పాలపుంత

కొండవీటి సత్యవతి

”నందూ! మనం చూద్దామనుకున్న జాగర్స్‌ పార్క్‌ జీటీవిలో వస్తోంది చూడు.”

”అవునా? నువ్వేం చేస్తున్నావిపుడు?”
”నీతో మాట్లాడుతున్నా”

”అబ్బో!జోకా?”
”పో..పోవోయ్‌ ఇంటి కెళ్లి సినిమా చూడు.”
”ఏ ఇంటికి?”
”ఏదో ఇంట్లో చూడు ఫోన్‌ పెట్టేస్తున్నా”
”నీ ఇంటికే వస్తున్నా…కాచుకో”
”నిజంగా”
”అబద్ధంగా”
”చచ్చేపనుందని నిన్న ఊదరగోట్టావ్‌”
”నీ దగ్గరకొచ్చి బతుకుదామని”
”రా మరి”
”తలుపు తియ్యిమరి” కాలింగు బెల్‌ వెగింది.
డోర్‌ తీస్తుంటే అతనికంటే ముందర పొగడపూల పరిమళం లోపలకొచ్చి గదినీ, ఆమెనీ కూడా చుట్టేసింది.
”దోసిలి పట్టు”
దోసిలి నిండా పొగడపూలు పోశాడు.
ఇన్ని పూలు ఎక్కడివి నంద”
”చెట్లవి”
”పొగడపూలు చెట్లకి పూస్తాయ? హృదయనికి అనుకున్నా”
”లుంబినీలో దొంగతనం చేశా”
దోసిలి అలాగే వుంచి చేతులు చాపింది.
ఆరడుగుల మనిషి అందంగా వొంగి ఆమె దోసిట్లో ముఖాన్నాన్చాడు. ఆ ఆనందాన్ని తట్టుకోలేనట్ట్టుగా కొన్ని పూలు కిందకి జారిపోయయి.
మెల్లగా ఆమె చుట్ట చేతులేసి
”ఐలవ్‌ యూ మధూ”
”నా కోసం ఈ పూలన్నీ ఏరు కొచ్చావా?”
”నీ కోసం కాదు”
”మరి?”
”నా కోసమే”
”అదేంటి?”
”నీ దోసిట్లో పోసినప్పుడు నీ ముఖంలోని సంతోషాన్ని చూడ్డం కోసం.”
”అంత ప్రేమా?”
”ఇంత ప్రేమ” అంట గట్టిగా ఆమెను హత్తుకున్నాడు.
ఆ ఊపులో పూలన్నీ నేలమీద రాలి పోయాయి.
”అన్నీ కిందపడిపోయాయి ఫో…”
”మనం కూడా కింద పడితే సరిపోతుంది కదా?”
ఫక్కున నవ్వింది మధుర. ఆమె నవ్వులోని కాంతి అతని ముఖం మీద ప్రతిఫలించింది. బుద్ధిమంతుడిలా పూలన్నీ ఏరి టేబుల్‌ మీద పోసాడు.
”మన పరిచయమై ఆరు నెలలా? అరవై సంవత్సరాలా మధు”
”ఓయ్‌! నాకు నిండా మూడు పదుల్లేవు”
”అయినా టీనేజ్‌ అమ్మాయిలా ఇంత అందంగా ఎలా వున్నావ్‌?”
”వయసుకి, అందానికి సంబంధమేమిటి?” నవ్వింది.
”ఇంత అందంగా హాయిగా ఎలా నవ్వగలవ్‌ నువ్వు?”
”నవ్వడానికి హద్దులున్నాయ నంద?”
”హద్దుల్లేవుగానీ ఆంషలున్నాయిగా”
”ఇక ఏ ఆంక్షలకీ లొంగేదాన్ని కాదు.”
”నాకు తెలుసుగానీ నీకింత లైవ్లీనెస్‌ ఎలా అబ్బింది?”
”జీవితం నేర్పింది”
”నిన్నెప్పుడ దిగులుగా, దుఃఖంగా చూడలేదు నేను.”
”నేను దుఃఖసాగరాల్ని, చీకటి అమావాస్యల్ని దాటి వచ్చేసాను. ఇప్పుడంతా పున్నములే, వెన్నెల స్నానాలే”
”నువ్వు మాట్లాడుతుంటే హాయిగా, రిలాక్సింగుగా వుంటుంది.”
”నన్ను పొగడ్డమే పనిగా పెట్టుకున్నావా ఈ రోజు? సినిమా చూడ్డానికి వచ్చి ఈ పనిలో పడ్డావేంటి నంద”
”ఇది పొగడ్త కాదు నీ సామీప్యత నాకు కలిగిస్తున్న పారవశ్యం. నువ్వు అడుగుపెట్టినంత మేరా నా జీవితం సంతరించుకున్న పచ్చదనం. సినిమా చూసే మూడ్‌పోయింది గానీ నీ నవల ఎంత వరకు వచ్చింది?”
”ఇవాళ ఏమి రాయలేదు. నువ్వూ కవిత్వం చెప్తున్నావే?”
”కవిత్వమా? నేనే… నా ముఖం లే, నువ్వెందుకు రాయలేదు?”
”ఆఫీసులో కొంచెం బిజీ. ఇంటికొచ్చేసరికి బాగా అలిసిపోతున్నా.”
”వంట్లో బాగానే వుంది కదా!”
”బాగానే వుంది. డోన్ట్‌వర్రీ. అలసట. అంతే”
”ఇలా అయితే ఎప్పటికి పూర్తవుతుంది?”
”ఏమో! తెలియదు.”
”అదేంటి? టార్గెట్‌ లేదా?”
”సృజనాత్మకతకి టార్గెట్లుండవు బాబూ! ఇదేమైనా ఆఫీసు ప్రాజక్టును కున్నావా? ఏదో ఒకటి రాసేయడం నాకిష్టం లేదు.”
”నాకేం తెలుసు చెప్పు. నేనేమైనా రైటర్‌నా?”
”టైమ్‌ చాలడం లేదు. టైమ్‌ దొరికినప్పుడు మూడ్‌ వుండడం లేదు.”
”సరే తల్లీ! నీ నవల, నీ ఇష్టం. తిండానికేమైనా వుందా?”
ఆకలిగా వుందా? ఇంకా ఏమీ వండలేదు”.
”వండుకుందాం పద”.
”సరే! అన్నం అయ్యే లోపల స్నానం చేద్దామా?”
”సరిగంగ స్నానాలా?”
”లేదు జలపాత స్నానాలు”
”జీవితంలో ఇంత సంతోషముంటుందని నిన్ను కలిసాకే నాకు తెలిసింది మధూ.”
సంతోషం ఎప్పుడ మన చుట్టనే వుంటుంది. దాన్ని గుర్తించడంలోనే వుంది మన తెలివంతా.”
”నిజమే! జలపాత స్నానాలకి జలపాతాల దగ్గరికే వెళ్ళనక్కర్లేదు. ఫోర్స్‌గా వస్తున్న ఈ షవర్‌ చాలదా?”
”ఆ థ్రిల్‌ వేరులే.”
”థ్రిల్‌ వేరేగానీ ఈ దగ్గరతనం అక్కడ కుదరదుగా! తలకోన జలపాతాలు అద్భుతంగా వుంటాయట. వీకెండ్‌కి వెళదామా? మధూ.”
”నీతో రావడానికి ఎక్కడికైనా, ఎప్పుడైనా నేను రెడీ నంద”.
”ఎక్కడికైనా వస్తావా?”
”ఆహా ఎక్కడికైనా సరే. ఆకాశం అంచుల దాకా రమ్మన్నా వస్తాను”.
”నా మీద అంత నమ్మకమా?”
”నా మీద నాకు నమ్మకం.”
”నా మీద ప్రేమేనా?”
”మన బంధం మీద నమ్మకం. ప్రేమ.”
”ఈ బంధాన్ని ఏమంటారు?”
”నాకూ తెలియదు. లివింగు టు గెదర్‌ హేపీలీ.”
”నీకు భవిష్యత్తు గురించి భయం లేదా?”
”ఎవరి భవిష్యత్తు?”
”మనదే”
”ఇప్పుడేమైంది మన భవిష్యత్తుకి?”
”ముందు ముందు ఏం జరుగు తుందో..”
”నాకలాంటి భయలేం లేవు నంధూ, దేన్నయినా ఎదుర్కోనడానికి నేనెప్పుడ సిద్దమే.”
”ఈ చిన్ని గుండెలో అంత నిబ్బరం ఎక్కడ వుంది?” ఎలా వచ్చింది నీకు?” గుండె మీద ముద్దు పెట్టాడు.
”జీవితమే నేర్పింది..” తడిగా వున్న అతని పెదాల మీద మధురంగా తన పెదాలాన్చింది. స్నానాలు ముగించి బయటకొచ్చారు.
”అన్నం అయ్యింది తిందామా?”
”నీకు బాగా ఆకలవుతున్నట్లుంది. సారీ. ఆలస్యమైంది.”
”ఏం ఫర్వాలేదులే మధూ. బయట వాతావరణం వరినట్లుందే.”
”అవును. వాన వచ్చేట్టుగా వుంది.”
ఆకాశం నిండా నల్లమబ్బులు. ఉరుములు, మెరుపులు. బాల్కానీలో నిలబడ్డారు. వర్షం మొదలైంది. ఎండాకాలపు వానకి తడిసి మట్టి కమ్మటి వాసనేస్తోంది.
”వానలో తడుద్దావ?” మధుర.
”జలుబు, జ్వరంలాంటివేమీ రావుగా”.
”వస్తే రానీ, నాలుగు రోజులు తుమ్మితే నష్టమేమీ లేదు లేవోయ్‌! వానలో తడుస్త ఐస్‌క్రీమ్‌ తినడం భలే బావుంటుంది.”
”యూ ఆర్‌ సో డిఫరెంట్‌.”
”ఎలా?”
”వర్షంలో తడవడమే భయం. మళ్ళీ చల్లగా ఐస్‌క్రీమ్‌ తినడం.”
”నీకు ఇన్ని భయలున్నాయ నంధూ” అల్లరిగా నవ్వింది. ”నాకేం భయలు లేవు. పద వెళదాం.”
”నీకు రోషమొచ్చినప్పుడు భలే ముద్దొస్తావ్‌ నంద” అంట ముద్దు పెట్టింది. నవ్వేసాడు.”పద వెళదాం మరి.”
ఫ్లాట్‌కి తాళం వేసి లిఫ్ట్‌లో కిందికి దిగారు.
”వాన బాగానే పడుతోంది మధూ.”
”అందుకేగా బయటకి వచ్చాం.”
”బైక్‌ మీద వెళదామా? కారులోనా?
”కారులోనే వెళదాం. మధ్యలో ఆపి నడుద్దాం.”
”ఒకే డన్‌. నువ్వు నడుపుతావా? నేను నడపనా.
”నువ్వే నడుపు. నేను వానని ఎంజాయ్‌ చేస్తాను.
”టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేసింది. జగుజీత్‌సింగు గజల్స్‌. జోరున కురుస్తున్న వర్షం మంద్రంగా, మధురంగా విన్పిస్తున్న జగుజీత్‌సింగు గళం. కొంత దరం వెళ్ళాక…
”ఇక్కడ ఆపు నంద! కొంచెం సేపు నడుద్దాం..”
ఆ వానలో మధుర చేతిలో చెయ్యేసి నడవడం చాలా థ్రిల్లింగుగా అన్పించింది నందకి.
”తడిసిపోయేవేవీ జేబులో లేవుగా నంద! నేనయితే ఏమి తేలేదు.”
”ఏమి లేవులే. పర్స్‌ కారులోనే పడేసాగా.”
ధారలుగా కురుస్తున్న వాన. ఇద్దరు మొత్తం తడిసి పోయరు.
”మనం పెళ్ళి చేసుకుందాం మధూ”
”ఇప్పుడు బాలేదా? మీ వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకుంటారా?”
”ఒప్పుకోరు””మన మధ్య వయసు తేడా! అండ్‌ యూ ఆల్‌ సో లాష్ట్‌ యువర్‌ హజ్బెండ్‌”
”సో వాట్‌? మగవాళ్ళే ఎందుకు పెద్ద వాళ్ళయ్యుండాలి? చిమ్మ చీకటిలాంటి నా మొదటి పెళ్లి.. నా భర్త మరణం.. ఇందులో నా తప్పేముంది?”
”నేనెప్పుడలా ఆలోచించలేదు మధూ. నీ బలమైన వ్యక్తిత్వం, నీ ప్రేమ, చైతన్యం ముందు అవన్నీ ఎందుకూ కొరగావు.” ”నేను నా గతం జీవితంలోని అంధకారంలోంచి బయటపడి వెన్నెల దారుల వెంట నడవాలనుకుంటున్నాను. నంద! నీ స్నేహం, నీ ఆత్మీయత చాలా అపురపం నాకు. ఈ చిన్న జీవితంలో అప్పుడే ముప్పై యేళ్ళు గడిచిపోయయి. మిగిలిన జీవితాన్నయినా నా కిష్టమైనట్టు మలుచుకోవాలని ఆశ. నీ స్నేహ సాహచర్యంలో దాన్ని సాధించగలననే నమ్మకముంది నాకు..” అతని చేయిని మృదువుగా నొక్కింది.
”మధూ! నీ సామీప్యత, స్నేహం నాకెప్పుడ కావాలి. పెళ్లయితే నేను మారిపోతానని, మామూలు మొగుడు అవతారమెత్తుతానని నీ అనుమానం కద!”
”అలా అని నేనన్నానా? అయినా అలాంటి సందర్భం వస్తే ఏం చేయలో నాకు బాగా తెలుసు లేవోయ్‌! సహజీవనంలో స్నేహం కరువైతే నా దృష్టిలో అది వేస్ట్‌” కళ్లు మిరుమిట్లు గొల్పుత ఒక మెరుపు తీగ ఆకాశంలో పరుగులు తీసింది. ఆ వెంటనే ఫెళఫెళర్భాటాలతో ఉరుము ఉరిమింది.
”మధూ! నేనెప్పుడ ఇలాంటి వర్షంలో తడవలేదు. మా అమ్మ నన్ను వర్షంలో తడవనిచ్చేది కాదు. వానలో తడుస్త నడవడం ఇంత అద్భుతంగా వుంటుందని నాకు తెలియదు.”
”జీవితంలోని చిన్న చిన్న ఆనందాలని, సంతోషాలని మనం ఇలాగే కోల్పోతుంటాం. ఎవరో ఒకరు అడ్డుపడుతుంటారు.”
”నాకు జలుబు చేసి జ్వరమొస్తుందని అమ్మ భయం”.
”ఒక్కోసారి ఏమి కాకపోవచ్చు కూడా. ఏదో అవుతుందనే భయం. మనల్ని పీడిస్త ఎన్నింటినో దూరం చేస్తుంది.”
”వెనక్కి వెళదావ? వాన ఇంకా ఎక్కువ అవుతోంది.”
”ఇప్పుడు వాన ఎక్కువైనా తక్కువైనా మనకి నష్టమేమిటి? మొత్తం తడిసిపోయాం కదా?”
”అవుననుకో. అయినా బాగా రాత్రయింది వెళదాం పద.”
”సరే! నాకేమైనా అవుతుందని నీకు భయం మొదలైంది కద! ఏమి కాదులే. అయినా ఎలాగ రేపు డాక్టర్‌ దగ్గరికి వెళ్లాలి” వెనక్కి తిరిగి కారు వైపు నడక సాగించారు. ఇద్దరి మధ్య కొంచెం సేపు నిశ్శబ్దం అల్లుకుంది.
ఏమాలోచిస్తున్నావ్‌ నంద! సడన్‌గా కామ్‌గా అయిపోయవేమిటి?”
”ఎందుకో మన మొదటి పరిచయం గుర్తొచ్చింది.”
”ఇంత సంతోషకరమైన వేళ అదెందుకు గుర్తు కొచ్చింది? డాక్టర్‌ దగ్గరికి వెళదామన్నాననా?”
”ఈ సంతోషం శాశ్వతమైతే ఎంత బావుంటుంది మధ?”
”ఏది శాశ్వతం చెప్పు నంద! ఈ క్షణంలో ఈ పిడుగులు మన మీదపడొచ్చు. ఏమైనా జరగొచ్చు.”
”నువ్వు చాలా ఫిలసాఫికల్‌గా మాట్లాడగలవు. నీకు రేపటి గురించి భయమేమీ లేదు.”
భయం లేదని ఎలా అనుకుంటావ్‌? కానీ భయపడి ఏం చేయగలం? మిగిలిన కాలాన్నైనా సంతోషంగా గడపొచ్చు కదా!”
”పాజిటివ్స్‌ నెట్‌ వర్క్‌ మీటింగులో నీ మాటలు విని నేను చాలా ప్రభావిత మయ్యను. అప్పటి వరకూ నాకు బతుకంతా నిరాశే. ఆత్మహత్య చేసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. బైక్‌ యక్సిడెంట్‌ అయినప్పుడు నాకు రక్తం ఎక్కించిన డాక్టర్లని రోజూ శపించేవాడిని. పిచ్చిగా ఏడ్చేవాడిని. నీ పరిచయం నాలో తిరిగి జీవితేచ్ఛను రగిలించింది. మదూ!”
ఆమె గుప్పిట్లో అతని చెయ్యి వణికింది. కళ్లలోకి ఉబికొచ్చిన కన్నీళ్లు వానధారలో కలిసిపోయయి.
”నేను చాలా ఏడ్చాను నంద! విలువైన కన్నీళ్లని చాలానే ఒలకబోసుకున్నాను. నీకు తెలుసుగా. నా మొగుడు ఆస్తిగా నాకు హెచ్‌ఐవిని పంచి చనిపోయడు. నా బిడ్డ కూడా పాజిటివ్‌గా పుట్టి చనిపోయింది. బతుకు నిండా చీకటి. కానీ నేను కూడదీసుకున్నాను. మిగిలిన జీవితాన్నైనా సంతోషంగా గడపాలను కున్నాను. మనలాంటి వాళ్ల గురించి ఎన్నో పుస్తకాలు చదివాను. కొండంత ధైర్యమొచ్చింది. వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. కారులో కూర్చున్నాక –
”ఐస్‌క్రీమ్‌ ఏది?”
”కొందాం. మరీ చిన్నపిల్లలా మారాం చేస్తావే.”
”నీ దగ్గర గాకపోతే ఇంకెవరి దగ్గర గారం చెయ్యగలను చెప్పు?”
ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ దగ్గర కారు ఆపి రెండు కోన్స్‌ కొనుక్కొచ్చాడు.
”వెళదాం. నీతో ఎక్కడికైనా వస్తానని చెప్పాగా.”
”అలాగే తిరుపతికి వెళదామా?”
”ఎందుకూ?”
”పెళ్లి చేసుకుందాం?”
ఫక్కున నవ్వింది మధుర.
”ఎందుకు నవ్వుతావ్‌?”
”మనకెవరయ్యా తిరుపతిలో పెళ్ళి చేసేది? ఇద్దరు హెచ్‌.ఐ.వి. పాజిటివ్‌లు. చిన్న పెళ్లికొడుకు, పెద్ద పెళ్లికూతురు. పైగా భర్తపోయిన దానికి అక్కడ పెళ్ళిచేస్తారని నీకు అంత నమ్మకమా నంద?”
”ఏం? ఎందుకు చెయ్యరు?” ఉక్రోషం ముంచుకొచ్చింది.
”నా పిచ్చి నంద! నువ్వెంత అమాయకుడివి. అయినా మనం పెళ్లి చేసుకు తీరాలి అని ఎందుకు పట్టుపడుతున్నావ్‌?”
”కారణాలు నేను చెప్పలేను మధ! నువ్వు దరం అయితే నేను భరించలేను.”
”నేనెందుకు దరమవుతాను? ఇద్దరం ఒకే పడవలో కదా! ప్రయణిస్తున్నాం. పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది నా దృష్టిలో అంత ముఖ్యమైనది కాదు. ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ, ఆత్మీయత బతికి వుంటే చాలు. మనం బతికున్నంత కాలం హాయిగా వుంటాం. మనకి ఆ బలం చాలద?”
”నిజమే అనుకో. నీ ప్రేమే కదా నన్ను బతికిస్తోంది. నీ సాన్నిహిత్యం దరమైతే నాకు ఇంకేం మిగలదు.”
”నంద! మన సహజీవనాన్ని సంతోషమనే పునాది మీద పునర్మించుకుందాం. నేన నిన్ను దూరం చేసుకోలేను. మనం మనలాంటి వాళ్లకి ఆదర్శమవుదాం. వాళ్లకి ధైర్యాన్నివ్వడం కోసం పని చేద్దాం. సరేనా!” నంద చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కింది. ఇంటికొచ్చేసారు.
”కార్లో వెళ్ళి కూడా ముద్దలా తడిసిపోయరేంటమ్మా.”
వాచ్‌మెన్‌ ఆశ్చర్యానికి వారిరువురి నవ్వులే సమాధానం.
”ఏంటో.. ఎందుకు తడిశారో. ఎందుకు నవ్వుతున్నారో” ముసుగు తన్నాడతడు.
నంద, మధుర ప్లాట్‌ తాళం తీసి లోపలికెళ్లి తలుపేసుకున్నారు.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

5 Responses to పాలపుంత

  1. Anonymous says:

    చాలా బావుంది

  2. Anonymous says:

    మంచిగుంది, చాలా నచ్హింది.. మళ్ళీ మళ్ళీ ఈ బ్లాగు కి వచ్చెలా చెసిందీ.

  3. Anonymous says:

    మంచి కధ. చాలా బావుంది.

  4. వేణు గొపాల్ says:

    చాలా బావుంది

  5. Anonymous says:

    చాలా బావు0ది

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.