స్త్రీలపై అత్యాచారాలకి మూలాలెక్కడ?

పులుగుజ్జు సురేష్

ముక్కుపచ్చలారని చిన్నారులపైన ఈ మధ్యకాలంలో అత్యాచారాలు పెరిగిపోయాయి.

వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.

 మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా మూడేళ్ళ బాలికపైన 60 ఏండ్ల వృద్ధుడి అత్యాచారం, ఆరేళ్ళ బాలికపై అత్యాచారం చేసి రైల్లో పడేసిన ఓ యువకుడు, ఎనిమిదవ తరగతి చదువుతున్న ఒక బాలికను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడు, ఇంటర్‌మీడియట్‌ చదువుతున్న విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న 50 ఏండ్ల ప్రిన్సిపల్‌, ప్రేమించలేదని వెంటపడి కళాశాలలో హత్యచేసిన ఓ ప్రేవెన్మాది, శారీరకంగా తన కోర్కెను తీర్చమని లేకుంటే నీ అంతు తేలుస్తానని బెదిరిస్తున్న పైఅధికారి, సామూహిక అత్యాచారం చేయగా తీవ్రమైన రక్తస్రావంతో మరణించిన ఓ గర్భవతి, ఏండేండ్ల బాలికను అత్యాచారం చేసి వక్షోజాలను కోసి చంపేసి శవంతో తన కోర్కెను తీర్చుకొని, మర్మావయవాల్లో కట్టెలు కొట్టి పూడ్చేసిన ఓ యువకుడు- ఇటువంటి సంఘటనలు వార్తలకెక్కని రోజు కనబడడంలేదు.
 పేపరు చదవాలంటే భయంపుడుతుంది. క్రైం న్యస్‌లో అత్యధికంగా ఇవే కనబడుతున్నాయి. ఇవి కాకుండా వార్తలకెక్కనివి మరెన్నో ఉన్నాయి. ఈ వార్తలు జిల్లా పేపరుకే పరిమితమవుతుండడం వల్ల రాష్ట్రస్థాయి సవచారం నవెదు కావడం లేదు. చిన్న వయసులోని అవ్మయిల ప్రాణాలు బలవుతుంటే ఆడబిడ్డలను కన్న తల్లిదండ్రులు చాలా రకాలుగా భయందోళనలకు గురవుతున్నారు. పెద్ద చదువులు చదివించాలన్న కోర్కెలు తల్లిదండ్రులలో వున్నా, కోర్కెలను అణచుకొని ఆదిలోనే తుంచివేసుకుంటున్నారు. చదువులో ముందంజలో ఉండి, చదువుకోవాలనే ఆసక్తి ఉండి కూడా పరిస్థితులు అననుకూలంగా ఉండడం వలన వెనుకంజవేయడం జరుగుతున్నది. స్త్రీలపైన అత్యాచారాలు జరగడం కొత్తకాకపోయినా పరిస్థితి బాగా తీవ్రమయింది. మహిళలపైన నేరాలు మరిన్ని పెరుగుతూనే ఉన్నాయి. బాలికలపైన పెరుగుతున్న నేరాల సంఖ్య లెక్కలు కూడా దొరకడం లేదు.
 ఆడపిల్లలు అర్ధరాత్రి ఒంటరిగా, స్వేచ్ఛగా ఎటువంటి భయం లేకుండా నడవగలిగిన రోజుననే మనకు స్వాతంత్య్రం వచ్చినట్టని, అప్పటిదాకా స్వాతంత్య్రం రానట్టేనని స్వాతంత్య్ర యెధులు తెలిపారు. అయితే అర్ధరాత్రి ఒంటరిగా తిరగడం కాదు గదా, బహిరంగ ప్రదేశాలలో నిత్యం జనంతో రద్దీగా ఉండే ప్రదేశాలయిన విద్యాలయాలు, రైళ్ళు, రైల్వేస్టేషన్లు, పట్టణాలు, నగరాలతో పాటు గ్రామాలలో  మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దీనికి కారణాలను పరశీలించాలి. 95కు పూర్వం అశ్లీల చిత్రాలు ఎక్కడైనా కనిపించినా, మహిళలపై అసభ్యకరమైన పదజాలం వినిపించినా మహిళలనుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవలసి వచ్చేది. అశ్లీల పదాలను ఉపయెగించిన వారిలో కొంత భయం కూడా కనిపించేది. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడిన తరువాత అశ్లీల నృత్యాలు, అశ్లీల చిత్రాలు విపరీతంగా పెరిగాయి. మనకు తెలియకుండానే మనలో భాగమయాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (ఇఊం)కు, అశ్లీల చిత్రాలకు, బాలికలపైన పెరుగుతున్న అత్యాచారాలకు సంబంధమేమిటనే ప్రశ్న చాలామందికి రావచ్చు. బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలకు ప్రపంచీకరణలో భాగమైన ప్రపంచ వాణిజ్య సంస్థ నా దృష్టికి ముద్దాయిగా కనిపిస్తున్నది. ఎందుకంటే ప్రచారానికి ఎంతఖర్చయినా పెట్టడానికి కంపెనీలు పోటీపడుతున్నాయి ఫలితంగా మీడియా లో వస్తున్న చిత్రాలను కలుషితం కాని ఒక సాధారణ మనిషి చడలేకపోతున్నాడు. ఇప్పుడొస్తున్న సినిమాలలో విశృంఖలత పెచ్చు మీరింది. అధిక భాగం సినిమాలలో ఇద్దరు సంపన్న కుటుంబాలలోని అమ్మాయి, అబ్బాయిల మధ్య కలిగే ఆకర్షణతో కలిసిన ప్రేమ వ్యవహారం చిత్రించబడుతున్నది. ప్రేమ అంటే ఒక అందమైన తెల్లని ఛాయ కలిగిన అమ్మాయి ఆకర్షణగా కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చిత్రీకరించేటపుడు అంగాంగమును కెమెరాతో చాలా క్లోజ్డ్‌ పిక్చర్‌లో బంధించి అదనపు సొగసులు, గందరగోళపు సంగీతం కలిపి వర్ణిస్తున్నారు. వావివరసలు లేకుండా, చిన్నపెద్ద వంటి తేడాలు లేకుండా ఎనభైఏళ్ళ వృద్ధుడు పదహారేళ్ళ అమ్మాయితో సరసాలాడడం, ప్రేమించడం వంటివి చూపించడం జరుగుతున్నది. అర్ధంలేని పదాలతో పాటలు ఉన్నాయి. సినిమాలలో మొదటి రాత్రులతో సహా అన్నీ చూపిస్తున్నారు. కాలేజి ఎగ్గొట్టి షికార్లు తిరగడం, షాపింగులు, పార్కులు, పబ్‌లు ఒకటేమిటి, వీటిలో కూడా ‘ఐటమ్‌ గర్ల్‌’ని ఖచ్చితంగా ఉంచుతున్నారు. దీనికి అనుబంధంగా టి.వీ.లు 24 గంటలు ఏదో ఒక ప్రోగ్రాంతో తలమునకలవు తున్నాయి. సీరియళ్లలో అక్రమ సంబంధాలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, కుటుంబ కలహాలతో నిత్యం విషాదం, అనుమానం, అవమానం, మర్డర్లు అత్యాచారాల మధ్య తప్పటడుగులు ఏవిధంగా వేయాలో బాగా నేర్పుతున్నాయి. ప్రపంచబ్యాంకు సహకారంతో అమలు జరుగుతున్న హెచ్‌.ఐ.వి ఎయిడ్స్‌ ప్రాజెక్టుల్లో యిచ్చే శిక్షణలు యువకులపైన దుష్ప్రభావం చూపుతున్నాయి. వీరు చూపించే కొన్ని కార్యక్రమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. టి.వి.లు, సినిమాలలో ఆడవారు ధరించే డ్రస్‌లు ఒక మీటరు కూడా ఉండడంలేదు. మామూలుగా యుక్తవయసులోని వారికి కనీసం 6-7 మీటర్లకు తగ్గకుండా బట్ట అవసరం. కానీ ఈ కార్యక్రమాలలో ఒక మీటరు లేదా మీటరున్నరలోపే ఉంటే ఒక తల్లి లేదా యువతి తన మానాన్ని ఏవిధంగా కాపాడుతుంది.  ఇకపోతే ‘వాలైంటైన్స్‌ డే’లు, హ్యాపీ న్యూఇయర్‌లు, బర్త్‌డే పార్టీలు- ఇటువంటి వాటి కొరకు వారంముందు నుండే ప్రసారసాధనాలు ముస్తాబవుతున్నాయి. దూరంగా ఉన్న వారితో అవతల వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయి పేరును బహిరంగంగా ప్రేమించానని చెప్పి అవమానపరచడం వంటివి షరా మామూలయ్యింది. ‘వాలైంటైన్స్‌డే’ రోజు కనీసం ఒక ప్రేమ జంటయైనా ప్రాణాలు తీసుకుంటుంది. ఇటువంటపుడు ఇవి జరుపుకోవడం అవసరమా! సభ్య సమాజం ఆలోచించాలి. ఒకవేళ ఇటువంటి పండుగలు జరుపుకోవాలంటే, అవి సమాజం పైన ఎటువంటి ప్రభావం చూపేవిధంగా ఉండాలి, మనుషుల మధ్య ఎటువంటి సంబంధాలు ఏర్పడితే బాగుంటుందో చర్చకు రావాలి. వాలైంటైన్స్‌డేకి కొన్ని కోట్ల రపాయల విలువయిన రకరకాల గ్రీటింగ్సు మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నాయి. మిలియన్ల డాలర్ల వ్యాపారం జరుగుతుంది. న్యూయియర్‌ శుభాకాంక్షలు తెలపడానికి టి.వి. చానళ్ళు పోటీపడుతుంటాయి. ఈ కార్యక్రమాల నిర్వహణకు బహుళజాతి సంస్థలు నిధులు అందిస్తాయి. న్యూఇయర్‌ వచ్చిందంటే ప్రధాన నగరాలలోని ముఖ్య స్థలాలలో లైవ్‌ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్‌ మహానగరంలో నెక్లెస్‌ రోడ్లో నిర్వహించే కార్యక్రమానికి బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు వస్తేనే ఆరోజు కొత్త సంవత్సరం వస్తుందన్నంతగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పబ్‌లు, హోటళ్ళు, వైన్‌షాపులు చాలా బిజీగా ఉంటాయి. పొట్టకూటికోసం స్వంతపాట, రికార్డు డ్యాన్సులేసే వారిని జైళ్లల్లో పెడుతున్నారు. కానీ పెద్దపెద్ద పార్టీలలో ఆ రోజు రాత్రంతా మీటరు బట్టతో మానాన్ని దాచుకొనే వారితో డాన్సులు వేయిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇటువంటి నీలిచిత్రాలు మారుమూల పల్లెలకు సయితం పెరిగిన టి.వి. చానళ్ళ పుణ్యమాని నగరాల నుండి వెళ్ళే లైవ్‌ చిత్రాలు గ్రామాలకు చేరుతున్నాయి. వీటి ప్రభావం అంచనాకు అందనంతగా ఉంది. టి.వి.చానళ్ళు ఒక్కసారి సమీక్షించుకుంటే బాగుంటుంది ఎటువంటి భావాలను, సంస్కృతిని ప్రచారం చేస్తున్నామని. సినిమాలు మరీ విచ్చలవిడిగా తయరయ్యాయి. కుటుంబ సభ్యులందరూ కాదుగదా, లింగభేదం లేని ఇద్దరు మనుషులు, ప్రేమికులు, నీ భార్యాభర్తలుగానీ  కలసి సినిమా చూడలేనంతటి విశృంఖలత్వం ఉంది. సినిమాను అన్ని వయస్సులవారు చూస్తారు. కాబట్టి కనీసం ఆలోచించాలి. ఉదాహరణకు ఒక అగ్రహీరో కూతురు ఒక మధ్య తరగతి యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటే రాష్ట్రమంతా గగ్గోలు పెట్టింది. ఆ హీరో వారం రోజుల వరకు బయటకు రాలేదు. అదే హీరో తీసిన సినిమాలు లేదా ఇతర హీరోలు తీసే సినిమాలలో జరిగే ప్రేమ వైఫల్యాలు, తన్నుకోవడం, చంపుకోవడం, ప్రేమ (ఆకర్షణ) కోసం దేన్నయినా త్యజించడం వంటివి సాధారణంగా మారాయి. ఈ సినిమాలు చూసిన యువకులు హీరోనే తన జీవితంగా అనుకునే యువకులపై పడుతున్న ప్రభావమెంతో ఒక్కసారయినా పరిశీలించుకున్నారా? ఈ మధ్యకాలంలో పెరిగిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ‘జావా’ ప్రభావంతో అన్ని రకాల చిత్రాలను సెల్‌లోకి బంధించుకుని ఎక్కడబడితే అక్కడ చూసుకునే అవకాశం వయస్సు పరిమితిలేకుండా ఏర్పడింది. ఈ పరిస్థితిలో ఉద్రేకానికి లోనైనవారు తమ యొక్క పరిధులు, పరిమితులు, సమాజం, వయసు అన్నింటిని మరచిపోతున్నారు. ఆ సమయంలో ఏం చేస్తున్నారో వారికే తెలియక చిన్న పిల్లలపై పడుతున్నారు. అదే స్థాయిలో యువతులపైన రెచ్చిపోతూ పిచ్చిపిచ్చిగా వ్యవహరించడం మామూలైపోయింది. నీరు మూడు భాగాలు ఉండి ఒక భాగం భూమి ఉంటేనే రక్షిత మంచినీరు లేని ప్రజలు లెక్కకు లేనంత మంది ఉన్నారు. మూడు భాగాలు ‘చెడు’ ప్రచారం జరుగుతూ ఒక్క భాగం కూడా ‘మంచి’ ప్రచారం జరగకపోతే సమాజం ఏదారిన నడుస్తుంది. మన పాలకులు బీరు, బారు షాపుల ప్రారంభోత్సవాలకు పోతే అక్కడ వంటిమీద నలుపోగులేని అమ్మాయిలు నృత్యాలు చేస్తుంటే మురిసిపోతున్న నేటి కాలంలో సమకాలీన పాలకులు ప్రజలకు పంపుతున్న సందేశమేమిటి?
 వేళకాని వేళల్లో ఉద్యోగాలు, కంపెనీలు ఇచ్చే వారంతపు, నెలాంతపు పార్టీలలో మితిమీరిన స్వేచ్ఛతో పాటు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అక్కడ మందుతో పాటు ఉండే అనేక అవకాశాల వలన మనుషులు తమ చేతుల నుండి వీడిపోయి మల్టీనేషనల్‌ చేతుల గుప్పెట్లో పడుతున్నారు. ఇకపోతే మహానగరాలలో ఉండే షాపింగుమాల్‌ల వద్ద మహిళలను వ్యాపార వస్తువు నుండి మార్చి వ్యాపారం చేయడానికి ఒక ఆకర్షణ వస్తువుగా వాడుతున్నారు. వీటిపైన ప్రతిఘటించే శక్తులను ప్రాణాలతో బతకనీయకపోవడం వలన ఉద్యమాల రూపాలు కూడా మారాయి. నేరస్తులకు పోలీసు పాలకవర్గాల అండదండలు సంపూర్ణంగా ఉండడం,  డబ్బుంటే ఎటువంటి నేరమయినా తారుమారు చేయగల నిపుణులు పెరుగుతున్నందు వలన, నేరాలపైన పర్యవేక్షణ కరువయింది. నేరం జరిగితే పోలీసు, లాయర్లు, పాలకులు మరియు మీడియా వంటి దళారులు కాసుల పండగ చేసుకుంటున్నారు. స్థూలంగా పరిశీలిస్తే 1991లో వచ్చిన ఆర్ధిక సంస్కరణల తరువాత ప్రతి ఒక్కటి డబ్బుతో చూడడం, రాష్ట్ర గవర్నర్‌తో సహా ఎం.ఎ, బి.ఎలకు కాలం చెల్లిందని చెప్తున్న ఈ నేపధ్యంలో వచ్చిన ప్రపంచ వాణిజ్య సంస్థ వలన పెరిగిన ప్రచారం ముఖ్యంగా మీడియా, సినిమా, పరిపాలనా రంగాలలో వచ్చినమార్పులు మనిషి నైతిక విలువల నుండి దూరమవుతూ తనకు సంబంధం లేని వాటి ప్రభావానికి లోనవుతూ ఇటువంటి విపరీత చర్యలకు పాల్పడుటకు కారకులవుతున్నారు. దీనిని మార్చవలసిన బాధ్యత సమాజంపైన ఉన్నది. లేకుంటే ఈ ప్రమాదం తెచ్చే పరిణామాలు సమాజంపై తీవ్రంగా ఉంటాయి. కార్యక్రమాల నిర్వహణకు మల్టీనేషనల్‌ కంపెనీలపై ఆధారపడుతున్న మీడియా సామాజిక కోణంలో ఆలోచించి ప్రత్యామ్నాయవర్గాలను అన్వేషించు కోవాలి. లేకుంటే బహుళజాతి సంస్థల విషపుకోరల్లో బలికావలసి వస్తుంది.

 

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

2 Responses to స్త్రీలపై అత్యాచారాలకి మూలాలెక్కడ?

  1. arunank says:

    స్త్రీలపై అత్యాచారాల మత్రమె కాదు ఉగ్రవదనికి కారణ0
    1)పె0పకము
    2) వా తా వ ర ణ0
    3)మీడీయా
    అన్నిటీలొ కల్టీముఖ్య మ ఇ నది తల్లి ధంద్రుల పె0పక0.తల్లి దంద్రుల కంటె పిల్లలను ఎవరు అర్థ0 చెసుకొ లీరు
    పిల్ల లు ప్ర వర్థన లొ ఏ మాత్రము తీదా వచ్చినా కనిపెట్టగలగాలి.కావలసిన సమయమ కీటాఇంచాలి .
    మనపనిలొ మనము వుంటీ వారినవాసరైన దారిలొ పెట్టాలి.మగ పిల్లలని ఆడ పిల్ల లను ఒకీ విధంగ పె0చాలి.
    మగ పిల్లా డు ఎమి చీసినా పరవలెదు అని అనుకొకూడధుడసిలమ అనీది ఇద్దరికీ ముక్యమీ.
    పెరిగీ వ వాతావరణ౦ కూడా చాలా ప్రబావ0 చూపుతు0ది.మంచి పిల్లలతొ స్నెహ0 ప్రొత్సాహి0చాలి.తప్పు దరిలూ
    వెళుతుంటీ,సామ,భీధ ధాన ధండొపాయలనపాఉపయొగించఇనా సరీ సరైన మార్గము లొ పెట్టాలి.
    విలైనంత వరకు ఎలెక్త్రనిక మీడియా కు దూర0 గ ఉ0చాలి.మ0చి సాహిత్యాన్ని చధవమని ప్రొత్సహించలి.
    న ఇ టిక విలువలు నీర్పించాలి.

  2. స్త్రీలపై అక్రమాలు,పెచ్చి రేగిపోవడం రోజు రోజుకీ పెరిగిపోతున్నదేకాని అడ్డుకట్ట పడటం లేదు. మీరు వ్రాసినవన్నీ యదార్థాలే కాని పరిష్కార మార్గం చక్కగా సూచించి ఉంటే చాలా బాగుండేది.
    చింతా రామ కృష్ణా రావు.

Leave a Reply to arunank Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.