన్నీ ఏడాదికి సరిపడా కొని నిలవ వేసుకునేవాళ్ళం. వో చుట్టం వచ్చినా, స్నేహితులొచ్చినా ఎన్నాళ్ళు వున్నా ఇబ్బందుండేది కాదు. వీడి హయాం వచ్చేవరకు నెలసరి తెచ్చుకోవటం… నెలాఖరున డబ్బాలు చూసుకొని వండు కోవటం… ఇప్పుడు మరీ వారానికో, నాలుగు రోజులకో తెచ్చుకుంటున్నారు కాబోలు. అబ్బే… అరకిలోలు, వందగ్రాములు వారానికేమవుతాయి. రోజువారీనో, ఏంపాడో… ఈవిడ ఇలా ఆలోచనల్లో వుండగానే ముందు గదిలో గొంతులు తారాస్థాయికి చేరాయి…! ఇహ రంగ ప్రవేశం చెయ్యక తప్పదని…

“అబ్బాయ్‌…” అంటూ తన వునికి చాటుతూ ముందు గదిలోకి నడిచింది.

“ చూడత్తయ్యా… నీ కొడుకు నిర్వాకం… సరుకులు తెమన్నప్పుడల్లా ఇట్లా చిందులు తొక్కితే రాళ్ళు, రప్పలతో వండడానికి నాకేవన్నా మంత్ర శక్తులున్నాయా?”

వంటింట్లోంచి మనవరాలు కేక “ అమ్మా నాకు టైమవుతోంది. వుప్మా పోపెలాగ పెట్టేది?”

“సగం ఎండుమిర్చి, నాలుగు సెనగబద్దలు, మూడు మినప గింజలు, పది ఆవపు గింజలు… చిట్టి చెంచాడు నూనె..”

“మరి ఇంగువో…”

“ఇంగువ’ అని గట్టిగా అను… అదే వస్తుంది వాసన”

“ఏంటమ్మా గుజ్జన గూళ్ళు నేర్పిస్తున్నావా? కూతురికి? ఉప్మానో, పులిహోరో చేస్తే పోపు దిట్టంగా పెడితేగాని రుచి రాదని చెప్పేదానివి. ఇదేం పోపే? పిల్లకి మాబాగా నేర్పిస్తున్నావు” ఆశ్చర్యంగా అడిగింది.

“అట్లా చేస్తుంటేనే సరుకులు తేవటానికి మీ అబ్బాయి యిట్టా రాద్ధాంతం చేస్తున్నారు”.

ఉక్రోషమంతా వెళ్ళకక్కింది ప్రియ.

కొడుకందుకొని “అవి వెనకటి రోజులే అమ్మా! చేతిలో డబ్బు పట్టుకెళ్ళి యింటెడు సరుకులు తెచ్చుకోవటం. ఇప్పుడు సంచీడు డబ్బు కుమ్మరించి చేతిలో సరుకులు తెచ్చుకుంటున్నాం” అన్నాడు.

“అదేవిట్రా అట్లా అంటావు. అప్పుడైనా వుప్పుతో తొమ్మిది కొనుక్కునే వాళ్లం. మనకేవన్నా మళ్ళా మన్యాలా…?”

“అప్పుడు లేని మళ్ళూ, మన్యాలు ఇప్పుడెక్కడివి కానీ మీరు వుప్పుతో తొమ్మిదీ కొంటే, మేం నీళ్ళతో ముప్పై కొంటున్నాం. నెలకింద కొన్న సరుకులు ఈ నెల కొనబోతే మరో నోటివ్వాల్సిందే”

“వందే?”

“కాదు… వెయ్యి. వందనోటు పిల్లలకే చాలవు!ఈ విడ్డూరమేమిటో ఆవిడ కర్థం కాలేదు. అవును రాత్రి మాటల్లో… అలసటలో పట్టించుకోలేదు కానీ పప్పులోకి నేతి చుక్కే లేదు. నేతి చెంచా కాస్త కూరలో వేసింది. పెరుగు పోయి నీళ్ళ మజ్జిగ అదీ గరిటతో కాదు… చెంచాతో…”

మనవరాలు మళ్ళీ కేక “అమ్మా నీళ్ళెన్ని పొయ్యాలి?”

“నీళ్ళవాడు రాలేదు. మంచినీళ్ళు పొయ్యకమ్మా” ప్రియ చెప్తోంది.

“నీళ్ళు రావటమేమిట్రా?” భారతమ్మ బుర్రకు మరో ఫజిల్‌.

“మంచినీళ్ళు కొంటున్నాం”

“అదేం పంపులు రావట్లేదా?”

“బామ్మా పంపులు రాకపోతే నాన్న జీతం నీళ్ళకే చాలదు. తాగే నీళ్ళకే ఈ గోల”

“పంపు నీళ్ళు వడకట్టుకు తాగొచ్చుగా?” అమాయకంగా అడిగిందావిడ.

“అదొకప్పుడత్తయ్యా. ఆ నీళ్ళల్లో కాల్షియమ్‌, ఫ్లోరైడ్‌ ఎక్కువగా వున్నాయి. అవి తాగితే తిండి వంటబట్టదు. ఎముకలు అరిగిపోతాయి… అందుకని తాగే నీళ్ళు కొనుక్కుంటున్నాం.”

“ఆ సంబరమెంత?”

“క్యాన్‌ ఇరవై. నెలకు ముప్పై క్యాన్లు. వెరసి ఆరువందలు.”

“గడప తొక్కి వచ్చిన వాళ్ళకు తిండి పెట్టకపోయినా… కనీసం మంచినీళ్ళిచ్చే యోగం కూడా లేదన్నమాట…”

“అందుకే ఇప్పటి ఇళ్ళకు గడపలే లేవు బామ్మా”

“కూరలు…కూరలు… బెండకాయ్‌… వంకాయ్‌”

వాకిట్లో కూరల బండి చూసి గబగబా కదిలింది భారతమ్మ. వెనకాలే ప్రియ నడిచింది.

లేత బెండకాయలేరుతూ ‘ఎంతబ్బాయ్‌?’ అడిగింది భారతమ్మ.

‘ఇరవై’

‘కిలో ఇరవయ్యే?’

“కాదు పావుకిలో”

“ఆ… “ అన్నమాట నోట్లోనే ఆగిపోయింది భారతమ్మకు.

కోడలు పరిస్థితి అర్థం చేసుకొని చకచకా నాలుగు పచ్చి మిరపకాయలు, నాలుగు పాలకూర కాడలు, ఐదు వంకాయలు, మూడు టమోటాలు తీసుకొని బండిని పంపేసింది.

భారతమ్మ ఆ భ్రమలోనే కోడలునను సరించి లోపలికొచ్చి కూలబడింది.

“అమ్మా… ఉప్మా అయిపోయింది” వంటింట్లోంచి కేక.

ఇంతలో నీళ్ళ క్యాన్‌ వచ్చింది. “ఏంటబ్బాయ్‌, ముప్పాతికే ఉన్నాయ్‌. నిండా తేవచ్చుగా…” “అట్లాగే వుంటుంది. ఇష్టముంటే తీస్కో… లేకుంటే లేదు…”

రెండో మాటంటే రేపట్నుంచి తేడన్న భయంతో గబగబా డబ్బులిచ్చి పంపాడు సత్యం.

వాడు పోగానే గ్యాస్‌వాడొచ్చాడు.”బిల్‌మీద పాతికివ్వాలమ్మా, పెట్రోలు రేటు పెరిగిపోయింది” అంటూ సిలిండర్‌ దించాడు.

“అబ్బాయ్‌… ఏవిట్రా ఈ దారుణం. ఇట్లా అయితే జనం బతకాలా? చావాలా?”

“పెద్దమ్మ గారు…మన నాయకులకు రెండూ కావాల… జనం వోట్లేసిందాకా బతకాల… వోట్లేశాక చావాల…”

“అట్లా అయితే మళ్ళీ ఎన్నికల్లో వీళ్ళనోడించరు?

“పెద్దమ్మగారు వెనకటి మనిషిలాగుంది. వోడేదెవరు? గెలిచేదెవరు? అంతా మాయ నాటకాలు. వారూ… వారూ… ఒకటే… మద్దెన మనవే పిచ్చోళ్ళం. పార్టీల చందాలు దండిగా ఇస్తే, ఎంత రేట్లు పెంచినా ఎవరూ పట్టించు కోరు. చల్లంగ పదవులు వాళ్ళకు. నెత్తిన నిప్పులు మనకు..

హాల్లో పిల్లలు టీ.వి పెద్ద సౌండ్‌లో పెట్టుకు చూస్తున్నారు. సీరియల్‌ మధ్య న్యూస్‌ కాబోలు ముఖ్యమంత్రిగారు ప్రత్యేక ఇంటర్వ్యూలో శెలవిస్తున్నారు.

“ధరలు పెరిగాయంటే ఎలా? పెట్రోలు ధర పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలూ పెరుగుతాయి…”

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

One Response to సన్నజీవాల సణుగుడు

  1. sujatha says:

    ఇందులో కధ ఏముంది? కధ ఏమిటా అని చదువుతుంటే, కధ అయిపోయింది. ధరలు రాజకీయ నాయకుల వల్లే పెరిగాయనుకోవడం, వాళ్ళు సరిగా పాలిస్తే ధరలు తగ్గుతాయనుకోవడం, ఎంత అమాయకత్వం? ఈ తప్పుడు చదువులు ఇలాంటీ తప్పుడు విజ్ఞానాన్నే ఇస్తాయి.
    సుజాత

Leave a Reply to sujatha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.