వివాహ వ్యవస్థ మారాలి

రమేష్‌ ఉపాధ్యాయ

“కేర్‌ కల్చర్‌ మరియు సిటిజెన్‌షిప్‌, ఛేజింగు కిన్‌షిప్‌, ఫ్యామిలీ, జెండర్‌ రిలేషన్‌షిప్‌ ఇన్‌ సౌత్‌ ఏషియ, షిప్టింగు సర్‌క్లాస్‌ ఆఫ్‌ సోసైటీ, స్టక్‌చర్స్‌ అండ్‌ స్టైటజి, మ్యారేజ్‌, మైగ్రేషన్‌ అండ్‌ జెండర్‌” అనే పుస్తకాల రచన, సహ-రచన, సహ-సంపాదకత్వం, చేసిన రజనీ పాలడీవాలా (జననం 1955) ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సమాజశాస్త్ర విభాగంలో ప్రొఫెసరు.

ఈమె భారత దేశంలోనూ ఇతర దేశాల్లోనూ చేసిన ఫీల్డు మార్క్‌ ఆధారంగా సమాజశాస్త్ర రంగంలో పరిశోధన చేశారు.
డా. రమేశ్‌ ఉపాధ్యాయ ‘కథన్‌’ అనే త్రైవసిక హిందీ సాహిత్య పత్రిక సంపాదకులు, ప్రసిద్ధ రచయిత. 25కు పైగా నవలలు, కథా సంపుటాలు, అనువాదాలు, సంపాదిత గ్రంథాలు వెలువరించారు).

రమేశ్‌ ఉపాధ్యాయ : రజనిగారు, పాఠకుల కోసం మీరింత వరకు చేసిన అధ్యయనం గురించి కొంత చెప్తారా?
రజనీ పాలడీవాలా : రమేశ్‌గారు, నేను ఇంగ్లీషులో రాస్తాను. మాది రాజస్తాన్‌ లోని పాలడీ అనే ఊరు. అందు వల్లనే నా పేరు పాలడీవాలా. నేను సమాజశాస్త్రంలో పిహెచ్‌.డి., చేశాను. ఢిల్లీ విశ్వ విద్యాలయంలో సమాజశాస్త్రం బోధిస్తున్నాను. పరిశోధన కూడా చేస్తున్నాను. పరిశోధన ఎక్కువగా జెండరు, కుటుంబం, సగోత్రత (kinship) గురించి చేశాను. నేను నా మొదటి పరిశోధన కోసం చేసిన ఫీల్డ్‌ మార్కు సీకర్‌ జిల్లా (రాజస్థాన్‌)లో స్త్రీలు చేసే పని, కుటుంబ వ్యూహ రచనకు సంబంధించింది. ఆ తర్వాత నేను దక్షిణ ఆసియలో కుటుంబం, సగోత్రత అనే అంశంపైన పరిశోధన చేశాను. దీనితో పాటు నేను స్త్రీవాదం, మహిళా ఉద్యమాల అధ్యయనం కూడా చేశాను.

గత ఐదేళ్ళుగా నెదర్‌లాండ్స్‌లో ఈ ఉద్యమాల గురించి పరిశోధన చేస్తున్నాను. ఎందుచేతనంటే ఈ అంశాల గురించి పరిశోధన చేస్తూ ఉండగా సమాజ శాస్త్రంలో ప్రతిపాదించే సిద్ధాంతాలు సాధారణంగా యూరప్‌, ఉత్తర అమెరికా ఖండాలలో ఉన్న వాస్తవానికి భిన్నంగా కొన్ని ఊహల మీద ఆధారపడి ఉన్నాయని నాకనిపించింది. అందువల్ల నేనిప్పుడు జెండరు, సగోత్రతతో పాటు ఏ ప్రాంతం, ఏ నాగరికత ఆధారంగా అలాంటి సిద్ధాంతాలు తయరవుతాయో, ఆ ప్రాంతానికి, నాగరికతకు సంబంధించిన అంశాల గురించి కూడా పరిశోధన చేస్తున్నాను. వీటితో పాటు భారత దేశంలోను, ఆసియ ఖండంలోను వివాహం, కుటుంబం, వరకట్నం మొదలైన విషయల గురించి కూడా పరిశోధన చేస్తున్నాను.
రమేశ్‌ : అందువల్లనే నేను ‘వివాహ వ్యవస్థలో ర్పు అవసరాన్ని’ గురించి మీతో కొంత మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు మన సమాజంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని సమాజాల్లో కూడా మార్పులు వస్తున్నాయనే విషయం మా కంటే బాగా మీకు తెలుసు. సామాజిక సంస్థలు కూడా మారుతున్నాయి. వివాహ సంస్థ లేక వ్యవస్థ కూడా మారుతంది. కానీ, నేటి పరిస్థితుల ననుసరించి అందులో ఎలాంటి మార్పు రావడం అవసరమో అలాంటి మార్పు రావడం లేదని నాకనిపిస్తంది. మీరేమంటారు?

రజని : చూడండి, కాలం మారుతంది, సమాజం మారుతంది, అందువల్ల వివాహ వ్యవస్థలోనూ, వివాహానికి సంబంధించిన అనేక ఇతర విషయల్లోనూ మార్పు రావడం అవసరం, అనే మాట సరైందే అయినా, ఈ మాటకు మరో మాట కూడా జోడించడం అవసరమని నాకనిపిస్తుంది. కాలం మారకుండా ఉండినా, సమాజం మారకుండా వుండినా కూడా పరంపరాగత మైన వివాహ వ్యవస్థలో లేదా వైవాహిక సంబంధాల్లో మార్పు అవసరమయేదే. ఎందుచేతనంటే, మానవతావాద దృష్టితోనూ, ప్రజాస్వామ్య దృష్టితోనూ చూసినప్పుడు ఇప్పటికి చాలా కాలం మునుపే అందులో మార్పు అవసరం ఏర్పడి ఉండింది. అందువల్ల దాన్ని గురించి మాట్లాడేప్పుడు మనం రెండు విషయలను దృష్టిలో ఉంచుకోవాలి – ఒకటి : కాలం, సమాజం మారినందువల్ల ఇప్పుడు అందులో మార్పు రావడం అవసరమనేది, రెండు : అందులో మార్పు అవసరం ఇప్పుడే కాదు, ముందు నుండే ఏర్పడి ఉండింది అనేది.

రమేశ్‌ : మీరు చెప్పింది సబబే. మానవతావాద దృష్టితోన, ప్రజాస్వామ్య దృష్టితోన చూసినప్పుడు వివాహం స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, ప్రేమ, సహకారం, వీటితో కూడిన సంబంధంగా ఉండాలి. కానీ, సంప్రదాయంగా వస్తున్న వివాహం ఒక సంబంధంగా కాక ఒక బంధనంగా ఉంట వచ్చింది. స్త్రీ పురుషులను, ముఖ్యంగా స్త్రీని కట్టి వేసే బంధనం. స్త్రీ పురుషులిద్దరు సవనమని, ఇద్దరికి సవనమైన ప్రాధాన్యం ఉందని చూపడానికి వాళ్ళిద్దరు సంసారం లేదా కుటుంబం అనే బండికి రెండు చక్రాలని అనేవారు. కానీ, నిజానికి భర్త భార్యను తన దాసిగానో, ఆస్తిగానో భావించేవాడు. అలాంటప్పుడు ఇది ఒక మానవీయ సంబంధం కాక అమానవీయ సంబంధమే అవుతుంది. అందువల్ల, వివాహ వ్యవస్థలో మార్పు అవసరం ఇంతకు మునుపే ఏర్పడి ఉంది, అని మీరు బాగా చెప్పారు. దాన్ని గురించి తర్వాత. వివాహం, ఒక సంబంధమా లేక వ్యవస్థా? ముందుగా ఇది చెప్పండి.

రజని : వివాహం ఒక వ్యవస్థ, ఒక సంబంధం, రెండూ అవుతుంది. వ్యవస్థ ఎందుకంటే అది సామాజిక చట్రానికి పునాది. అంతే కాక అది ఒక సంబంధం కూడా. ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు జెండర్ల మధ్య, రెండు కుటుంబాల మధ్య, రెండు తరాల మధ్య, ఏర్పడే సంబంధం. ఇప్పుడు వివాహ స్వరూపంలో చాలా మార్పు వచ్చింది. వ్యక్తులు తమకెవరిష్టమైతే వారిని పెళ్ళి చేసుకో వచ్చు. అవివాహితులుగా ఉండదలచుకొంటే ఉండవచ్చు, లేదా పెళ్ళి చేసుకోకుండా కూడా కలసి ఉండవచ్చు. మునుపు అలా లేదు. ఒకటి, వివాహం చేసుకోకుండా సమాజంలో ఉండడం ఎవరికైనా చాలా కష్టంగా ఉంటూ ఉండేది. అవివాహితులకు సమాజంలో ఎలాంటి స్థానమూ ఉండేది కాదు. వారికి వయెజనులకుండే ఏ అధికారాల లభించేవి కావు. వారు సమాజానికి ప్రమాదకరమైన వారుగా కూడా భావించ బడేవారు. అందువల్ల వివాహం చేసుకోవడం అందరికీ తప్పనిసరిగా ఉండేది. రెండోది, వివాహానికి సమాజం అనుమతి, అంగీకారం అవసరమయ్యేది. ఈ అనుమతి, అంగీకారం పొందేందుకు వివాహం తరతరాలుగా వస్తున్న విధివిహిత పద్ధతి ప్రకారమే జరగవలసి ఉండేది. ఈ పద్ధతి చాలా సంక్లిష్టంగాను, అనేక విధాలుగాను ఉంట ఉండేది. ఉదాహరణకు హిందువుల్లో అది ఒక విధంగా ఉంటే ముస్లింలలో మరో విధంగాన, ఇతర మతాల్లో మరో విధంగాన ఉండేది. హిందువుల్లో కూడా ఉత్తర భారత దేశంలో ఒక పద్ధతిలో ఉంటే దక్షిణ భారత దేశంలో మరో పద్ధతిలో ఉండేది. కులం, ఉపకులం, గోత్రం మొదలైన వాటికి సంబంధించిన నియమాలను పాటించడం తప్పనిసరి అయ్యేది. దానితో పాటు పెద్దలు ఆ వివాహం సరియైనదని భావించి దానికి అనుమతి ఇచ్చినప్పుడే ఆ వివాహం జరిగేది. ఈ విధంగా వివాహ వ్యవస్థ కొత్త తరాన్ని నియంత్రించే వ్యవస్థగా కూడా ఉండేది.

రమేశ్‌ : ఈ విధంగా అది తరతరాల దాకా చెక్కుచెదరకుండా నిలిచిన వ్యవస్థగా కూడా ఉంటూ వచ్చింది!

రజని : అవును. కానీ, వివాహ వ్యవస్థను స్త్రీ పురుషుల మధ్య ఒక ప్రత్యేకమైన సంబంధం ఏర్పరచి ఉంచడానికే అన్నిటికంటే ఎక్కువగా ఉపయెగించడం జరిగింది. అనేక కులాలుగా విభజించబడిన సమాజంలో స్త్రీల లైంగికతపైన నియంత్రణ ఉంచడం చాలా అవసరం అయింది. ఇక్కడ వివాహం ఒక సంబంధం కాదు, బంధనం అనే మీ మాట కూడా చేరుతుంది. సంబంధం- సమబంధంలో సమానత్వ భావన ఉంటుంది. కానీ, ఇక్కడ వివాహం జరగడానికి స్త్రీ పురుషుల కులం సమానంగా ఉండడం మాత్రమే అవసరమయ్యేది. కానీ, జెండర్‌ దృష్టిలో స్త్రీ విలువ పురుషుని కంటే చాలా తక్కువగా అంచనా వేసేవారు. కుటుంబం ఆమె పైన ఆధారపడి ఉందని స్త్రీకి చెప్పేవారు. కానీ, కుటుంబంలో ఆమె స్థానం ఎల్లప్పుడు భర్త కంటే క్రిందే, అతని వెనకే ఉంట ఉండేది. కుటుంబంలో ఉండే సంబంధాలు జెండరు, జనరేషన్‌ (తరం) రెండు విషయల్లో కూడా ఆధిపత్యవాద సంబంధాలుగా ఉంటాయి. ఉదాహరణకు స్త్రీ పైన పురుషుని ఆధిపత్యం, సంతానం పైన తండ్రి ఆధిపత్యం, పిల్లలపైన పెద్దల ఆధిపత్యం. అందువల్ల కుటుంబంలో ప్రజాస్వామ్యం కావాలనుకుంటే మనం వివాహం, కుటుంబం, ఈ రెండు వ్యవస్థల్లోనూ మార్పు తీసుకురావలసి ఉంటుంది.

రమేశ్‌ : కాలం, సమాజం మారడంతో పాటు కొన్ని మార్పులు తమంత తామే వస్తున్నాయి. ఉదాహరణకు ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రుల, లేక పెద్దల ఇష్టప్రకారం కాకుండా తమ ఇష్ట ప్రకారం వివాహం చేసుకుంటున్నారు.

రజని : చాలా మంది ఇలా చేస్తున్నారని నాకనిపించడం లేదు. పట్టణాల్లో ఉండేవాళ్ళు, ధనవంతులు, బాగా చదువుకున్నవారు, డాక్టర్లు, ఇంజనీర్లు లాంటి అబ్బాయిలు, అమ్మాయిలు తమ ఇష్ట ప్రకారం పెళ్ళి చేసుకుంటున్నట్లు మనం చూస్తాం. కానీ, మొత్తం సమాజంలో వీరి సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువే. మరో విషయం, అక్కడొకరు, ఇక్కడొకరు తమ ఇష్టప్రకారం వివాహం చేసుకుంటున్నప్పుడు సమాజంలో కానీ, వివాహ వ్యవస్థలో కానీ మార్పు రాదు. తమ ఇష్టప్రకారం వివాహం చేసుకునేవారు కూడా, వివాహం తమ మార్గంలోని వారితోనే, తమ మతంవారితోనే, వీలైతే తమ కులం వారితోనే చేసుకోవాలనే ప్రయత్నం చేస్త ఉండడం కూడా మనం చూస్తూంటాం. మరో విషయం, కుల మత బంధనాలు తెంచుకొని వివాహం చేసుకునేవారు కూడా సమాన వర్గం లేదా సమాన సామాజిక స్థాయి గురించి తప్పక ఆలోచిస్తారనే విషయం కూడా మనం తరుచు చూస్తూనే ఉంటాం. సినిమాల్లో లాగా ధనవంతురాలైన ఒక అమ్మాయి ఒక పేద అబ్బాయిని చేసుకోవడం, ధనవంతుడైన ఒక అబ్బాయి ఒక పేద అమ్మాయిని చేసుకోవడం నిజ జీవితంలో చాలా తక్కువగానే మనకు కనిపిస్తుంది. అంతే కాక వివాహానికి ముందు వారిద్దరిలో ఎంత సమానత్వం ఉండినా వివాహం తర్వాత వారి మధ్య సంప్రదాయబద్ధమైన వివాహ సంబంధం ఏర్పడిపోతుంది, ‘ఇక నీవు భార్యవు. ఇల్లు చక్కబెట్టు, నీ తల్లిదండ్రులను పూర్తిగా మరిచిపో. నా తల్లిదండ్రుల సేవ చేయి. నేను నా పని నుంచి ఎప్పుడు తిరిగి వచ్చినా సరే, నీవు మాత్రం నీ ఉద్యోగం నుండి పని ముగియగానే నేరుగా వీలైనంత త్వరగా ఇంటికి రావాలి, పిల్లలను చూసుకోవాలి, వంట చేయలి….’ ఇలా ఇలా…. సమానత్వం ఆధారంగా జరిగే అధిక సంఖ్యాక ప్రేమ వివాహాల పరిణామం ఇలానే ఉంటుంది. కారణమేమిటంటే ఎవరో ఒకరిద్దరు తమ ఇష్టప్రకారం వివాహం చేసుకున్నంత మాత్రాన వివాహ వ్యవస్థ మారదు, సమాజంలో నెలకొని ఉన్న అసమాన సంబంధాలు మారవు.

రమేశ్‌ : మరి వివాహ వ్యవస్థలో, సామాజిక సంబంధాల్లో మార్పు తెచ్చేందుకు ఏమి చేయలంటారు?

రజని : ఇప్పుడు ఉంట ఉన్న అన్ని సంబంధాలను మార్చే సామాజిక విప్లవం జరగాలనేదే మీ ప్రశ్నకు అన్నిటికంటే సులభమైన, ఉత్తమమైన సమాధానం. కానీ, ఈ మాట చెప్పడం ఎంత సులభమో, చేయడం అంతే కష్టం. అందువల్ల ప్రస్తుతం ఉన్న వ్యవస్థలోనే కొన్ని సంస్కరణలు, మార్పులు తెచ్చేదాన్ని గురించే ఆలోచించగలం. వాటికోసం – ఒకటి, వివాహానికి సంబంధించిన చట్టాల్లో మార్పు రావాలి, రెండోది సామాజిక విలువల్లో, నమ్మకాల్లో మార్పు రావాలి. ఉదాహరణకు కుటుంబంలో ఆడ పిల్లలు, మగ పిల్లల మధ్య భేదభావం చూపని వాతావరణాన్ని సమాజంలో నెలకొల్పాలి. ఆడ పిల్ల, మగ పిల్లవాడు ఎవరు పుట్టినా సమానంగా వేడుకలు చేయలి, ఇద్దరి లాలన, పాలన, చదువు సంధ్యలు సమానంగా జరగాలి. ఇద్దరికి ఆరోగ్యానికి, చికిత్సకు సంబంధించిన సౌకర్యాలు, ఆటపాటల అవకాశాలు సమానంగా ఇవ్వాలి. మొదటి నుండి మగపిల్లవాడి విలువ, ప్రాముఖ్యం ఆడపిల్ల కంటే ఎక్కువనే మాట వాళ్ళ మనసులోకి ఎక్కించకూడదు. చిన్నప్పటి నుండి ఇద్దరికీ, స్త్రీ పురుషులిద్దరు మనుషులే కాబట్టి వారి విలువ సమానమేననీ, ఇద్దరికీ సమానమైన అధికారాలుంటాయనీ, బోధపరచాలి. ఇదంతా కేవలం నోటి మాటగా మాత్రమే ఉండకూడదు. నిజ జీవితంలో అమలు పరచాలి. ఉదాహరణకు వంటింటి పని, లేదా తమ్ముడు – చెల్లెళ్ళను చూసుకొనే పని ఆడపిల్లలదే కాదు, మగపిల్లలది కూడా అనే మాట ఆడపిల్లలకు, మగపిల్లలకు మొదటి నుండి నేర్పాలి. ఇలాంటి పనులు ఇద్దరికీ నేర్పాలి, ఇద్దరితో చేయించాలి కూడా. అబ్బాయి బయటకి పోయి మగపిల్లలతో క్రికెట్‌ ఆడుకోవాలి, అమ్మాయి ఇంట్లో ఒంటరిగా లేదా తన తోటి ఆడపిల్లలతో కలసి బొమ్మలతో ఆడుకోవాలి, అనే భేదభావం ఉండకూడదు. పెళ్ళి తర్వాత అబ్బాయి అత్తగారింటికెళ్ళి ఇల్లరికం ఉండడంలో తప్పేమీ లేదని తల్లిదండ్రులు మొదట స్వయంగా తెలుసుకొని తర్వాత తమ మగపిల్లలకు తెలియజెప్పాలి. ఇలాంటి చర్యల ద్వారా స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానత తగ్గడమే కాక అత్తగారింట్లో కోడండ్లపైన జరిగే అత్యాచారాలు కూడా తగ్గుతాయి.

రమేశ్‌ : అంటే, ఈ విధంగా జరిగినప్పుడు వివాహం ఒక బంధనంగా, ముఖ్యంగా స్త్రీలకు బంధనంగా ఉండదు. సమానత్వంపైన నిలిచిన ఒక సంబంధంగా వరుతుంది. కానీ మీరు అన్నట్లు, స్త్రీల లైంగికతని నియంత్రించడానికి, లేదా దానిపైన ఆంక్షలు విధించడానికి వివాహ సంస్థను ఉపయెగించడం జరుగుతంది. సంప్రదాయవాదులు సావజిక చట్రాన్ని చెదిరిపోకుండా కాపాడడానికి ఈ ఆంక్షలు అవసరమని భావిస్తారు. కానీ, అభ్యుదయవాదానికి, ప్రజావాదానికి, స్త్రీవాదానికి సంబంధించిన ఆలోచనలను గౌరవించేవారు మాత్రం ఈ ఆంక్షలను అనుచితమైనవిగా, న్యాయరహితమైనవిగా భావిస్తారు. ఈ సమస్యకు పరిష్కారంగా కొందరు వివాహం ఒక సంబంధం కాకుండా ఒక రకమైన ఒప్పందం గా ఉండాలని సూచిస్తున్నారు. మీ అభిప్రాయం ఏమిటి?

రజని : చూడండి, వివాహంతోపాటు విడాకుల ఏర్పాటు కూడా ఉంది. అంటే వివాహం ఒక విధమైన ఒప్పందమే. వివాహం ద్వారా అమలులోకి వచ్చి, విడాకుల ద్వారా ముగియగల ఒప్పందం. ఈ ఒప్పందం వల్లనేగదా వైవాహిక సంబంధాలు ఏర్పడుతాయి? పైగా నేనిప్పుడన్నట్లు, వివాహ సంబంధం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యే ఉండేదీ, వారివరకే పరిమితమయ్యేదీ, కాదు. అది అనేక రకాల సంబంధాల సముచ్చయం. అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన సంబంధం కావడం వల్ల స్వతంత్రులు, సవనులు అయిన ఇద్దరు నాగరికుల మధ్య ఏర్పడిన సంబంధంగా ఉంటుంది, లేదా ఉండాలి. కానీ, వివాహం ఒక వ్యవస్థ కూడా. యథాస్థితి వాదానికి చెందిన వ్యవస్థ. ఆ తర్వాత అది పితృస్వామ్యం కారణంగా అసమానతతో కూడిన రెండు జెండర్ల (స్త్రీ పురుషుల) మధ్య ఏర్పడే సంబంధం కూడా. అంతే కాక నవతరాన్ని అదుపులో ఉంచడానికి, వివాహ సంస్థను చెక్కు చెదరకుండా మునుపటిలాగే ఉంచడానికి తోడ్పడే రెండు తరాల మధ్య ఉండే సంబంధం కూడా. చివరగా అది రెండు కుటుంబాల మధ్య ఉండే సంబంధం. ఈ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబం ఆధిపత్యవాద సంబంధాలకు చెందిన అన్యాయ పూరిత మైన ఏర్పాటుకు గురి అవుతుంది. ఈ విధంగా వివాహం కేవలం ఒప్పందం ఆధారంగా అర్థం చేసుకోవడానికి వీలుపడే ఆలుమగల మధ్య ఉండే సంబంధం మాత్రమే కాదు. దీనితో పాటు, వ్యక్తిగత స్థాయిలో ఎవరో కొందరు ప్రేమ వివాహం, కులాంతర వివాహం లాంటివి చేసుకున్నా కూడా దాని వల్ల వివాహ వ్యవస్థ మారదని కూడా నేను చెప్పదలచుకున్నాను. వివాహం వల్ల కుటుంబాల మధ్య ఏర్పడే సంబంధాలు మారనంత వరకు, దాని వల్ల కుటుంబంలో ఏర్పడే సంబంధాలు మారనంత వరకు, సామాజిక చట్రంలో మార్పులు జరగనంత వరకు, వివాహ వ్యవస్థలో మార్పు తీసుకురావడం కష్టం.

రమేశ్‌ : బాగా చెప్పారు. కానీ, ఒప్పందం మాట నేను ఎందుకన్నానంటే, నేటి వివాహ స్వరూపం ఒక అనౌపచారికమైన ఒప్పందంగానే ఉంది. స్త్రీ పురుషుల అసమానత కారణంగా ఈ ఒప్పందం షరతులను పాటించడం, భర్త, అతని కుటుంబం వారి ఇష్టాయిష్టాలపైన ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా వివాహం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఔపచారికమైన ఒప్పందంగా ఉండి, మీరన్నట్లు, ఆ ఇద్దరు వ్యక్తులు స్వతంత్రులు, సమానులు అయిన ఇద్దరు నాగరికులైనప్పుడు, రెండు పక్షాలు దాని షరతులు పాటించవలసి ఉంటుంది. వివాహం జీవితాంతం భరించవలసిన బంధనం కాక, ఎంత వరకైతే భార్యా భర్తలు ప్రేమతో కలిసి ఉండగలరో, అంతవరకు ఉండటానికి, అలా ఉండలేనప్పుడు విడాకులు తీసుకొని వేరు కావడానికి అనువైన ఒప్పందంగా ఉంటుంది.

రజని : చూడండి, మనం వివాహమన్నప్పుడు దాని అర్థం ఒక ఒప్పందం అనే. వివాహం ఔపచారికమైందని అనుకున్నా, అనౌపచారికమైందని అనుకున్నా ఒక ఒప్పందమే. వివాహమంటే, ఇద్దరు వ్యక్తులు లేదా రెండు కుటుంబాలు ఏర్పరచుకుంటున్న సంబంధంపైన చట్టపరమైన ఆమోద ముద్ర, సామాజిక ఆమోద ముద్ర కావాలని కోరుకోవడం. అంటే వాళ్ళు చట్టం ఎదుట, సమాజం ఎదుట వచన బద్ధులవుతున్నారన్నమాట! ఈ వచనబద్ధత ఒక ఒప్పందమే. కానీ, ఇక్కడ ఉన్న చిక్కేమిటంటే, ఇది సమానత్వం ఆధారంగా కాక, అసమానత్వం ఆధారంగా ఏర్పడిన ఒప్పందం కావడం. ఒక రకంగా చూస్తే స్నేహితుల మధ్య కూడా అవ్యక్తమైన ఒక ఒప్పందం ఉంటుంది. మనలో ఎవరు చిన్నా, పెద్దా కాదు, సమానులం, ఈ సమానత్వం ఆధారంగా కలిసి ఉంటాం అని. ఈ అవ్యక్త ఒప్పందాన్ని ఒకరు ఉల్లంఘించినప్పుడు మిత్రతా సంబంధం ముగిసిపోతుంది. వివాహ ఒప్పందంలో ఉన్న సమస్య ఏమిటంటే భార్యా భర్తల్లో, మిత్రుల్లో లాంటి సమానత్వ సంబంధం ఉండదు. ఒక పక్షం, అంటే భర్త ఆ ఒప్పందాన్ని మాటి-మాటికి ఉల్లంఘిస్త ఉన్నా కూడా ఆ సంబంధం నిలిచి ఉండగలుగుతుంది. ఈ విధంగా వివాహం ఒప్పందంగా ఉండడంలో ఏ సమస్యా లేదు, కానీ, సమస్య అంతా ఈ ఒప్పందం రెండు పక్షాలకు వర్తించే సమానమైన షరతులపైన ఆధారపడి ఉండకుండా అసమానమైన షరతుల పైన ఆధారపడి ఉండడం వల్లనే ఉత్పన్నమవుతంది. కానీ, సమాజంలో స్త్రీ పురుషుల్లో సవనత్వం ఏర్పడనంతవరకు ఈ ఒప్పందం అసమానమైన షరతులపైన ఆధారపడి ఉండినా కూడా అవసరమే. ఎందుచేతనంటే భర్త అక్రమాలకు వ్యతిరేకంగా గానీ, సమానత్వం పొందడానికి గానీ భార్య పోరాడాలనుకుంటే చట్టపరమైన, సామాజికమైన ఆ ఒప్పందం ఆధారంగానే పోరాడగలుగుతుంది.

రమేశ్‌ : కానీ, ఇప్పుడు చాలా మంది పెళ్ళి చేసుకోకుండా కూడా కలిసి ఉంటున్నారు కదా! అక్కడ ఏ ఒప్పందమూ ఉండదు. కేవలం సంబంధమే ఉంటుంది.

రజని : సంబంధం మాత్రమే కావాలనుకున్నప్పుడు వివాహంతో పనే లేదు. ఇద్దరు వ్యక్తులకు గనక ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి విలువననుసరించి ఒకరు జీవిస్తూ ప్రేమ పూర్వకంగా మేము కలిసి ఉండగలము, అనే నమ్మకం, భరోసా కలిగినప్పుడు అది ఆదర్శ స్థితే అవుతుంది. కానీ వాస్తవంలో స్త్రీ పురుషుల మధ్య అలాంటి సమానత్వం లేదు. స్త్రీలకు-ముఖ్యంగా పేద, చదువురాని, బయటకి వెళ్ళి ఏ పనీ చేయలేని స్త్రీలకు-పోషణ, భద్రత వివాహ బంధంలో బంధింపబడినప్పుడే లభిస్తుంది. అలాంటప్పుడు భర్త కొట్టినా, హింసించినా, ఇంట్లో నుండి వెళ్ళగొట్టినా, మరే విధంగానైనా సతాయించినా భార్య తన వివాహం పైన చట్టపరమైన, సమాజపరమైన ముద్రపడి ఉన్నప్పుడు మాత్రమే అతనికి వ్యతిరేకంగా చట్టరీత్యా ఏదైనా చర్య తీసుకోగలుగుతుంది.
రమేశ్‌ : అది సరే, సాంప్రదాయకంగా వివాహాన్ని సంతానోత్పత్తి చేయడం, సమాజాన్ని నడిపించడం, మానవ జాతిని సజీవంగా ఉంచడం లాంటి ఉన్నత ఉద్దేశ్యాలతో జోడించడం జరుగుతంది. కానీ, వ్యక్తి స్వాతంత్య్రం, స్త్రీ విముక్తి, స్త్రీ పురుషుల సమానత్వం, మొదలైన వాటికి ప్రాధాన్యం లభిస్తున్న ఈ రోజుల్లో ఈ ఉద్దేశ్యాలను సాధించే లైంగికత పైన విధించే ఆంక్షలు, ఉచితమైనవిగా భావించబడడం లేదు. స్త్రీలు విద్యావంతులు అయి, పురుషుల్లాగానే బయటకి వెళ్ళి పనిపాటలు చేయడం, పనిపాటలకు, ఉద్యోగంలో అభివృద్ధి చెందడానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే ఉద్దేశ్యంతో గర్భనిరోధక పద్ధతుల ద్వారా సంతానం కలగకుండా చేసుకోడం, అంతే కాక లైంగికతను సంతానోత్పత్తి చేసే ఉద్దేశ్యాన్నుండి వేరుగా ఉంచాలని డిమాండు చేయడం, వివాహానికి సంబంధించిన సాంప్రదాయిక విశ్వాసాలకు, వ్యవస్థకు వ్యతిరేకం. ఈ కొత్త పరిస్థితుల్లో వివాహ వ్యవస్థలో ఎలాంటి మార్పులు అవసరమవుతాయి? ఆ మార్పులు ఎలా తీసుకొని రావాలి?

రజని : ఇది చాలా చిక్కు ప్రశ్న. ఇక్కడ ఒక విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. వివాహం హిందూ మతం ప్రకారం జరిగినా, ఇస్లాం మతం ప్రకారం జరిగినా, మరే మతం ప్రకారం జరిగినా, అందులో వివాహం కేవలం సంతానోత్పత్తి కోసమే కాదు, రతికి సంబంధించిన సుఖ సంతృప్తులు పొందేందుకు కూడా, అనే మాట వత్రం అందర స్పష్టంగా అంగీకరిస్తారు. అన్ని సంస్కృతుల్లోన వివాహానికి ఇది ఒక ముఖ్య ఉద్దేశ్యంగా ఉంటూ వచ్చింది. కానీ, దానితో పాటు సంతానోత్పత్తి చేయడం కూడా వివాహానికున్న ఒక ముఖ్య ఉద్దేశ్యం, అనే మాట కూడా చేరి ఉంట వచ్చింది. వారసత్వానికి సంబంధించిన ప్రశ్న కూడా దీనితో చేరి ఉంది. విధిపూర్వకంగా జరిగిన వివాహం వల్ల కలిగిన సంతానానికే తండ్రి ఆస్తికి వారసత్వాధికారం పొందే వీలుండేది. రతి సుఖ – సంతృప్తుల విషయనికొస్తే అది కూడా కొన్ని నియమ నిబంధనల ననుసరించే పొందే వీలుండేది. అందులో కూడా పురుషుని సుఖ – సంతృప్తుల గురించే మాట్లాడేవారు, స్త్రీల సుఖ – సంతృప్తుల గురించి మాట్లాడే వారు కాదు. అందుచేత సంతానోత్పత్తి చేయడమే వివాహానికి ముఖ్యోద్దేశ్యంగా ఉంటూ ఉండేది. ఇప్పుడు జనసంఖ్యను అదుపులో ఉంచడం, కుటుంబ నియంత్రణ, గర్భనిరోధక పద్ధతులు మొదలైనవి రావడం వల్ల సెక్స్‌ను సంతానోత్పత్తి నుండి వేరు చేయడానికి వీలు ఏర్పడింది.

రమేశ్‌ : అయినా, చాలా మంది ఇప్పుడు కూడా సంతానం కోసమే వివాహం చేసుకుంటున్నారు.

రజని : నిజమే. కానీ, వచ్చిన మార్పు ఏమిటంటే, ఇప్పుడు సెక్స్‌కు, సంతానోత్పత్తికి ప్రత్యక్ష సంబంధం లేకుండా పోయింది. సంతానం వద్దనుకునే వారు, ఇప్పుడే వద్దనుకునే వారు, సెక్స్‌ సుఖం పొందుతూ కూడా సంతానం కలగ కుండా ఆపుకోవచ్చు. దాన్ని కొందరు స్రీల విముక్తికి, లేక వారి లైంగిక స్వేచ్ఛకు కారణంగా కూడా చెప్తారు. గర్భనిరోధకాలు రావడం వల్ల స్త్రీ తన భర్తతోనే కాకుండా ఇతర పురుషులతో కూడా సంబంధం ఉంచుకోడానికి స్వతంత్రురాలు కావడం మంచిదే అని కొందరు భావిస్తే, మరి కొందరు దాని వల్ల మనుషులకు వ్యభిచరించడానికి పూర్తి స్వేచ్ఛ లభించిందని భావిస్తున్నారు. కానీ, వివాహం కేవలం లైంగిక సంబంధం మాత్రమే కాదని నా అభిప్రాయం. ఇది ఒక కౌటుంబిక, సామాజిక సంబంధం కూడా. అందులో భార్య, భర్త ఒకరిపట్ల ఒకరు నిజాయితీతో ఉండడం, కలిసి పిల్లలను పెంచడం, పరస్పరం ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు, ఇద్దర కలసి పిల్లల వ్యక్తిత్వాన్ని వికసింప చేయడం, కుటుంబాన్ని, సమాజాన్ని మరింత మెరుగు పరచడంకోసం కలిసిమెలిసి పని చేయడం, ఇలాంటి విషయలు కూడా అందులో ఉంటాయి. ఇలాంటి అనేక విషయల పట్ల శ్రద్ధ చూపకుండా వివాహాన్ని కేవలం లైంగిక సంబంధంగా భావించడం, ఆ సంబంధం ఆధారంగానే విముక్తికి, లేదా నైతికతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం నా దృష్టిలో సమంజసంకాదు, సరైందీ కాదు.

రమేశ్‌ : ఇక వివాహానికి విడాకులతో, ఇతర చట్టాలతో కూడా సంబంధం ఉంది. ఇప్పుడున్న వ్యవస్థలో ఈ చట్టాలు ఎక్కువగా పురుషుల పక్షంగా ఉంటున్నాయి. స్త్రీల పక్షం వహించే కొన్ని చట్టాలు తయరైనా, స్త్రీలు తమ బలహీన ఆర్థిక-సామాజిక పరిస్థితి కారణంగా వాటి నుండి లాభం పొందలేక పోతున్నారు. మీరేమంటారు?

రజని : చూడండి, మన దేశంలో, వివాహానికి సంబంధించిన విషయంగానీ, కుటుంబానికి సంబంధించిన విషయంగానీ, లేదా స్త్రీ పురుషుల వ్యక్తిగత సంబంధాల విషయంగానీ, ప్రతి విషయంలోన చట్టరీత్యా ఒక విధమైన పరిస్థితి ఉంటే, సామాజిక ఆచరణ దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మన దేశంలో వివాహానికి, విడాకులకు సంబంధించిన చట్టాలు ప్రగతిశీలంగానే ఉన్నాయి. కానీ ఆచరణలో వాటి ఉపయెగం లేకుండా పోతంది. ఉదాహరణకు, ఎవరైనా ఒక స్త్రీ చట్టరీత్యా తనకు ఉండవలసిన అధికారం కోసం పోరాడాలని అనుకుంటుందనుకోండి, ఆమె తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఆమెకు తోడ్పడకపోతే ఆమె పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయరవుతుంది. భర్త ఆమెను వదిలేస్తే ఆమె తండ్రి, అన్నదమ్ములు మేము ఏమీ చేయలేము, నీవు అక్కడే ఉండాల్సిందే, అని అంటే ఆమె ఎక్కడికి పోతుంది? అదే విధంగా వారసత్వాధికార చట్టం ఇప్పుడు తండ్రి ఆస్తిలో కుమార్తెకు కూడా పాలుపంచుకొనే వీలు కలుగజేసింది. అయితే ఆమె అన్నదమ్ములు నీవు నీ భాగం అడిగితే నీకు, మాకు మధ్య తోబుట్టువుల సంబంధం శాశ్వతంగా తెగిపోతుంది, అని అంటే ఆమె తన భాగం అడగనే అడగదు. చెప్పొచ్చేదేమిటంటే, చట్టమేమో ప్రగతిశీలంగా ఉంది. కానీ సమాజం వెనకపడి ఉంది. అదేవిధంగా దాంపత్యాధికారాలను పునరుద్ధరించడానికి సంబంధించిన చట్టం ఉన్నా, చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని ఆశ్రయిస్తున్నారు. పురుషునికి ఈ చట్టం నుండి సహాయం పొందవలసిన అవసరమే లేదు. ఎందుకంటే, నీవు నీ భర్త ఇంటికి తిరిగి వెళ్ళిపో, అని ఆమె పుట్టింటి వాళ్ళే అంటారు. ఇక స్త్రీలు కూడా మీరన్నట్లు తమ బలహీన ఆర్థిక, సామాజిక పరిస్థితి కారణంగా ఈ చట్టం నుండి లాభం పొందలేరు. చాలా మంది భర్తలు విడాకులు ఇవ్వకుండానే భార్యను ఇంట్లో నుంచి వెళ్ళ గొడుత ఉండినా, స్త్రీలు చట్టం సహాయంతో దాన్ని ప్రతిఘటించ లేక పోతున్నారు.

రమేశ్‌ : విడాకుల విషయంలో ఇద్దరి అంగీకారంతో విడిపోయే చట్టం వచ్చింది. ఇది మంచిదే అని నా అభిప్రాయం. కానీ, దీని ఉపయెగం కూడా చాలా తక్కువగానే కనిపిస్తుంది.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

4 Responses to వివాహ వ్యవస్థ మారాలి

  1. laxmi says:

    ఈ వ్యాసము చదవడానికి, థెసిస్ రాసుకొవడానికి చాలా బాగా ఉంటుంది. లోపము వ్యవస్థ లొ లేదు. మీరు పైన చెప్పిన/విమర్శించిన కొన్ని విషయాలను ఒకే ద్రుష్టి (లోపాలను వెతికే) చుశారు. లోపము వివహ వ్యవస్థ లో లేదు. కొంత మంది భర్తలు/భార్యలు లో వుంది. మన వ్యవసకలొ కులమతాలు మాత్రమే లోపాలు, మిగిలినవి భార్యాభర్తల మధ్య భాద్యతల విభజన మాత్రమే. కొన్ని నిభంధనలు, కట్టుబాట్లు స్త్రీ పురుషులిరువురికి ఉండాలి. బాధలు బంధనాలు వద్దని అందరు అనుకుంటే కుంటుంబ వ్యవస్థ చిన్నభిన్నం అవుతుంది, పిల్లలు మంచి వాతావరణం లో పెరుగరు. మంచి పౌరులుగా ఎదగరు. విమర్శ అంటే మంచి చెడులను ఏక నెత్రముతో చూసి , చెడును నివారించేదిఆ ఉందలె తప్ప అగ్నిని రగిలంచేదిగా ఉండకూడదు.

  2. యడవల్లి says:

    లక్ష్మి గారు చాలా చక్కగా చెప్పారు..పైన రజని గారికి భారతీయ సంస్కృతి గురించి మాట్లాడుతే…తాట తీస్తామని చెప్పండి..ఇదే చర్చ ముస్లిం వివాహ వ్యవస్థ లేదా ఇతర మతాల గురించి జరిపే ధైర్యం ఎవ్వరూ చేయరు..కారణం…వెంటనే తలలు పగలగొడ్తారు కాబట్టీ…

  3. కృష్ణకుమారి says:

    ఇక్కడ అనవసరపు పడికొట్టు పదాలు ఎక్కువ వాడేరేమో? సరిగ్గా అర్ధం కావటం లేదు. చాలా చోట్ల జనరలైజేషన్ ఎక్కువగా వుంది. దీనికంటే నాకు ఇండియా టుడే వ్యాసాలు నచ్చాయి. పూర్తిగా సర్వే చేసి మరీ రాసాడు ఒకసారి. మతాలతో సంబంధంలేకుండా. ఈ రజనీ గారు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్లనిపిస్తుంది.

  4. viswam says:

    చాలా బాగఉనంది

Leave a Reply to కృష్ణకుమారి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.