దిగ్భ్రాంతి కలిగిస్తున్న పిల్లల లింగనిష్పత్తులు

మేరీజాన్‌
ప్ర : సాధారణంగా లింగ నిష్పత్తి అనంగానే, అమర్త్యసేన్‌ 1994లో న్యూయార్క్‌ టైమ్స్‌లో రాసిన ‘వాన్‌ హుంద్రెద్‌ మిల్లిఒన్‌ వొమెన్‌ అరె మిస్సింగ్‌’ వ్యాసమే చర్చకు ప్రారంభమని అందరు భావిస్తారు. అది ఎంతవరకు నిజం?
స : నోబెల్‌ ప్రైజ్‌ గెలుచుకున్న ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ న్యూయార్క్‌ టైమ్స్‌ మొదటి పేజీలో ఈ విషయం గురించి చాలా మంచి వ్యాసం రాసారు. దానిగురించి మీరు అడగటం నాకు సంతోషంగా వుంది. ప్రపంచంలో చాలా ప్రాంతాల జనాభాలో మగవారికంటే, ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ రోగాల బారిన పడకుండా బ్రతికే అవకాశాలు కలిగి వుంటారు గనుక. అంతేగాక, పురుషుల కంటే, స్త్రీల జీవితకాలమే ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ పురుషుల నిష్పత్తులను, ముఖ్యంగా చైనాలో మరియు ఇండియాలో డేటాను పరిశీలించిన మీదట, పాలకులను ”తగ్గుతున్న లింగ నిష్పత్తుల” గురించి మేలుకొల్పటానికి సేన్‌, ‘మాయమవుతున్న స్త్రీలు’ (మిస్సింగ్‌ విమెన్‌) అనే పదాన్ని వాడారు. అయితే, భారతదేశంలో కధ దీనికన్నా చాలామందే మొదలయింది. పంతొమ్మిదవ శతాబ్దపు చివరిలోనే, బ్రిటీషు అధికారులు పంజాబ్‌, రాజస్థాన్‌లలో ఆడపిల్లలను చంపే అలవాట్లు వున్నాయని కనుగొన్నారు. స్వాతంత్య్రానంతరం, పంతొమ్మిది వందల డెబ్బైలలో ప్రవీణ్‌ విసారియా మరియు అశోక్‌మిత్ర అనే జనసంఖ్యా శాస్త్ర పరిశోధకులు జనాభా గణాంకాల్ని పరిశీలించి, భారతదేశంలో లింగ నిష్పత్తి క్రమంగా తగ్గుతోందనీ, ఆ తగ్గుదల స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగుతోందనే దిగ్భ్రాంతి కలిగించే విషయం చెప్పారు. నిర్లక్ష్యమేకాక, స్త్రీల పనికి తక్కువ విలువని కట్టి చూడటం లాంటి కారణాలు స్త్రీలలో ఎక్కువ మరణాలకు దారితీస్తోందని విశ్లేషించి చెప్పారు. 1980లలో బొంబాయి, ఢిల్లీలో స్త్రీల సంఘాలు, ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వారు గర్భస్థ శిశువులలో లోపాల గురించి చేసిన ఒక స్టడీ రిపోర్టును బయటికి తెచ్చారు. ఈ టెస్టును 1970లో భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఢిల్లీలో ఉన్న గర్భిణులపై పెద్ద సర్వే చేసినపుడు, చాలామంది గర్భస్థ శిశువుల లింగం తెలుసుకోవాలని ఆశిస్తున్నారనీ తమ గర్భంలో ఆడ శిశువులు వున్నారని తెలుసుకున్న చాలామంది గర్భస్రావం చేయించుకున్నారనీ ఈ రిపోర్టు ద్వారా తెలిసింది. సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన తరువాత, 1994లో లింగ నిర్ధారణకు వ్యతిరేకంగా మొట్టమొదటి చట్టం పి.ఎన్‌.డి.టి వచ్చింది.
ప్ర : పడిపోతున్న లింగ నిష్పత్తులని స్త్రీలపై హింసగా – ఆడపిల్లలని చంపటం, భ్రూణ హత్య, – పరిగణించటం జరుగుతోంది. సమస్యని అర్థం చేసుకోవటానికి ఈ దృక్కోణం ఎంతవరకు పనికొస్తుంది?
స : ఈ ప్రశ్నకి చాలా కోణాలున్నాయి. మొదటగా, ”హింస” అనే పదం విస్తృతార్థంలో వాడినపుడు, కొన్ని సార్లు దానికీ, ”వివక్షత”కు తేడా వుండదు. ఈ సమస్యను చూడటంలో ఉన్న విభిన్న దృక్పథాలను బట్టి, సమస్య పేర్లు కూడా మారతాయి. నేను ఈ సమస్యని గర్భస్థ శిశు హత్య అని కాకుండా, లింగ నిర్ధారక గర్భస్రావం అని అంటాను. వీటిని హత్యలుగానో, మారణ/హత్యాకాండలుగానో నేను చూడను. ఆడపిల్ల పట్ల సమాజం చూపే వివక్ష గురించి ప్రపంచదృష్టిని ఆకర్షించటానికి ఆయా పేర్లు పనికొస్తాయి గానీ, ఆ దృక్కోణంలో సమస్యని అర్థం చేసుకోవటానికీ, కుటుంబాలు కూతుళ్ళని వద్దనుకోవటానికి గల కారణాలు గానీ మనకు తెలియవు. నాజీలు యూదులను, సెర్బులు ముస్లిములను నిర్మూలించాలనుకోవటానికి, కుటుంబాలు కూతుళ్ళు వద్దనుకోవటానికి చాలా తేడాలున్నాయి. గర్భస్థ శిశువు హత్య లేదా భ్రూణహత్య వంటి పదాలు వాడినప్పుడు, అన్ని గర్భశ్రావాలనూ నేరంగానో లేదా హత్యగానో పరిగణించే ప్రమాదం ఏర్పడుతుందికూడా.
ప్ర : మీ అధ్యయనం గురించి చెప్పండి. ఎప్పుడు, ఎట్లా చేసారు? ఏ దృక్పధంలో జరిగింది?
స : మేము అధ్యయనం చేస్తున్న క్రమంలోనే నాకు ఈ విషయాలపై స్పష్టత వచ్చింది. మా అధ్యయనం ”ప్లానింగ్‌ ఫామిలీస్‌; ప్లానింగ్‌ జెండర్‌” అనే పేరుతో ప్రచురితమయింది. కావాల్సిన వారు మా సెంటర్‌ వెబ్‌సైట్‌ నుండి డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు. ఉత్తర, పశ్చిమ రాష్ట్రాలలో (పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌) లింగ నిష్పత్తి అతి తక్కువగా ఉన్న జిల్లాలలో భిన్న సామాజిక వర్గాల కుటుంబాలపై లోతయిన అధ్యయనం చేసాము. ఈ సమస్యపై చాలావరకు గణాంకాలు అందుబాటులో వుండటం వల్ల, మా అధ్యయనంలో గుణాత్మక అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాము. కుటుంబ డైనమిక్స్‌, కుటుంబాలు తమకు ఆడపిల్లలు, మగపిల్లలు సంఖ్యను ప్లాన్‌ చేసుకుంటున్న పద్ధతి, దానిలో ఇమిడివున్న భిన్న అంశాలు, కుటుంబాలు పిల్లల సంఖ్యను తగ్గించుకొనేకొద్దీ, కొడుకులను కావాలనుకోవటమే కాకుండా, కూతుళ్ళను వద్దనుకుంటున్నాము కూడా. ఒక కూతురు, ఒక కొడుకు (”ఇద్దరు పిల్లలే ముద్దు”) కావాలనుకొంటున్న వాళ్ళు కూడా, ”ఒక కొడుకు తప్పనిసరి, మరీ తప్పదంటే ఒక కూతురు”ను కోరుకుంటున్నారు.
ఇక్కడ ఎందుకు కూతుళ్ళను వద్దనుకుంటున్నారు అనే ప్రశ్న మళ్ళీ వేసుకోవాలి. మా ఉద్దేశంలో, ఒక తరం నుండి మరొక తరానికి కుటుంబాల వనరుల (అది డబ్బుకీ, లేదా ఆలనా పాలనకు సంబంధించినవి) బదిలీ అవుతున్న క్రమంతోనే ఇటువంటి ”పిల్లల ప్రణాళికలు” కూడా ముడిపడి వున్నాయి. కావచ్చు. మనకు ప్రస్తుత పరిస్థితులలో కొట్టొచ్చినట్లు కనిపించేది ఏమిటంటే – కుటుంబాలు ఎంత జాగ్రత్తగా పిల్లలని పెంచటానికి – వారి ఆరోగ్యం, వారి స్కూలు, పెద్ద చదువులు, పెళ్లికయ్యే ఖర్చులన్నింటి గురించీ – లెక్కలేసుకుంటున్నాయనేది. వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో, మధ్య తరగతి కుటుంబాలన్నీ కొద్దిమంది పిల్లలనే కనాలని కోరుకుంటున్నాయి – తక్కువమంది కొడుకులూ, అంతకన్నా తక్కువమంది కూతుళ్ళూ. ప్రస్తుతం కూతుళ్ళకయ్యే ఖర్చు ఆమెని పెద్దచేసి, ఆమె కన్యాత్వాన్ని జాగ్రత్తగా పెళ్ళయ్యే వరకూ కాపాడి, ”మంచి సంబంధం” చూసి పెళ్ళి చెయ్యటంతో ఆగట్లేదు. ఆమె మళ్ళా అత్తవారింట్లో  సమస్యలెదుర్కొని, పుట్టింటికి తిరిగి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువే. అంటే, పాతకాలంనాటి ‘కొడుకుల ప్రేమ’ ఈనాడు కొత్త స్థాయికి చేరుకుందన్న మాట. దానికి తేలిగ్గా దొరుకుతున్న అల్ట్రా సౌండ్‌ టెక్నాలజీ కూడా బాగా తోడ్పడింది. మనమందరం ప్రగతిశీల మార్పులుగా భావించే – స్త్రీల విద్య, పెళ్లి వయసు పెరగటం – వంటివన్నీ కూడా – కూతుళ్ళ పెంపకానికయ్యే ఖర్చుని పెంచి, ఆమెని మరింత బరువుగా మార్చి, మనమూహించని ఫలితాలకి దారితీస్తున్నాయి. ఈ పరస్పర విరుద్ధమైన పరిణామాన్ని అధిగమించాల్సిన అవసరం మనకెంతైనా వుంది.
ప్ర : లింగ నిష్పత్తి తగ్గుదలకు, లింగ నిర్ధారణలో సహకరిస్తున్న వైద్య వ్యవస్థ ఎంతవరకు భాధ్యత వహించాలి?
స : ఇది కొంచెం కష్టమైన ప్రశ్న. సంక్లిష్టం, ఖరీదైన ఆమ్నియోసిస్‌ పరీక్షను కాకుండా మామూలుగా అందరికి అందుబాటులో వుండే అల్ట్రా సౌండ్‌ పరీక్షను కుటుంబాలు, వారికి సహకరిస్తున్న వైద్యులూ లింగ నిర్ధారణకు వాడటం మొదలు పెట్టినపుడే, ఈ సమస్య ఒక ఖచ్చితమైన మలుపు తీసుకుంది. దురాశతో, అనైతికంగా వ్యవహరిస్తున్న వైద్యులను మనం తప్పకుండ బాధ్యులను చెయ్యాలి. ఏమీ వైద్య సదుపాయాలూ లేని మారుమూల గ్రామాలకి, అల్ట్రా సౌండ్‌ మెషీన్లను వానలలో పట్టుకెళ్లిన వైద్యులను గురించి నేను విన్నాను. మా అధ్యయనంలో అటువంటి కొంతమంది వైద్యులు తాము చేసిన పనిని ”సోషల్‌ వర్క్‌” అని సమర్థించుకోవటం మేము చూసాము. లింగ నిర్ధారణ పరీక్షలను చట్టవిరుద్ధమని ప్రకటించినప్పటికీ వైద్య వ్యవస్థ దానికి అతీతంగా ప్రవర్తిస్తూ, తమ సభ్యులను కాపాడుకుంటోంది. ఈ చట్టం కింద చాల తక్కువ మందికి శిక్షలు పడ్డాయి. వైద్యులకున్న సామాజిక అధికారం కారణంగానూ, ”మంచి” సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చామనే పేరువల్లనూ, దీనికి వైద్యులను బాధ్యులను చేయటంలో ఉద్యమం చాలావరకు విఫలమయింది. ఇంకో రకంగా చూస్తే, వైద్యులు కూడా ఈ సమాజంలో భాగమే కాబట్టి సమాజ పక్షపాత ధోరణులన్నీ వంటపట్టించుకుని వుంటారు. ఆ రకంగా చూస్తే సమస్య కేవలం వైద్య వ్యవస్థతో మాత్రమే కాదు.
ప్ర : దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి బాగుందని అందరు భావిస్తారు. దీనిగురించి గణాంకాలు ఏమని చెప్తున్నాయి? ఈ రాష్ట్రాల్లో తగ్గిన లింగ నిష్పత్తికి కారణాలేమిటి?
స : అతిహీనమైన లింగ నిష్పత్తి ఉత్తరాది, వాయువ్య రాష్ట్రాల్లో ఉన్నమాట నిజం, తమిళనాడులోని కొన్ని జిల్లాలను మినహాయిస్తే, 2011 గణాంకాలలో ఇంతకూ ముందూ ఫరవాలేదన్పించిన పట్టణాలూ, జిల్లాలూ కూడా ఇప్పుడు తక్కువ లింగ నిష్పత్తి చూపిస్తున్నాయి. దానిలో, ఒరిస్సా మరియూ నాగాలాండ్‌ లోని పట్టణ ప్రాంతాలూ వున్నాయి. గణాంకాల ప్రకారం చూస్తే, దక్షిణాది రాష్ట్రాల్లో, సేలం, ధర్మపురి జిల్లాలను మినహాయిస్తే, పిల్లల లింగ నిష్పత్తులు సరిగ్గానే వున్నాయి. అంటే, ఆర్థిక పరిస్థితులు బాగుపడి, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ, అందరు గర్భిణులు, పుట్టే పిల్లల లింగ నిర్ధారణ చేసుకోరు. ఆ పరిస్థితికి వేరే కారణాలు కూడా తోడయితే తప్ప. అయితే, 2011 గణాంకాలు ఇటువంటి సిద్ధాంతీకరణలను కూడా పునరాలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్తున్నాయి.
ప్ర : 2011 జనాభా లెక్కల గురించి ఇంకొంచం చెప్తారా? మీ అధ్యయన ఫలితాలని పునరాలోచించు కోవాల్సిన అవసరం ఏర్పడిందా?
స : 2011 జనగణనలో పిల్లల్లో లింగ నిష్పత్తులు ముందుకంటే తగ్గినాయని 927 నుండి 914 వరకూ తెలిసింది. వాయవ్య రాష్ట్రాల్లో ఈ నిష్పత్తులు కాస్త మెరుగు పడినప్పటికీ, లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడపిల్లల మరణాలూ ఇతర ప్రాంతాలకి కూడా – తూర్పు, మధ్య భారత రాష్ట్రాలకి పాకుతున్నట్లు స్పష్టమయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ తగ్గుదల కన్పిస్తోంది. అయితే, జిల్లా, పట్టణ స్థాయిల్లో జాగ్రత్తగా చూసినప్పుడే దీని కారణాలు అంతు పడతాయి.
ఈ ఫలితాలు మాకు ఆశ్చర్యం కలిగించలేదు. కుటుంబాలని ”ప్లాను” చేసుకోవాలనే ఆలోచన క్రమంగా అన్ని వర్గాలలో, పేదలతో సహా, పెరుగుతోంది. అత్యంత పేదవైన తూర్పు ఉత్తర ప్రదేశం, బీహారు జిల్లాలలో కూడా ఈ ధోరణి మనకి కన్పిస్తోంది. కేరళలో కూడా కొంతమేరకు ఈ ధోరణి ప్రబలుతోందని మనకు అక్కడ జరుగుతున్న అధ్యయనాలు చెప్తున్నాయి. ఉత్తర, వాయవ్య రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించటంవల్ల, బహుశా పరిస్థితి కొంత మెరుగుపడి ఉండవచ్చు. పూర్తి స్థాయి మార్పు తీసుకురావటానికి, ఇంకా చాలా కృషి చేయవలసి వుంటుంది.
ప్ర : లింగ నిర్ధారణ చట్టాలను బలపరచాలనీ, ఎక్కువమందికి శిక్ష విధించాలనీ అధ్యయనాలు చేసిన చాలామంది సూచిస్తూ వుంటారు. మీ దృష్టిలో అది సమస్యకి సరయిన పరిష్కారమేనా?
స : ప్రస్తుతం చాలావరకు దృష్టి 2003 సంవత్సరములో మార్చబడిన ప్రత్యామ్నాయ చట్టంపైన, కొంతవరకు గర్భశ్రావాన్ని అనుమతించే మెడికల్‌ తెర్మినతిఒన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ 1971 చట్టంపైనా వుంది. కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు ఈ చట్టం ఎందుకిట్లా విఫలమయిందనే ప్రశ్న తమని తాము వేసుకోవాలి. ఉద్యమ కార్యకర్తలూ, విలేఖరులూ రహస్య ”స్టింగ్‌ ఆపరేషన్లు” చేసి పట్టుకున్న వైద్యులకే కాస్త శిక్షలు పడ్డాయి. ఈ చట్టం కేవలం నియంత్రణకి ఉద్దేశించింది. చట్టాన్ని అమలు చేయాల్సిన సిబ్బందికి ఇది దాదాపు అసాధ్యమయిన పని. ఈ స్థాయిలో, తప్పకుండా చట్టాన్ని గట్టిగ అమలుచేసి, ఉల్లంఘిస్తున్నా కేంద్రాలని మూసివేయాలి. కానీ, లింగ నిర్ధారణ పరీక్షలను ఆపాలి తప్ప, గర్భస్రావాల్ని నియంత్రించ కూడదు. దీనికోసం గర్భస్రావం గురించి ఉన్న యం.టి.పి. చట్టాన్ని బలోపేతం చేసి, దాన్ని జనాభా నియంత్రణ విధానాలు కాకుండా, స్త్రీలకున్న హక్కుగా మార్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం చాలా వుంది.
ప్ర : మీ ఉద్దేశంలో, లింగ నిష్పత్తి తగ్గుదల గురించి దృష్టి సారించాల్సిన అంశాలేమిటి?
స : చెప్పాలంటే, చాలా విషయాలపై దృష్టి సారించాలి. వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని నియంత్రించటానికి మించి, వీటిపై దృష్టి పెట్టటం అత్యంత అవసరం. కూతుళ్ళను పెంచటానికి ఇంత ఖర్చు అవుతోందంటే ముందు మనం-వైద్యం, విద్యకయ్యే ఖర్చుల గురించి ఆలోచించాలి. రెండు ”వివాహ” వ్యవస్థ దాదాపు మన అజెండాలో లేకుండా పోయింది. స్త్రీల ఉద్యమంలో కూడా, కుటుంబంలో హింసని గురించి మాట్లాడుతున్నమేగాని, ఎంత తక్కువ మంది స్త్రీలు వేతన వ్యవస్థలో వున్నారనేది మనం ఆలోచించట్లేదు. ప్రస్తుతం భారతదేశంలో, కేవలం 15% మంది స్త్రీలు మాత్రమే వేతనాలు లభించే పనిచేస్తున్నారు. మనం స్త్రీల కోసం, ఎక్కువ ఉద్యోగావకాశాలూ, మంచి వేతనాలూ అడగాల్సిన అవసరం చాలా వుంది. ఎందుకంటే, కనీస ఆర్థిక స్వావలంబన లభించాలంటే అది మొదట అవసరం. మూడవది – కుటుంబాలలో కూతుళ్ళు పోషించే పాత్ర గురించి, మనకున్న పితృస్వామ్య కుటుంబాలలో కూడా తల్లి తండ్రుల ఆలన పాలన చూసుకోవడంలో కూతుళ్ళు తీసుకుంటున్న శ్రమ గురించి మనం చాలా బయటకు తీసుకు రావాలి. నాలుగు – వయసు మీరిన వారి బాధ్యతను తీసుకోవటంలో, రాజ్యం, మార్కెట్‌ కూడా మరింత ఎక్కువ పాత్ర తీసుకోవాలి.
చివరిగా, కుటుంబంలో కూతుళ్ళ పరిస్థితి బాగుపడాలంటే, మెరుగైన సామాజిక విధానాలు రాజ్యం అమలు పరచటమే కాక, వుద్యోగాలొచ్చే ఆర్థిక ప్రగతి మనకవసరం. సామాజిక ఉద్యమాల నుండి, మనం కుటుంబ వ్యవస్థనూ, తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలనే విధానాన్ని, నిశిత విమర్శకు గురిచేయాల్సి వుంది. ఇవన్నీ చేయకుండా ”అమ్మాయిలు ఎందుకు మాయమవుతున్నారూ?” అని అడిగితే లాభంలేదు.
ఇంటర్వ్యూ , అనువాదం: ఎ. సునీత

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

One Response to దిగ్భ్రాంతి కలిగిస్తున్న పిల్లల లింగనిష్పత్తులు

  1. pd says:

    మన రాష్ట్రం పరవా లేదు 2011 సెన్సస ప్రకారమ 992/1000.

Leave a Reply to pd Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.