హింసలేని సమాజంవైపు సామూహిక ప్రయాణం కౌన్సిలింగ్‌ స్కిల్స్‌ మరియు చట్టాలపై రెండు రోజుల శిక్షణ -భూమిక టీం

 

భూమిక హెల్ప్‌లైన్‌ కౌన్సిలర్లు, వివిధ మహిళా పోలీస్‌ స్టేషన్‌లలోని సపోర్ట్‌ సెంటర్‌లలో పని చేస్తున్న కౌన్సిలర్లకు, కరీంనగర్‌లోని సఖి సెంటర్‌లో పనిచేస్తున్న కౌన్సిలర్లకు డిసెంబర్‌ 21, 22 తేదీల్లో కౌన్సిలింగ్‌ నైపుణ్యాలు, మహిళా చట్టాలపై శిక్షణా కార్యక్రమం జరిగింది. వరంగల్‌లోని సర్వోదయ యూత్‌ ఆర్గనైజేషన్‌ నుండి వచ్చిన ఇద్దరు కౌన్సిలర్లతో పాటు భూమికలో పని చేస్తున్న 22 మంది కౌన్సిలర్స్‌ ఈ శిక్షణలో పాల్గొన్నారు. మొదటి రోజు శిక్షణా కార్యక్రమం ఉత్సాహవంతంగా మొదలైంది. ఆటలా జరిగిన పరిచయ కార్యక్రమంలో సిబ్బందంతా జంటలుగా విడిపోయి వారి పేరు, చదువు, ఉద్యోగ అనుభవం, ఇష్టాఇష్టాలను పంచుకుని ఒకరి పరిచయాన్ని మరొకరు వివరించారు. ఇలా చేస్తున్నపుడు వారంతా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడంలో మునిగిపోయారు. అదే

ఉత్సాహంతో ఒకరి పరిచయాన్ని ఒకరు చేస్తూ అవతలి వ్యక్తి గమనించిన, తెలుసుకున్న విషయాల గురించి చాలా ఆసక్తిగా వివరిస్తూ ఈ శిక్షణ నుండి ఆశిస్తున్న అంశాలను మాత్రం ఎవరికి వారే తెలియపర్చారు. వేరువేరు అనుభవాలు, విద్యార్హత కలిగిన వీరంతా ఆశిస్తున్న అంశాలను మొత్తంగా నాలుగు క్యాటగిరీలలో చేర్చడం జరిగింది. అవి:

1. మహిళలు, పిల్లల అంశాల గురించి మరింత లోతుగా పని చేయగలగడం

2. గృహ సందర్శనకు వెళ్ళినపుడు, కమ్యూనిటీలతో కలిసి పనిచేసేటపుడు మరింత మెరుగ్గా సమస్యను అర్థం చేయించడం, అందుకు తగిన నైపుణ్యాలు

3. కౌన్సిలింగ్‌ చేసిన తర్వాత బాధితుల సమస్యల నుండి కౌన్సిలర్‌ ఏ విధంగా బయటపడటం, బాధితుల బాధలను ఇంటివరకు తీసుకెళ్ళకుండా ఉండగలగడం

4. కౌన్సిలింగ్‌ సెంటర్‌కు సహాయం కోసం వచ్చిన ప్రతి మహిళకు న్యాయం చేయడానికి కావల్సిన నైపుణ్యాలు

పార్టిసిపెంట్స్‌ వెలిబుచ్చిన శిక్షణావసరాల గురించి ప్రశాంతి మాట్లాడుతూ భూమికలో పనిచేస్తున్నపుడు కౌన్సిలర్ల నుండి సంస్థ ఏం ఆశిస్తుంది? మహిళల పట్ల భూమిక దృక్పధం ఏమిటి, భూమిక సంస్థ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, తద్వారా భూమిక సంస్థ సిద్ధాంతం, పనిచేసే విధానం, పనిచేసే క్రమంలో రాజీపడకూడని అంశాల గురించి తెలుసుకోవడం అవసరమని అందుకు ఈ రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ఉపయోగ పడుతుందని అన్నారు. ఈ అంశాల గురించి భూమిక ఛీఫ్‌ ఫంక్షనరీ సత్యవతిని వివరించమని కోరారు.

భూమిక ఆవిర్భావం గురించి డైరెక్టర్‌ సత్యవతి మాట్లాడుతూ భూమికకి రెండు దశాబ్దాల చరిత్ర ఉందని, స్త్రీల ఉద్యమంలో భూమిక పుట్టిందని, స్త్రీల ఉద్యమాలలో చర్చించిన, పురుడు పోసుకున్న ఆలోచనలకు రూపం ఇస్తూ భూమిక రూపొందిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రెండు దశాబ్దాల క్రింత నెలకొన్న సామాజిక అంశాలను ప్రశ్నిస్తూ స్త్రీల ఉద్యమం సాగింది. ఈ ఉద్యమం సాగుతున్న నేపధ్యంలోనే 1975సంవత్సరం అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా డిక్లేర్‌ అయింది. 1975-85 కాలాన్ని స్త్రీ దశాబ్దంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దేవకిజైన్‌ ఆధ్వర్యంలో భారతదేశంలో స్త్రీల ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు ఏవిధంగా

ఉన్నాయని అధ్యయనం చేసారు. అదే సమయంలో స్త్రీలపై జరిగే అన్ని రకాల వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడుతాం అని 149 దేశాలు సీడా ఒప్పందం మీద సంతకాలు చేసాయి. ఇదే సమయంలో స్త్రీ శక్తి సంఘటన మొట్ట మొదటి స్త్రీల చరిత్రగా తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర గురించి ‘మనకు తెలియని మన చరిత్ర’ పుస్తకాన్ని తీసుకరావడం జరిగింది. ఆ తరువాత ఆస్మిత, అన్వేషి అనే రెండు సంస్థలు ఏర్పడ్డాయి. అస్మిత రిసోర్స్‌ సెంటర్‌గాను, అన్వేషి రిసెర్చ్‌ సెంటర్‌గాను ఏర్పడ్డాయి. క్రమంగా సత్యవతి అన్వేషిలో మెంబర్‌ అవడం వివిధ స్త్రీల సమస్యలపై అవగాహన పెంచుకోవడం జరిగిందని చెప్పారు.

1980లలో హైద్రాబాద్‌లో ఏర్పడిన ‘డౌరీడెత్‌’ కమిటీ కార్యక్రమాల్లో పాల్గొంటూ స్త్రీల అంశాల మీద ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో జరిగే వుమెన్స్‌ కాన్ఫరెన్స్‌ మరియు వుమెన్స్‌ స్టడీస్‌ కాన్ఫరెన్సలలో చురుగ్గా పాల్గొంటూ తన పరిధిని విస్తరించుకున్నానని చెప్పారు. 1989లో తెలుగులో మొట్ట మొదటి స్త్రీవాద కరపత్రిక లోహితను జయప్రభతో కలిసి నడిపానని ఆ అనుభవం 1993లో ప్రారంభించిన భూమిక పత్రికకు సంపాదకత్వం వహించడానికి అవకాశం వచ్చిందని తెలిపారు. అన్వేషి అండదండలతో 1993లో తెలుగులో సమగ్ర స్త్రీ వాద పత్రిక భూమిక వెలువడిందని ఆ సమయంలో విస్తృతంగా రాస్తున్న స్త్రీవాద రచయిత్రులకు, కవయిత్రులకు భూమిక వేదికగా నిలిచిందని తెలిపారు.

80దశకంలో తెలుగు సాహిత్యంలో పెద్ద ఎత్తున స్త్రీలు ఎన్నో నూతన అంశాలను, అప్పటి వరకు సాహిత్యంలో కనబడని అంశాలను తీసుకుని విరివిగా కవిత్వం రాశారు. నీలిమేఘాలు, గురి చూసి పాడే పాట లాంటి, స్త్రీల కవిత్వ సంకలనాలు అప్పుడే వెలువడ్డాయి. 90వ దశకం వచ్చేనాటికి తెలుగు సాహిత్యంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచీకరణ నేపధ్యం నూతన ఆర్థిక విధానాల ప్రభావం తెలుగు సమాజాన్ని బలంగా తాకడం వల్ల రచయితలు, రచయిత్రులు ఈ మార్పుల్ని సాహిత్యంలో చాలా ప్రతిభావంతంగా కథ, కవిత్వ రూపంలో రాయగలిగారు.

హైకోర్టులో అడ్వకేటుగా ప్రాక్టీస్‌ చేస్తున్న సంగీతా శర్మ ఆత్మహత్య భూమిక హెల్ప్‌లైన్‌ ఆవిర్భావానికి పరోక్షంగా కారణమైన విషయాలను వివరిస్తూ, పనిచేసే చోట లైంగిక వేధింపులు. గృహహింస అంశాల మీద లోతుగా పనిచేయాల్సిన అవసరం, అలాగే సామాన్య స్త్రీలకు సమాచారం అందుబాటులో ఉంచాలనే ఉద్ధేశ్యంతో హెల్ప్‌లైన్‌ గురించిన ఆలోచన చేసారని చెప్పారు. ఆ తరువాత ఆక్స్‌పామ్‌ ఇండియా ఆర్థిక తోడ్పాటుతో భూమిక హెల్ప్‌ లైన్‌ 2006 మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినం నాడు ప్రారంభమవ్వడం, మొదలైన సమాచారం మొత్తాన్ని వివరించారు. హెల్ప్‌లైన్‌ ప్రారంభమైన తరువాత వచ్చిన పత్రిస్పందన ఆధారంగా ప్రభుత్వంలోని వివిధ విభాగాలతో ముఖ్యంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, లీగల్‌ సర్వీస్‌ అథారిటీలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టానని వివరించారు. ఇద్దరితో మొదలైన భూమిక ఈ రోజు దాదాపు 50మంది సిబ్బందితో స్త్రీలు, పిల్లల అంశాల మీద నిబద్దతతో పనిచేస్తూ జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును పొందిందని చెబుతూ శిక్షణలో ఉన్న కౌన్సిలర్లను ఉద్దేశించి మనమందరం పనిచేయాల్సింది బాధిత మహిళ సంక్షేమం గురించి మాత్రమే. హెల్ప్‌లైన్‌ నడిపినా, పోలీస్‌ స్టేషన్‌లలో సపోర్ట్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేసినా, మహిళా కారాగారంలో పనిచేసినా మన ఫోకస్‌ సమస్యల్లో ఉన్న స్త్రీలు, పిల్లలు మాత్రమే. ఎంతో నిబద్థతతో నిజాయితీతో పనిచేయాలని భూమిక ఎప్పుడూ బాధితుల పక్షాన్నే నిలబడుతుంది అనే పేరుని నిలబెట్టుకోవాలని అందరూ సమైక్యంగా పనిచేయాలని కోరుతూ తమ ప్రసంగాన్ని ముగించారు.

సామాజిక కార్యకర్త దేవి మాట్లాడుతూ హింస అని దేనిని అంటారు? హింస ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని చర్చించారు. హింస రూపాలను కూడా తెలియజేశారు. హింస అంటే జాతి, మత, కుల, రంగు, లింగ వివక్షత, ధనిక, పేద, పెద్ద, చిన్న వీటన్నింటిలో ఉంటుంది. ఎవరైతే హాయిగా జీవించలేకపోతున్నారో వారంతా హింస అనుభవిస్తున్నట్టే. హింస… ఆర్థిక, రాజకీయ, సామాజిక, రాజ్య హింస రూపాల్లో ఉంటుంది. ఉమ్మడి కుటుంబాల్లో హింస ఉండదు అని అనుకుంటారు అది నిజం కాదు. కుటుంబం, పెళ్లి, జంట కట్టడం గురించిన చరిత్ర, ఇప్పటి పెళ్లి, జంట పెళ్ళిళ్ళ తేడాల గురించి చెప్పారు. జంటకట్టడంలో భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ

ఉంటుంది. తల్లికి పిల్లల మీద హక్కు ఉంటుంది. ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమీ ఉండవు. సామాజిక ఒప్పందం ఉంటుంది. సామాజిక భద్రత ఉంటుంది. ఏ వివాహం అయినా ఆనాటి సమాజంలోని ఆర్థిక పరిస్థితికి లోబడి ఉంటుంది. మానవ విలువలు ఛిద్రమవడం వలన ఆర్థిక సంబంధాలు కమొడిటిగా మారి సెల్ఫ్‌ సెంటర్డ్‌గా తయారు కావడం అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితి. ప్రపంచంలో శ్రమ విభజన మొట్ట మొదట స్త్రీ, పురుషుల మధ్య జరిగింది. జంట కట్టడమనేది ఇప్పటి పెళ్ళిగా, దాంపత్యంగా మారిన తరువాత ఈ విభజన జరిగింది. దాంపత్యం వచ్చాక వ్యభిచారం, అక్రమ సంబంధాలు ఉనికిలోకి వచ్చాయి. అప్పుడే ప్రాతివత్యం మొదలైంది. బైలాజికల్‌గా స్త్రీ బలహీనురాలు అన్నది అవాస్తవం. స్త్రీ తన సంతానానికి సహజమైన వాస్తవం, తండ్రి నమ్మకం మాత్రమే.

నా ఆస్తి నా పిల్లలకు రావాలి, కాబట్టి నా పిల్లలు అనే గ్యారెంటీి ఉండాలి అన్న మగవారి భావన నుండి ఆడవాళ్ళను కట్టడి చేయడం, ఆంక్షలు విధించడం జరిగింది. పురాణాలు, ఆచారాలు, సాంప్రదాయాలు అనే ఆలోచనల్లోంచి సమర్థించడానికి వీటిని తయారుచేసారు. పాతివ్రత్యం, శీలం ఇవన్నీ మధ్యతరగతి వర్గం ఏర్పాటుచేసుకున్నవి. ఒకప్పుడు గిరిజన స్త్రీలకు, శ్రామిక కులాలకు ఇవన్నీ ఉండేవి కావు. క్రమంగా ఇవి వారి వరకు చేరాయి. స్త్రీల బానిసత్వంతో మొదలైన మానవ బానిసత్వం స్త్రీల విముక్తితోనే అంతమవుతుందని, కుటుంబ వ్యవస్థ యొక్క పునాది ఆర్థిక పునాది, వంశవృక్షం కొనసాగించడం, చరిత్ర రాసుకోవడం ఇదంతా కులీనుల వ్యవహారం అన్నారు. కౌన్సిలింగ్‌లో ముఖ్యంగా ఆర్థిక సంబంధాలు, లైంగిక సంబంధాలు దాచిపెడతారు. ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోవడం వలన సమస్యకు మూలం ఏమిటి అని తెలుస్తుంది. ఆర్థిక పరిస్థితిని బట్టి సమస్యలు వస్తాయి. వాటి రూపాలు మారుతాయి. అవి డైరెక్టుగా ఆర్థిక రూపంలో రావు, వివిధ రకాల గొడవలతో వస్తాయి. అధికార ప్రదర్శనలు దెబ్బతిన్నపుడు ఇగొ ప్లే చేస్తుంది. అధికార దర్పం ఆమోదించనపుడు వారు ఆశించింది జరగనపుడు గొడవలు మొదలవుతాయి. ఆధిపత్యం, ఆర్థిక డిమాండ్‌ కింద మొదలవ్వచ్చు. ఆర్థిక డిమాండ్‌ను డైరెక్టుగా అడగనపుడు అధిపత్యం అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది. వాళ్ళు మనకు చెప్పే దానిలో నుండి కాకుండా చెప్పే విధానంలో నుండి కూడా నిజాన్ని గ్రహించాలి. అందరితో మాట్లాడి ఒక అభిప్రాయానికి రావాలి. కొన్ని మెళకువలు చెప్పాలి. ఎలా చేస్తే ఏమవుతుందో పరిణామాలు చెప్పాలి. రాజీ ఎక్కడ పడాలి. ఎక్కడ పడకూడదు చెప్పాలి. కుటుంబ బాధ్యతలు, విలువలు ఏంటి అని తెలుసు కానీ వాటికి అనుగుణంగా ఆమెకు ఓదార్పుగా సహాయంగా ఉండేటట్లు చేయాలి. లైంగిక పరమైన సమస్యలు ఎలా వస్తాయి. ఆ విషయాల్లో ఎలా ఉండాలో కూడా మాట్లాడాలి. ఆర్థిక నిర్మాణం, నమ్మకం, పవర్‌ రిలేషన్స్‌ ప్రయోజనాలకు సంబంధించి కాన్పిక్ట్‌, కుటుంబంలోని ప్రతి సంఘటనను ఎలా అర్థం చేసుకుంటారు, తరాల మధ్య ఉత్పన్నమైన సమస్యలు ఎలా

ఉంటాయి, సర్దుకుపోవడం, కొత్తగా పెళ్ళైన వారు కుటుంబంలో అడ్జస్ట్‌ కాకపోవడం, ఎమోషనల్‌ నీడ్స్‌… వీటన్నింటి గురించి చర్చించారు.

వీటన్నిటినీ కౌన్సిలింగ్‌లో మనం అర్థం చేసుకోవాలి. వివాహేతర సంబంధాలలో మనం ఎలాంటి సూచనలు ఇవ్వాలి. అక్రమ సంబంధాలు, అక్రమ సంతానం అనే పదాలు వాడకూడదు, ఇవి కేవలం లీగాలిటీకి సంబంధించినవి మాత్రమే. పురుషస్వామ్యం ఆర్థికమైన విషయాలను నైతిక విషయాలుగా మారుస్తుంది. అందువల్ల పిల్లల విషయంలో చాలా సున్నితంగా ఉండాలి. పిల్లల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారికి అనుగుణంగా కౌన్సిలింగ్‌ ఉండేలాగా చేయాలి. కౌన్సిలింగ్‌ చివర్లో మనం చేయవల్సినది అంతా పూర్తి చేసామా? ఇంకా ఏమైనా మిగిలిపోయిందా అని సమీక్షించుకోవాలి అని కూడా వివరించారు.

2వ రోజు

రెండవ రోజు ప్రోగ్రాం మొదటి రోజు జరిగిన చర్చల రివ్యూతో మొదలైంది. తరువాత కౌన్సిలర్స్‌ అందరూ 4గ్రూపులుగా ఏర్పడి నాలుగు కేసులను తీసుకుని కౌన్సిలింగ్‌పై రోల్‌ ప్లేలు చేయడం జరిగింది. తరువాత ఈ రోల్‌ ప్లేల నుంచి అందరూ గమనించిన అంశాల గురించి, కౌన్సిలింగ్‌ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించడం జరిగింది.

గమనించిన విషయాలు:

్జ బాధిత స్త్రీతో మరియు ప్రతివాదితో మొదట వేరువేరుగా/ వ్యక్తిగతంగా మాట్లాడాలి

్జ ప్రతివాదితో మాట్లాడుతున్నపుడు కౌన్సిలింగ్‌ చేస్తున్నప్పుడు బాధిత స్త్రీని బయట కూర్చోబెట్టి మాట్లాడకూడదు

్జ బాధిత స్త్రీకి మరియు ప్రతివాదికి వేరువేరుగా, వేరే రోజుల్లో మరియు వేరే సమయాల్లో కౌన్సిలింగ్‌ ఇవ్వాలి. ఒకరు ఉన్నపుడు మరొకరితో మాట్లాడకూడదు

్జ కౌన్సిలర్‌ ప్రథమంగా బాధిత స్త్రీని బలోపేతం చేయాలి

్జ కౌన్సిలింగ్‌ ప్రక్రియ సూచనలు ఇస్తున్నట్లుగా ఉండకూడదు

్జ బాధిత మహిళకి స్త్రీల సహాయార్థం ఉన్న సపోర్టు సిస్టమ్స్‌ గురించి వివరించాలి

్జ బాధిత మహిళ సమస్యను కౌన్సిలర్‌ సమస్యగా తీసుకోకూడదు / భావించకూడదు

్జ కౌన్సిలింగ్‌ చేసేటప్పుడు కౌన్సిలర్‌ తన భాషని సరిచూసుకోవాలి. వారిద్దరి మధ్య దూరం పెరిగే విధంగా మాట్లాడకూడదు

్జ కౌన్సిలర్‌ బాధిత స్త్రీతోగాని లేదా ప్రతివాదితోగాని వ్యక్తిగత పరిచయాన్ని పెట్టుకోకూడదు

్జ కౌన్సిలర్‌ బాధిత స్త్రీకి మార్గనిర్దేశం చేయాలి కాని బాధిత స్త్రీ తరఫున నిర్ణయాలు తీసుకోకూడదు

్జ జడ్జిమెంటల్‌గా ఉండకూడదు

్జ కౌన్సిలింగ్‌ చేసేటప్పుడు కౌన్సిలర్‌ నోట్‌బుక్‌ ముందు పెట్టుకుని రాస్తూ ఉండకూడదు

్జ కౌన్సిలింగ్‌ చేసేటపుడు కౌన్సిలర్‌ మరియు బాధిత స్త్రీ, ప్రతివాది ఎదురూబొదురూ కూర్చోవాలి

్జ బాధిత స్త్రీ వివరాలు లేదా కౌన్సిలింగ్‌లో చెప్పిన విషయాలు ప్రతివాదికిగానీ ఇతర కుటుంబ సభ్యులతోగానీ లేదా బయటవారితో గాని చెప్పకూడదు

్జ బాధిత స్త్రీ గాయాలతో వస్తే వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి

్జ అసాధ్యమైన ఆశలు కల్పించకూడదు

్జ బాధిత స్త్రీకి కౌన్సిలింగ్‌ జరిగేటపుడు కొన్ని విషయాలను పరోక్షంగా తెలియ చేస్తుంటారు. దానిని కౌన్సిలర్‌ గమనించి తగిన సహాయం అందించాలి

దీనిపై చర్చను కొనసాగిస్తూ, కౌన్సిలర్స్‌ అందరిని 4 గ్రూపులుగా చేసి కౌన్సిలింగ్‌లో పాటించాల్సినవి, పాటించకూడనివి మరియు చేయాల్సినివి, చేయకూడనివి చర్చించుకుని ప్రజెంట్‌ చేయమన్నారు.

ప్రజెంటేషన్‌లో వచ్చినవి పాటించాల్సినవి

్జ గోప్యత

్జ వినడం- సరిగ్గా పూర్తిగా వినాలి ఓపికతో వినాలి

్జ మధ్య మధ్యలో ప్రశ్నలు అడగడం

్జ ఐ కాన్టాక్ట్‌

్జ భాష అర్థమయ్యేటట్టు ఉండాలి

్జ మీరు అని సంబోదించాలి

్జ కేసును బట్టి సమయం కేటాయించాలి, సమయ పాలన ముఖ్యం

్జ సహానుభూతి ఉండాలి

్జ కంప్లైంట్‌ రాసేటపుడు సమాచారమంతా వచ్చేటట్లు చూడాలి

్జ ఆలోచన చేసేవిధంగా మార్గదర్శన చేయాలి

్జ ధైర్య పర్చాలి / బలోపేతం చేయాలి

్జ బాధిత స్త్రీ తన కెపాసిటీస్‌ని గుర్తించుకునేలా చేయాలి

్జ అవసరమైన రెఫరల్‌ సర్వీస్‌, సమాచారం ఇవ్వాలి

్జ సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలి

్జ నమ్మకాన్ని, భరోసాని ఇవ్వాలి

్జ సమస్య నుండి బయటకు రావడానికి ఉన్న మార్గాలను విశ్లేషించడానికి కావాల్సిన అవగాహన ఇవ్వాలి

్జ కుటుంబపరమైన, చట్టపరమైన, సామాజికపరమైన భవిష్యత్‌ గురించి అవగాహన ఇచ్చి నిర్ణయం తీసుకునేలా చేయాలి

్జ కౌన్సిలర్‌ ఎప్పటికప్పుడు సమాచారాన్ని, జ్ఞానాన్ని పెంచుకోవాలి

్జ కేస్‌ను బట్టి అవసరమైన వివరాలు మళ్ళీ మళ్ళీ తెల్సుకోవాలి

్జ కూర్చునే విధానం సౌకర్యవంతంగా ఉండాలి

్జ అసభ్య పదజాలం వాడరాదు, వాడనివ్వరాదు

్జ కేసుకు సంబంధంలేని విషయాలు మాట్లాడరాదు

్జ పరిష్కారాలు సూచించాలి

్జ సమస్య యొక్క రూట్‌ కాజ్‌ను గుర్తింప చేయాలి

్జ నాన్‌ జడ్జ్‌మెంటల్‌గా ఉండాలి

పాటించకూడనివి / చేయకూడనివి

్జ విసుక్కోకూడదు / సహనం పాటించాలి

్జ నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు

్జ కోప్పడకూడదు

్జ కౌన్సిలర్‌ అభిప్రాయాలు వారిపై రుద్దరాదు

్జ ప్రతివాదిని నేరస్తుడిగా చూడరాదు

్జ కౌన్సిలింగ్‌ జరిగేటపుడు ఫోన్లో రికార్డు చేయనివ్వకూడదు

్జ కౌన్సిలర్‌ బాధిత స్త్రీ తరఫున నిర్ణయాలు తీసుకొనకూడదు

్జ సానుభూతి చూపకూడదు

్జ అన్నీ చేసెయ్యాలని, న్యాయం చేసెయ్యాలని అనుకోకూడదు ్జ మార్గదర్శన చేయాలి కాని ప్రాక్టీకల్‌గా కుదరని సూచనలు ఇవ్వకూడదు

్జ తప్పొప్పులు ఎత్తి చూపకూడదు

్జ వివాహేతర సంబంధంలో ఉన్న స్త్రీని కౌన్సిలింగ్‌కి పిలవకూడదు

్జ కులం, మతం, వర్గం ఆధారంగా మాట్లాడకూడదు

్జ కంప్లైంట్‌ కాపీని ఇతరులెవ్వరికీ ఇవ్వకూడదు

్జ ఎటువంటి ప్రలోభాలకూ గురికాకూడదు

్జ త్వరగా చెప్పమని తొందర పెట్టకూడదు, మాట్లాడే మధ్యలో ఆటంకపరచకూడదు

్జ లాయర్లను, మీడియాను కౌన్సిలింగ్‌ జరిగే సమయంలో అనుమతించకూడదు

్జ రికమెండేషన్‌కు తావియ్యరాదు

్జ డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు చేయకూడదు

్జ వేరే కేసులను ఉదాహరణగా తీసుకొని చెప్పకూడదు. దీని ద్వారా వారిలో వాళ్ళ కేసును చెప్పుకోడానికి అపనమ్మకం, అనుమానం కలుగుతాయి

్జ సమాచారం ఇవ్వడంలో అలసత్వం, ఆలస్యం చేయకూడదు

్జ నిర్ణయం తీసుకోవడంలో బలవంతపెట్టకూడదు, తొందర పెట్టకూడదు

్జ కౌన్సిలర్‌ అధైర్యంగా కన్పించకూడదు

్జ కౌన్సిలర్‌ వ్యక్తిగత సంబంధాలు కానీ, ప్రతి ఫలాలు కానీ ఆశించకూడదు

్జ కౌన్సిలింగ్‌ సమయంలో పిల్లల సాక్ష్యాలను తీసుకోకూడదు

్జ సంభ్రమాశ్చర్యాలకు లోను కాకూడదు

్జ కౌన్సిలర్లు ఆడంబరంగా కనబడకూడదు

్జ ఒకరి వైపునుండే విని అభిప్రాయాల్ని ఏర్పరచుకోకూడదు

భూమిక సపోర్ట్‌ సెంటర్‌లలో పని చేస్తున్న కౌన్సిలర్లంతా పై విషయాలన్నీ నాన్‌ నెగోష్యబుల్స్‌గా పాటించాలని చెప్పారు. తరువాత కుల వ్యవస్థకి సంబంధించి కౌన్సిలర్లు రమ్య మరియు రెహ్మత్‌ ఒక సెషన్‌ తీసుకుని ఆటల ద్వారా చక్కగా అర్థం చేయించారు. అనంతరం సత్యవతి మహిళల రక్షణ కోసం ఉన్న ముఖ్యమైన చట్టాల గురించి వివరించారు. చివరిగా పార్టిసిపెంట్స్‌ ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడంతో ఈ రెండు రోజుల శిక్షణ ముగిసింది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.