సెజ్‌ సెగల్లో విలవిలలాడుతున్న పోలేపల్లి

కొండవీటి సత్యవతి

పోలేపల్లి వెళ్ళాలని, అక్కడి సెజ్‌ బాధితులతో మాట్లాడి, వారి దు:ఖగాధని భూమికలో రాయలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.
 రత్నమాల కూడ చాలాసార్లు చెప్పింది. అమెరికాలో వుండే జయప్రకాష్‌తో చాట్‌ చేస్తున్నపుడు తెలిసింది ఆగష్టు 7 న పోలేపల్లిలో పబ్లిక్‌ హియరింగు వుందని.

 సరే ఆ రోజు హాజరైతే అందరినీ ఒకే చోట కలిసినట్టు వుంటుందని, విషయలు బాగా అర్ధమౌతాయని అనుకుని శిలాలోలితకి, సుజాతాపట్వారీకీ ఫోన్‌ చేసాను.
శిలాలోలిత వస్తానని చెప్పడంతో పోలేపల్లి ప్రయాణం ఖాయమైంది.

ఆగష్టు 7న ఉదయం ఆరుకంతా రోడ్డెక్కేసాం. జడ్చర్ల దాదాపు 80 కిలోమీటర్లుంటుంది. మేము వెళ్ళేసరికి అక్కడ రత్నమాల, బాలగోపాల్‌, గీతాంజలి, హేమలలిత, సూరేపల్లి సుజాత వచ్చి వున్నారు. మాధవి, 50 మంది కాలేజీ పిల్లలతో కలిసి బస్సులో వస్తోందని, తన కోసమే ఎదురుచూస్తున్నామని సుజాత చెప్పింది. సమావేశం ఇంకా ఆరంభమయ్యే సూచనలు కనబడలేదు. టెంట్‌ వేస్తుంటే గాలికి కిందపడుతోంది. మేము నిలబడిన చోట రాక్షసుడి కోరల్లా రెండు ఆర్చీలు  ఎపి ఐఐసి వి రోడ్డు కిటూ అటూ దర్పంగా నిలబడి వున్నాయి. పొలాల్లో చురుగ్గా పనులు జరుగుతున్నాయి. ఆరవింద్‌ ఫార్మావారి షెడ్‌ నిర్మాణం జరుగుతుతోంది. లారీలు, రోడ్‌రోలర్లు అటూ, ఇటూ తిరుగుతున్నాయి. పొలాల మధ్యలో విశాలమైన నల్లటి తారు రోడ్డు అప్పటికే వేసారు. ఫార్మా కంపెనీల కాళ్ళు కందకుండా, వాళ్ళ కార్లు తిరగడానికి వీలుగా అంత విశాలమైన రోడ్డు వేసారని చూడగానే అర్ధమౌతుంది. వాటన్నింటినీ గమనిస్తూ అందరం మాట్లాడుకుంటుండగా మాధవి వాళ్ళ బస్సోచ్చింది. జీన్‌ పాంట్లేసుకున్న అమ్మాయిలు బిల బిల మంటూ బస్సు దిగేరు. వాళ్ళని చూసి నాకు చాలా సంతోషమన్పించింది.సెజ్‌లాంటి సీరియస్‌ అంశాల్లో యువత పాల్గొని, బాధితుల పక్షాన నిలబడితే మంచిది. ఈ విషయాలను వాళ్ళు అర్ధం చేసుకోగలిగితే బావుంటుంది అని నాకన్పించింది.
 బస్సు దిగిన వాళ్ళందరిని మళ్ళీ ఎక్కించి పోలేపల్లి గ్రామంలోకి బయలు దేరాం అందరం. మేము వెళుతున్నపుడు  చాలామంది స్త్రీలు ఎదురుపడ్డారు. వాళ్ళందరిని కూడా బస్సులో ఎక్కించుకుని ఊళ్ళోకి వెళ్ళాం. చాలా మంది పబ్లిక్‌ హియరింగు జరిగే ప్రాంతానికి బయలు దేరారు. కొంతమంది అక్కడ జరుగుతున్న పనుల్లో కూలీలుగా పనికి వెళ్ళారు. మేం పోలేపల్లికి ఆనుకుని వున్న గుండ్ల గడ్డ తాండాకి వెళ్ళాలనుకున్నాం. తండాలో ఎవరూ లేరని, పనులకి పొయ్యారని ఊళ్ళో వాళ్ళు అన్నారు. అయినా సరే కాలేజీ పిల్లలకి తాండా ఎలా వుంటుందోచూపించాలని మాధవి  వాళ్ళు అనడంతో ఇరుకు దారుల్లోంచి, లంబాడా తండాకి నడక మొదలు పెట్టాం. నిజంగానే మేము వెళ్ళేసరికి ఒక ముసలాయన తప్ప ఎవరూ కనబడలేదు. ఊరికి దూరంగా విసిరేసినట్టున్న ఆ లంబాడా తండాలో కోళ్ళు, కుక్కలు యధేచ్ఛగా తిరుగుతున్నాయి. చుట్టు చెట్ల మీద పిట్టలు గూళ్ళ కడుతున్న అద్భుత దృశ్యాలు కనబడ్డాయి. కొంత సేపటికి కొంతమంది స్త్రీలు తండాలోకి వచ్చారు. మేము వాళ్ళతో మాట్లాడటం మొదలు పెట్టాం. అందరి గొంతులోను ఒకే వేదన, అందరి గుండెల్లోంచి తన్నుకొచ్చేది ఒకే దు:ఖం. మావి ఇన్ని ఎకరాలు పోయాయి, అన్ని ఎకరాలు పోయాయి, మాకు ఇప్పుడు ఏమీ లేదు. మేమెలా బతకాలి. మోసం చేసి మా భూములు గుంజుకున్నారు. పద్ధెనిమిది వేలు నష్టపరిహారం అన్నారు. అందరికీ లంచాలిచ్చి మాకు మిగిలింది ఎకరానికి ఎడెనిమిది వేలు. ఆ డబ్బాంతా ఎన్నడో అయిపోయింది. మా తండా తప్ప మా కిప్పుడు ఒక సెంటు భూమి కూడా మిగల్లేదు. తైదలు, జొన్నలు, కందులు పండించుకు తినేటోళ్ళం. తొక్కు చేసుకోనీకి ఒక్క చింతకాయకూడా మిగల్లేదు. మేము భూమి లేకుండా ఎలా బతకాలి. మందుల కంపెనీల్లో మమ్మల్ని కూలీలుగా చేసారు. కూలీ కూడా రోజూ దొరకదు. పస్తులుంటున్నాం. హాయిగా మా పంట మేం పండించుకు తినేటోళ్ళం ఇప్పుడు దినసరి కూలీలుగా మారిపోయం. మా కష్టాలెవరికి చెప్పుకోవాలె. ఎవరైనా చస్తే బొంద పెట్టనీకి సెంటు జాగా కూడా లేకుండ చేసారు. అప్పుడు మాకు తెలివి లేకపాయె. ఇప్పుడు మాకు అన్నీ తెలుసు ప్రభుత్వం మా మొఖాన కొన్ని వేలు కొట్టి తను మాత్రం లక్షలకి, కంపెనీలకి పొలాలు అమ్మింది. ఇదేం అన్యాయం? ఇదేం ప్రభుత్వం? ఇప్పుడు మాకు అన్నీ తెలిసాయి. మా భూమి మాకు వెనక్కి కావాలి. మాకు నష్టపరిహారం మొద్దు, మందుల కంపెనీలొద్దు మా భూమి వకు కావాలి” అంటూ తండా వాసులు నినదించారు. ఈ విషయాలు పబ్లిక్‌ హియరింగులో చెప్పండని బాలగోపాల్‌ సచించారు. వాళ్ళని సమావేశానికి రమ్మని చెప్పి అందరం తండా నుంచి బయలుదేరాం.
‘ఫోటో తీసుకుందామని ప్రయత్నించి నపుడు ఒక లంబాడీ స్త్రీ అన్న మాటలు నా చెవుల్లో గింగిర్లు కొట్టాయి. ” ఎందుకమ్మా ఫోటోలు. ఎన్ని సార్లు ఫోటోలు దిగాలి ఎంతమందికి మా బాధలు చెప్పుకున్నాం. అందరూ వస్తారు. మాతో మాట్లాడతారు. మా కన్నీళ్ళు చూస్తారు. కానీ ఎవరూ తుడవనీకి రావడం లేదు. మా సమస్యల్ని పట్టించుకోవడం లేదు” ఆమె మాటలు నా చెంప మీద చెళ్ళున తగిలి నట్లయింది. ఇప్పటికి ఎంతమందికి తన గుండె విప్పి, తన బాధను వివరించిందో. ఎంత విసుగు చెందిందో పాపం! అన్పించింది, నిజమే! అందరం వస్తాం. చూస్తాం. సాలిడారిటీ ప్రకటిస్తాం. కానీ వాళ్ళ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి.
 గుండ్ల గడ్డ తాండ చూసిన తర్వాత, ఆమె మాటలు విన్న తర్వాత మనసంతా భారంగా అయ్యింది. అదే మూడ్‌తో పబ్లిక్‌ హియరింగు జరిగే చోటకి వచ్చాం. హైవేకి కూతవేటులో ఎపిఐఐసి కోర స్తంభాల పక్కన సమావేశం మొదలైంది. భూములు కోల్పోయిన వారంతా మాట్లాడసాగారు.
 మొదట జబ్బార్‌ అనే వ్యక్తిమాట్లాడుతూ తమ కుటుంబానికి చెందిన 50 ఎకరాల పొలాన్ని ప్రభుత్వం తీసేసుకుందని, హైదరాబాద్‌లోని జూపార్క్‌లాగా పార్క్‌ డెవలప్‌ చేస్తామని చెప్పి ప్రభుత్వం బలవంతంగా తమ భూముల్ని లాగేసుకుందని తెలిపాడు. దీనివల్ల తమ కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు చనిపోయారని, మొత్తం పోలేపల్లిలో నలభై మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భూములు గుంజుకునే పని 2001 నుండి మొదలైంది. మాకు ఉద్యోగాలిస్తామని కలక్టర్‌ చెప్పాడుగానీ ఎవ్వరికీ ఉద్యోగం రాలేదు. పోలేపల్లి సెజ్‌ వల్ల 370 కుటుంబాలు నాశనమైపోయయి. చస్తే కూడా బొంద పెట్టనీకి లేదు. 2006లో అరవింద్‌ ఫార్మా కంపెనీ ముందు ఉద్యమం చేసినపుడు మాకు ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పోలేపల్లి సర్పంచ్‌ బాలస్వామి గౌడ్‌ మాట్లాడుత ”ప్రభుత్వానికి ప్రజల భూముల్ని గుంజుకునే హక్కున్నదంటూ మా భూముల్ని లాక్కున్నారు. నిజానికి ఇవేవీ ఎసైన్డ్‌ భూములు కాదు. ప్రజలు ఎంతో కష్టపడి కొనుక్కొన్నారు. ప్రభుత్వం ఒప్పుకొన్న వేవీ చెయ్యలేదు. నష్టపరిహారం కూడాచాలా తక్కువ ఇచ్చారు. రైతులంతా భూమికి భూమి అడుగుతున్నారు. కానీ ప్యాకేజ్‌ అమలు చేస్తామంటున్నారు. పార్లమెంటరీ కమిటీ పోలేపల్లి వచ్చింది. కాన్షీరామ్‌ రాణా రిపోర్ట్‌ మాకు దొరకనే లేదు. ఆ రిపోర్ట్‌ ఏమైందో తెలియదు” అన్నారు. అబ్ధుల్‌ రవూఫ్‌ తన భూమి 15 ఎకరాలు పోయిందని తాను నష్టపరిహారం తీసుకోలేదని అడుగుతుంటే కోర్టుకు పొమ్మంటున్నారు. ”అంటూ వాపోయడు. శంకరయ్య మాట్లాడుతూ’ మా బతుకు తెరువైన రెండకరాలు పోయాయి. నా చేతికి పద్దెనిమిది వేలు వచ్చాయి. మాకు న్యాయం కావాలి. మాపొలంమాకు కావాలి. దీని కోసం ఎన్ని ఉద్యమాలు చేస్తున్నాం? మాది ఆరు ఎకరాలు పోయింది ఈ బాధ తట్టుకోలేక మా ఆయన గుండె పోటుతో చచ్చిపోయడు. అరవింద కంపెనీ వాళ్ళ జెండా పీకాం. రాయి పీకాం. వాళ్లు బోర్‌ పీకేసినాం. కంపెనీ కాడ టెంట్‌ వేసుకుని వంట చేసుకున్నాం. పోలీసులొచ్చి మమ్మల్ని పచ్చిపులుసు కూడా తిననీయలేదు.” పెద పెంటయ్య, మొగులమ్మదీ అదే వేదన. ”ఇరవై అయిదు ఎకరాలు గుంజుకున్నారు. మేము పదకొండుమందిమి. చేతిలో చిల్లిగవ్వలేదు. ఎక్కడ కలక్టరాఫీసు ఎక్కడ పోలేపల్లి. కూలినాలి చేసుకు బతికేటోల్లం. మహబబ్‌నగర్‌కి పోవడం మావల్లవుతుందా? మాకు న్యాయం చెయ్యండి, ” గంగమ్మ, కమ్లి, రంగమ్మ, సాజీదాబేగం. అందరి గుండెల్లోను సుడులు తిరుగుతున్న దు:ఖం.
ఆగష్టు ఏడున జరిగిన పోలేపల్లి ఫార్మాసెజ్‌ దురాగతాలపై జరిగిన పబ్లిక్‌ హియరింగులో వెల్లువెత్తిన కన్నీటి గాధలు. పోలేపల్లి , గుండ్లగడ్డ తాండ, ముదిరెడ్డి పల్లి గ్రామాల ప్రలజ కన్నీటి ప్రవాహాలు మమ్మల్ని ముంచెత్తిన సందర్భమిది. ఒక్కొక్కరూ తమ గుండె ఘోషను వినిపిస్తుంటే మేము చేష్టలుడిగి కన్నీటి పొరల మధ్య స్తబ్ధులమై కూర్చున్నాం. ”అభివృద్ధి” విశ్వరూప సాక్షాత్కారమైన సమయమది. రెండు ఫార్మా కంపెనీల లాభాల కోసం 320 కుటుంబా లను రోడ్ల పాలు, చేసిన ‘అభివృద్ధి’ భూతం ఎపిఐఐసి రూపంలో వికృతంగా సాక్షాత్కారిచింది.నలభై మంది ప్రాణాలను ఈ భూతం ఇప్పటికే మింగేసింది. మరెంతోమంది ప్రజల గుండెలు  ఉద్వేగంతో, ఉద్రేకంతో, ని్స్సహాయత్వంలో ఎప్పుడు ఆగిపోతాయోనన్నంత బలహీనంగా కొట్టుకుంటున్నాయి. మొన్నటిదాకా 2,5,8,10, ఎకరాలకు ఆసాములు. ఇప్పుడు రోజు కూలీలు. వాళ్ళు ఆరుగాలం కష్టించి పంటల్ని పండిచుకున్న పొలాల్లోనే కూలీలైనారు. ప్రత్యేక ఆర్ధిక మండలి వాళ్ళ భూముల్ని మింగేసింది. పచ్చటి ప్రాంతాన్ని తవ్వి పోగులు పోసింది. పబ్లిక్‌ హియరింగు సందర్భంగా వాళ్ళు రాసుకున్న కరపత్రం చడండి. వాళ్ళు తమ బాధను దాటి, రెప్పచాటున పొంగుతున్న ఉప్పెనను అదిమిపట్టి, ఈ ప్రత్యేక ఆర్ధిక మండలివల్ల భవిష్యత్‌లో జరగబోయే వినాశనం గురించి ఎంత వివరంగా  రాసారో చూడండి.

ప్రియమైనా ప్రజలారా!
మేము పోలేపల్లి, గుండ్లగడ్డతాండ, ముదిరెడ్డి పల్లి గ్రావలకు సంబంధించిన రైతులం. ప్రస్తుతం మేము ఫార్మాసెజ్‌ బాధితులం. 2003 సం.న గ్రీన్‌ పార్క్‌ పేరుతో 320 కుటుంబాలకు చెందిన వ వెయ్యి ఎకరాల భమిని ఎపిఐఐసి స్వాధీనం చేసుకుంది. వ పండ్ల తోటలను బోర్లను ధ్వంసం చేసి, పచ్చని గడ్డిని తగలబెట్టింది. మేము ప్రశ్నించినందుకు వపై కేసులు పెట్టి జైళ్ళలోకి నెట్టింది. భములు పోయిన తర్వాత మేమంత కూలీలుగా బతుకుతున్నాము. తైదలు, జొన్నలు, కందులు, సీతాఫలాలు, చింతకాయలు, వమిడి, జామలు పండించుకుంట, బర్లు, గొర్లు కాసుకుంట బతికే మమ్మల్ని బజారు కీడ్చింది ఎపిఐఐసి. గ్రీన్‌పార్క్‌ పేరుతో సేకరించిన భములను ప్రస్తుతం ఫార్మాసెజ్‌కు ఇచ్చింది. ఫార్మాసెజ్‌లో కీలకమైన అరబిందోఫార్మా, హైట్రోడ్రగ్సు కంపెనీలు బల్క్‌ డ్రగ్సు తయరు చేయటానికి నిర్మాణాలు చేస్తున్నారు. ఎపిఐఐసి ఫార్మాసెజ్‌ కోసం మౌళిక వసతులైన రోడ్లు, నీరు, కరెంటు ఇప్పటికే ఏర్పాటు చేసింది. కాని 5 సం.రాల నుంచి నిరంతరం పోరాటం చేస్త వకు న్యాం చేయండి అని నెత్తి నోర కొట్టుకున్నా ఈ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఎపిఐఐసి ఎవరు పట్టించుకోలేదు.  భములు కోల్పోయి గుండెపగిలి చనిపోయిన 42 మంది రైతులు వారి కుటుంబాలు రోడ్లపాలయి బతుకెళ్ళదీస్తున్న ఏ ప్రభుత్వం చలించలేదు. ఈ సమస్య భములు కోల్పోవడం వరకు పోలేపల్లి సమస్య అయితే ఫార్మాసెజ్‌ ఉత్పత్తులు ప్రారంభించిందంటే ఈ సమస్య పాలమూరు జిల్లా సమస్య అవుతుంది. అంతేకాక దుందుబి నది నుంచి ఈ ఫార్మాసెజ్‌ విష పదార్ధాలు డిండినదిలో కలుస్తాయి. డిండినది నుంచి కృష్ణా నదిలో కలిసి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు మొత్తం విషపూరితం అవుతుంది. జంట నగరాలకు వచ్చే కృష్ణ తాగునీరు, దక్షిణ కోస్తాకు వెళ్ళే కృష్ణ సాగునీరు విష పదార్థాలతో నిండిపోతుంది. మనం పోలేపల్లి ఫార్మాసెజ్‌ వెదజల్లె విష పదార్ధాలతో ఎలా బతకగలం, ఎలా వ్యవసాయం చేయగలం, ఎలా ధాన్యాలను ఉత్పత్తి చేయగలం, ఎలా జాతీయ సంపదను పెంచగలం, ఎలా భావితరాలను బతికించుకోగలం. నిన్నటి వరకు ఒక ఊరి సమస్య అయితే పోలేపల్లి పార్మాసెజ్‌ ఈ రోజు మన ఉమ్మడి సమస్య. మన ఉనికి సమస్య. మన బతుకు సమస్య. మన నాగరికత సమస్య, మొత్తంగా మన దేశభక్త సమస్య, దేశసార్వభౌవధికార సమస్య. కెవలం ఒకరిద్దరు ఫార్మా కార్పోరేట్‌ యజవనుల ఆదాయన్ని పెంచటానికి జరుగుతున్న  ఈ ఫార్మాసెజ్‌ కుట్రను భావ ప్రకటన ద్వారా బద్దలు కొడదాం. కాళ్ళ కింద భమిని కోల్పోవడమంటే సమస్తమం కోల్పోవడమే. కాబట్టి ఆగష్టు 7, 2008 ఉదయం 10గలకు పోలేపల్లి గ్రామంలో జరిగే పబ్లిక్‌ హియరింగులో మీరందరు వతో గొంతు కలపండి. పార్మాసెజ్‌కు వ్యతిరేకంగా ఎక్కడిక్కడ చర్చ పెట్టండి. సెజ్‌ దోపిడీని ఎండగట్టండి. మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధమవుదాం. పోలేపల్లి ఫార్మాసెజ్‌ వ్యతిరేక పోరాటాల్లో భాగమవుదాం, దేశభక్తిని చాటుకుందాం. సెజ్‌లను తరిమి కొడదాం, భారతదేశాన్ని కాపాడుకుందాం.
ఈ రోజు రాష్ట్రంలో ఏ మూల చూసినా సెజ్‌ మంటలే. ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ పేరుతో, పాలకుల ‘అభివృద్ధి’ జపం పచ్చని పంట పొలాలను బీళ్ళుగా పరుస్తోంది. ప్రజల జీవనాధారాలను లాక్కుని వాళ్ళను దిక్కులేని వాళ్ళుగా తయారు చేస్తోంది. దేశంలో పలు ప్రాంతాలు సెజ్‌ల సెగకి భగ భగ మండుతున్నాయి. అది పోలేపల్లి కావచ్చు. కాకినాడ కావొచ్చు. సత్యవేడు కావచ్చు. సింగరు కావొచ్చు. సూళ్ళూరు పేట కావొచ్చు. దేశవ్యాప్తంగా వేలాది గ్రామాల్లో, లక్షలాది కుటుంబాలను శాశ్వత నిర్వాసితులను చేయబోతున్నాయి ఈ ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు. దేశంలో మొత్తం 600 పైగా సెజ్‌లున్నాయి. మన రాష్ట్రంలో 91 సెజ్‌లు ఇప్పటికీ సత్యప్రాయంగా అనుమతి పొందాయి. ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు అనేవి దేశాన్ని అభివృద్ధి పధంలో నడుపుతాయని, లక్షలాది ఉద్యోగాలు  దొరుకుతాయని ప్రభుత్వం మొండిగా వాదిస్తున్నది. ఇది నిజం కాదు. ఈ సెజ్‌ల ఏర్పాటు వల్ల పచ్చటి పంట పొలాలు, అపార మత్య్ససంపద, సహజవనరులతో పాటు, గ్రామాలకు  గ్రామాలను కార్పోరేట్‌ సంస్థలు దోచుకుంటున్నాయి. ప్రజలు తమ పొలాల నుండి, తమ జలాల నుండి, తమ నివాసాల నుండి వెళ్ళగొట్టబడతారు. ముఖ్యంగా ఎస్‌.సి.ఎస్‌.టి. బి.సి మైనారిటీ ప్రజల భూముల్ని ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటోంది. కార్పోరేట్‌ రంగ ‘అభివృద్ధి’ని ప్రజల అభివృద్ధిగా బుకాయిస్తున్న ప్రభుత్వం భూములు, వనరులు, కొంపా గూడు కోల్పోయిన ఈ ప్రజల్ని ఏ ‘అభివృద్ధి’ బాట కడ్తుంది?
 పోలేపల్లి విషయనికొస్తే ఎస్‌.సి, ఎస్‌టి, బి.సి, మైనారిటీలకు చెందిన మొత్తం 1240 ఎకరాల భూమిని ప్రభుత్వం గుంజుకున్నది. వీటిలో కేవలం 150 ఎకరాలను అరవిందో, హైట్రో ఫార్మాలకిచ్చి మిగతా భూమిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చెయ్యలనుకుంటోదనేది స్పష్టం. రైతులకి 18 వేలిచ్చి ఫార్మా కంపెనీలకు కోట్లకు  అమ్మింది ప్రభుత్వం. సర్వం కోల్పోయి పోలేపల్లి ప్రజలు రోడ్ల మీద పడాల్సి వచ్చింది. 
కాకినాడలో ఓఎన్‌జిసితో పాటు ప్రయివేటు పెట్రోలియం కంపెనీల కోసం 12,500 ఎకరాలను కబళించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సామర్ల కోట, పిఠాపురం, యు. కొత్త పల్లి మండలాల్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ సెజ్‌ తీర ప్రాంతానికి వరింది. ఇవి చవిటి నేలలని ప్రభుత్వం చెబుతోంది కానీ అది నిజం కాదు. జీడి మామిడి, సరుగుడు, కొబ్బరి, సపోటా, మామిడి తోటలతో పాటు పంట భూమి కూడా వుంది. సరుగుడు నారు మళ్ళు ఇక్కడే ఎక్కువగా వున్నాయి. సరుగుడు  నారు రాష్ట్ర మొత్తానికి ఇక్కడి నుండే సరఫరా అవుతుంది అంతేకాదు ప్రకృతిలోని ఫలసాయం మీద ఆధారపడి బతికే  వెయ్యి కుటుంబాలకు పైగా గీత కార్మికులు, 1500 కుటుంబాల యాదవులు, మత్స్యకారులు ఈ ప్రాంతంలో వున్నారు. కాకినాడ సెజ్‌వల్ల వీరంతా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సెజ్‌ ఏర్పాటును వ్యతిరేకిస్త  అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. జైళ్ళ కెళుతున్నారు. అయినా సరే మొక్కవోని ధైర్యంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళు తున్నారు.
అలాగే చిత్తరుజిల్లా సత్యవేడులో, అనంతపురం, నెల్లూరుల్లో, ప్రకాశం జిల్లా ఓడ రేవు, గు౦టూరు జిల్లా నవాబు పట్నంలో కూడా శరవేగంతో సెజ్‌లు అమలవు తున్నాయి. కోస్తా తీరం వెంబడి ప్రజలు ‘కోస్టల్‌  కారిడార్‌’ భయం గుప్పిట్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దాదాపు 972 కిలోమీటర్ల అంటే కోస్తా  తీరంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదారులు కృష్ణా, గు౦టూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని 972 కి.లీ పొడవున ఈ కారిడార్‌కు కావలిసిన భూమి సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్త్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ఆహారభద్రతకు ముప్పు ఏర్పడబోతోంది. ప్రజారోగ్యం, పర్యావరణం మంటగలిసి పోతాయి. ఈ కారిడార్‌లో ఏర్పాటు కాబోతున్న పరిశ్రమలు వదిలిపెట్టే వ్యర్ధాలవల్ల ఆ ప్రాంతమంతా నరకంగా వరబోతోంది. సముద్ర జలాలు, భూగర్భ జలాలు కలుషితం కాబోతున్నాయి. అయినా సరే ప్రభుత్వం ముందు చూపు లేకుండా, ప్రజల ఆధీష్టానికి వ్యతిరేకంగా ప్రత్యేక ఆర్ధిక మండళ్ళు, కోస్టల్‌ కారిడార్‌ల ఏర్పాటుల కోసం సామ, దాన, భేద, దండోపాయ లన్నింటిని ఉపయెగిస్తోంది. వీటికి వ్యతి రేకంగా మాట్లాడుతున్న వాళ్ళని అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తోంది. తాము బ్రహ్మాండమైన అబివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తుంటే అడ్డుకుంటున్నారని దమననీతిని ప్రదర్శిస్తోంది.
 పోలేపల్లిలో ఏర్పాటవుతున్న ఫార్మా సెజ్‌వల్ల సమస్తం కోల్పోయిన ప్రజలు, ప్రభుత్వం చెబుతున్న ‘అభివృద్ధి నమూనా’కి ఎంత దూరంలో వున్నారో ఆగష్టు 7న జరిగిన పబ్లిక్‌ హియరింగ్లో మాట్లాడిన ప్రజల్ని చూసిన తర్వాత ఎవరైనా అర్ధం చేసుకుంటారు. ఈ అభివృద్ధి నమూనా వెనక వుండే వినాశనం, విచ్ఛిన్నం, ఆహార, ఆరోగ్యం, జీవనాధారాల అభద్రతల గురించి మనం అర్ధం చేసుకోవాలి. పేద ప్రజల జీవితాలను, జీవనాధారాలను కార్పోరేట్‌ శక్తులకు బలిచ్చి, వాళ్ళకు లాభాలు గడించి పెట్టే పనిని ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం తలకెత్తుకోవడం ఎంతో గర్వి౦చాల్సిన విష యం. సామాజిక కార్యకర్తలు, ప్రజాస్వామ్యం వాదులు, హక్కులసంఫలు ఈ విషయమై ఐక్య ఉద్యమం నడపాల్సిన అవసరం ప్రజలకు అండగా వుండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
సెజ్‌ల మీద ఏర్పాటైన కాన్సిరామ్‌ రాణా పార్లమెంటరీ కమిటీ రికమెండేషన్లు
1. రైతుల కష్టాలను వారి ఉద్యమాలను అర్ధం చేసుకోవాలి.
2. సెజ్‌ల అనుమతుల్లో అనవసర తొందరపాటు వల్ల కూడా సెజ్‌ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 3. సెజ్‌ల ఏర్పాటు అభివృధ్ధిని, ఎగుమతుల్ని సూచిస్తుంది. అయితే దీనిని ప్రజలెందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ప్రజల ఆవెదనతో తదుపరి చర్యలకు శ్రీకారం చుట్టాలి.
 4. ప్రజల ఉద్యమాలను, వారి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటూ, దాని కనుగుణంగా సెజ్‌ చట్టానికి మార్పులు, చేర్పులు చేసే దాకా వేరే సెజ్‌లను నోటిఫై చేయరాదు.
 5.  రైతుల నుండి తీసుకునే భూముల వల్ల రైతుల దిగుబడి, ఆదాయం తగ్గటమొక్కటే కాదు వారి సా్మాజిక, సాంస్కృతిక జీవితం ప్రభావితమౌతుంది. వ్యవసాయంతో సంబంధమున్న రైతుల, కూలీల జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని కమిటీ నమ్ముతోంది.
6. అలాగే రోడ్ల విస్తరణ ఇళ్ళ నిర్మాణాల వల్లను, టౌన్‌షిప్‌ల నిర్మానం వల్లను ఎంతో పంట పొలం నాశనమవుతోంది.
 7.  ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ ఏర్పాటు వల్ల, నగరీకరణవల్ల పంట భూములు పాడయిపోతున్నాయి. ఆహార భద్రత విషయంలో ప్రభుత్వం సీరియస్‌ చర్యలు తీసుకోవాలి.
 8.  ఆర్ధిక అభివృద్ధి కోసం వ్యవసాయ అభివృద్ధిని ఫణంగా పెట్టడం భావ్యం కాదు…
 9. వ్యవసాయ ొభూముల్ని ఎట్టి పరిస్థితుల్లోను వ్యవసాయేతర పనులకి కేటాయించకూడదు…
కాన్షిరామ్‌రాణా రిపోర్ట్‌ 47 రికమండేషన్స్‌ని ప్రభుత్వానికి సూచించింది. ఈ కమిటీ పోలేపల్లిని కూడా సందర్శించింది. సెజ్‌లు ఏర్పాటు చేసేటపుడు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తల గురించి చాలా చక్కటి రికమండేషన్స్‌ ఇచ్చింది. పూర్తి వివరాలు వచ్చే సంచికలో ప్రచురిస్తాం.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

3 Responses to సెజ్‌ సెగల్లో విలవిలలాడుతున్న పోలేపల్లి

  1. Rakesh says:

    అమ్మా..
    పోలేపల్లి గురించి వివరాలను ప్రచురించినందుకు ధన్యవాదాలు!!

  2. Pingback: సెజ్‌ సెగల్లో విలవిలలాడుతున్న పోలేపల్లి « Fighting Injustice in Polepally (Jadcherla) SEZ

  3. Anonymous says:

    చాలా బాగా రాసారు,
    పొలెపల్లి పొరాతానికి వివిధ రూపాలసహకారము అవసరము. దానికి అందరి సహకారము కావలె.
    వాగీశ

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.