సాగర సూర్యుడు ఆకాశ జలపాతం

అనిశెట్టి రజిత

గూడూరులో రైలు దిగగానే
ఎదురొచ్చిన స్నేహస్వాగతం.

సముద్రునితో కలిసి
సూర్యోద యాన్ని ఆహ్వానించాలని
తూపిలిపాలెంవైపు బస్‌లో
ఉద్విగ్న ఊపిర్ల వెచ్చదనం..
సముద్ర దర్శనం ఆదిత్యుని ఆగమనం
అలలతో ఆటలాడుతూ
సేదతీరిన రచయిత్రుల గణం..
నాయుడుపేటలో ప్రతిమ నివాసంలో
ఆత్మీయ ఆతిథ్యం ఆహ్లాదపు విడిది.
ప్రళయకావేరి కోసం పరుగులు
పులికాట్‌ సరస్సుపై పడవ షికారులో
పోటెత్తిన అలల కవ్వింపులకు
మన కేరింతల జవాబులు..
రాత్రి చీకటిని సవాల్‌ చేస్తూ
మామండూరు పర్యాటక ప్రాంతంలో
మరో మజిలీ..
పచ్చని పర్యావరణం ఒడిలో
పరవశించిన మన సంచారాలు
చెట్టు చేమా తీగలు డొంకలు
వాగులు వంకలతో చెలిమిలు..
తిరుపతిలో నిలిచి స్త్రీవాదంపై
అభిప్రాయలు స్పష్టీకరించి
తలకోనలో బసకు పయనించాం.
దిట్టమైన చెట్ల నడుమ
పగలే చీకటి వాతావరణంలో
ఆత్రంగా తలకోన జలపాతం చూడాలని
కోతుల దండులతో తలపడుత
దీర్ఘమైన శిఖరారోహణాపర్వం..
కొండల లోయల్లో వాగుల ప్రవాహ ధ్వనులు
చిట్టచివరికి కనిపించింది
కోనతలపై అల్లదిగో ఆకాశ జలపాతం..
చిరునవ్వుల మువ్వల సవ్వడుల్లా
అడవిలో అతివల సందడి
అడవి పొదరింట
తరువులపై ఊయల నడకలు
వన సమాజాన కథల కవితల విహారాలు
ప్రకృతికి ప్రణమిల్లి సృష్టికి జేజేలం టూ
తిరుగు ప్రయాణం… చంద్రగిరి కోట వైచిత్రం
కళ్యాణి డ్యామ్‌ నిర్మాణ విశేషం
తిరుపతి మహతి ప్రాంగణంలో
సాహితీ బ్రహ్మోత్సవాల సంరంభంలో
మరో మజిలీ…

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

One Response to సాగర సూర్యుడు ఆకాశ జలపాతం

  1. mohanrao says:

    మామూలు గా ఎదొ రాసెసి ముక్కలు చెసె కవితలు అవసరమా

Leave a Reply to mohanrao Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.