ఇంకేం జెయ్యాలె తెలంగాణకోసం

జె.సుభద్ర
తెలంగాణ  ఇప్పుడు యుద్ధభూమైంది. తెలంగాణ ఆకాంక్షలు బర్మాలై విస్ఫోటిస్తున్నయి.ఉద్యోగులు, విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు ఆర్టీసి, మున్సిపల్‌ కార్మికులు, సీనియర్‌ సిటిజన్లు, మహిళలు వీల్లు వాల్లని లేదు అందరు తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే అనే పోరాట బాటను కొనసాగిస్తున్నరు. తెలంగాణ జంగు నడుపుతున్నరు.
బలవంతంగా కలిపిన మా తెలంగాన మాక్కావాలె, తెలంగాణ మా జన్మహక్కు’ అని 56 ఏండ్ల నుంచి కంటి మీద కునుకు లేక పోరాడ్తనే వున్నరు రక్తతర్పణ చేస్తానే వున్నరు.ఫజల్‌ అలీ కమీషన్‌, పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీరూల్ప్‌, 610 జిఓ, సిక్స్‌ పాయింట్‌ ఫార్ములా, గిర్‌గ్లాని కమీషన్‌ కాన్నుంచి నిన్న మొన్నటి శ్రీకృష్ణ కమిటీ దాకా ఫక్తు మోసాలే మోసాలు.ప్రజల కోసమే ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల్ని గౌరవిస్తాం అనే రాజ్యాంగ ప్రమాణాల్ని బురదలో తొక్కి నాలికకి నరం లేకుండా ప్రభుత్వ నేతలే వ్యవహరించడం ప్రజా నేరం కాదా! కేంద్ర హోం శాఖ మినిస్టర్‌  డిసంబరు 9, 2009న చేసిన తెలంగాణ ప్రకటన పచ్చి అబద్ధమని తేలిపోయింది. అంత పెద్ద ప్రభుత్వాధినేతల ప్రకటనలు కూడా విలువ లేని నీళ్ళ మూటలవు తున్నప్పుడు తెలంగాణ ప్రజలు ఎవర్ని నమ్మాలి? యింట్లోన్ని నమ్మేటట్టు లేదు బైటోన్ని నమ్మేటట్టు లేదు అంతా మోసకారి బట్టేబాజులైండ్రు.
1952లో 1969లో దాదాపు నాలుగు వందల మందిని ఆంధ్ర వలస పాలకులు కాల్చి చంపిండ్రు. 2009 నుంచి యిప్పటిదాకా తెలంగాన కోసం తెలంగాణ బిడ్డలు 500 మంది రకరకాల ప్రాణత్యాగాలు చేసిండ్రు. పెట్రోలుతో కాల్చుకుని కొందరు, రైలును ఢీకొట్టి, వురేసుకుని, విషందాగి ఆత్మార్పణం చేస్కున్నరు. యివన్నీ కూడా హత్యలే. యివికాక అనేక పోరాటాలు చేస్తున్నరు. నిరాహార దీక్షలు, గర్జనలు, పొలికేకలు, రోడ్ల మీద బైటాయిస్తున్నరు. బంద్‌లు చేస్తున్నరు. రైళ్లను, బస్సుల్ని దిగ్భంధించి రాస్తారోకోలు చేస్తున్నరు. కాలికి బట్టకట్టకుండా పోయిమీద కుండ బెట్టకుండా తెలంగాణకోసం ప్రజలు రోడ్డెక్కిండ్రు.యింకో దిక్కు ధూంధాం చేసి ఆటపాటలవుతుండ్రు. ములాఖత్‌ల ప్రోగ్రాం బెట్టి తెలంగాణ కాంగ్రెసు, టిడిపి, సిపిఎం నేతలను కల్సివాల్ల బట్టలుతికిండ్రు, బూట్లుతుడ్సిండ్రు. వాల్లకు క్షవరంజేసిండ్రు. గులాబీలు పచిండ్రు.  కాళ్లు మొక్కిండ్రు వంటలు చేసిండ్రు. నిరంతర దీక్షా శిబిరాలు గల్లి గల్లికి చేస్తున్నరు. ‘ఔర్‌ ఏక్‌డక్కా తెలంగాణ  పక్కా’ అనే నినాదంతో సహాయ నిరాకరణ చేస్తున్నరు. ఉద్యోగులు  ఆఫీసుల పంజేయొద్దు. పన్నులు కట్టొద్దు. బస్‌ల టిక్కెట్‌ తీసుకోవద్దు అనీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టెదాకా యీసహాయ నిరాకరణ కొనసాగుతుందనే నినాదాలు కొనసాగుతున్నయి.
ఒక్కరోజూ రెండ్రోజుల్లో 60 ఏండ్లనుంచి తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన వనరులు, చదువులు, ఉద్యోగాలు, ఆత్మగౌరవాలు సీమాంద్రులు దోచుకొని కోట్లక్కోట్లు పడగలెత్తి తెలంగాణని విడిచేదిలేదు, సమైక్యాన్ని కదిపేది లేదు, తెలంగాణ వస్తే 23 ఉద్యమాలు చేస్తమని ఆవేశపడ్తున్నరు. బిక్షానికి వచ్చి ఆమిల్లు కరిచినట్లున్నయి సీమాంధ్రదొరల ఆవేశాలు.
తెలంగాణ ఉద్యమాలు ఒక ఎత్తయితే దానిమీద ప్రయోగిస్తున్న నిర్బంధాలు తక్కువేమి లేవు. ఉస్మానియా కేంద్రాన్ని సీమాంధ్ర కాంగ్రెసు పాలకులు లాఠీలతో గాయ పర్చింది అక్కడ నిత్యం 365 రోజులు 24 గంటలు నిరంతర యుద్ధం రగులుతుంది. తుపాకుల మోతలు, బాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లు పిల్లెట్లు, రాళ్ళ వర్షాలు, అరెస్టులు జైళ్ళు నిత్యకృత్యమైనయి. యింత భీకరమైన యుద్ధం దశాబ్దాల తరబడి సాగిన యుద్ధం  ప్రపంచంలో ఎక్కడ జరగడం లేదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు కూడా యిట్లా యింతకాలం, యింత తీవ్రంగా జరగలేదేమో.
యింత ప్రాణనష్టంతో యిన్నేండ్లుగా ఉద్యమాలు సాగుతున్నయి. అయినా తెలంగాణ రావడంలేదు. ఒక ప్రజా ఆకాంక్షని, ప్రజాస్వామిక హక్కును వ్యక్తం చేయడానికి యింకా ఏం చేయాలి? ఎట్ల వ్యక్తం జేయాలె? నిరసనకు ఉద్యమాలకు, పోరాటరూపాలెన్ని వున్నయో అన్ని చేస్తుంటిమి. మా తెలంగాణ మాక్కావాలె”ననే ఆకాంక్షను నెరవేర్చుకోనీకి తెలంగాణ వాళ్ళం యింకేం జేయాలె.
యింత జరుగుతున్నా సీమాంధ్ర పాలక వర్గ నాయకులు వాల్ల ప్రయోజనాలు ప్రధానంగా తెలంగాణ వ్యాపార కేంద్రంగా వుండడం. వాల్లకు ప్రజలు వాల్ల ఆంక్షలు ప్రయోజనాలు అక్కెర లేదు.కానీ తెలంగాణ రాజకీయ నాయకుల సంగతేంటి? వీల్లు సక్కంగుంటే తెలంగాణ పార్లమెంటుబిల్లు ఎప్పుడో రెపరెపలాడేది. చివరాకిరికి తెలంగాణ రాజకీయ నాయకుల పని బడితేనే వారి స్వార్ధం, ప్రలోబాలు వదిలి తెలంగాణ కోసం నిలబడ్తరు. అప్పుడే తెలంగాణ పక్కాగా వస్తుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to ఇంకేం జెయ్యాలె తెలంగాణకోసం

  1. Sri says:

    ఒక్క పక్క తెలుగొని పై యెడు చుడు దప్ప అంత బానె వుంది. యె అంధ్ర ఐనా రాజకియ నాయకులె దొచుకొంది, దొపిడి అన్నిచొట్ల జరిగింది, అందరొ కలిసి రాజకియని మారుచుకొవల సిన పొరాటాని, అర్దమ లెని పొరాటము గా మార్ చారు ఎ రాజకియులు.

Leave a Reply to Sri Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.