భాషలు వాటి ప్రత్యేకతలు – వేములపల్లి సత్యవతి

 

భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో మన తెలుగు కూడా ఉంది. తెలుగు వర్ణమాలలో అక్షరాలు 56. నేడు వాటిలో ఋషికి బదులుగా రుషి, గుఱ్ఱమునకు గుర్రమని రాస్తున్నారు. ఇంగ్లీషు భాషలోని 26 అక్షరాలను నాలుగు రకాలుగా నేర్చుకోవాలి. హిందీ వర్ణమాలలో తెలుగులోవలే ఏ, ఓ లుండవు. నపుంసక లింగం కూడా ఉండదు. ఉర్దూ భాషలోని వర్ణమాలలోని అక్షరాలు 38.

తెలుగు భాష విశిష్టతలు:

ఏ భారతీయ భాషల్లోను లేని సీస పద్యము తెలుగును సింహాసనమెక్కించింది. అవధానం తెలుగు భాష కీర్తి చంద్రిక. అవధానంలో అష్టావధానం, శతావధానం, సమస్యాపూరణం, అంత్యాక్షరి, దత్తపదులు మొదలైనవి ఉన్నాయి.

ఉర్దూ భాష ప్రత్యేకతలు:

ఉర్దూను లష్కర్‌ భాష (మిలటరీ) అంటారు. పుట్టి పెరిగింది లక్నోలో, పెద్దదై రాజగద్దెనెక్కింది హైద్రాబాద్‌ సంస్థానంలో. ఉర్దూను కుడివైపు నుంచి మొదలుపెట్టి, ఎడమవైపునకు రాస్తారు. ఉర్దూ ఉచ్ఛారణ వినసొంపుగా ఉంటుంది. ఆ భాషకు, అపూర్వమైన, వెలకట్టలేని ఆభరణం గజల్స్‌. గాలిబ్‌ గజల్స్‌ అన్నింటికంటే ప్రసిద్ది గాంచినవి. గజల్స్‌ ప్రేమకో, విరహానికో సంబంధించినవి. గజల్స్‌లో రకాలున్నవి. షేర్‌, బైత్‌, ఫర్డ్‌ మొదలైనవి. రెండు పంక్తులున్నవాటిని గజల్స్‌ అంటారు. గజల్స్‌లోని పంక్తిని షేర్‌ అంటారు. మొదటి పంక్తిని మత్లా అంటారు. హిందీలో రెండు పంక్తులున్న వాటిని దోహా అంటారు. ఉర్దూలో నాల్గు పంక్తులున్న పద్యాలను రుబాయిలంటారు. తెలుగులో నాలుగు పాదాలున్న పద్యాలు ఆటవెలది, కందము, శతకాలు మొదలైనవి. ఉర్దూలోని అమూల్య ఆభరణమైన గజల్స్‌ను వెలుగులోనికి దిగుమతి చేసిన ఆద్యులు దాశరధి కృష్ణమాచారి గారు. తర్వాత తెలుగు గజల్స్‌ను కొత్త పుంతలు తొక్కించి సామాజిక వేదికగా మార్చిన మహనీయుడు సి.నారాయణరెడ్డి గారు. ఆ ఘనత వారికే చెందుతుంది. తెలుగు భాషతోపాటు ఇతర భాషలలోను గజల్స్‌ను గానం చేసి గజల్స్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నవారు గజల్స్‌ శ్రీనివాస్‌. నేడు దేశ, విదేశాలలో ఆయన పేరు మారుమోగుతోంది. భాషలు ప్రవహించే నదులలాంటివి.

మహిళలను నేలనుంచి నింగిదాకా పయనింపచేసింది మహిళా చైతన్యమే. ఈ చైతన్యమే నేడు మహిళలను అన్ని రంగాలలోను పురుషులకు ధీటుగా అప్రతిహతంగా ముందుకు దూసుకుపోయేలా చేస్తోంది. సాహిత్య రంగంలో ఆధునిక మహిళల కవితలు, కథలు, నవలలు, వ్యాసాలు, గేయ కవితలు, హైకూలు, నానీలు మొదలైనవి పుంఖాను పుంఖాలుగా వెలువడుతున్నాయి. తెలుగులో అనేకమంది మహిళలు, పురుషులు వేర్వేరు సమస్యల మీద గజల్స్‌ రాస్తున్నారు. గజల్స్‌ రాసే మహిళలతో కొందరు ట్రస్టులు ఏర్పాటుచేశారు. అకాడమీలు స్థాపించారు. తెలుగు ప్రాంతాలకు ముఖ్యంగా తెలంగాణకు చెందిన మహిళలతో పాటు, విదేశాల్లో ఉద్యోగినులయిన మహిళలు కూడా గజల్స్‌ రాస్తున్నారు. మహిళలు, పురుషులు రాసిన తెలుగు గజల్స్‌ను ‘గజల్స్‌ సుమాలు’ అనే పుస్తకంగా ప్రచురించారు. మహిళలందరూ రాసిన వాటిలో నుంచి కొన్నింటిని ఎంపిక చేసి, వాటితోపాటు వారి పరిచయాలను క్లుప్తంగా తెలియపరుస్తున్నా.

గజల్స్‌ సుమాంజలి గ్రంథం ఆధారంగా:-

1. పేరు: వాణీ వెంకట్‌

వృత్తి: గృహిణి

1. ఓటమెంత ఎదురైనా ప్రయత్నం మాననంటూ / తీరాన్ని చేరాలనే ఉబలాటం చూస్తున్నా!!

2. కడలి నీరు కంటనీరు వ్యర్థమనీ చెపుతున్న / ఊరడించు సారగపూ సంస్కారం చూస్తున్న!!

3. వెన్నెలంత నీటిలోకి ఒలుకుతోంది ఎందులకో / చెరువులోన కలువభామ కులుకుతోంది ఎందులకో!!

2. తెలుగు గజల్స్‌ వాగ్గేయకారిణి జ్మోతిర్మయి మళ్ళ

చదువు: బియస్సీ, హిందీ సాహిత్య రత్న

వ్యాపకం: తెలుగు గజల్స్‌ గానం, రచన

అభిరుచులు: కర్నాటక సంగీతం, చిత్రలేఖనం, కవిత్వం, కథలు, కార్టూన్లు

విదేశాలలో: సౌతాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో గజల్‌ కచేరి, గజల్స్‌ అకాడమీ స్థాపన

1. ఉన్నతికో ప్రగతికో ఒక రాజ్యం రెండయింది / కలసి మెలసి మెలిగేది తెలుగు మనసులే కదా

2. నీ కోసమే జన్మంతా గడపలేదా ఆడదీ / నీ తోడిదే లోకమంటూ నడవలేదా ఆడదీ

3. ఇద్దరు ఒక్కటైన క్షణం ధన్యతగా భావించి / తనువు మనసు అణువణువూ ఇవ్వలేదా ఆడదీ

4. ముల్లు గుచ్చుకుంటే నువ్వు విలవిలలాడుదువులే / కడుపు చీల్చు యాతనంత ఓర్చలేదా ఆడదీ

5. అమ్మగా, అక్కగా, ఆలిగా, కూతురిగా / బ్రతుకంత ఉగాదిగా మలచలేదా ఆడదీ

6. కనిపిస్తూనే ఎంతగా బాధిస్తున్నావో తెలియదు నీకు / ప్రేమిస్తూనే ఎంతగా వేధిస్తున్నావో తెలియదు నీకు

3. ఇందిర భైరవి

వృత్తి: ఉపాధ్యాయిని

అభిరుచి: హైకూలు, మినీలు, వచన కవిత్వం, గజల్స్‌ రాయడం

1. మనసున చోటిచ్చానని మట్టిలోన కలపడమా / మనసంటె మాటతీర చెలగాటం ఆడాలా

2. నరుడు ఏలా దేవుడగును ఎదన గుడేలేనివాడు / మొలకనెలా ఈను నేలలోన తడే లేనినాడు

4. హంసగీతి

వృత్తి: సైన్స్‌ టీచరు

హాబీలు: ఫ్యాషన్‌ డిజైనింగ్‌, డ్రాయింగ్‌, కవితలు రాయడం

1. ఆటలైనా పాటలైనా అందమేగా పిల్లలకు / నవ్వులన్నీ పాలుగారే బుగ్గలోనే ఉంటవి

2. ఎదురు చూచు వసంతం రావాలని ఆశ ఆశ / కొమ్మ కొమ్మ చిగురులతో నిండాలని ఆశ ఆశ

3. కదులుతున్న మేఘాలే చిరుగాలికి కురువాలని / రాలుతున్న చినుకులలో తడవాలని ఆశ ఆశ

5. లక్ష్మి రాయవరపు

కలం పేరు: ఎన్నెల

వృత్తి: అకౌంటెంట్‌, కెనడా

1. పంచదార చిలుకలేవి పాలజొన్న మురుకులేవి / రేగి జామ ఐస్‌పుల్ల బండి వెనుక ఉరుకులేవి

2. రాయేసి కొట్టామో పాలోలుకగ తిన్నామో / చింతకాయ పులుపులేవి వరి కంకుల పెరుగులేవి

6. లీల

వృత్తి: ఉపాధ్యాయిని (కేంద్రీయ విద్యాలయ, హైద్రాబాద్‌)

చిరునామా: మిచిగాన్‌ (యుఎస్‌ఏ)

విద్య: కర్నాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం

1. స్వప్నమా చెదరకే కంటిలోన నిలచిపో / స్నేహమా చెదరకే గుండెలోన నిలచిపో

2. జ్ఞాపకాల కథలన్నీ కవితలుగా రాస్తున్నా / మధురమైన నా కథగా నీవు నిలచిపోరాదా

7. లయన్‌ విమల గుర్రాల

వృత్తి: ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్టుమెంట్‌లో గెజిటెడ్‌ ఆఫీసర్‌

ప్రస్తుత నివాసం: వైజాగ్‌

1. గజల్‌ కంటిపాప గీయురేఖ నిరసించుట సాధ్యమా / వేధించే నీ తలపుని ఎదురించుట సాధ్యమా

2. పల్లెలందున అందమెంతో నగరవాసికి తెలియునా / పైరుపైరున జీవ ఝరులే పారుతూనే ఉన్నవి

3. ఒకరినొకరు కాటేసే మోసాలు మానాలి / కనులు మూసి నిద్దురోయే నమ్మికొకటి కావాలి

8. మాలా చిదానంద్‌

వృత్తి: మేనేజర్‌ (అవాన్‌ కాస్మటిక్‌ కంపెనీ), బెంగుళూరు

వ్యాపకం: రచన, 150కి పైగా కవితలు, 40 తెలుగు గజల్స్‌ రాశారు.

1. కానరాని దేశమేదో చేరినావు నేస్తమా / ఓర్వలేని బాధలెన్నో నింపినావు నేస్తమా

2. చిత్తంలో చేరి ప్రేమ చంపుతోంది ఎందులకో / చిత్తరువుగ చేసి నన్ను నవ్వుతోంది ఎందులకో

9. రోహిణి ఉయ్యాల

వృత్తి: ఉపాధ్యాయిని

పరిచయం: 600కి పైగా ఏకవాక్య కవితలు (అవి చదవడానికి లభ్యంకాలేదు). 500కి పైగా ద్విపాద కవితలు, ఇంగ్లీషులో, తెలుగులో వందకు పైగా దీర్ఘ కవితలు రచించారు.

‘భావనాల భామినినై గజల్లోన కరగాలని, అద్భుతమైన గజల్‌లో ఒక షేర్‌ (గజల్‌లోని పంక్తి)గానైనా నిలిచిపోవాలని ఆశ’ అని తెలియపరచారు.

1. చూపులతో రణం చేస్తూ కళ్ళు కలిపి వెళ్ళిపోకు / మన వలపుల బాటలలో ముళ్ళు పరచి వెళ్ళిపోకు

2. మదినిదోచు వసంతమై వచ్చావని మురిసాను / నిర్దయగా శిశిరాలకు నన్ను విడిచి వెళ్ళిపోకు

3. అవినీతిని ప్రశ్నించే గళము కొఱకు వెతుకులాట / మంచితనం పండించే పొలము కొఱకు వెతుకులాట

4. జీడీపీ కొలతలలో ఎదుగుతోంది నా దేశం / పేదరికపు ఛాయలేని చోటు కొరకు వెతుకులాట

10. సిరి వడ్డె

వృత్తి: కస్టమర్‌ కేర్‌, చెకౌట్‌ క్యాషియర్‌ ఇన్‌ మార్కెటింగ్‌ గ్రూప్‌ (కేంబ్రిడ్జ్‌)

ముద్రితమైన పుస్తకాలు: సిరిమల్లెలు

1. తుంటరైన వయసంతా తూనీగై విహరిస్తే! / ఊహల్లో కాస్త అలుపు అలా వచ్చి వెళ్ళిపోయె!!

2. తూరుపులో అరుణిమనై మెరవాలని ఉంది నాకు! / పడమరలో కెంజాయిగ మురవాలని ఉంది నాకు!!

11. సోమిశెట్టి స్వర్ణలతా నాయుడు

కలంపేరు: శ్రీ స్వర్ణ

పరిచయం: ఏకవాక్య కవితలు వెయ్యి వరకు రచించారు. ద్విపాద కవితలు 200 వరకు రాశారు. మొదటి దీర్ఘకాలిక కవితల సంపుటి శ్రీ స్వర్ణకిరణాలు, సినారెగారి చేతులమీదుగా ఆవిష్కరించబడింది.

1. గున్నమామి చెట్టు కింద వేచియున్న క్షణాలన్నీ / బుగ్గలపై కెంపులుగా మార్చుకుంటూ ఉన్నాను!

2. చైత్రవీణ తంత్రులన్నీ మోగుతాయి అవనిలో / కోయిలలే మధురంగా పాడినాయి ఆమనిలో!

12. శ్యామల గడ్డం

చదువు: ఎం.ఎ., పిహెచ్‌.డి.

వృత్తి: రీడర్‌ (తెలుగు పద్మావతి మహిళా కళాశాల, హైదరాబాద్‌.) 2012లో సాహిత్య సరాగాలు పుస్తకం ప్రచురితమైనది. వారి అత్తగారి ఇంటిపేరు మీద కొమర్రాజు ఫౌండేషన్‌ స్థాపించారు.

1. బాధలెన్నో హృదయములో దాచితిలే ప్రియురాలా / చెట్టుచెంత మది గుట్టును విప్పితిలే ప్రియురాలా

2. దేశానికి వన్నె తెచ్చే నవజవాను నీవేలే / ప్రాణమొడ్డి పోరాడే తెంపరియు నీవేలే

3. ముష్కరులూ మొండిగుండి చాటునుండి దాడి చేయ / తెలివి, తెగువ చూపించే వీరుడవూ నీవేలే

4. మనసులోన బాధలెన్నో దాచుకున్న బడబాగ్నివి / దేశానికి సరిహద్దుల చిహ్నమునూ నీవేలే

13. డా||బి.ఉమాదేవి జంధ్యాల

చదువు: ఎం.ఎ., బి.ఎడ్‌., పిహెచ్‌.డి

పరిచయం: రీడర్‌, తెలుగు శాఖ, జవహర్‌ భారతి డిగ్రీ కళాశాల, కావలిలో పనిచేసి రిటైరయ్యారు.

పరిశోధన అంశం: ఆధునిక ఆంధ్ర కవిత్వము-స్త్రీ

1. ఆడపిల్ల నిప్పటికీ కుంపటిగా తలచాలా / అనుబంధా లన్నిటిని కాలరాసి వెళ్ళలేను.

2. నిలువెత్తు బంగారపు బొమ్మనుగా మార్చారే / ప్రేమఅను పాలనునే పారపోసి వెళ్ళలేను.

3. తలవంచు కునేటంత తప్పేమిటి వధువుల్లో / బానిసత్వ నాటకాన్ని తోసిరాసి వెళ్ళలేను.

4. వానచినుకా వానచినుకా వారమైనా వచ్చిపోవే / ఎదురు చూసే అన్ని ఊళ్ళకు దూరమైనా వచ్చిపోవే

5. నీవురాక నేలతల్లి గుండె బీటలు వారిపోయే / చెరువులమ్మల ఒడిని నింపగ భారమైనా వచ్చిపోవే

6. బక్క పేగుల ఆకలేంటో బలిసినోళ్ళకు తెలుస్తుందా / ఒళ్ళుకాలే ఎండ సంగతి మిద్దెలోళ్ళకి తెలుస్తుందా!

7. దొంగలెత్తుకు పోవటానికి పుస్తెకూడ పసుపుకొమ్మే / భయం తెలియని రాత్రులేంటో కలిగినోళ్ళకు తెలుస్తుందా!

8. కట్టుగుడ్డలు జతను మించవు కాపురాలకు గదుల్లేవూ / అన్ని ఉండి గొడవలేంటో గుడిసెలోళ్ళకు తెలుస్తుందా!

9. ఈ చిలకెగిరి పోయిందంటె తిత్తినెవరూ ఉంచుకోరని / తప్పుదారిన కోట్లు కూడబెట్టినోళ్ళకు తెలుస్తుందా!

10. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే గడ్డమీద / ఓట్లుకొనే నాయకుల్ని నమ్ముతునే ఉన్నాం కద!

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో