కాళ్ళను కళ్ళలో పెట్టి చూసుకోవాల్సిందే

కొండేపూడి నిర్మల
నిజాం ఆస్పత్రిలో ఒ.పి కార్డు కోసం క్యూలో నుంచున్నాను. అందరికంటే ముందు నుంచున్న అదృష్టవంతుడు బిల్లు చెల్లించి అభిమన్యుడిలా దుసుకెళ్ళాడు. స్ట్రెచర్‌ మీద రెండు కళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నాయి.
గాయల వార్డు లిఫ్ట్‌ ముందు గుంపులో నుంచున్నాను. అందరికంటే ముందు కాళ్ళు అతికిన అదృష్టవంతురాలు కాఫీ ఫ్లాస్కుతో ఎదురొచ్చింది. స్ట్రెచర్‌ మీదున్న చేతులు రెండు జారుతున్న సుట్ఖెసుల్ని పట్టుకుని వున్నాయి.
బెడ్‌ నంబరు పదకొండు పక్కన బి.పి, చూస్తూ నుంచున్నాను. అందర్ని దాటుకుంటూ నన్ను అదృష్టవంతురాల్ని చెయ్యడానికి వచ్చిన కుర్ర డాక్టరు చాంతాడంత మందుల చీటి చేతికిచ్చి తరిమి కొట్టింది. యభై తొమ్మిది కిలోల బాధని ఒడిసి పట్టడానికి వేలాడుతున్న ఇనపరాయి మీంచి చూపు తిప్పి క్యూలో కలవడానికి పరిగెత్తాను.
గది నుంచి దుకాణానికి మధ్య వున్న నాలుగంతస్తుల దూరాన్ని పడూతూ లే్స్తూ కొలుస్తూ వుంటే అందరికంటే ముందు తొందరపడి మెట్లు దిగిన దురదృష్టవంతు రాలు ఏదో మర్చిపోయి వెనక్కి వస్తోంది.
అంత దురాన క్యాంటీన్‌ పక్కన చెట్టూ కింద ఆరోగ్య శ్రీ అభాగ్యులు కదులుతున్న క్యూల వంక అసూయగా చూస్తున్నారు. మంత్రిగారి వాగ్దానం విని భూతవైద్యాన్ని వదులు కున్నందుకు ముసలవ్వలు సంతానాన్ని చివాట్లు పెడుతున్నారు.పెద్దల మాట చద్ది మూట కదా. వారం రోజులుగా వాళ్ళు చద్ది లేక శుష్కించిపోతున్నారు.
నిరుద్యోగుల సంఖ్య నింగికి ఎగురు తున్నా ఆస్పత్రిలో సిబ్బంది లేరు. అందరికంటే ఆఖర్న వచ్చి కూడా అదృష్టవంతుడై పోయిన రాజకీయ గండా ఒకడు గానా బజానాతో నాలుగు కార్లతో వచ్చి మిలీనియం గదుల్ని ఆక్రమించాడు. ఆస్పత్రి అంతటా ఖాకీల రక్షణ కోసం తుపాకీ గుండ్లు క్యూలో వున్నాయి.
బతుకులు క్యూలో వున్నాయి. చావులు క్యూలో వున్నాయి. ప్రశ్నించే ఆగ్రహాన్ని, నిస్సహాయమైన కడుపుమంటల్ని తొక్కి పెట్టి చిన్న సది కోసం, గుళిక కోసం ఎదురు చూపులు. క్యూలు వున్నాయి. క్యూలు చెదిరిపోకుండా శాంతి భద్రతలు క్యూలో వున్నాయి. క్యూ లు పూర్తవకుండా కౌంటర్లు మూసుకుంటున్నాయి. వైద్యుడి కొలువులోనే కొనవూపిరి ఆగిపోతోంది.
కాశీ యత్ర చేసి వచ్చిన కూలి చీమలాగా కాళ్ళు నిమురుకుంట క్యూలో పడ్డ కష్టాలు అతనితో చెబుతున్నాను.
”అదృష్టవంతురాలివి. క్యూలో నిలబడ్డానికి నీకు కాళ్ళయినా వున్నాయి. మరి నా సంగతేమిటి?” అన్నాడు. గుండె నీరయి నట్టనిపించింది. పెద్ద గీత ముందు చిన్న గీత వెలా వెలా పోయింది. కాలు విరిగి మంచాన వున్న వాడికి కదులుతున్న క్యూలు చైతన్య రధాల్లానే కనిపిస్తాయి కదా.
”చూడు చిట్టి తండ్రీ, నుంచున్న వాళ్ళు మాత్రమే క్యూలో వున్నట్టు కాదు. ఒ.పి వార్డు ముందు బల్లల మీద కూలబడ్డ క్యూ వుంది. గుండె కోతలు పూర్తయి మగత లోంచి మెలకువలోకి రావడానికి రెప రెపలాడే కంటిరెప్పలు క్యూ వుంది” అని చెప్పాను.
తను నవ్వాడు.
అప్పటిదాకా ముఖాల్లో వున్న ఆందోళన,భయన్నీ, ఒంటరితనాన్ని, వైరాగ్యాన్ని దాటుకుంట, క్యూ చివర వున్న చిర్నవ్వు వెలిగింది. ఫర్లేదు. నాకు చాతనైన చికిత్స నేన మొదలు పెట్టాను అనిపించింది.
”అమ్మ నేను వచ్చెయ్యనా? కంగారేం లేదు కదా? డబ్బులు పంపనా?” పరదేశీ లాంటి కొడుకు గొంతు చెవిలో గింగురు మంటోంది. కంగారు వుంటేే మటుకు వున్నది వున్నట్టు నేను వాడికి చెప్పగలనా? ఏ పరిచయం లేకుండా అక్కడున్న ఆ నీలం చీర పిల్లతో పంచుకున్నంత బాధ కూడా కన్న కొడుకుతో నేను వినిపించలేను. బహుశా వాడ అంతేకావచ్చు. కన్నవాళ్ళకీ పిల్లలకీ మధ్య ఎంతో ప్రేమగా దించుకున్న డాలరు తెర ఒక సామూహిక ఒంటరి దు:ఖం. మనిషి నిప్పును కనిపెట్టడానికి చేసిన ప్రయత్నం నేలమీద నిలబడ్డానికి కూడా చెయ్యలేవె.
కారిడార్‌ పొడుగునా తడబడుతూ, తడబడుతూ కొత్త నడకల

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

2 Responses to కాళ్ళను కళ్ళలో పెట్టి చూసుకోవాల్సిందే

  1. Anonymous says:

    చాలా బాగుంది

  2. anaamakudu says:

    అమ్మా నాన్నలు డబ్బులు ఇచ్చినప్పుడు లెక్కలు చెప్పరు.
    కాలేజి రోజులలో పైసా పైసా కి లెక్క అడిగేవారు.
    అ డబ్బు ఎలాపోయి0దో ఎవరికి తెలియదు.
    వాళ్ళు చేసే రాజకీయాలు మీకు తెలియదు
    పిల్లలని డబ్బు సంపాది0చే యంత్రంగా చూస్తారు
    కట్నం కోసం వున్న భార్యకొ, భర్తకొ విడాకులు యిమ్మని చెప్పె పెద్దలూ వున్నారు.
    రండువైపులా వెధవలు వున్నారు

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.