మన తల ఎవరి పాదాల మీద వుంది?

కొండేపూడి నిర్మల

అనగా అనగా ఒక ఇరమై ఏళ్ళ అమ్మాయి.. అప్పుడే డిగ్రీ పరీక్ష రాసి, ఎప్పటినుంచో కలలు కంటున్న విలేఖరి ఉద్యోగం కోసం పత్రికలో చేరింది. చేరిన కొత్తలోనే ఉగాది ప్రత్యేక సంచిక కోసం బాపు బొమ్మకి ప్రేమ కథ రాయమన్నారు. తెల్లవార్లూ నిద్రకాచి మనసంతా వొలకబోసి ముఖ చిత్ర కథ రాసి భయం భయంగా సంపాదకుడికి  సమర్పించింది.

 ”ఓహో..అబ్బో… బావుంది. చాలా చాలా బావుంది, ఇదిగో చూశారా, మొన్న చేరిన ఆ బక్క పిల్ల ఎంత గొప్పగా రాసిందో..” అంటూ అందరికీ ఫోను చేశాడాయన. ఇద్దరు సీనియరు సంపాదకులు అది జిరాక్సు తీసి ఇంటికెళ్ళి మరీ చదువుకున్నారు. ఆ రోజంతా ఆ పిల్ల నేల మీద నడవలేదు, గాల్లో తేలిపోయింది.
 కానీ మర్నాడే వాళ్ళకు సందేహం వచ్చింది. అన్నట్టు, బాపూ బొమ్మకి, వూరూ పేరు లేని అనామకురాలితో రాయించడమేమిడి? ఫలానా ప్రముఖుడితో రాయిద్దాం. అనుకున్నారు. సదరు ప్రముఖుడు చక చక టీ తాగినంత చులాగ్గా అక్కడిక్కడే కథ రాసి పడేశాడు. ”దిగులు పడకు, నీది వచ్చే సంచికలో వస్తుంది.” అన్నారు సహ ఉద్యోగులు. అన్న ప్రకారం వచ్చే సంచికలో ఆమె కథ వచ్చింది, కానీ ఎలా? ఫలానా ప్రముఖ రచయిత కథ చదివిన స్పూర్తితో వచ్చిన స్పందనల పరంపరలో ఒకటిగా వచ్చింది. అమ్మాయికి ఏడుపొచ్చింది. కానీ ఏం చేస్తుంది? ఎవరు రాసినా పత్రిక కోసమే కదా, పత్రిక బావుంటే నేను బావున్నట్టే, అనుకుని ఓదార్చుకుంది. రాతకి సిరా తప్ప, మెదడు ఖర్చు చెయ్యక్కర్లేదని అది కేవలం గుమాస్తా పని అని అలా తెలిసింది.
???
నాలుగేళ్ళ పాటు మూసుకున్న పత్రిక గేట్లు ఆవాళే తెరుచుకున్నాయి. జీతాలిస్తారన్న వార్తకి ఊరంటుకున్నంత ప్రచారంతో అంతా వచ్చారు.చార్మినారు చౌరాస్తా నుంచి, ఆర్టిసీ క్రాసు రోడ్డు దాకా క్యూ కట్టిన సిబ్బందిలో ఆ అమ్మాయి కూడా వుంది. తొమ్మిదింటికి రావాల్సిన యజమాని రెండయినా దిక్కు లేదు. చివరికి మూడున్నర దాటాక జీతాలిచ్చే గుమాస్తా చల్లటి కారులో వచ్చాడు. భయభక్తులతో దారి ఇచ్చారు రాత గుమాస్తాలు. లోపలికికెళ్ళి వొళ్ళు విరుచుకుని, విశ్రాంతి తీసుకుని, టిఫిను తెప్పించుకుని, ముఖ్యులతో మంతనాలాడి, ఇక అప్పుడు, గది కిటికీ తీసి సినిమా టిక్కెట్ల మాదిరి జీతం కవర్లు ఇవ్వడం మొదలుపెట్టాడు వాడు. కాగితాలు లెక్కపెట్టుకున్న వాళ్ళెవరి మొహాలు వెలగడం లేదు.కారణం అది ఒక్క నెల జీతం. బకాయీ పడ్డ ఏడు నెలలలో పదో వంతు కూడా లేదు. అవి కూడా నలభై మందికి ఇచ్చి ”హౌస్‌ఫుల్లు” బోర్డు పెట్టాడు. ”మళ్ళీ తర్వాత షో” ఎప్పుడో ఎవరూ జవాబు చెప్పలేక పోయారు. మొత్తం అంతా శవ జాగారణ.. చచ్చిన కొలువుల్ని పాడె ఎక్కించి కూచున్నారు. చిల్లర డబ్బులు కూడా రాలడం లేదు. ”డౌను, డౌను” అందరితో బాటు ఆ అమ్మాయి కూడా అరిచింది. బరువైన కవర్లు అందుకున్న కొందరు అందరినీ కంట్రోలు చేస్తున్నారు.
”అన్నేళ్ళు పనిచేసిన మాకే జీతం లేదు, మీరంత తొందర పడితే ఎలా?” అన్నాడొకడు ఆమెని చూసి, ఆ అమ్మాయి తెల్లమొహం పెట్టుకుని వెళ్ళిపోయింది. నిజమే కదా ! పత్రిక  మూసేద్దామని ఆలోచన రాగానే అమ్మేసిన ఫర్నిచరుతో బాటు, తగ్గించిన కలరు పేజీల్తో బాటు, ”కుదింపు” పేరిట రోడ్డు మీదికి గెంటేసిన ఆడవాళ్ళలో ఆ పిల్ల కూడా వుంది. అందువల్ల హక్కులు లేవు, ఆందోళనల్లేవు.
మూడోకాళ్ళ పందెం (త్రీ లెగ్గు రేసు- మినరలు వాటరు కంపెనీ) వారు నడిపిన ”అవమానం” అనే పత్రికలో రాజీనామా రాస్తోంది ఆ అమ్మాయి. ప్రకటనల రూపంలో ఆదాయం తెచ్చి అందులోనే జీతం అందుకోవడానికి ఎప్పుడో అలవాటు పడింది. ముఖం విలువ (ఫేసు వాల్యూ) చూపించి తెచ్చి కంపోజు చేసిన సీరియళ్ళు ఎప్పుడొస్తాయో రచయితలకి చెప్పలేక తప్పించుకుని తిరుగుతోంది. ప్రకటన ఇచ్చిన కబ్జా గాళ్ళను గురించి అద్భుత కధనాలు రాయడానికి అసహ్యం వేస్తోంది. ఎడిటోరియల్లేదు, కవితల్లేవు, కథల్లేవు, వ్యాసాలు అసలే లేవు. ఈ మధ్య అసెంబ్లీ కోసం పది కాపీలు మాత్రమే వెయ్యడం మొదలు పెట్టింది. అసలది కేవలం న్యూసు ప్రింటు కోటా కోసం నడుస్తున్న చద్ది వార్తల పత్రిక.. వేళ్ళు, అక్షరాలకు ఎదరుగు తిరుగుతున్నాయి. జర్నలిజం వ్యభిచారం కంటే ఏ విషయంలో తక్కువ? అనిపించింది. ఉన్న ఫళాన ఇంటికి వచ్చేసింది.
???
ప్రింటు మీడియా ”నాకు అచ్చి రాలేదు”అనుకుంది. ఆశాజీవి అయిన ఆ పిల్ల. అందుకని ప్రసార మాధ్యమానికి వచ్చింది. అక్కడంతా సినిమా వాతావరణమే.. ముందు లేచిన పక్షి, ముందే అందర్నీ నమిలేస్తుంది. (ఎర్లీ బర్డు కెన్‌ గెట్‌ ఎర్లీ పుడ్‌) అనే సిద్ధాంతం అమలులో వుండేది. కాబట్టి పందుల ఫుల్ల నోట్లో వేసుకుని తెల్లారకుండానే కొందరు వచ్చేవారు. వాళ్ళతో పోటీ పడ్డం కష్టంగా వుండేది. రేపు జరిగే ధర్నా ఇవాళే డూప్స్‌తో లాగించి వార్త ప్రసారం చేయడం లగాయితు, చేసిన క్యాసెట్టు చిన్న ఛానల్సుకి అమ్ముకోవడం నుంచి, కథనం మార్చేసి సందర్భాలకి రీ మిక్సు చెయ్యడం, బెదిరించి ఇవాళ ప్రతికూలంగా రాసిన వార్త,కవరు అందాక రేపు అనుకూలంగా ప్రసారం చెయ్యడం దాకా అంతా అదొక గ్యాంబ్లింగుగా, ”కాయి రాజా కాయి, చూస్తే లేదు చేస్తే వుంది” గా వుంటే, తట్టుకోలేక, కనీసం తనకు కేటాయించిన బీట్స్‌ అయినా సవ్యంగా చేద్దామంటే వాహనాల, కెమెరా, ఎడిటింగు ఏదీ ఎవరు సహకరించక… పకడ్భందీగా పెట్టిన పొగ  అల్లుకుపోయి ఊపిరాడక కొట్టుకున్నా నెట్టుకొద్దామనే అనుకుంది.కానీ వాళ్ళే రిసెప్షనిస్టుల్ని, యాంకర్లలనీ తప్ప వార్త విభాగంలో వున్న ప్రతి మహిళా జర్నలిస్టునీ ప్రత్యేక శ్రద్ధతో ఏరి ఉమ్మడి వీడ్కోలు ఇచ్చారు. పది పమందితో చావు పెళ్ళి లాంటిదంటారు కదా. అన్ని నేరాల రాసేదానికంటే చాతకాని, మూగ ప్రాణి ఇంకోటి లేదని భలే బాగా అర్ధం అయ్యింది.
వెబ్‌సైటు బూం నడుస్తోంది. పాశ్చాత్య దేశాలకి తెలుగు సంస్కృతిని పరిచయం చేసే కార్యక్రమం మొదటి ఉద్దేశ్యం.కానీ అది అచిరకాంలోనే సినిమా తారల వెకిలి డైరీగా మారిపోయింది. ఏ తారకి ఎక్కడ పుట్టు మచ్చ వుండటంవల్ల అంత కలిసి వచ్చిందో, ఏ నటుడు కొత్తగా ఎవరితో డేటింగు మొదలుపెట్టాడో కనిపెట్టడం యాతనగా వుండేది. ఎలాగోలా తెలుసుకునే లోపు వివరాలు మారిపోతూ వుండేవి. అప్పుడు అక్కడ ఇలాంటి వివరాల్లో తల పండిన జర్నలిస్టు కూడా వుండేవాడు కాబట్టి ఆమె చెవులకే తప్ప చేతి వేళ్లకి పెద్దగా పని వుండేది కాదు. అయితే ఒకానొక శుభ ముహూర్తాన యాజమాన్యానికి, ఈ పత్రిక కంటే, ఎడ్యుకేషను సైటు పెడితే లాభం కదా అని జ్ఞానోదయం కలిగింది. అప్పుడింక పుట్టుమచ్చల జర్నలిస్టూ,ఎక్కడా పనికి రాని ఆ అమ్మాయీ నోరు మూసుకుని బైటికి ఒచ్చేశారు.
ఎంత చెడ్డా పత్రిక ఆమె పాలిట ఒక బోధి వృక్షం. పరిచయమైన ప్రతి యాజమాన్యానికి గుళ్ళు, మసీదులు, చర్చీలు కట్టించాలని ఆమె ఎప్పుడూ అనుకుంటూ వుంటుంది.
 కబ్జా పత్రిక, గుండా పత్రిక, పిల్లి, బల్లి, జాతక, వాస్తు – ప్రయెగాత్మక పత్రిక, రాజకీయ ముఠా పత్రిక, కీచక పత్రిక, వెకిలి ఎకసెక్కాల పత్రిక – వాని బామ్మరుదుల్లాంటి ప్రసార మాధ్యమం ఎవరైతే మటుకు ఏమిటి? పోషించేవాడి కోసం ప్రాణం విడవడం, పెట్టుబడి దారుల మనం వేరు కాదనడం సతీసహగమనాన్ని  గుర్తు తెస్తోంది.
కలాలు అమ్ముడు పోయాయని మందకృష్ణమాదిగ చెప్పడం ఏమిటి? మనమే ఇంకా ఎపుడూ గుస గుసగా కూడా అనుకోలేదు. ధోరణిలో ఎంత బానిసత్వం వున్నాగాని, జర్నలిస్టుల్లో సగం మందికి ఉద్యోగ భద్రత లేకపోయినాగాని, ప్రకటించిన జీతానికీ ఇస్తున్న జీతానికి పొంతన లేకపోయినాగాని, అక్రిడేషను కార్డులు, ఇంటి స్థలాలు కొందరికే దక్కినాగాని,రాలిపోయిన జర్నలిస్టు కుటుంబాలకి మొండి చెయ్యి చూపినాగాని, నిన్న గాక మొన్న జరిగిన దాడిలో కూడా దాడికి గురయిన స్త్రీల గొంతును రికార్డు చెయ్యకపోయినా గాని సభ్యత్వం కట్టినా సరే జీవితకాలంలో ఎప్పుడూ ఓటు చెయ్యమని ఎవరూ అడక్కపోయినాగాని, కనీసం గోచిలేని సినిమా గంతుల నుంచి, వ్యాసార మాయలనుంచీ మొదటి పేజీ శీర్షిక చోటుని కూడా రక్షించుకోలేని భావదాస్యంలో సంపాదకులు వున్నాగాని మన తల ఎవరి పాదాల మీద వుందో చెప్పే హక్కు ఎవరికీ లేదు. లేదు. లేదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. పత్రికలు ప్రజ్వలించాలి. ఒకే ఒక్క సిరా చుక్క వేయి మెదళ్ళ కదలిక.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

3 Responses to మన తల ఎవరి పాదాల మీద వుంది?

  1. chavakiran says:

    బాగుంది.

  2. prashanth says:

    నిర్మల గారు పత్రికల గురించి బాగా రాశారు.

  3. ఇది నిజంగా జరిగిన సంఘటనలా ఉంది.

Leave a Reply to chavakiran Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.