కాకరాపల్లిలో కదిలించే వాస్తవాలు

కె.ఎన్‌. మల్లీశ్వరి
మూడేళ్ళ క్రితం సిక్కిం వెళ్ళినపుడు భూమికి 14 వేల అడుగుల ఎత్తులో, మంచుతో కప్పబడిన పర్వతశ్రేణులతో ఉండే ‘నాతుల్లాపాస్‌’ అనే ప్రదేశానికి వెళ్లాం. భారత చైనా సరిహద్దు ప్రాంతం అది..ప్రతి కిలోమీటర్‌కీ భారతసైన్యం పహారా కాస్తూ కనపడింది. ఉద్రిక్తంగా ఉండే సరిహద్దు ప్రాంతాల పట్ల ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా ఉంటాయో అక్కడ చూసాను.
మార్చి రెండో తారీకు కాకరాపల్లి ఉద్యమకారులకి సంఘీభావంగా ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తరుఫున నేను ఉత్తరాంధ్ర రచయితలతో కలిసి వడ్డితాండ్ర మొదలైన గ్రామాలు తిరిగినపుడు పైన చెప్పిన మాదిరి వాతావరణమే కనిపించింది. కోట బొమ్మాళి నుంచే పోలీసుల హడావిడి ఎక్కువగా కన్పించింది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉన్నా మేం వెళ్ళిన రోజునుంచీ కొంత సడలించారని తెలిసింది. సుమారు 1000 మందికి పైగా పోలీసులు ఆ చుట్టుపక్కల గ్రామాలని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
కల్లోలిత ప్రాంతానికి గుర్తుగా ఎక్కడ చూసినా వాడి పారేసిన వాటర్‌ పాకెట్స్‌… పోలిథిన్‌ సంచులూ… తగలబడిన ఇళ్ళూ, వాహనాలు… కనిపించాయి. గుడి దగ్గరా, బడి దగ్గరా, బావి దగ్గరా, రైలుగేటు దగ్గరా ఒక చోటనేంటి? ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా పోలీసులు కాపలా కాస్తున్నారు.
వడ్డితాండ్రలో వాహనం దిగీ దిగగానే… సముద్రంలో మునిగిపోతున్న వాళ్లకి గడ్డిపోచ దొరికినా చాలన్నట్టుగా ఆ గ్రామస్తులు ఆత్రుతగా మా చుట్టూ చేరారు. పోలీసులు బాంబులు వేయడం ద్వారా కాలిపోయిన ఇళ్ళు, సామాన్లు చూపించారు.
మేం గ్రామంలో అడుగుపెట్టిన సమయానికే ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు, కొన్ని కొత్త బకెట్లను మోసుకుంటూ రావడం కనిపించింది. దాంట్లో ఓ చీర, ఒక దుప్పటి, కొంచెం బియ్యం, ఉప్పు, పప్పు, సబ్బుబిళ్ళలు, ప్లాస్టిక్‌ మగ్గు కనిపించాయి. ఆ బకెట్‌ మీద ఒక స్టిక్కర్‌ అంటించి ఉంది. దాని మీద వైఎస్సార్‌ ఫౌండేషన్‌, జగన్‌ నాయకత్వం వర్ధిల్లాలి అని రాసి ఉంది. ఆ బకెట్లో వస్తువులు మాకు చూపించిన ఓ కుర్రాడు… ”ఆళ్ళే కాల్చేసినారు… ఆళ్లే ఇయ్యన్నీ ఇత్తన్నారు… మాకేటీ ఎరిక లేదనుకుంతన్నారు గావాలా” అని అర్థవంతంగా పెదవి విరిచి వెళ్ళిపోయాడు.
నిజనిర్ధారణలో భాగంగా మేం వడ్డితాండ్ర, ఆకాశలఖవరం, సీరపువానిపేట, హనుమంతునాయుడుపేట, ఈస్ట్‌కోస్ట్‌ ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఉన్న ప్రాంతం తిరిగాం… అనేక మంది మత్స్యకారుల్నీ, రైతుకూలీలని కలిసి విషయాలను సేకరించి వాస్తవాలను మా అవగాహనలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాం.
అన్ని గ్రామాల్లో ప్రజలు థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణం పట్ల పూర్తి వ్యతిరేకతతోనూ, ప్రభుత్వ చర్యల పట్ల తీవ్ర ఆగ్రహంతోనూ ఉన్నారు. వడ్డితాండ్రకి మేం వెళ్ళగానే ప్రజలందరూ జగన్నాథస్వామి గుడి మండపం దగ్గరకి చేరుకున్నారు. ఆ గ్రామ సర్పంచ్‌ అయిన కృష్ణవర్జున్‌, కారుణ్య కేశవ్‌ అనే మత్స్యకారుడూ మాకు వివరాలు చెప్పారు.
సోంపేటలో మాదిరిగానే ప్రజల అభిప్రాయాలకి వ్యతిరేకంగా కాకరాపల్లిలో కూడా చిత్తడినేలల్లో థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణం జరుగుతోంది. దానిని వ్యతిరేకిస్తూ 2010 ఆగస్ట్‌ 15 తేదీ నుంచీ చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళంతా శాంతియుతంగా శిబిరం నడుపుకుంటున్నారు. పోలీసులు అకస్మాత్తుగా శిబిరాన్ని తొలగించడంతో ఘర్షణ మొదలైంది.
శిబిరం తొలగింపుకి ముందు కొన్ని రోజులుగా చుట్టుపక్కల గ్రామాలవారికీ, పవర్‌ప్లాంట్‌, ప్రభుత్వాధికారులతో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నిర్మాణం ఆపే విషయమై ప్రభుత్వ అలసత్వంతో ప్రజలు ప్లాంట్‌కి వాహనాలు వెళ్ళే దారులను దిగ్బంధనం చేశారు. దాంతో ప్రభుత్వం తీవ్రమైన అణచివేత చర్యలకి పాల్పడింది.
అందులో భాగంగానే శిబిరాలను బలవంతంగా తొలగించడం, అడ్డు వచ్చిన ప్రజలపై లాఠీ ఛార్జ్‌ చెయ్యడం, రబ్బరు తూటాలను వాడుతున్నామని చెప్పి నిజం బుల్లెట్లను వాడి ఇద్దరి ప్రాణాలను బలిగొనడం చేసింది ప్రభుత్వం… అంతేకాకుండా అనేకమందికి తీవ్రగాయాలు కూడా అయ్యాయి.
కాల్పులు జరగడానికి కొన్ని నెలల ముందు వడ్డితాండ్రని మద్యపాన నిషేధ గ్రామంగా ప్రభుత్వాధికారులు ప్రకటించారు. దానికి భిన్నంగా పోలీసుల రంగప్రవేశంతో ఎక్కడ చూసిన తాగి పారేసిన మందుబాటిళ్ళు ఖాళీసీసాలను బద్దలుగొట్టి ఇళ్ళ మీదికి విసిరి ప్రజలను భీతావహులను చెయ్యడం, ఇళ్ళలోకి చొరబడి స్త్రీలను జుట్టుపట్టి బైటకి ఈడ్చుకురావడం, బాంబులు వేసి ఇళ్ళను తగలబెట్టడం చేశారు.
”మొగోడొచ్చి ఆడదాయిని కొట్టేసినట్టు ఆ పోలీసులొచ్చి మా ఇళ్ళని బాంబులతో కొట్టేసినారు” అంటూ ఉత్తమ్‌ అనే మత్స్యకారుడు వాపోయాడు.
అట్లాగే హనుమంతునాయుడుపేటలో సహాయనిరాకరణ ఉద్యమం ద్వారా అక్కడి ప్రజలు పవర్‌ ప్లాంట్‌కి వెళ్ళే లారీలను ఆపివేయడం, కూలి పనులను తిరస్కరించడం చేశారు. కాకరాపల్లి నుంచి కంపెనీకి వెళ్ళే రోడ్డుని తవ్వేసారు. ప్లాంట్‌ మరో అడ్డదోవని కనిపెడితే అక్కడా రోడ్డు బ్లాక్‌ చేశారు… ప్రజలవైపునుంచి అన్ని రకాలుగా వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ద్వారా అణచివేత చర్యలకి దిగింది.
శిబిరాన్ని దౌర్జన్యంగా తొలగించారు…అక్కడ ఉన్న కుర్చీలు, వంటకోసం శిబిరం దగ్గర పెట్టుకున్న కూరగాయలూ, పప్పూ, ఉప్పూ లాక్కెళ్ళిపోయారు… అట్లాగే శిబిరంలో ఉద్యమగీతాలు పాడుకోడానికి వీలుగా తెచ్చుకున్న డోలక్‌ లాంటి సంగీత పరికరాలని, అక్కడ ఏర్పాటు చేసుకున్న హుండీని సీల్‌ చేసేసారు… 144 సెక్షన్‌ విధించడం ద్వారా ప్రజలు గ్రామం దాటి వెళ్ళడానికి, నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళడం కూడా ఇబ్బందిగా మారింది… కాల్పుల తర్వాత నౌపాడ సి.ఐని శవం ఇవ్వమని అడిగితే… ”వాళ్లకి పట్టిన గతే… మీకూ పడుతుంది…” అని బెదిరించారని గ్రామస్తులు చెప్పారు.
మేము సర్వేలో భాగంగా వైజాగ్‌ బెటాలియన్‌ పోలీసులతో మాట్లాడినపుడు ఆఫ్‌ ద రికార్డ్‌ ఒక పోలీసు ఉద్యోగి చెప్పిన మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి… ”అంతా మావాళ్ళే కదండీ…మేమూ ఇట్లాంటి వూళ్ళ నుంచే ఉద్యోగాల్లోకి వెళ్లాం…ఇట్లా చెయ్యడం మాకు బాధగానే ఉంటుంది…కానీ శాంతిభద్రతలను కాపాడి పరిస్థితులను అదుపులో ఉంచడం మా డ్యూటీ… ఇంతమంది వ్యతిరేకించే ప్లాంట్‌ కట్టడం అనవసరం కదా…” ఆవేదనగా అన్నాడతను.
కాల్పుల్లో చనిపోయిన జీరు నాగేశ్వరరావు, సీరపు ఎల్లయ్య కుటుంబీకులు పవర్‌ప్లాంట్‌ నిర్మాణాన్ని ఆపెయ్యాలన్నదే తమ కోరికని చెప్పారు… ”మమ్ములనందరినీ..తల్లీ బిడ్డలాదిగా…కాల్చుకోనీ…మావు లొంగం…పేనాలర్పిత్తాం…బాంబులే ఏత్తారో…తూటాలే పేలుత్తారో…ఇకన ఆల్లిష్టం…” అంటూ ఇక ఎవరికీ భయపడేది లేదని తెగేసి చెప్పారు.
వారిని పరామర్శించడానికి వెళ్ళినపుడు…మత్స్యకారులు కొందరు అక్కడే ఉన్నారు…అన్ని కులాల మధ్య, రైతాంగానికీ మత్స్యకారులకీ మధ్య కష్టసుఖాల్లో అనుబంధం ఉంటుందని ఈ ప్లాంట్‌ని తరిమివేయడం కోసం చేసిన పోరాటంలో చుట్టుపక్కల అరవై గ్రామాలవాళ్ళం మరింత సంఘటితం అయ్యామని చెప్పారు…
మేం రచయితలమని తెలిసి హనుమంతునాయుడుపేటలో మహిళలు ”మాకిష్టం లేని ప్రాజెక్ట్‌ని మా మీద రుద్దుతున్న ఈ ప్రభుత్వాన్ని, అక్రమంగా అనుమతులిచ్చిన వాళ్ళని, ఈ కలెక్టర్‌ని, కంపెనీలో వాటాలున్న రాజకీయనాయకుల్నీ, ఇదుగో ఈ రోజు నీళ్ళు పట్టుకోడానికి వెళ్ళినప్పుడు మనుషుల్ని చూసి తొడగొట్టిన పోలీసుల్నీ బాగా తిడుతూ రాయండి. మీకు ఏవన్నా భయంగా ఉంటే మా పేర్లు పెట్టి మరీ రాయండి… మీరు వచ్చి వెళ్ళినందుకు మాకు మేలు జరిగేది ఏవన్నా ఉందంటే అదే… మా అందరికీ చెప్పండి…” అని గట్టిగా చెప్పారు. వడ్డితాండ్ర, ఆకాశలఖవరం, సీరపువానిపేట, హనుమంతు నాయుడుపేట ప్రజలు… ఈస్ట్‌కోస్ట్‌ ఎనర్జీస్‌ కంపెనీకి అనుమతులు మంజూరు చేయడంలో ఈ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు.
”ఫ్యాక్టరీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రం గురించి… ప్లాంట్‌ పనిచేయడం మొదలుపెడితే తెలినీలాపురానికి వచ్చే ముప్పు గురించీ, సర్వే ఏ మాత్రం ప్రస్తావించకుండా అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలికుంచి గ్రామం గురించి సర్వేలో రాసి… దూరంలో ఉంది కాబట్టి దానికి ఎలాంటి ఆపదా లేదని తేల్చారు.
”ఫ్యాక్టరీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలినీలాపురం పక్షుల విడిది కేంద్రం గురించి… ప్లాంట్‌ పనిచేయడం మొదలుపెడితే తేలినీలాపురానికి వచ్చే ముప్పు గురించీ, సర్వే ఏ మాత్రం ప్రస్తావించ కుండా అక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలికుంచి గ్రామం గురించి సర్వేలో రాసి… దూరంలో ఉంది కాబట్టి దానికి ఎలాంటి ఆపదా లేదని తేల్చారు.
”వడ్డితాండ్రలో రిజిస్టర్డ్‌ కంపెనీగా ఉన్న శ్రీ జగన్నాథ పేపర్‌ మెన్‌ కోఆపరేటివ్‌ సొసైటీకి 1948 సంవత్సరం నుంచీ చేపల వేటకి లీజ్‌ పర్మిషన్‌ ఉంది.. దాన్ని హఠాత్తుగా అయిదేళ్ళ కిందట ఆపేయడమే కాకుండా మాన్యువల్‌ రికార్డ్‌ చేస్తున్నపుడు ప్లాంట్‌ మూలంగా నష్టపోయే సొసైటీలు ఏమీ లేవని తేల్చారు.
”రెండేళ్లనుంచీ తంపర భూముల్లో చేపపిల్లలు బతకడం లేదు. పేదప్రజలకి ఆదాయవనరు అయిన బొరిసెగడ్డి ఎండిపోతోంది… ప్లాంట్‌ వాళ్ళు తంపరభూముల్లో మందు కలిపి అక్కడ ప్రజలకి ఉపయోగపడే వనరులు లేవని సర్వే బృందాలను నమ్మించడానికి ప్రయత్నించారన్నది ప్రజల ఆరోపణ.
”పర్యావరణశాఖ నుంచి అధికారులు సర్వేకి వచ్చేముందు తంపర పరిసర ప్రాంతాలలో 50 మందికి బాణా కర్రలు డప్పులు ఇచ్చి పక్షుల్ని బెదరగొట్టారు.
”అనుమతి లేకుండా ఫాక్టరీ స్థలం చుట్టూ భారీ బట్టీలు తీయడం ద్వారా వరద నీరు గ్రామాలని ముంచెత్తుతోంది. బట్టీల లోతు తెలీక, అందులో దిగిన అర్జాల ధర్మారావు, ఒక కుటుంబానికి చెందిన మరి ఇద్దరు పిల్లలు చనిపోయారు.
”ఇక్కడ గ్రామాలు, వాగులూ, వంకలూ లేవని, ఇవి తంపర భూములు కావనీ ప్రభుత్వానికి నివేదికలు వెళ్ళాయి.
తాజాగా జపాన్‌ అణు ఉదంతంతో ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి, కాకరాపల్లి ఉద్యమానికి బలమూ చేకూరుతోంది. కాకరాపల్లిలో కూడా మహిళలు ఎక్కువశాతం ఉద్యమ కార్యకలాపాల్లో చురుకైన నిర్ణయాత్మకమైన పాత్రను పోషిస్తున్నారు. అభివృద్ధి విధ్వంసంలో చిక్కుకుని విలవిలలాడుతున్న వారికి ఇపుడు ఉత్తరాంధ్ర ఉద్యమాలు ఆశని కల్పిస్తున్నాయి.
(అట్టాడ అప్పలనాయుడు, వివిన మూర్తి, వర్మ, వేలూరి రామారావు, రామలక్ష్మి, చలం, దాసరి రామచంద్రరావు, బులుసు సరోజినీదేవి మా బృందంలో ఉన్నారు.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

2 Responses to కాకరాపల్లిలో కదిలించే వాస్తవాలు

  1. krishna says:

    I agree with చr truths some what
    but I agree with ur truths some what
    but should now the real truths , in this movement all villages are not particitpated why
    some villagers took money from From Plant , they agree and other may not agree
    one of the main person in the movement wants more money ,the company wont give
    he stared his movement and raises. The Plant was starred on 2009 and movement is strength form dec 2010
    why people immediately not started ….

  2. sivalakshmi says:

    మహిళలు ఉద్యమం లో నిర్ణయాత్మకమైన పాత్రను పోషించడం అనే విషయం భవిష్యత్తు మీద ఆశ ను కలిగిస్తుంది. మీ బృందానికి అభినందనలు.

Leave a Reply to krishna Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.