దళితస్త్రీలపై అత్యాచారాలు

ఎస్‌. శారద

నేటి సమాజంలో స్త్రీలకు జరిగే అన్యాయలలో ఎక్కువభాగం దళిత స్త్రీల పైననే జరుగుతున్నాయి. అన్ని రంగాల్లో దళిత స్త్రీలు అన్యాయలకు అత్యాచారాలకు అవమానాలకు అవహేళనలకు గురి అవుతున్నారు.

పురుషాధిక్య సమాజంలో దళిత స్త్రీలపై జరిగే దమనకాండను వివక్షతను దళితవాద ఉద్యమాలు ఎలా ఎదుర్కొంటున్నాయి, దళిత స్త్రీలు అగ్రకులాధిపతుల అత్యాచారాలకు ఎన్ని విధాలుగా గురి అవుతున్నారనే జండర్‌ విధానాన్ని కొన్ని అంశాల ద్వారా చర్చిస్తున్నాను.

దళిత స్త్రీలు అన్ని రంగాల్లోను ఈనాటికీ అణగ ద్రొక్కబడుతనే ఉన్నారు. ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా దళిత స్త్రీ ఆక్రందనే. సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలన్నింటిలోను ఈ విషమ పరిస్థితి కొనసాగుతనే ఉంది. దళిత స్త్రీలు కుల మత, లింగ, రాజకీయ వివక్షలన్నింటికీ గురి అవుతున్నారు. వారి శ్రమతో పండి పులకిస్తున్న భూమి ఒడిలోనే వారి మానప్రాణాలు హతమైపోతున్నాయి.
దళిత స్త్రీలపై జరుగుతున్న పురుష దమనకాండలో స్త్రీని మాంసం ముద్దగానే పురుషాహంకారం చూస్తుంది. ఆమెపై దుర్మార్గంగా అత్యాచారం చేయడానికి, ఆ తర్వాత హతం చేయడానికి వెనుకాడడం లేదు. ఒక భూసామిలో సాంఘిక అహంకారం, పురుష పెత్తనం రెండ పెనవేసుకొని ఒక దళిత స్త్రీ పై అత్యాచారం చేయడానికి, ఆ తర్వాత హతం చేయడానికి వెనుకాడని మానసిక పరిస్థితికి తీసుకు వెళుతున్నాయి.
కుటుంబ హింసనుండి, సావజిక హింసనుండి తన్ను తాను రక్షించుకోటానికి, తనపై జరుగుతున్న భౌతిక, మానసిక దాడులనుండి బ్రతికి బయట పడడానికి దళిత స్త్రీ నిరంతరం అగ్రకుల సమాజంతో పోరాటం చేస్తూనే వుంది.
చరిత్రకూ, సంస్కృతికీ నిర్మాత అయిన దళిత తల్లి నేడు తన మానప్రాణాల రక్షణకు పురుష సమాజంతో పోరాటం చేస్తూనే వుంది. తాను నాటిన చేలో తాను బలి అవుతున్నప్పుడు దేశంలో తన స్థానమేమిటో నిత్యం ఆమె తెలుసుకుంటుంది. అందుకే దళిత కవి తన తల్లి గురించి ఇలా ఆక్రోశించాడు.
నాకూలి తల్లి పంట కుప్పల మధ్య పరాభవమైపోయింది.
ఉత్తమ మాతల పురస్కారాలందు కుంటున్నప్పుడు
నా వాడ తల్లి గుక్కెడు నీళ్ళు తాగినందుకు జరిమానాలు కడుతుంది.
తల్లులు అపరనాయకురాళ్ళయి ఏలికలు చేస్తున్నప్పుడు
నాలాగా తల్లి ప్రభుత్వాఫీసుల ముందు ధర్నాలు చేస్త వుంది.
ఎవరికైనా అమ్మంటే పాట పాడుతనో జోలపాడుతనో స్ఫురిస్తే
నాకు వ అమ్మ కలుపు తీస్తనో తట్టలు వెస్తనో గుర్తుకొస్తుందండి
కోడి కూసింది మొదలు రాత్రికి నాన్న తట్టిందాక
తనకసలు ఒక ఆడదాన్నన్న సంగతే గుర్తుకురాని నామొరటుతల్లి!
దళిత స్త్రీ అనగానే తాకరానిది కాని, మానభంగం చేయడానికి మాత్రం ఎటువంటి అంటలేదు. అస్పృశ్య స్త్రీ అనగానే ఆమెకి సామాజిక, ఆర్థిక, రాజకీయ అండలేదని అనుభవించడం, ఆ నేరం బయటకు రాకుండా ఆమెను చంపడం అగ్రవర్ణాల వారికి సులభమైపోయింది. దళిత స్త్రీనే ఎందుకు ఎక్కువ దాడికి అవమానానికి గురి అవుతుంది. ఆమెకి ప్రాకారాలు కలిగిన పెద్ద పెద్ద గృహాలు లేవు. ఆమె శ్రమ చేస్తున్న పొలాలు ఆమెవి కావు. మనిషికీ మనిషి మధ్య లింగపరమైన, స్త్రీలపైన దమనకాండ చేయడానికి హింద అగ్రవర్ణాల వారు ఏమాత్రం వెనుకాడక పోగా అది వారి నిత్యకృత్యంగా, వారి అహంభావానికి చిహ్నంగా కొనసాగిస్తున్నారు. అగ్రకుల స్త్రీ మరణానికి పురుషుడు కొంత కారణమయితే దళిత స్త్రీ హత్యకు అగ్రకుల పురుషుడు పూర్తిగా కారణమవుతున్నాడు. ఇది మానసికమైనది, భౌతికమైనది.
ప్రతి సంవత్సరం 513 మంది దళితులు హతం అవుతున్నారు. భార్య లేక తల్లి బాధితురాలవుతుంది. దళితుల ఇళ్ళు తగలబడినప్పుడు, బిడ్డచనిపోయినప్పుడు, భర్త చనిపోయినప్పుడు ఆమె దుఃఖితురాలవుతుంది. ఈ విషాదానికి దళిత స్త్రీపై ఉన్న అస్పృశ్యతే ప్రధానకారణం.
నిజానికి దళిత స్త్రీ చాలా ఆత్మాభిమానం కలిగింది. తనకుతాను శ్రమించి తాను జీవించి ఇతరులను పునరుజ్జీవింప చేయగల ఈ మాతృమూర్తిని ఈనాటి భరత భూమిలో ఎవరు ఎప్పుడు వధిస్తారో తెలియని పరిస్థితి. దళిత స్త్రీల మీద జరుగుతున్న ఈ దారుణ అరాచకత్వం అవనుషమైంది. పైగా నానాటికి పెరిగి పోతోంది. సివిల్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఎట్రాసిటిస్‌ యాక్టు ఒక ప్రక్క విఫలమయింది అనుకుంటే 1989లో ఎస్‌.సి, ఎస్‌.టి ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎట్రాసిటిస్‌ యాక్ట్‌ మరింత దారుణంగా విఫలం అయింది. ఇటీవల ఢిల్లీలో 22 స్త్రీ సంఘాలు ఒక సమావేశంలో స్త్రీలపై వివిధ రంగాలలో జరుగుతున్న అత్యాచారాలను ఖండించి ఇలా ప్రకటించాయి.
స్త్రీల అణచివేతన, దాని స్వభావాన్నీ విశ్లేషించే పద్ధతి, అణచివేతను వ్యతిరేకించే ఉద్యమము, ఆ ఉద్యమం గురించి వ్యూహ వివేచనాలన్నీ ఈనాటి చారిత్రక అవసరాలు.
దళిత స్త్రీ పట్ల అగ్రకుల హిందూ సామాజిక వ్యవస్థలో ఉన్న న్యనతాభావాన్ని దాన్ని కొనసాగిస్తున్న అగ్రకుల పురుష మనస్తత్వాన్ని గూర్చి విమల ధోరత్‌ సంక్షిప్తంగా యిలా అన్నారు.
దళిత స్త్రీలకు చదువుకొనే హక్కు లేదు. మతగ్రంథాల జ్ఞానాన్ని సంపాదించే హక్కు లేదు. ఆస్తిని సంపాదించే హక్కు లేదు. నిజానికి హింద సామాజిక వ్యవస్థ దళిత స్త్రీని క్రింది స్థానానికి నెట్టివేసింది. ఆ విధంగా దళిత స్త్రీలను మత సాంఘికాది విషయలలో అణచిపెట్టే విధంగా అగ్రకుల పురుషసమాజాన్ని వ్యవస్థ నిర్మించింది.
ఇక విద్యాలయల్లో విద్యార్థినుల పట్ల వివక్ష ఎలా అనుసరించబడుతుందో ఢిల్లీలో సమావేశమైన స్త్రీ సంఘాలు ఇలా నివేదిస్తున్నాయి. కాలేజీల్లో స్త్రీలపై జరుగుతున్న హింస భౌతికమైంది. మగవాళ్ళు కనుచపులతో, మాటలతో స్త్రీలను మానసిక హింసకు గురిచేస్తున్నారు. ఈసారి స్త్రీ అత్యాచారానికి గురి అయినట్లు సమాజానికి తెలిస్తే ఆమె మానసిక క్షోభకు గురవటం జరుగుతుంది. దళిత విద్యార్థినులు రాగింగుకు మరింత గురవుతున్నారు. ఈ మానసిక హింస సామాజికంగాన, లింగపరంగాన కొనసాగుతుంది. ఈ రెండు కారణాల నుండి జరిగే హింసవల్ల దళిత విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
దళిత స్త్రీ హక్కుల ఉల్లంఘనకు, ఆర్ధికాంశాల్లో దళిత స్త్రీల వెనుకబాటు తనానికి విడదీయరాని సంబంధంవుంది. భారతీయ సమాజంలో ఆర్థికంగా చితికిపోయిన వారిలో దళిత స్త్రీలు అధికంగా ఉన్నారు. దళిత స్త్రీకి సొంతభూమి లేదు. వీరు ఎక్కువగా వ్యవసాయ కూలీలుగానే జీవిస్తున్నారు. 1991లో గ్రామాల్లో వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్న దళిత స్త్రీలు 71% ఉన్నారు. వ్యవసాయం అనేది సంవత్సరంలో కొంతకాలం మాత్రమే పోషిస్తుంది. ఈ కారణంగా దళిత స్త్రీ సంవత్సరమంతటికీ కావలసిన జీవన భృతిని పొందలేక పోతున్నది. దళిత స్త్రీలకు ఉపాధి తాము నివసిస్తున్న గ్రామంలో లేకపోవుట వల్ల వారు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. వీరు వలస పోయినప్పుడు రైలు స్టేషన్లలో నివసించడం, చావిళ్ళలో నివసించడం వలన సరిఅయిన నివాస సౌకర్యం లేకపోవుట వలన భూస్వాముల అత్యాచారాలకు గురి కావలసివస్తోంది. దీనివల్ల వారి పిల్లల విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతోంది.
వాడ్రేవు వీరలక్ష్మీదేవిగారు వ్రాసిన ‘పేరెంట్‌’ అనే కథ దళిత వాదానికి సంబంధించినదే. భర్త లేని ఒక ఆడమనిషి ఒక సంపన్నుడి ఇంట్లో ఇంటిపనికి చేరి శీలాన్ని పోగొట్టుకొని ఒక కూతుర్ని కంటుంది. అష్టకష్టాలుపడి కన్న కూతుర్ని పెంచి పెద్దచేసి చదివించింది. వి.డి.ఓ. ఉద్యోగంలో చేరేట్టు చేస్తుంది. ఆ అమ్మాయి గ్రామస్తుల ద్వారా అనేక అక్రమాలకి పాల్పడుతున్న ఆ ఊరి వెతుబారి తన తండ్రి అని తెలుసుకుంటుంది. అతను చేసే అక్రమాలను ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఆ ఊరి వెతుబారి ఆ అమ్మాయిని తన కూతురేనని చెప్పి ఉద్యోగం ఊడగొడతానని బెదిరిస్తాడు. అయినా ఆ అమ్మాయి ధైర్యంతో తాటాకు బెదిరింపులకి లొంగకుండా విద్యద్వారా పురోభివృద్ధి సాధించడమేగాక, తన తల్లిని దళితకులంలో ఉన్నదని ప్రతిరోజు లొంగదీసుకుంటున్న అతని దుర్మార్గాలకు బుద్ధిచెప్పింది. కానీ కష్టపడిన కాలం తిరిగిరాదు. అమ్మ జీవితం అంధకారమయం చేసాడు. ఇలాంటి సంఘటనలింకెన్నో సమాజంలో జరుగుతనే ఉన్నాయి.
రైళ్ళలో టికెట్‌ లేకుండా ప్రయణం చేయల్సి రావటం, దానివలన రైల్వే పోలీసులు బలవంతంగా వీరిని కొట్టడం, అసభ్యకర పదజాలం ఉపయెగించి తిట్టడం కొన్నిసార్లు అత్యాచారాలు జరపడం చేస్తున్నారు. పోలీస్‌ క్యాంపులు ఏర్పాటు చేసిన ప్రదేశాలు, మిలటరీ క్యాంపులు ఏర్పాటు చేసిన ప్రదేశాలకు దళిత పల్లెల స్త్రీలు, గిరిజన తండాల స్త్రీలు పుల్లలు వంటి వాటిని ఏరుకోటానికి పోయినప్పుడు అత్యాచారాలకు గురికావడం విరివిగా జరుగుతుంది.

దళిత స్త్రీలపై పోలీసు – మిలటరీ వాళ్ళ అత్యాచారాలు :

త్రిపురలో దేబేరమ్మ అనే గిరిజన స్త్రీపై సైనికులు అత్యాచారం చేసారు. తరచూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన దళిత స్త్రీలు సైనిక శిబిరాల వద్ద అత్యాచారానికి గురవుతున్నాను. ఈ సమస్యను గుర్తించి 1991లో గౌహతి హైకోర్టు స్త్రీలను ఎటువంటి సందర్భంలోను సైనికులు తమ శిబిరం వద్ద ఆపి, ప్రశ్నించవద్దని ఆదేశించింది.
ఇదే క్రమంలో వయస్సుతో నిమిత్తం లేకుండా మైనరు బాలికలపై కూడా వీరు అత్యాచారాలు జరుపుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని రాంపూర్‌ గ్రామంలో 12 సంవత్సరాల సబీనా యస్కిన్‌ను పోలీసులు అరెస్టుచేసి జుట్టుపట్టుకొని లాఠీతో కొట్టారు. ఇంకొకరు నోటిలో మూత్రాన్ని పోసారు. ఇలాంటి దారుణమైన సంఘటనలు భారతావనిలో కోకొల్లలు.
పోలీసు కస్టడీలో మరణించేది ఎక్కువ దళిత పురుషులే. వారి భార్యలు అనాధలవుతారు. నిలువ నీడ లేకుండా పోతుంది. 1992-93లో భారత సంక్షేమశాఖ షెడ్యల్డు కులాల వారిపైన జరిపిన అత్యాచారాలను నమోదుచేసింది. దాని ప్రకారం 1076 మంది దళిత స్త్రీలను బలాత్కరించడం, 731 మందిని దారుణ హత్య చేయడం, 1890 మంది దళితులను గాయపర్చడం జరిగింది.
జోగినులు, మతంగులు :
దళిత స్త్రీలు కొన్ని జిల్లాల్లో గుళ్ళకు అనుబంధమైన జీవితాన్ని గడుపుత లైంగిక హింసని అనుభవిస్తున్నారు. జోగినులు, మాతంగులుగా, బసివినులుగా వారనుభవిస్తున్న జీవితం దుర్భరమైంది, దారుణమైంది. వారి జీవితాలను మానవతా రహితంగా దేవుడి పేరు చెప్పి వారిని పెండ్లికి, జీవన సంస్కృతికి దూరంగా ఊరుమ్మడి బ్రతుకులుగా రూపొందించారు. రెండు సంవత్సరాల, అయిదు సంవత్సరాలు వయస్సులోనే వారిని దేవుళ్ళకు అప్పజెప్పి వారిని అగ్నిగుండంలో త్రోస్తున్నారు. అందుకే కమలాబాసిన్‌ తన గీతంలో ఇలా వ్యాఖ్యానించింది.
ఒక స్త్రీని వేధించడం, బాధించడం, హింసించడం పితృస్వామ్య లక్షణమైతే దళిత స్త్రీని అమానుషంగా అవమానించి చంపేవరకు సామాజిక అసమానతతో తీసుకుపోవడం కుల పితృస్వామ్యమవుతుంది. హిందు దేవాలయం ఈ సామాజిక అసమానతకు కేంద్రీభూతం అయింది.
దళిత స్త్రీల హత్యల్లో కారంచేడులో ఆలీసమ్మ కొడుకును దారుణహత్య చేసారు. సాక్ష్యం చెప్పడానికి పూనుకున్న ఆలీసమ్మను దుండగులు హత్యచేసారు.
మెదక్‌ జిల్లాలో ఒక రజకస్త్రీ అగ్రకులాల పెద్దలు ఆమెతో సంపర్కించడానికి అడిగినప్పుడు నిరాకరించినందుకు ఆమెకు గుండు గొరిగించి, జీడిరసం గుండుమీద రుద్ది, గాడిదమీద ఊరేగించి అవమానపరిచారు.
ఆ మధ్య సజ్జలగడెంలో మహాదేవమ్మ అనే బసివిని గుడ్డలూడదీసి అమానుషం చేసారు. ఈ సంఘటనపై దళితకవి మద్దరి నగేష్‌ ఈ క్రింది కవితలో ఆగ్రహం వ్యక్తం చేసారు.
”మానం అంటే కడుక్కొని సరిపెట్టుకొనేదాన్ని
ఈ సినిగిపోయిన రవికను ఎక్కణ్నుంచి తేచుకునేదిరా!
కుచ్చినరాల పోటయితే ఎట్టాగో తట్టుకొనేదాన్ని
రొమ్ముపీకల్నే కొరికేసినావే!
నా పిలగాడికి పాలెట్టాకుడిపేదిరా!
ఈ నొప్పులకి నా పెద్ద పేణానికి మోసంవస్తే
రేపు నాబిడ్డలకి కూడుబెట్టెదెవుర్రా నా బిడ్డ”
ఈ కవి ఇంత ఆక్రోశంతో చెప్పినదాని వెనుక ఎంతో దుఃఖ భరితమై దీనగాథ ఉంది. ఇలాంటి గాథలు దాదాపుగా ప్రతిగ్రామంలో అలాగే ఉన్నా బసివిని నగ్నంగా ఊరేగించిన సంఘటన దళిత ప్రజల్నే కాకుండా దళిత కవితాలోకం గుండెల్ని కూడా పిండేసింది.
ఇలాగే ప్రకాశం జిల్లా టంగుటూరులో ఒక దళితస్త్రీ ఇందిర ఎంతో అందంగా ఉండేది. ఆమె అత్తకు ఒక కమ్మ మిండగాడు ఉండేవాడు. ఆ మిండగాడు భర్త, అత్తలేని సమయంచూసి ఇందిరకు గుండుగొరిగి, మీద బ్రాందిపోసి నిప్పు అంటించాడు. దహిస్తున్న మంటల్లో ఇందిర రక్షించమని అరచుకొంట, రోడ్ల వెంబడి పరుగెత్తుత కాలిపోయింది.
ఈ సంఘటనపై దళితులు తీవ్రమైన ఉద్యమం నడిపారు. అదే జిల్లాలో చీమకుర్తిలో నలుగురు దళిత స్త్రీలను క్వారీ కాంట్రాక్టర్లు ఆదివారం పనుందని పిలిపించి బలవంతంగా కట్టేసి, మానభంగం చేసి, నోట్లో గుడ్డలదిమి, రాళ్ళతో కొట్టి కాలువలో త్రొక్కారు. ఆ శవాలను ఒడ్డున పడేసి కాలుజారి గొయ్యిలో పడ్డట్టు పోలీసుల చేత చెప్పించారు. తరువాత దళిత ఉద్యమం (దళిత మహాసభ) ఆ సమస్యలోకి జొరబడి దళితస్త్రీలను కాంట్రాక్టర్లు చంపగా చూసిన సాక్షులను బయటకులాగి ఇది సామూహిక అత్యాచారం, హత్యలు అని నిరపించటం, ప్రభుత్వం భూస్వాముల హరితవిప్లవం తర్వాత బలిసిపోయి పచ్చటి పొలాలు నెత్తుటిచారలు కట్టిస్తున్నారు.
ఈ వరుసలోనే నల్గొండజిల్లాలో సమాజాన్ని కుదిపేసిన ఒక ఉదంతం జరిగింది. మావతమ్మ అనే దళిత స్త్రీని వివస్త్రని చేసి వూరేగించారు. మొత్తం భారతదేశమే విస్తుపోయింది. ఎక్కువగా ఈ మానభంగాలు, వివస్త్ర ఊరేగింపులు చేసి స్త్రీలను హింసించేది కమ్మ, రెడ్డి, రాజులు రాజ్యాధికారం ఉన్నవారి చేతుల్లోనే పోలీసులు, ప్రభుత్వాధికారంతో ఉంటారు. అందుకే పోలీసులు డాక్టర్లు, అధికారులు ఇతర ఉద్యోగస్తులు అంతా ఈ సంఘటనలలో భూస్వాముల పక్షాన్నే వ్యవహరించారు. ఒక సంఘటనను మాఫీ చేసి, మరో సంఘటన జరగడానికి వీరంతా పునాదులు వేస్తున్నారు.
ఇంక విశ్వవిద్యాలయల్లో సెంట్రల్‌ యూనివర్సిటీలో సునీత అనే దళిత విద్యార్థిని ఒక రెడ్డి విద్యార్థి మోసపు ప్రేమమాటలు చెప్పి గర్భవతిని చేసి నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో సునీత ఆత్మహత్య చేసుకున్నది. అగ్రకుల విద్యార్థులు ఇలా ఎందరిని మోసగించారో ఎన్ని గర్భాలు చిదిపారో అంతులేదు. అన్ని స్థాయిల్లోను ఈ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. పొలాల్లో, చావిళ్ళలో, గుడిలో, బడిలో చివరికి విశ్వవిద్యాలయంలో కూడా దళితస్త్రీహత్యలే.
ఇంతేగాక మధ్యతరగతి ఉద్యోగస్తులు ఇళ్ళలోను, పొలం, పుట్ర ఉన్నవాళ్ళ ఇళ్ళలోను 8 ఏండ్ల నుండి 10 ఏండ్ల వరకు ఉన్న దళితులు ఆడపిల్లల్ని పనికి పెడుతూ వాళ్ళు అక్కడే రజస్వలవుతారు. ఆ తరువాత ఇంటి యజమానులు అనేక సందర్భాల్లో ఒంటరిగా ఉన్న ఆడపిల్లపై అఘాయిత్యం చేస్తున్నారు. ఆ మూగబాధ చెప్పుకోలేక ఎటో వెళ్ళిపోవడమో, ఆత్మహత్య చేసుకోవడమో జరుగుతుంది.
గుంటరు జిల్లాలో ఒక ఇంటి యజమాని అత్యాచారం చేయడంతో ఆ అవ్మయి గర్భవతి అయింది. ఆ ఇంటి యజవనురాలు నాటు పద్ధతుల్లో కడుపు తీయించింది. అది పెద్ద ప్రవదానికి దారితీసి చివరకు అమ్మాయి కుటుంబానికి తెలిసి పెద్దాసుపత్రికి చేర్చగా అతికష్టం మీద ఆ అమ్మాయి బ్రతికింది. ఇలాంటి గుండెను కదిలించే సంఘటనలింకెన్నో జరుగుతనే ఉన్నాయి.
దళిత స్త్రీల శరీరం మీద, మానం మీద, హృదయం మీద, గుండె మీద, బాల్యం మీద, శ్రమ మీద, విజ్ఞానం మీద, వ్యక్తిత్వం మీద నిరంతరం జరుగుతున్న అగ్రకుల అహంకార దాడులకు చరమదశ ఎప్పుడు వస్తుందో!
దళితస్త్రీవాద ఉద్యమం లింగ, కులవివక్ష మీద నిర్మాణాత్మక, ఆచరణతో పోరాటాన్ని రూపొందించుకోవాలి.
దళితస్త్రీవాద ఉద్యమం ఒక శక్తి అయి ఒక ప్రత్యామ్నాయ సవజాన్ని నిర్మించినప్పుడే ఈ వివక్ష, దాడి అంతమవుతాయి. అప్పుడే సావజిక అసమానతకు ఆర్థిక, రాజకీయ అసమానతలకు కుల, లింగ వివక్షలకు వ్యతిరేకంగా సాగే పోరాటాలు విజయవంతమై ప్రత్యామ్నాయ సామాజిక రాజ్యవ్యవస్థను నిర్మించుకోవటం సాధ్యపడుతుంది. ప్రపంచదేశాల్లో అనేక విప్లవాల్లో స్త్రీలు వీరోచితపాత్ర వహించారు. పోరాటాల్లో పాల్గొనని స్త్రీజాతులు స్వేచ్ఛను, సమానతను పొందలేరు. ప్రపంచచరిత్ర ప్రతి అడుగులో పోరాటం అవసరమయిందని రుజువుచేస్తుంది. అన్ని పోరాటాలకంటే స్త్రీ తన వ్యక్తిత్వం కోసం చేసిన పోరాటం గొప్పది.
దళిత ఉద్యమం ద్వారా స్త్రీలపైన కులాధిపత్యం తిప్పి కొట్టబడింది. దళితస్త్రీలలో వచ్చిన ఆత్మవిశ్వాసం మధ్యతరగతి స్త్రీల విషయంలో కంటేె ముందుకు నడిచింది అనడంలో ఆశ్చర్యంలేదు. దళితస్త్రీలు కారంచేడులో తమపై జరిగిన అత్యాచారానికి 1985 జూలై 17న వారు దళిత ఉద్యమం అండతో మొత్తం అత్యాచారాన్ని పోలీసులకి వివరించగలిగారు. తమపై అత్యాచారం ఎలా జరిగిందో బహిరంగ వేదికలపై కూడా వివరించి చెప్పగలిగారు.
దళితస్త్రీలపై జరిగే అత్యాచారాల్లో ముఖ్యంగా విశాలమైన పొలాల్లో కేకవేసినా వినబడనంత దూరంలో మనుషులు ఉండటం, వాటర్‌షెడ్లు వంటి చిన్నచిన్న షెల్టర్స్‌లోకి ఏదో పని ఉందని పిలవడం, బలవంతంగా, చేయిపట్టుకోవడం ఎదురుతిరిగితే లొంగదీసుకోవడం, ఎవరికీ చెప్పలేని అశక్తితో వారు క్రుంగిపోవడం జరుగుతుంది. పోలీసుస్టేషన్లలో నమోదయ్యే కేసులు తక్కువ. సంఘటనలు వెలుగులోకి వచ్చి అది చైతన్యానికి దారితీసేవి తక్కువ. పశ్చిమగోదావరి జిల్లా పిప్పరలో ఒక దళితస్త్రీ ఎదురుతిరిగినందుకు భూస్వాములు దండిగ ఉన్న ఊరు కావడంతో ఆ అమ్మాయి కొట్టిందనే నెపంతో దళితుల ఇళ్ళన్నీ ధ్వంసం చేసి ఒక దళితుణ్ణి చంపేసారు. ఈ తరుణంలో దళిత ఉద్యమం వారిని కూడగట్టి బలమైన ఉద్యమం నడిపి ఆ కేసును నిలబెట్టింది. ఉద్యమం అండ ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనల్లో బాధితులు ధైర్యంగా ముందుకు వస్తారు. కానీ అండలేనప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు.
అనేక సందర్భాల్లో తక్కువ కులాలపై జరిగే అత్యాచారాలను అత్యాచారాలుగానే పరిగణించటం లేదు.
అసలు దళిత ఆడపిల్లలను వేధించడంలో కూడా కులవివక్ష వుంది. దళిత విద్యార్థినులను కులపరమైన హింసావాక్యాలతో వేధిస్తున్నారు. దళిత స్త్రీలకు, దళిత విద్యార్థినులకు సందేశాన్ని తీసుకువెళ్ళే విషయంలో ఉద్యమాలు బలంగా ఉండే క్రమంలో ప్రచారసాధనాల ప్రభావం కూడా జోడించబడుతుంది.
కులంతక్కువ స్త్రీని హీనంగా పిలవడం మీడియలో కూడా విభిన్న ఫోటోల ద్వారా చూపిస్తున్నారు. ఇంటి పనిమనిషిగా దళితస్త్రీ ఉంటే ఇంటి యజమాని కొడుకు ఆమెని చెరిస్తే, మరొక వివాహానికి కొంత డబ్బు ఇచ్చి పంపే ఔదార్యం చూపుతుంది. కానీ వివాహానికి అంగీకరించదు. చట్టప్రకారం ఈ దృశ్యం తత్వాన్ని ప్రబోధిస్తున్న ప్రసారసాధనాలు ఈ ఘట్టాల్ని నిరంతరంగా ప్రచారం చేస్తనే ఉంటాయి. ఈ కులవాదం హింసకు ప్రత్యామ్నాయన్ని రూపొందించుకోవడం ఉద్యమంలో ఒక అవసరం అవుతుంది.
ఏ ఉద్యమమైనా అది నిత్యప్రగతిశీలంగా ఉండాలంటే ఉపరితలం మీద యుద్ధం వలన సాధ్యం కాదు. దళిత ఉద్యమం కూడా సమాజ పునర్నిర్మాణంలో హిందూవాదాన్ని పూర్తిగా నిర్మలించానే భావాన్ని కలిగి ఉండకపోతే దళితవాదం కూడా సంస్కరణవాదంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
స్త్రీపై హింస భారత భూభాగంలో అంతం కావాలంటే హిందూ సామ్రాజ్యవాద పునాదులను పెకలించే పోరాటంలో భాగస్వాములు కావడం వల్ల సాధ్యమని ప్రతి భారతీయ స్త్రీ భావించి, ఆలోచించి, ఆచరణలో కదలిననాడు కులనిర్మలనా పోరాటం దానికి ఒక శక్తిగా, అండగా నిలిచిననాడు మాత్రమే ఈ హింస అంతమవుతుంది. హింస ఒక సామాజిక చర్య, ఆ సమాజ చర్యను ఆ సమాజాన్ని సమూలంగా మార్చడం ద్వారానే మార్చగలం.
ఒకనాడు క్రైస్తవమతం వల్లే విద్యావంతమైనది, దళితపల్లెలు, ఈనాడు అదే మతం వలన ఉన్నతవిద్యకు పోలేని దుస్థితికి నెట్టబడ్డారు.
ఆంధ్రదేశంలో రెండు ప్రధాన ఉద్యమాలు నడుస్తున్నాయి. ఒకటి భూమికోసం పోరాడే నక్సలైట్‌ ఉద్యమం రెండు సావజిక గౌరవం కోసం, రాజ్యాధికారం కోసం పోరాడే దళిత ఉద్యమం.
హిందూ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ఒక నూతన ప్రణాళికను రూపొందించుకోనిదే దళితస్త్రీకి విముక్తి లేదు. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాల ప్రత్యామ్నాయ ప్రణాళికతో హిందూరాజ్య వ్యవస్థను కూర్చే క్రమంలో మైనారిటీ మతాలు ముందుకు నడవాలి. దళితస్త్రీవిముక్తి మత మూఢ విశ్వాసాలతో కాకుండా హిందూవాద కులఛాందస సంకుచిత ద్వేష వాద ప్రత్యామ్నాయంగా కరుణ, ప్రేమలతో కూడిన పోరాట బాటలో రాజకీయధికార దిశగా నడిచినప్పుడే సాధ్యమవుతుంది.
రిఫరెన్స్‌ బుక్స్‌
1. పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ – కత్తి పద్మారావు, 2. నీలిమేఫలు – స్త్రీవాద కవిత్వం, 3. స్త్రీ చైతన్యం – సాహిత్యం – డా. పి. కుసుమకువరి,4. రెండోసగం – సివెన్‌ దబవు ఆర్‌.5. వార్త ఆదివారం కథపేరు -పేరెంట్‌, – వాడ్రేవు వీరలక్ష్మీదేవి

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

2 Responses to దళితస్త్రీలపై అత్యాచారాలు

  1. Anonymous says:

    చాల బాగుంది…..

  2. DAAVID says:

    చాల బాగునంది…

Leave a Reply to DAAVID Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.