ఆ దేశం నీకేమిచ్చింది?

కొండేపూడి నిర్మల

లూసియనాలో చదువుకుంటున్న అల్లం రాజయ్య కంటిదీపం కిరణ్‌కుమార్‌ హత్య వార్త విన్నప్పటినుంచీ మనసు మనసులో లేదు. అంతకు ముందు ఎ.బి.కె. ప్రసాద్‌ మనవడి మరణం ఇలాంటిదేనని గుర్తొచ్చింది.

ఈ రెండింటికీ మధ్య కూడా ఇంకా చాలా చదివాను. ఆ తల్లిదండ్రుల గుండె కోత నన్న కోత పెడుతోంది. కారణం నా కొడుకూ అక్కడే ఉన్నాడు. వాడు ఒక్కడే కాదు.
ఇవాళ మాయా అద్దంలోంచి మాత్రమే పిల్లల్ని చూ
సుకుంటూ, రాత్రింబవళ్ళను తలక్రిందులు చేసుకున్న ప్రతి ఇల్లూ గతుక్కుమని వుంటుంది. మావాడు ఇల్లినాయిసు వర్సిటీలో చేరిన కొత్తలో అక్కడంతా హైద్రాబాద్‌ లానే వుందని చెప్పినప్పుడు ఎంత తెరిపిగా అనిపించిందో! మళ్ళీ నెల్లాళ్ళకే తన పక్క రూం విద్యార్థి పెట్రోలుబంకులో నిప్పంటించుకుని ప్రాణం తీసుకున్నాడని, అందుకు నల్ల వాళ్ళ బెదిరింపులే కారణమని చెప్పినప్పుడు అది మిట్ట మధ్యాహ్నం అంటే వాడికి నిద్ర పట్టని అర్థరాత్రి అని తెలిసి నా కళ్ళముందు హఠాత్తుగా చీకటిపడింది.
గాఢంగా వుండాల్సిన బంధాలే వొదులొదులుగా వున్నాయని బాధపడుతున్న చోట, కనీసపు హక్కులు మరీ ప్రమాదంలో వున్నాయి. మనవాడ్ని పట్టభద్రుడ్ని చేసి నిలబెట్టిన దేశం చుట్టిరావడానికి బదులు, దేహాన్ని చూడ్డానికి పరిగెత్తాల్సి రావడం ఎలాంటి శాపం?
విశ్వాసాలు నిట్టనిలువునా కూలి పోతున్నాయి. ఏది ఆశిస్తున్నామో, రాస్తున్నామో, వట్లాడుతున్నామో అందుకు భిన్నమై పోయిన జీవితాల్లో సారం వెతుక్కోవడం చాలా కష్టంగా ఉంది. బతుకు మనది కాదు సరే, చావూ మనది కాదని తెలుస్తోంది. అది ఎవరి ఎజెండాలోనో చేరిపోయింది.
ఇలాంటప్పుడు నేను నా కొడుకుతో రహస్యంగా చెవిలో అయినా, ”నల్లవాడితో జాగ్రత్త” అనో ”తెల్లవాడితో బావుండు” అనో, ఒక రచయిత్రి మొహం పెట్టుకుని చెప్పలేను. రాసిన రాతలముందు దోషిలా నిలబడలేను. తల్లిగా నా బేలతనమూ దాచుకోలేను. జీవితం భయం పిడికిట్లో నలిగిపోతోంది.
ఓ పక్క ఎదుగు బొదుగు లేని జీవితాల్లోంచి పిల్లలు పారిపోతోంటే వాళ్ళని ఇంటికేసి ఆకర్షించడమేలాగో అర్థం కాకుండా వుంది. మన దేశమెప్పుడో అనాకర్షణీయమై పోయింది. ఎంప్లాయిమెంటు రిజిస్ట్రేషను ద్వారా ఉద్యోగం సంపాయించుకున్న వాడ్న దేకంటితో చసి ఎంతకాలమై పోయిందో!
చాతనైతే పందేనికి పెంచే కోడిలా నీ పిల్లల్ని పెంచు. నచ్చిన సీటు కొనడానికి అందినంత దోపిడి చెయ్యి. చిన్న సమస్యకు కూడా పెద్ద మంత్రి కాళ్ళో, గల్లీ రౌడీ గడ్డాన్నో పట్టుకో. ఏదీ చాతకాదా? అయితే బతకడం దండగ. ప్రేమ తప్ప ఇంకేమీ ఇవ్వలేనప్పుడు, అది కూడా ప్రచారాకర్షణ ముందు ఓడిపోయినప్పుడు ఏ నైతిక హక్కుతో నీ బిడ్డని ఈ మట్టిమీద కట్టి పడేస్తావు?
డాలరు ఒక్కటే కారణం కాదు. నీ పిల్లలు మెచ్చే ఎన్నో కారణాలు అక్కడ వున్నాయి. ఖచ్చితంగా అవి కన్నవాళ్ళని మరిపించే శక్తిని ఇస్తున్నాయి. బళ్ళో చేరింది మొదలు మనవాడిలో ఎలాంటి ప్రతిభ వుందో ఇక్కడి పంతుళ్ళు కనిపెట్టలేక పోతున్నారు. మరి అక్కడి వాళ్ళు నిగ్గు తీస్తున్నారు. కాబట్టి పెట్రోలు పంపులో కూడా మనవాడు సంతోషంగా పనిచేస్తున్నాడు.
చదువు తప్ప ఇంకో స్వప్నం తెలీని ఒక విద్యార్ధి జీవితాన్ని కూడా రెండు దేశాల మధ్య వైరుధ్యం దెబ్బ తీసినప్పుడు ఇక యూనివర్సిటీలు శ్మశానాలు కాక ఇంకేమవుతాయి? మనం ఇప్పుడు రాజకీయ స్పృహ లేదనో, ఉద్యమ నేపథ్యం తెలీదనో బెంగ పడగలమా? పవిత్ర యుద్ధం పేరుతో, పవిత్ర ప్రేమ పేరుతో, పవిత్ర కుర్చీ పేరుతో కాలిపోతున్నది మానవత్వమే అవుతున్న దాఖలాలో మనం లేమా?
హింస డిజావూ అయిపోయింది. చరిత్ర పునరావృతమవుతోంది.
కొన్నివేల సంవత్సరాల కింద ఈ దేశాన్ని ఎవరి దేవుడు రాజ్యమేలాడో ఇప్పుడు అప్రస్తుతం. శిథిలాల కింద నలిగిన మనుషులు ఎందరో?
ఎవరెవరి ముఖాల్లో మన పోలికలున్నాయె గుర్తు పట్టడం అవసరం.
ఇంత జరిగాక ఇంకా ఎవరినైనా ఏ దేశాన్నయినా ప్రేమించమని చెప్పకండి. పిల్లల్ని ప్రేమించడానికి వనరులు సరిపోక ఏడుస్తున్న వాళ్ళం.
ఈ దేశం నీకేమిచ్చింది? ఒక వలసనిచ్చింది.
ఆ దేశం నీకేమిచ్చింది? కన్న బిడ్డ దేహాన్నిచ్చింది.
వలసకి, జీవితానికి మధ్య మిగిలినదేమిటి? అనంతమైన ఎదురుచపు.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

6 Responses to ఆ దేశం నీకేమిచ్చింది?

  1. t.sujatha says:

    హృదయాన్ని కదిలించే సంఘటన ఎందుకు జరిగిందో తెలిస్తేనే ఆలోచించి విమర్శించుకో గలం ఆత్మావలోకనం
    చేసుకోగలం.విదేశీ చదువులు,వలసలు గురించి ఆలోచించుకోవలసిన సమయం ఆసన్నమైనట్లు తోస్తుంది.

  2. c vanaja says:

    దుంఖంలో ఉన్నప్పుడు చేసే ఆక్రోశంలో విచక్షణ ఉందా అని వెతకటం భావ్యం కాదేమోకానీ నిర్మల తన వ్యాసంలో ఎవరికో ఏదో నిరూపించాడంకోసం ఏవేవో వాదనలు తెలిసీతెలియక చేసినట్లు కనిపిస్తోంది. నేను బర్కిలీకి వచ్చిన మొదటి రోజు ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ ఇక్కడ మంచి స్కోర్స్ తెచ్చుకునే స్టూడెంట్స్ అంతా ఇండియన్స్ అండ్ చైనీస్, ఎందుకంటీ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టం బావుంటుంది అన్నాడు. ఈ మాట ఆయనే కాదు ఇక్కడ పిల్లల్ని బడికి పంపించే ఏ ఇండియన్ తల్లితండ్రులని అడిగినా చెప్తారు. అంతే కాదు అక్కడ అలవోకగా మాస్టర్స్ ఇంజనీరింగ్ వంటి చదువులని ప్రజల టాక్స్ డబ్బులతో చదువుకుని ఆ చదువులతో ఇక్కడ యావరేజ్ అమెరికన్ కన్నా రెండు మూడింతలు ఎక్కువ సంపాదిస్తూ నాకు పుట్టినదేశం ఏమిచ్చింది అనుకోవటం అన్యాయం కదూ! అమ్మల్ని సంతోషపెట్టానికి పెట్రోలు బంకులో పనిచెయ్యటం కూడా అద్భుతంగా ఉంటుందని అబద్దాలు చెప్పే పిల్లలు ఇక్కడ ఒక మిడిల్ క్లాస్ అమెరికన్ కొడుకుకి లేదా కూతురికి అండర్ గ్రాడ్యుయేషన్ చదువు కూడా ఎంత కస్టమో చెప్పకపోతే ఆ తప్పు అమ్మది కాదని నేను అర్దంచేసుకోగలను. ఇవ్వాళ ఒక సగటు అమెరికన్ ఈర్ష్యపడీ స్థాయిలో తను బతకటానికి తను ఇండియాలో పుట్టటం తన బేసిక్ ఎడ్యుకేషన్ ఇండియాలో జరగటమేనని పిల్లలు చెప్పకపోతే అదీ అమ్మ తప్పు కాదని నేను అర్దం చేసుకోగలను. కానీ అమ్మా! ఒక నల్లవాడు మన పిల్లవాడిని చంపగానే తన రేసిజంతో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని చూసిన చూస్తున్న తెల్లవాడితో స్నెహం చెయ్యమని అమాయకంగా సలహా ఇస్తున్న నీకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. 10 ఏళ్ళు స్నేహం చేసినా నీ కొడుకు తెల్లవాడి లివింగ్ రూమ్ దాటలేడని. మీ పిల్లలు తమ పిల్లల్ని “తెల్లవాడి” సమాజంలో పెంచటానికి కూడా ఎంత భయపడుతున్నారో కూడా తెలుసుకోవాలి.
    కట్టి పడేసి తెచ్చి పేరుకు మాత్రం స్వేచ్చ ఇచ్చి నల్ల వాడికి ఏ వనరునూ అందకుండా చెసిన తెల్లవాడు ఇవ్వాళ వాళ్ళ దారిద్ర్యానికి కారణం మరెవరో అని రెచ్చకొట్టే లౌక్యం కూడా తెలుసుకోవలసే ఉంది. ఇప్పటికీ తెల్లవాడు గోధుమ వర్ణం వాళ్ళ మీద చూపించే రేసిజం కంటే గోధుమ వర్ణీయులు నల్లవాడి పట్ల ప్రవర్తించే విధానం మెరుగ్గా ఉంటుందన్న బ్రమలు కూడా నువ్వు వదులుకోవాలి. భయంతో, అనుమానపు చూపులతో హింసించే గోధుమ వర్ణీయుల్లో కొందరైనా మంచివాళ్ళుంటారని తెలియని నల్లవాడి అమయకత్వాన్ని కూడా మనం అర్ధం చేసుకోక తప్పదు మరి. చూపుల మీద కథ రాసిన నీకు ఇది అర్థం చేసుకోవటం పెద్ద కష్టం కాదనుకుంటాను. అమ్మా! మరిన్ని డబ్బులు మరింత మంచి జీవితం కోసం రేసిజం మీద హింస మీద కట్టిన చరిత్ర, విలువలు లేని సమాజం లోకి పిల్లలు చేసే ప్రయాణంలో ముళ్ళుంటాయని వాళ్ళకు చెప్పాల్సిన సమయం ఇది.

  3. స్పందన కు కూడా ఖండనలుంటాయా?????
    ******************************

    వాస్తవానికి వ్యంగానికీ తేడా తెలీని దశలో వనజ వుందంటే నమ్మబుద్ధి కావడం లేదు. అల్లం నారాయణ చెప్పినట్టు తెల్సిన మృత్యువుతో పోరాటం వేరు. దానికొక ప్రణాళిక, ప్రయోజనం వున్నాయి. కానీ ఇవాళ పిల్లలు తెలియని మృత్యువు కి బలవుతున్నారు. పిల్లలు – అంటే నల్ల వాడా, తెల్లవాడా, గోధుమ రంగు వాడా అనే పరిమిత దృక్పధంతో నేనిది రాయడం లేదు. వర్ణ ద్వేషం గురించి, తెల్ల వాడి అభిజాత్యం గురించి , అత్యాశ గురించి మీరూ నేనూ కొత్తగా ఇప్పుడు వాదించుకోనవసరం లేదనుకుంటాను.
    ఎడ్యుకేషను సిస్టం బావుండి ఉద్యోగ వనరులు తక్కువ వుండటమే ఇక్కడి ప్రత్యేకత.పెట్రోలు పంపులో పని అయినా, ఫెలోషిప్పు పని అయినా మరికొన్ని మెరుగైన అవకాశాలు, జీవితం, గుర్తింపు ఆశించడం అసహజం కాదు.రెండు రెట్ల సంపాదన ఒక్కటే పూర్తి స్థాయి గమ్యం కాకపోవచ్చు. మనవాడు తెల్ల వాడి లివింగు రూమూ దాటడు, నల్ల వాడి అంతరంగమూ తెలుసుకోడు.తన గురించి మాత్రమె ఆలోచించగలుగుతాడు. ఇద్దరికీ బలవుతాడు.ఇది కూడా మన ఎడ్యుకేషను సిస్టంలో వున్నదే.మనలోనే ఒక భాషలోనే, సంస్కృతిలోనే ,భావజాలంలోనే ఇన్ని అస్పష్టతలున్నప్పుడు ,రెండు దేశాల మధ్య, జాతుల మధ్య ఎమిటి ఆశిస్తున్నావు? .మొన్నటి కాలము అనేక మంది తల్లు పరంగా ఒక స్పందన.
    బాధలో వున్నప్పుడు విచక్షణ వుంటుందో లేదో నాకు తెలీదు.
    స్పందనకు కూడా ఖండన వుంటుందని ఇప్పుడు తెలిసింది.
    బై ది బై….
    “చూపులు “- కధ కాదమ్మా, అది కవిత.
    అది రాసింది నేను కాదు జయప్రభ.

  4. vanaja says:

    ఈ దేశం నీకేమిచ్చింది వలస, ఎదుగు బొదుగు లేని జీవితం తప్ప అనటం వ్యంగం అని నాకు నిజంగానే అర్థం కాలేదు. మళ్ళీ మళ్ళీ చదివినా కూడా. తిరిగి ఈ స్పందన/ఖండనలో నిర్మల ఏం చెప్పదల్చుకున్నారో నాకు అస్సలు అర్థం కాలేదు. చూపుల గురించి కరెక్షన్ కు థాంక్స్. కథ పేరు పొరపాటు పడ్డాను. బహుశా పురుగు అనుకుంటా దాని పేరు. నిర్మలే రానినట్లు గుర్తు.
    ఇదే అంశంపై ఇతర వెబ్ పేజీల్లో వచ్చిన వ్యాసాలు ఆసక్తి ఉన్న వాళ్ళకోసం…
    ప్రాణహితలో హిమబిందు రాసిన వ్యాసం
    http://www.pranahita.org/category/%e0%b0%9a%e0%b1%8c%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be/
    తన బ్లాగులో కల్పన రెంటాల వ్యాసం
    http://kalpanarentala.wordpress.com/2008/01/11/%e0%b0%a8%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%95%e0%b0%be%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/

  5. vanaja says:

    ఈ దేశం నీకేమిచ్చింది వలస, ఎదుగు బొదుగు లేని జీవితం తప్ప అనటం వ్యంగం అని నాకు నిజంగానే అర్థం కాలేదు. మళ్ళీ మళ్ళీ చదివినా కూడా. తిరిగి ఈ స్పందన/ఖండనలో నిర్మల ఏం చెప్పదల్చుకున్నారో నాకు అస్సలు అర్థం కాలేదు. చూపుల గురించి కరెక్షన్ కు థాంక్స్. కథ పేరు పొరపాటు పడ్డాను. బహుశా పురుగు అనుకుంటా దాని పేరు. నిర్మలే రానినట్లు గుర్తు.
    ఇదే అంశంపై ఇతర వెబ్ పేజీల్లో వచ్చిన వ్యాసాలు ఆసక్తి ఉన్న వాళ్ళకోసం…
    ప్రాణహితలో హిమబిందు రాసిన వ్యాసం
    http://www.pranahita.org/category/%e0%b0%9a%e0%b1%8c%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be/
    తన బ్లాగులో కల్పన రెంటాల వ్యాసం
    http://kalpanarentala.wordpress.com/2008/01/11/%e0%b0%a8%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%95%e0%b0%be%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/

  6. c vanaja says:

    ఈ దేశం నీకేమిచ్చింది వలస, ఎదుగు బొదుగు లేని జీవితం తప్ప అనటం వ్యంగం అని నాకు నిజంగానే అర్థం కాలేదు. మళ్ళీ మళ్ళీ చదివినా కూడా. తిరిగి ఈ స్పందన/ఖండనలో నిర్మల ఏం చెప్పదల్చుకున్నారో నాకు అస్సలు అర్థం కాలేదు. చూపుల గురించి కరెక్షన్ కు థాంక్స్. కథ పేరు పొరపాటు పడ్డాను. బహుశా పురుగు అనుకుంటా దాని పేరు. నిర్మలే రాసినట్లు గుర్తు.
    ఇదే అంశంపై ఇతర వెబ్ పేజీల్లో వచ్చిన వ్యాసాలు ఆసక్తి ఉన్న వాళ్ళకోసం…
    ప్రాణహితలో హిమబిందు రాసిన వ్యాసం
    http://www.pranahita.org/category/%e0%b0%9a%e0%b1%8c%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be/
    తన బ్లాగులో కల్పన రెంటాల వ్యాసం
    http://kalpanarentala.wordpress.com/2008/01/11/%e0%b0%a8%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%95%e0%b0%be%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81/

Leave a Reply to c vanaja Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.