”పదండి ముందుకు” – ఆసియా దేశాలలో స్త్రీలు

డాక్టర్‌ జె. భాగ్యలక్ష్మి
ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్ళినపుడు అక్కడి స్త్రీల స్థితిగతులను మనం గమనిస్తుంటాం. ఒక దేశ ప్రగతిని అంచనా వెయ్యటానికి ఎన్నో సూచికలుంటాయి. కాని స్త్రీల ప్రగతిని బట్టే దేశప్రగతిని అంచనా వేయటం సబబు. ఎందుకంటే వెనుకబడినవారిలో మరింత వెనుకబడినవారు, చదువురానివారిలో మరింతగా చదువురానివారు, ఇతరుల స్వార్థానికి బలయ్యేవారిలో మరింతగా బలయ్యేవారు స్త్రీలేనన్నది కొత్తగా కనుక్కొన్న విషయం కాదు. అందుకే స్త్రీల అభివృద్ధిని సూచికగా తీసుకొంటే అసలైన దేశప్రగతి అర్థమవుతుంది.
ఆసియాలోని మలేషియా, సింగపూర్లు మరీ వెనుకబడిన దేశాలు కాదు. వీరి ఆర్థిక ప్రగతిలో టూరిజం ప్రముఖంగా ఉంటుంది. అందుకే దానిపై కేంద్రీకరించి కోట్లకు కోట్లు వ్యయం చేసి ఎన్నో వసతులు కల్పించి, ఆహ్లాదకరమైన పరిసరాలు, వినోదాత్మకమైన ఆటలు, ప్రదర్శనలతో టూరిస్టులను ఆకట్టుకొంటారు.
ఈ పర్యాటక పరిశ్రమలో చాలామంది యువతులు పనిచేయటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. గైడుగా అర్ధరాత్రిదాకా పని చేయటం, వారివెంట మరో ఊరికి వెళ్ళి హోటళ్ళలో బసచేసి, పర్యాటకుల సమస్యలు పరిష్కరించటం, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులలోనైనా ఆహ్లాదకరంగా మాట్లాడుతూ తమ క్రమశిక్షణలోకి వారిని తీసుకురావటం అంత సులభమైన విషయం కాదు.
మలేషియాలో నాలుగురోజులు మాకు గైడుగా ఉంది, జెంటింగ్‌కు వచ్చి మమ్మల్ని సింగపూరుకు సాగనంపిన రోష్నా (రోజ్‌)తో మాట్లాడుతూ తెలుసుకొన్న విషయాలివి.
ప్రశ్న :    టూరిజంలో చాలామంది స్త్రీలు పనిచేస్తున్నారా?
జవాబు :    అవును. మలేషియాలో ప్రభుత్వమే స్త్రీలను టూరిజంలో పనిచేయమని ప్రోత్సహిస్తుంది.
ప్రశ్న :    దీనికి కావలసిన అర్హతలేమిటి?
జవాబు :    సెకండరీ స్కూలు ఫైనలు వరకు చదువుకొంటే చాలు. అయితే ఇంగ్లీషు బాగా వచ్చి ఉండాలి.
ప్రశ్న :    దీనికి శిక్షణ ఉంటుందేమో!
జవాబు :    అవును. ఆరునెలల శిక్షణ ఉంటుంది. చాలామంది స్త్రీలు టూరిజంలో పనిచేయటానికి ముందుకొస్తున్నారు. కొందరు బస్సు డ్రైవర్లుగా, కొందరు టాక్సీ డ్రైవర్లగా పనిచేస్తున్నారు. పెట్రోలు బంకుల వద్దా స్త్రీలు పనిచేస్తారు.
ప్రశ్న :    ఈ దేశంలో అక్షరాస్యత ఎంత?
జవాబు :    తొంభైశాతందాకా చదువువచ్చినవాళ్ళే.
ప్రశ్న :    మీరు ఇంట్లో ఏ భాషలు మాట్లాడుతారు.
జవాబు :    మా ఇంట్లో మలే భాష, ఇంగ్లీషు రెండూ ఉన్నాయి.
ప్రశ్న :    మతం పట్ల చాలా భక్తి శ్రద్ధలున్నాయా?
జవాబు :    (తల ఊపుతూ) మతమంటే గౌరవమే. రోజుకు ఐదుసార్లు ప్రార్థించాలి. రంజాన్‌ సమయంలో ఉపవాసాలూ ఉంటాము.
ప్రశ్న :    మలేషియాలో స్త్రీలు ప్రత్యేకమైన దుస్తులు ధరించాలనే నియమముందా?
జవాబు :    ఇక్కడ అన్ని మతాలవారూ ఉన్నారు. ముస్లిం స్త్రీల విషయంలో ప్రభుత్వం నుండి అటువంటిదేమీ లేదు. తలకు ముసుగు అన్నది వాళ్ళ, వాళ్ళ అభిరుచిని బట్టి ఉంటుంది. జుట్టు స్త్రీకి కిరీటం లాంటిది. దానిని గౌరవంగా చూసుకోవాలి. నామటుకు నేను హజ్‌ చేశాను. కాబా, ఉమ్రా దర్శించారు. తలకు స్కార్ఫ్‌ చుట్టుకొంటాను.
ప్రశ్న :    మతాలపట్ల మలేషియా ప్రజల దృక్పథం ఎలా ఉంటుంది?
జవాబు :    మేమందరం సెక్యూలర్‌ భావాలతో కలిసిమెలిసి ఉంటాము. చాలామంది చైనీయులు, భారతీయులు ఉన్నారు. తరతరాలుగా మలేషియా పౌరులే. కాని వ్యాపారంలో వీళ్ళు బాగా రాణిస్తున్నారు. అయినా ఎవరూ ఎవరినీ ద్వేషించరు.
(ఈ విషయం ఇతరులనుండి కూడా తెలుసుకొన్నాను. ఒక సర్దార్‌ మలేషియాలోనే పుట్టి పెరిగినవాడు ”ఇక్కడ ఏ ఇబ్బందులూ లేవు. అందరూ ప్రశాంతంగా జీవిస్తుంటారు” అని చెప్పాడు.)
ప్రశ్న :    వివాహ విషయంలో చట్టమేముంటుంది?
జవాబు :    ముస్లిం చట్టం ప్రకారము నలుగురు భార్యలు ఉండవచ్చు కాని అంతమందిని పోషించి కుటుంబాలు పెంచుకొనే శక్తి ఎవరికి ఉంది? దేశంలోని సివిల్‌ చట్టం ప్రకారం ఒకరికి ఒక భార్య అనేదే ప్రమాణం.
ప్రశ్న :    స్త్రీవాదం గురించి మీ అభిప్రాయమేమిటి?
జవాబు :    మలేషియా అభివృద్ధిలో స్త్రీలు చురుగ్గా పాల్గొంటున్నారు. స్త్రీలు మంత్రులుగా ఉన్నారు. ఎప్పటికైనా స్త్రీ ప్రధానమంత్రి కావచ్చు. కాబట్టి స్త్రీలు దయనీయ స్థితిలో లేరని చెప్పగలను.
ప్రశ్న :    గృహహింస గురించి ఏమంటారు?
జవాబు :    గృహహింస ఉందని నేననుకోను. పోలీసులున్నారు. స్త్రీల సంస్థలున్నాయి. సమస్య అంతగా లేదనిపిస్తుంది.
ప్రశ్న :    గ్రామ ప్రాంతాలలో మీ అనుభవమేమిటి?
జవాబు :    (చిరునవ్వుతో) గ్రామప్రాంతాలు నేనంతగా చూడలేదు. అయితే స్వయంసహాయక సంఘాలు బాగా పనిచేస్తున్నాయని విన్నాను.
సింగపూర్‌ పర్యటనలో సూజన్‌, జేన్‌లు గైడులుగా పనిచేశారు. జేన్‌ చైనీస్‌ అమ్మాయి టూరిస్టులకు సులభంగా ఉంటుందని వీరు క్రిస్టియన్‌ పేర్లు పెట్టుకుంటారు. ఈ పద్ధతి చైనాలో కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ స్త్రీలు ఎక్కువగా వ్యాపార రంగంలో కనిపిస్తారు. సిరియాలో ముస్లింలతో పాటు క్రిస్టియన్లూ సహజీవనం చేస్తుంటారు. ఇక్కడ గైడుగా కేటీ వచ్చింది. తను విద్యార్థి. తీరిక సమయాల్లో పనులు చేసి తన చదువు తల్లిదండ్రులకు భారం కాకుండా చూసుకొంటుంది. అన్ని కట్టుదిట్టాలున్న ఇరాన్‌లో కూడా స్త్రీలు గైడులుగా పనిచేస్తున్నారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

3 Responses to ”పదండి ముందుకు” – ఆసియా దేశాలలో స్త్రీలు

  1. arunank says:

    అవునండి .నేను కూడా మలెషియా లో చూసాను .30 నుంచి 40 శా త0 మహిళలు అక్కడ పని చేస్తారు .ఆడవాళ్ళంటే ఇంట్లొ ఉండి పిల్లల ను మాత్రమే చూడలనే మన ద్రుక్పథ0 మారాలి.

  2. Ravi says:

    మలేషియాలోని భారతీయుల దారుణమైన పరిస్థితులు తెలుసుకోవాలంటే ఈ లంకెను నొక్కండి. మలేషియా నిదానంగా ఇస్లామిక్ రాజ్యంగా అవతరించ బోతోంది అని చదివాను కొత కాలం క్రితం.

    Malaysian-NRIs-ask-India to terminate it’s business relations with malaysia

    దురదృష్టవశాత్తూ భారత దేశములో చాలామంది అభ్యుదయ వాదులు హిందూ ఛందసత్వాన్ని మాత్రమే మత ఛందసత్వంగా, మిగిలిన వారి ఛందసత్వాన్ని “వారి హక్కుగా” చూడడం జరుగుతోంది.

  3. nrblpwjdn says:

    m3XhNf egmntkpykipt, [url=http://cneuazsjwoem.com/]cneuazsjwoem[/url], [link=http://zqurepgpnmjv.com/]zqurepgpnmjv[/link], http://vykfjmbjpwvl.com/

Leave a Reply to nrblpwjdn Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.