ఒక రాత్రి – రెండు స్వప్నాలు- ఉమామహేశ్వరి నూతక్కి

”పాడుదమా స్వేచ్చా గీతం…

ఎగరేయుదమా జాతి పతాకం….

దిగంతాల నినదించి…

విశ్వ విఖ్యాతి నొందగా జాతి గౌరవం…

పాడుదమా స్వేచ్ఛా గీతం…

జలియన్‌వాలాబాగ్‌ దురంతపు నెత్తుటి దారుల హత్తుకొని…

ఉరికొయ్యల, చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని…

పొగిడిన కాలం…., పోరాడిన కాలం…

మరి మరి ఒకపరి తలుచుకొని… మృతవీరుల గాధలు తెలుసుకొని..

పాడుదమా స్వేచ్ఛా గీతం…”

ప్రజా పోరాటాలతో పరిచయ మున్న ప్రతీ ఒక్కరినీ ఉద్వేగానికి గురిచేసే పాట ఇది. ఆ పాట విన్న ఎవరూ దానిని రచించిన గంటేడ గౌరు నాయుడుని మరిచి పోరు. రచయితలలో అనేక రకాలుంటారు. కాలక్షేపం కోసం ఫక్తు రొమాన్సులూ… డిటెక్టివ్‌ నవలలూ రాసేవారు కొందరైతే… సంఘంలో కొన్ని మార్పులు రావాలని, వాటి కొరకు ప్రత్యేకంగా కొన్ని పాత్రలు సృజించో, వాస్తవ జీవితం నుంచి తీసుకొనో రచనలు చేసే వారు మరికొందరు. అదృష్టవశాత్తూ తెలుగు రచయితలలో రెండవ కోవకు చెంది నవారు చాలా మంది ఉన్నారు. అలాంటి కోవకి చెందిన గురజాడ, చాసోల వార సత్వాన్ని అందిపుచ్చుకున్న రచయిత గంటేడ గౌరు నాయుడు. ఆయన వ్రాసిన కథల సంకలనం ఈ నెల మీకు పరిచయం చేయబో తున్న ”ఒక రాత్రి-రెండు స్వప్నాలు” పుస్తకం.

కృష్ణా – గోదావరీ పరివాహక ప్రాంతపు సంపన్నులు మన రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు వలసపోయి, అక్కడ పొలాలను చవకగా కొని, అక్కడి ప్రజలను వాళ్ళ నేలలోనే పరాయివాళ్ళుగా చేయడమో, లేదా వాళ్ళకు స్థానభ్రంశం కలిగించడమో చాలా కాలంగా కొనసాగుతున్న ప్రక్రియ. బ్రిటిష్‌ వాళ్ళది సామ్రాజ్యవాద వలస వాదమయితే ఇది అంతర్గత వలసవాదం. ఈ అంతర్గత వలసవాదంలో పరాయీకరణ ప్రధాన పార్శ్వమయితే, స్థానిక జీవితం శిథిలం కావడం మరో పార్శ్వం. ఏ రంగంలో వచ్చే మార్పులయినా ప్రజలందరినీ సామాజిక అభివృద్ధి. కొందరికి స్వర్గాన్నీ మరికొందరికి నరకాన్నీ అందించేది వర్గాభివృద్ధి. అంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది ఈ వర్గాభివృద్దే. దీని పర్యవసానమే ప్రాంతాల మధ్య, కులాల మధ్య, వృత్తుల మధ్య సంఘర్షణ. ఈ వాస్తవాన్ని ప్రతిబింబించేదే గంటేడ గౌరు నాయుడు ”ఒక రాత్రి – రెండు స్వప్నాలు” పుస్తకం.

పదేళ్ళ క్రితం కృష్ణా తీరం నుంచి భూస్వాములు, డబ్బు సంచులతో శ్రీకాకుళ ప్రాంత గ్రామాలకు వెళ్ళి, అక్కడ పొలాలను చవకగా కొని, అక్కడి చిన్న, సన్నకారు రైతులను వాళ్ళ పొలాల్లోనే కూలీలుగా మార్చారు. లేదా వలస వెళ్ళిపోయేటట్లు చేసారు. అభివృద్ధి పేరిట జరుగుతున్న ఈ తంతును, భూమి సంబంధాలలో వస్తున్న విపరీత పోకడలను గౌరు నాయుడు తన కథలలో స్పృశించారు. నలిగిపోతున్న ప్రజల జీవితాలను వర్తమాన పరిస్థితుల నేపధ్యంలో చిత్రించారు. ”గ్రామంలో కూర్చుని తినే వాళ్ళకి కాళ్ళ ఎముకలు వడ్డించే వ్యవస్థకు కళాకృతులు” ఈ సంపుటిలోని కథలు. ప్రపంచీకరణ భూమి సంబంధాలనే కాక, వ్యవసాయ రంగాన్ని ఆశ్రయించిన వృత్తుల ను, మొత్తంగా మానవ సంబంధాలను ఎలా ఛిద్రం చేస్తోందో గంటేడ కథలు స్పష్టం చేస్తాయి. యేటి పాటను విన్నా, రెండు స్వప్నాలను కన్నా, మార్పుల ముసుగులో వర్గ వర్ణ వ్యవస్థ చేస్తున్న వికృత విన్యాసాలే కనిపిస్తాయి.

తన ఉపాధికి ఆలంబన అయిన ఊరిలో రైతు బ్రతకలేక ఊరొదిలి పోతు న్నా… కన్న కొడుకు పట్నంపట్ల తప్పు చేసినవాడు పశువుతో సమాన మని క్షమించి, తమ ఊరిలో అడుగు పెట్టి తమ అసురశాల వద్దకు వచ్చేసరికి ఇంగ్లీష్‌ చదువులు చదువుతున్న మనవడి నోట నర్స రీ రైంలు వింటూ వాడి నానమ్మా ఎత్తుకుం టుందీ పాట…” నాగలీ నీకిదే జోహారు…

మా భాగ్యదేవతా జోహారు.

రాజ్యాలు గెలిచినా రాదు నోటికి మెతుకు.

నీ కొన మీద బ్రతకాలి కోటానుకోట్లు.”

వలస వచ్చిన దొర, స్థానిక దళారీ తిరుపతి నాయుడి వంటి వాళ్ళవల్ల బంగారు నాయకుడు వంటి స్థానిక చిన్న రైతులు పొలాలలను పోగొట్టుకోవడాన్ని ”సెగ” కథ ప్రతిబింబిస్తుంది. ”దొరలొచ్చిన తరువాత రైతన్నోడికి సుకముందేటి? అన్నది ఈ కథ పాఠకుల ముందుంచే వాస్తవం. దొరల దురాక్రమణల ఫలితంగా రైతులు రైతులను నమ్ముకున్న వృత్తులవాళ్ళు కాలక్రమేణా ఊరొదిలిపోయి బస్సెక్కే వలస విధానానికి కళాకృతి ”ఒక రాత్రి – రెండు స్వప్నాలు”. ఆహార పంటలు పోయి వ్యాపార పంటలు రావడం. ఎద్దుల స్థానే ట్రాక్టర్‌ సేద్యం రావడం. దొరలు వచ్చి స్థానికులను పరాయీకరించడం లాంటి పెట్టుబడిదారి వ్యవసాయ పరిమాణాలకు అక్షరాకృతి ”భూమి పుండు” కథ.

వలస పక్షి అనే కథలో ధనిక స్వామ్య పరిమాణాల వల్ల, మొతుబరుల వల్లా చిన్న చితకా జనం వ్యవసాయ రంగంలో బ్రతకలేక పట్నాలకు వెళ్ళడం, అక్కడ అసలే బ్రతకలేక పల్లెకు తిరిగి రావడం ఈ విధంగా అస్థిరతకు లోనవుతున్న తీరును వాస్తవికంగా ప్రదర్శిస్తుంది. తవిట్నాయుడు వంటి సంపన్నుల వల్ల అచ్చయ్య వంటి దళితులు వెట్టి చాకిరికి లోను కావడం – శ్రమ తప్ప సుఖానికి కరువైపోవడమనే సత్యానికి కథాకృతి ”నాణెం కింద చీమ” కథ. వర్గ వ్యవస్థ అనేది రైతులు, రైతు కూలీలు వ్యవసాయ వృత్తుల వాళ్ళనే కాక సమాజం మీద ఆధారపడి బ్రతికే జానపద కళాకారులను కూడా వదిలిపెట్టదు. ”ఏం మిగిలింది” కథ ఈ వాస్తవికతకు దర్పణం. సంపన్న యువకుడు నాశనం చేసిన స్త్రీ బ్రతుకును పాటగట్టి పాడినందుకు గాయకుడు ఊరొదలాల్సి వచ్చి, వూరొదిలిపోయి చాలా కాలం తరువాత ఊరికి తిరిగి వస్తే తన పాట టి.విలలో వినిపించే అంగడి సరకుగా మారడం ఈ కథలోని వస్తువు. ”పాటలని కన్న తండ్రులు ఈధులెంట అడుక్కు తిరుగుతుంటే, పాటనెత్తుకెళ్ళినోల్లు కారులో ఊరేగు తాండ్రు” అంటూ కళ కూడా దోపిడికి ఎలా గురయిందీ, కళాకారుల జీవితాలు ఏ రకంగా పరాయీకరింప బడుతున్నాయీ అనే విషయాన్ని గౌరు నాయుడు మన మనసుకు హత్తుకొనేట్టు చెపుతారు.

”ఆర్తి” అనే కథ విప్లవకారుల కుటుంబ కథ, ఇది కొండోళ్ళ కథ. ఏడవ దశకానికీ, నేటికీ ముడి పెట్టిన కథ, విప్లవ పరిస్థితులు కొనసాగుతున్న వాస్తవాన్ని ప్రతిబింబించే కథ. ఒక తాత తన కొడుకు, మనవరాలు విప్లవానికి అంకితమై మరణిస్తే, మిగిలిన ముని మనుమణ్ణి కూడా ఉద్యమానికి అంకితం చేయడం దీని కథా వస్తువు. ప్రాజెక్టుల నిర్మాణం – ముంపు ప్రాంత ప్రజల జీవితాలలో రాజకీయంగా అడుకుంటున్న తీరును ”ముంపు” కథ ఆవిష్కరిస్తుంది. ఈ కథలన్నీ చదివిన తరువాత రచయిత మారుతున్న ఊళ్ళ కథలు చెపుతున్నాడనీ, మార్పులను ఆహ్వానిస్తూనే అనారోగ్యకర దోపిడికి అవకాశమిచ్చే మార్పులను వ్యతిరేకిస్తున్నాడనీ, నిజంగా రావలసిన మార్పు కోసం పాఠకుల మెదళ్ళలో ఆలోచనా బీజాలు నాటుతున్నాడనీ అర్థమవుతుంది. గంటేడ గౌరు నాయుడు కథలు చిక్కగా ఉంటాయి. సంక్లిష్టంగా ఉంటాయి. ఈ కథలు వస్తువుని ఏకరువు పెట్టడంతో ఆగిపోవు. ఆ వస్తువు అలా ఉండటానికి కల కారణాలు చెపుతాయి. చదువరులను కలవరపరుస్తాయి. వారి కర్తవ్యం పట్ల ఆలోచన రేకెత్తిస్తాయి. ”మనం పుట్టిన నేలా, మనని కదిలించిన పాటా, మనం అడుగు కలిపిన కోలాటం” అన్నీ మన నుండి దూరం కావడం – చివరకి మాయం కావడం – ఇవన్నీ మనుషులను ఎంత సంఘర్షణకు గురి చేస్తుందో ఈ కథలు చెపుతాయి..

కలల్లోనూ.. పొలాల్లోనూ…

పచ్చ రంగును మాత్రమే చిత్రించుకునే రైతు… బతుకు బొమ్మ నిండా పులుము కున్నది నల్ల రంగే… దాన్యపు గింజల మీద మన అందరి బొమ్మలు చిత్రించే మట్టి చేతుల మహాద్భుత చిత్రకారుడు తన బొమ్మను చిత్రించుకోలేక పోవడం ఎంత విషాదం…!! అంటారు గౌరు నాయుడు.

నిజమే కదా… మట్టి వాసనలని, పల్లె చైతన్యాలని, నాగలి శబ్ధాలని, బతుకు గౌరవాలని తిరిగి ఆలింగనం చేసుకోవడం కోసం, తమ వేదనలకి జ్ఞాపకాల పత్తిని పెట్టి, చైతన్యపు చమురును పోసి… కలాలను నాగళ్ళుగా మార్చి చీడ పట్టిన సమాజంలో పచ్చటి తివాచీ పరిచాలని తాపత్రయపబడిన రచయిత గౌరు నాయుడు.

గౌరు నాయుడి స్వేచ్ఛా గీతం విన్నా… ఆయన కథలు చదివినా మనకు ఒకటే అనిపిస్తుంది. మనిషిని నిర్లక్ష్యం చేస్తున్న ప్రతీ చోటా, మనిషి ఉనికి మసకబారుతున్న ప్రతీ వేళా కలాలు కరవాలాలై అక్షరాలు ఆయుధాల్లా ఉద్యమిస్తాయి.

మనిషిని కాపాడుకోవడం కోసం మనిషి సాంస్కృతిక నేపధ్యాన్ని సజీవంగా ఉంచుకోవడం కోసం, మనిషి కోసం మనం అందరం చదివి తీరాల్సిన పుస్తకం ”ఒక రాత్రి – రెండు స్వప్నాలు”. వెళదామని ఎంత బలవంతం చేస్తున్నా, ఊరి మీద మమకారంతో దానిని ఒదలలేక – అక్కడ బ్రతకలేక కంసాలి వీరాచారి వంటి వాళ్ళు పడే సంఘర్షణని ”అసురశాల” అనే కథ ద్వారా మనకు తెలియచేస్తారు గౌరు నాయుడు. అసురశాల వైభోగాలు గౌరు నాయుడు చెపితేనే వినాలి. ”ఊరందరికీ తల్లో నాలుక… కంసాలోడికీ కాపోడికీ ఉన్న లంకె – నాగలికీ నర్రెకీ ఉన్న లంకె రా” అనే నమ్మకం ఉన్న వీరాచారి ఒక నగర జీవనుడి నయవంచనకుబలై పోలీసుల బారిన పడి అవమానితుడు, ఆక్రోశితుడూ అయ్యే కథ ‘అసురశాల”. విషాదం నిండిన హుందాతనంతో మెరిసిపోయే కథ ఇది. తమ

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

One Response to ఒక రాత్రి – రెండు స్వప్నాలు- ఉమామహేశ్వరి నూతక్కి

  1. Abdul hafeez says:

    Gourunaidu Gari kathalu nijaalanu add am padataayi.ilaanti rachalanu parichayam cheyadam kooda oka samajika seva.

Leave a Reply to Abdul hafeez Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.