నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి…

ఆంగ్లమూలం: ఎవరో! , అనుసృజనః సీతారాం

నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి. ఇవ్వాళ నా పుట్టినరోజేమీ కాదు
మరే ప్రత్యేకతా లేదు.
గతరాత్రి మేమిద్దరం తొలిసారి తగవులాడాం. నన్ను గాయపెట్టే
మాటలెన్నో అన్నాడతను
నాకు తెలుసు అలా అన్నందుకు క్షమాపణలు చెపుతాడని
ఎందుకంటే అతనీ రోజు పూలను కానుక చేశాడు.
నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి. ఇవ్వాళ మా పెళ్ళిరోజేమీ
కాదు. మరే ప్రత్యేకతా లేదు.
గత రాత్రి నన్ను గోడకేసి కొట్టాడు నాకు ఊపిరాడకుండా
చేశాడు అదొక పీడకలని, నిజం కాదని అనుకుంటాను
ఈ ఉదయం గాయాలతో, దెబ్బలతో నేను నిద్ర లేచాను
నాకు తెలుసు అతను పశ్చాత్తాపపడి వుంటాడని
బహుశా, అందుకే అతనీరోజు నాకు పూలను కానుకగా
పంపాడు.
నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి. ఇవ్వాళ మదర్స్ డే
కాదు మరే ప్రత్యేకతా లేదు
గతరాత్రి మళ్ళీ అతను నన్ను కొట్టాడు
మునుపటికంటే దుర్భరంగా,
అతన్ని వొదిలివేసి నేనేం చేయగలను? పిల్లల్ని
నేనెలా పోషించుకోగలను? డబ్బు ఎక్కడినుంచి
తేగలను అతనికి భయపడ్డా వదిలిపెట్టలేకపోయాను
కానీ, నాకు తెలుసు అతను క్షమాపణలు చెప్పి ఉంటాడు
కాబట్టే ఈ రోజతను పూలను కానుక చేశాడు.
నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి ఇవ్వాళ మరీ
ప్రత్యేకమైన రోజు
ఇవ్వాళ నా అంత్యక్రియలు
గతరాత్రి ఆఖరిసారి నన్ను చంపేశాడు
చచ్చేదాకా కొట్టాడు
అతన్ని వొదిలేయగల ధైర్యాన్ని నేను ముందే చేసి
ఉంటే….?
ఇవ్వాళ నాకు పూలు కానుకగా వచ్చేవే కావు.

(Promilla Kapur సంపాదకత్వంలో వెలువడిన Empowering the Indian Woman, అనే పుస్తకంలో పేరు లేకుండా రాసిన ‘I got Flowers Today’ అన్న అనుభవశకలానికి నా అనువాదం ఇది. ప్రతిరోజూ, ప్రతిరాత్రీ ఎవరో ఒకరు తగవుపడుతూనే వుంటారు. ప్రతి ఉదయం ప్రత్యేకమైన రోజున పూలను కానుకగా ఎవరో ఒకరు అందుకుంటూనే ఉన్నారు. ఈ గృహ హింసను ఆపుదాం. ఒకవేళ ఆ స్త్రీ తన భర్తతో కండోమ్ గురించే తగవుపడి వుంటే-?)

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

One Response to నాకీరోజు పూలు కానుకగా వచ్చాయి…

  1. radhika says:

    చాలా బాగా అనువాద0 చేసారు.మీ శైలి బాగుంది.

Leave a Reply to radhika Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.