ఆత్మవిశ్వాసం ఆమె ఆయుధం

మాలతీ చందర్‌
(అమ్మతో నేను-నాతో అమ్మ” పేరుతో ఈ సంచిక నుండి కొత్త శీర్షికను ప్రవేశపెడుతున్నాం.
తమ మాతృమూర్తులతో తమ అనుబంధాన్ని, అనుభవాలను ఎవరైనా పంచుకోవచ్చు. ఫోటోలతో వ్యాసం
పంపితే మరింత బావుంటుంది. -ఎడిటర్‌)
పిల్లల్లేని తల్లి వుండవచ్చు కాని, తల్లి లేని పిల్ల వుండదు ఈ సృష్టిలో.
నాకు మా అమ్మ తొలి జ్ఞాపకం – బయట జేరిన ఆ మూడు రోజుల్లో – బియ్యం బాగుచేస్తూనో, పప్పులు విసురుతనో, చీపుళ్ళు కడు్తూనో, విస్తర్లు కుడు్తూనో – అరుగుమీద వెదురు తడకల గదిలో కూచోడం – ఇంకా ఈనాడు జరుగు తున్నట్లుగా కళ్లకు తిరిగి తిరిగి కనపిస్తూ వుంటుంది. విశ్రాంతి తీసుకోవ లసిన ఆ మూడు రోజుల్లో కూడా, ్మా అమ్మ తల ఎత్తకుండా శ్రమ పడటం, నిన్న మొన్నటి విష యంలా వుంటుంది. నా చిన్నప్పుడు మా అమ్మ ఎన్నడ తీరిగ్గా కూచోని మాట్లాడటం నేను ఎరగను. ఎప్పుడ పనిలో నిమగ్నమై వుండేది. అవన్నీ ఇంటికి సంబంధించిన పనులు.
మా నాన్నగారు పోయేప్పటికి నాకు ఎనిమిది నెలలట. అంచేత, నాకు మా నాన్న ముఖం తెలియదు. మా అమ్మని తెల్ల బట్టల్తో వేలుముడితో, ఖాళీ నుదుటితో తప్ప మరో విధంగా ఏనాడ చూడలేదు – వూహించుకోన లేదు. నాన్నగారు బ్రతికివున్న రోజుల్లో ఆమె వంటెడు నగల్తో దిగిన ఫొటో లోని అమ్మ, ొమా అమ్మ కాదు – ఎవరో కొత్త మనిషి అనిపిస్తుంటుంది ఈనాటికి కూడా.
మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ”మాది కృష్ణా జిల్లా పెద్దపీట వెయ్యండి” అవి ‘కృష్ణాతీరం’లో ఒక చోట అంటారు. మాది కూడా కృష్ణా జిల్లాయే. కృష్ణా జిల్లాలోని నూజివీడు.యెలూరికీ, బెజవాడకీ మధ్యవున్న ్మా వూరికి – రైల్వేస్టేషన్‌ వున్నా, అది వూరుకి పదమూడు మైళ్ళ దరంలో వుంది. మాకు నూజివీడు స్టేషన్‌ కంటే – అరటిపళ్ళ గెల తోక ముందు వుంచుకుని నిల్చుని వున్న హనుొమాన్‌ జంక్షన్‌తోనే ఎక్కువ పరిచయం. మా వూరు వెళ్ళాలంటే హనుమాన్‌ జంక్షన్‌ మీదుగానే వెళ్ళాలి. అప్పట్లో అగిరిపల్లి రోడ్డు లేదు. మా నాన్నగారు జమీందార్ల దగ్గర పనిచేసే వారట. అదేదో కోటపాడో, వుయ్యూరో.. నాకు సరిగ్గా తెలియదు. ఎస్టేటులో పనిచేసేవారట. ప్రతి వేసంగికి ఉదక మండలం వెళ్ళేవారుట వాళ్ళతోపాటు!
మా నాన్నగారు పోయే వేళకి, పది నుంచి ఎనిమిది నెలల వయసుదాకా మొత్తం ఆరు మందిమి. అప్పటికి అమ్మకి ఇరవై ఏడేళ్ళు. వృద్ధురాలైన అత్తగారు, చెమిటి, ముసలి, కోపిష్టి అయిన బ్రహ్మచారి పిన మామగారు, బాలవితంతువైన ఆడబడుచు కూతురు – పదేళ్ళ లోపు ఆరుగురు పిల్లలు, అప్పులు, వీటన్నిటితో మా నాన్నగారు అకస్మాత్తుగా ఒక మధ్యాహ్నం వేళ ఆస్పత్రిలో కన్ను మూశారట. ఆ రాత్రి చిన్నపిల్లలు ఆకలి అని ఏడుస్తూ వుంటే,మా మామ్మకి ఆకుకీ నేలకీ తేడా తెలియక, ఆ దుఃఖంలో నేలమీద అన్నం కలిపి, అయిదుగురు పిల్లలకీ పెట్టిందట. అటువంటి సంసారాన్ని మా అమ్మ ఎలా ఈదుకు వచ్చింది? మా అందరిని ఎలా పెద్ద చేసి చదువులు చెప్పించి స్వశక్తితో నిలబడగల వ్యక్తులని ఎలా చేయగలిగింది? అన్నది ఈనాటికీ నాకు ఆశ్చర్యంగానే వుంటుంది.
మా నాన్నగారు పోయేటప్పటికి, ఒక్క కొడుక్కి కూడా వొడుగు అవలేదుట. అందుకని వూళ్లో దూరపు బంధువులు ఆయన అపరకర్మలు చేశారుట. ్మా మామ్మ బ్రతికివున్ననాళ్లు యీ విషయం చెప్పి ఏడుస్తూ వుండేది. ఆవిడ ఏం చెబుతుందో అర్ధం కాకపోయినా మేము ఏడ్చేవాళ్లం ఆమెతోపాటు.
నాన్నగారు పోగానే అమ్మ పుట్టింటికి, తండ్రి చాటుకి వెళ్లలేదు. ఎంతమంది చెప్పినా ‘నా యింట్లో నా పిల్లల్ని పెంచుకుంటాను. తండ్రి లేని యీ పిల్లల్ని ఎవరి పె౦చినా పెంచను’ అని ఖండితంగా చెప్పి, అక్కడే ఆ యింట్లోనే – తన, తన పిల్లల గాక, మరో ముగ్గురు పెద్దవాళ్ళతో, ఆ సంసారాన్ని లాక్కొచ్చింది. ్మా అమ్మగారు సుమతీ శతకం నేర్పలేదు. ‘మీకు తండ్రి లేడు. తండ్రి లేని పిల్లలు అని నలుగురు, జాలిపడి చులకన చేసే విధంగా వుండకూడదు’ అంట ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం వంటివి ఎప్పుడ నరిపోస్తుండేది. అమ్మ డిక్షనరీలో మాతృప్రేమకు పర్యాయపదం క్రమశిక్షణ. మా బంధువుల్లో కొందరు ‘తండ్రి లేకపోవడం అష్టదరిద్రాల్లో ఒకటి’ అంట మమ్మల్ని చూసి అన్నప్పుడు, అమ్మ హి్మాలయం అంత ఎత్తుకు ఎదిగి, అవతల వ్యక్తులు చీమలపుట్టంత అల్పులు అన్నట్టుగా నిరూపించేది.
అమ్మకి ముద్దులు పెట్టుకోడం, గారాబం చేయడం ఏనా్డూ తెలియదు. ఎందుకంటే, ఆమెకి అంత వ్యవధి వుండేది కాదు. పరికిణీలు, జాకెట్లు కుట్టడం, అన్నయ్యల నిక్కర్లు కుట్టడం వాటితో సరిపోయేది. మధ్య మధ్య పెద్దన్నయ్య పుస్తకాలు చిన్నన్నయ్యకు, ఆ తరువాత మిగతా నలుగురికీ, అలా పాత పుస్తకాలు జాగ్రత్తగా కుట్టి, అట్టలు వేసి, స్కూళ్లు తెరిచే వేళకి రెడీగా వుంచేది. ‘పాత పుస్తకాలల్తో బడికి వెళ్లటం నామౌషీ కాదు. బాగా చదవకపోవటం నావెషి’ అని ొమాకు నూరిపోస్త వుండేది. ఇప్పుడనిపిస్తుంది నిజంగా ొమా బుర్రలకి చిల్లులు పొడిచి, ఈ భావాన్ని కరిగించి పోసిందేవెనని!
చిన్నప్పటి నుంచి కొన్ని నియమాలు, అమ్మ తన రక్తంతోపాటు మాలో ప్రవహింపజేసింది. ఎవరింటికెళ్ళినా తక్కువ మాట్లాడాలి అవతలవాళ్లు తింటానికి పెట్టినా అన్నీ అక్కడ తినకూడదు ఇంటికి తీసుకురావాలి. ‘నాకిది కావాలి’ అని ఎవరినీ అడగకూడదు. ఆఖరికి అమ్మని కూడా అడగరాదు. పెట్టింది తినాలి, ఎవరినీ అప్పు అడగకూడదు. ఇది మా అమ్మ నియమావళిలో ప్రథమ పాఠం. నిమ్మతొనలు పిప్పరమెంట్లు అరిచేతి వేడికి కరిగి పాకం వచ్చినా, అవి యింటికొచ్చాక తినాలే తప్ప, పెట్టిన వెంటనే తినే ధైర్యం మాకు వుండేది కాదు.
‘మీ నాన్నగారి పేరుకీ, గౌరవానికీ భంగం రాకూడదు’ అంట మాలో మా నాన్న ఒక మానవాతీత వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి అనే యిమేజ్‌ కల్పించింది. నిజానికి యీనాడు తలుచుకుంటే – మా నాన్న సాదాసీదా వ్యక్తి అనిపిస్తుంది. ఉన్నన్నాళ్ళు దర్జాలకి పోయి, ఆరుగురు పిల్లల్నీ, అప్పులనీ, ముసలివాళ్లని వదిలేసిపోయిన వ్యక్తిగా తప్ప – మా అమ్మ క్షణ క్షణం నూరిపోసిన ‘అద్భుత వ్యక్తి’ కాదనిపిస్తుంది. అయితే ఆ సాదా సీదా వ్యక్తిని ఆదర్శ పురుషునిగా ఒక ఎత్తు పీఠం మీద కూచోబెట్టి, తద్వారా ొమాలో ఒక ధ్యేయన్ని, లక్ష్యాన్ని కల్పించింది మా అమ్మ. ఆయన ఆనాటి మామూలు వ్యక్తి, సగటు మనిషి అని యిప్పుడు బోధపడుతూ వుంది.
పని విభజనలోన, క్రమశిక్షణలోన, ప్రేమలోన ఎక్కువ తక్కువలు ఎప్పుడ చూపించేది కాదు ్మా అమ్మ. ఏనాడ పాకెట్‌ మనీ, ఆఖరికి కానీ కూడా బయట ఖర్చు చెయ్యటం మాకు సాధ్యం అయ్యేది కాదు. తేగలు, మొక్కజొన్న పొత్తులు, చక్కిలాలు, వేరుశనగ వుండలు…ఇవి బయట కొనుక్కుని తినటం మేము కలలో కూడా వూహించని విషయం. ఈనాడు స్టార్‌ హోటల్స్‌లో వేల మీద బిల్లు పే చేస్తున్నప్పుడు, నా బాల్యంలోని వేరుశనగ వుండలు జ్ఞాపకం వస్తుంటాయి.
ఒకసారి మా యింట్లో గులాబీపువ్వులు పూశాయి. మేము ముగ్గురం అక్కచెల్లెళ్ళం. ముగ్గురికీ గులాబీల మీద వెజే. మా అమ్మ ఒక్క పంచదార పొట్లం, రెండు గులాబీలు విడివిడిగా, మూడింటి మీదా మూడు గిన్నెలు బోర్లించి, ముగ్గురికీ ఎవరికి కావలసిన గిన్నె వాళ్లని తీసుకోమంది. అంత సరిసవనంగా వుండేది ఆమె ప్రేమ. ఇన్ని కట్టడుల లోన మాకు తిండికీ, బట్టకీ లోటు వుండేది కాదు. అవి ఎలా అమర్చేదో నాకీనాటికీ తెలియదు.
‘ఆకలేస్తున్నది’ అంటే ‘అన్నం తిను’ అని ఠకీమని జవాబు చెప్పేది. ‘ఏమన్నా పెట్టు’ అంటే ‘ఏమన్నా పోతే నీమీద పెడ్తాలే’ అనే జవాబు వచ్చేది అమ్మ నుంచి.
చదువు విషయంలో మా అమ్మ ఒక్కొక్కప్పుడు నిరంకుశంగా వుండేది. అది మా మంచికే అన్న వివేకం యిన్నాళ్లకి మాకు కలిగిందనుకోండి. పరీక్షల్లో ఫస్ట్‌ మార్కులు రాకపోతే, అది చాలా అవవనకరమైన విషయమనే భావం ఆమె కళ్లలో ప్రతిఫలించేది. ఒకసారి ఆ చూపును ఎదుర్కొన్నాక మరుసటి సంవత్సరం తక్కువ ొమార్కులు తెచ్చుకునే సాహసం మాలో ఎవరికీ వుండేది కాదు. ఆ ఏడు మా రెండో అన్న స్కూలు ఫైనలు తప్పాడు. ఆ ఏడాది మా అమ్మ మా చిన్నన్నకు రెండో జత బట్టలు కుట్టించలేదు. వంటికి సబ్బులు కొనలేదు. కాళ్ళకి చెప్పులు కొనలేదు. అన్నయ్యతో ఆ ఏడు మాట్లాడలేదు. అంతే. మళ్లీ పరీక్షకు కూచున్నప్పుడు డిస్టింక్షన్‌ వచ్చింది. మా అమ్మ పిల్లల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తుందని బంధువులు అంటుండేవాళ్లు. ఆ కాఠిన్యత వెనక ఆరుగురు పిల్లల పెంపకం, భర్త వదిలి వెళ్ళిన అప్పులు, మరో ముగ్గురు పెద్దవాళ్ళని పోషించాల్సిన భారం వుందని చాలామంది మర్చిపోయేవారు.
మా అమ్మకి రాజాజీ అంటే చాలా యిష్టం – భక్తి కూడాను. రాజాజీ ‘డెట్‌ రిలీఫ్‌ యక్ట్‌’ వల్ల మా కుటుంబం వొడ్డున పడింది. నాన్నగారు చేసిన అప్పులు చక్రవడ్డీలతో పెరిగి, పెరిగి, భతంలా అయి, యిల్ల వాకిలీ అన్నీ కొట్టుకుపోతున్న సమయంలో, ‘డెట్‌ రిలీఫ్‌’ చట్టం అమలులోకి వచ్చిందట. ఆ సమయంలో అమ్మ వంటి మీద నగలు అమ్మేసి, అసలు అప్పు తీర్చేసింది. మా పూర్వీకుల యిల్లు, మామిడితోట, పొలాలు మా అన్నయ్యలకి మిగిల్చింది. ఆ పూర్వీకుల యింట్లోనే మా అన్నయ్య వుంటున్నారు.
మా అమ్మ పోస్ట్‌ కవరు ఎప్పుడ, ఎవరికీ రాయదు. కార్డు మీద, నల్ల పూసల వంటి అక్షరాల్తో రెండు కవర్లకు సరిపడ విషయలు రాస్తూ వుంటుంది. అసలు పోస్టల్‌ శాఖవారు, అమ్మలాంటి వాళ్లకోసమే పోస్టుకార్డులు ప్రింటు చేస్తున్నారేవెనని నా అను్మానం. తమిళనాడులో వున్న మాకు తెలుగులో ఎడ్రసు రాస్తే అందదని, ఇంగ్లీషులో పెద్ద అక్షరాలు మా చేత రాయించుకుని, ఆ ఎడ్రసు పదిసార్లు దిద్దుకుని, ఇంగ్లీషులో ఎడ్రసు రాయడం నేర్చుకుంది. ఆమెకి గల పట్టుదల, జీవితంపై గల అనురక్తి మాకు ఏడో వంతు కూడా లేదు. ఆరుగురు పిల్లల పెళ్లిళ్లు చేసింది. పూర్వీకుల ఆస్తి కొడుకులకి అప్పగించింది. పిల్లలందరు పెద్దవాళ్లయి స్థిరపడ్డారు. నిర్విరామ బాధ్యతల తరువాత యిప్పుడు కాస్త తీరిక దొరికింది. అందుకనే దినపత్రికలు, వారపత్రికల, పుస్తకాలు అలా చదువు్తూ వుండేది.
నా జీవితంలోని ముఖ్యమైన మలుపుకి మా అమ్మ ప్రత్యేక బాధ్యత వహించింది. చందర్‌గార, నేను యిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు, బంధువుల్లో కొందరు వ్యతిరేకత, మరికొందరు వుదాసీనతచూపించారు. అప్పుడు ొమా అమ్మ ‘నేను వున్నాను భయం లేదు’ అని ధైర్యం చెప్పి, ఆసరాగా నిలబడింది. తనని నిందించినా, నిశ్శబ్దంగా సహించింది. ఆనాడు అన్నవారే ఈనాడు చుట్టరికాలు తిరగేస్తున్నారు.
మా అమ్మకు తొంభై అయిదు వచ్చింది. ‘అధిక వసాల్తో కలిపి నాకు నూరేళ్లు’ అంట వుంటుంది. తెల్లవారేసరికి స్నానం చేసి, శుభ్రంగా వెండి జుత్తు దువ్వుకుని, మడత నలగని బట్టల్తో – కొంచెం వొంగి, తొంగి తొంగి ొచూస్త వుంటుంది దినపత్రిక కోసం. అది ఆసాంతం చదివితే గాని వూరుకోదు. ఆమెకి టి.వి. ప్రోగ్రాములు, అందులో వచ్చే సినిమాల మీద అంత యిష్టం లేదు. ఎంతకూ చదువు. మమ్మల్ని పెంచడంలో, కుటుంబ బాధ్యతల్లో ఆమె పుస్తకం పుచ్చుకోకుండా గడిపిన కాలం, వడ్డీతో సహా వసూలు చేసేంతగా చదువు్తూ వుంటుంది. కళ్లకి జోడు లేకుండా, పుస్తకాలు చదువుత, సదిలో దారం ఎక్కించగలదు ఈనాటి దాకా. మేమంతా నాలుగు కళ్ళ వాళ్లం, ఆరు కళ్ల వాళ్లం.
కాలంతో పాటు నడవగల మా అమ్మ – ఒక్క విషయంలో తప్ప, మిగతా అన్ని విషయల్లో ఆమె కాలానుగుణంగా తనని తాను మార్చుకుంది. సంసార భారంతో, ఆర్థిక యిబ్బందులకు లోనవటం వల్ల కాబోలు, వంద రూపాయల నోటు మార్చినపుడల్లా మా అందర్ని ‘క్రిమినల్స్‌’ని చూసినట్టు ొచూస్తుంది. తన రోజుల్లో ఆమె ొనూరు ొరూపాయలు నోటును ఒకటి రెండుసార్లు ొచూసిందట. అటువంటి అపు్రూపమైన నూరు రపాయల నోటుని కూరల వాడికి యిస్తూన్నపుడు, అదేదో భరించలేని దృశ్యంగా భావిస్తూ వుంటుంది.
మా అమ్మకి గల పడికట్టు రాళ్లు, జీవితం పట్ల వున్న అవగాహన, ఆత్మవిశ్వాసం, మాలో ఎవ్వరికీ లేవు. ఈనాటికీ ఆమె మంచం మీద కూర్చోగల ధైర్యం మాకు లేదు. ఆవిడే కూర్చోమని అంటేనే తప్ప కూచోము. అటువంటి భయభక్తులు మా నరనరాల ప్రవహించేటట్లు పెంచింది.
మా మేనకోడలి పేరు బాపూ రమణల ‘చీగాన పచనాంబ’ (శ్రీ జ్ఞాన ప్రసనాంబ). దానిని మేమంతా పాపాయి అని పిలుస్తాము. దాన్ని పేరు పెట్టి పిలిచే ధైర్యం, మా యింట్లో ఎవ్వరికీ లేదు. అది మా అమ్మ పేరు – అందుకని! (ఆంధ్రజ్యోతి )

Share
This entry was posted in అమ్మతో నేను-నాతో అమ్మ. Bookmark the permalink.

One Response to ఆత్మవిశ్వాసం ఆమె ఆయుధం

  1. మలతి గారూ…మీ అమ్మగారు యెంత అత్బుతత్బువ్యక్తి.

Leave a Reply to జ్యోతిర్మయి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.