టాలీవుడ్‌లో నేను సైతం… ఉద్యమానికి శ్రీకారం చుట్టిన క్యారెక్టర్‌ మరియు డైలాగ్‌ ఆర్టిస్టులు

 

బహుశా కొన్ని వారాల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో కాలంగా నడుస్తున్న లైంగిక వేధింపులు, దోపిడీ ఈ విధంగా బహిరంగ చర్చనీయాంశం అవుతుందంటే ఎవరూ నమ్మి ఉండేవారు కాదు. ఈ విషయాలపై ఇటువంటి చర్చలు జరుగుతాయని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు.

అయితే అక్షరాలా జరిగింది మాత్రం ఇదే. ఏప్రిల్‌ 6న, ఉదయం 10:30 గంటలకు శ్రీరెడ్డి అనే ఆర్టిస్ట్‌ తెలుగు సినీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసింది. సినీ పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆమె ఈ పని చేసింది. అనుకోని విధంగా ఆమె నిరసన ఊపందుకుంది, జన సమ్మతి పుంజుకుంది. దీనికి స్పందిస్తూ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (”మా”) శ్రీరెడ్డిపై నిషేధాజ్ఞలు విధించింది. తమ అసోసియేషన్‌లోని 900 మంది సభ్యులను ఆమెతో నటించరాదని ఆంక్షలు పెట్టింది. ఇవన్నీ జరుగుతుంటే నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) స్వయంగా నోటీసు జారీ చేసి తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులపై తెలంగాణ ప్రభుత్వాన్ని, జాతీయ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను వివరణ ఇవ్వాలని కోరింది. నేషనల్‌ హ్యమన్‌ రైట్స్‌ నోటీసు తర్వాత శ్రీరెడ్డిపై విధించిన నేషేధాన్ని ”మా” ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా బయటికి వచ్చిన విషయం మాత్రం సినిమా పరిశ్రమలో ప్రముఖంగా కనిపించని కేరెక్టర్‌, డైలాగ్‌ ఆర్టిస్టులు చూపించిన సాహసం, అందించిన సహకారం, శ్రీరెడ్డి లేవనెత్తిన అంశాలకు మద్దతుగా వారు బయటికి వచ్చి సినీ పరిశ్రమలో పాతుకుపోయిన దోపిడీ వ్యవస్థ, ఇతర రాజకీయాలను నిర్భయంగా బయటపెట్టారు. వ్యవస్థీకృతమైన లైంగిక వేధింపులు, దోపిడీకి సినీరంగం పెట్టిన ముద్దు పేరు ”కాస్టింగ్‌ కౌచ్‌”. దీని గురించి సినీ పరిశ్రమలో అందరికీ తెలుసు. అయితే బాహాటంగా ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమ అంగీకరించలేదు. అటువంటప్పుడు ఈ అంశాలపై చర్చించడం కానీ, చర్యలు చేపట్టడం కానీ వీరికి తేలికైన విషయం కాదు.

తెలుగు సినీ పరిశ్రమ ఒక కార్పొరేట్‌ వ్యవస్థ మాదిరి కేవలం నాలుగు కుటుంబాల గుత్తాధిపత్యంలో నడుస్తోంది. టాలీవుడ్‌లోని ప్రముఖ పురుష నటులు ఈ కుటుంబాలనుండే వస్తారు. అయితే వీరి ఇళ్ళల్లోని స్త్రీలను మాత్రం సినీ రంగంలోకి సాధారణంగా రానివ్వరు.

ఈ పురుష నటుల కోసం ఏర్పడిన ”ఫాన్‌” క్లబ్బులు వారి పేరును జాగ్రత్తగా కాపాడుతుంటాయి. మగ నటులంతా తెలుగువారే అయి ఉండడం, స్త్రీలు మాత్రం ఎక్కువగా ఇతర రాష్ట్రాల వారయి ఉండడం గమనించవలసిన విషయం. ఇతర భారీ పరిశ్రమల మాదిరి ఇక్కడ కూడా స్వపక్ష ధోరణులు, అసమాన జీతభత్యాలు, పురుషాధిపత్యం, లోపల వార్తలేవీ బయటకు పొక్కకుండా నిగూఢ నిఘా వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంటాయి.

మహిళా ఆర్టిస్టులు చిన్నపాటి విమర్శ చేసినా, వారి సినీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వారిని సినీ పరిశ్రమ తేలికగా క్షమించదు. ఈ మధ్య కాలంలో నటి ఇలియానా, రాధికా ఆప్టే కొంచెం బాహాటంగా మాట్లాడినందుకు వారిని దుమ్మెత్తి పోశారు. వీరిని అన్నం పెట్టే చెయ్యినే కరిచే విశ్వాసహీనులు అన్నారు. అంతేకాక నటి తాప్సి చేతులు జోడించి మీడియా ముందు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇతర నటులైన మాధవీలత, గాయత్రిలు అవకాశాలు కోల్పోయారు.

శ్రీరెడ్డి తన బహిరంగ నిరసనకు ముందు ఒక నెల నుండి తెలుగు సినీ పరిశ్రమలో ప్రబలంగా ఉన్న లింగ వివక్ష ధోరణులు, స్థానిక మహిళా ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వకపోవడం, ఇచ్చి పుచ్చుకునే సాంప్రదాయాలు, మహిళా ఆర్టిస్టులను లైంగిక వాంఛ తీర్చమనే బలవంతాలు, అలా చేయని పక్షంలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (”మా”)లో సభ్యత్వం సంపాదించడంలో ఉన్న కష్టాలు… అన్నింటినీ పరిశ్రమ పెద్దల ముందు ఉంచింది. అయితే ఆమె ఆరోపణలను ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు నిరసనగా అర్ధనగ్న ప్రదర్శన చేసింది. దీనిని గంభీరంగా తీసుకోకపోగా, పేరు సంపాదించే ”స్టంటు” అని, ఇది ఒక చవకబారు చర్య అని కొట్టి పారేయడం జరిగింది. అయితే శ్రీరెడ్డి నిరసన ప్రదర్శన జరిగిన వెంటనే ”మా” ఆమెపై నిషేధం విధించడంతో అసలు విషయం బయటపడింది.

కుల పంచాయితీ తీరులో ‘మా’ తెలుగు సినీ పరిశ్రమ తరపున శ్రీరెడ్డిపై నిషేధం విధించడం, ‘మా’ సభ్యులెవ్వరూ ఆమెతో నటించకూడదని కట్టడి చేయడం, శ్రీరెడ్డి అసభ్య ప్రవర్తనతో తమ సంస్థను మలినం చేసిందని మీడియా ముందు తీవ్రంగా దుమ్మెత్తి పోయడంతో సినీ పరిశ్రమలో దాక్కున్న చీకట్లు బయటకు వచ్చాయి. వీరి ఒక తరహా నిర్ణయాలకు వ్యతిరేకంగా ఊహించని వర్గాలు గొంతు విప్పాయి. తెలుగు ప్రజలు సోషల్‌ మీడియాలో అభిప్రాయాల వరద కురిపించారు. శ్రీరెడ్డికి మద్దతుగా కవిత్వం కూడా రాశారు. పరిశ్రమలోని డైలాగ్‌ ఆర్టిస్టులు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు శ్రీరెడ్డి చెప్పిన విషయాలు నిజమని సమర్ధించారు. నటి అపూర్వ మొదలుకొని ఎందరో ఆమె మాటలను బలపరిచారు.

శ్రీరెడ్డి నిరసన జరిగిన వారంలోనే తెలుగు పరిశ్రమలో లైంగిక అత్యాచారాలు, వేధింపుల గురించి పెద్ద ఎత్తున బహిరంగ చర్చలు మొదలయ్యాయి. ఇది మన దేశ సినీ చరిత్రలోనే బహుశా మొదటిసారి కావచ్చు. మహిళా సంఘాల సమర్ధన వలన, కొన్ని మీడియా ఛానల్స్‌ సహకారం వలన శ్రీరెడ్డి నిరసన ఒంటరి కేకగా మిగిలిపోలేదు. ఇతర క్యారెక్టర్‌ ఆర్టిస్టులు తాము పడే పాట్లు, ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం పడే కష్టాలు బహిర్గతం చేసి, మహిళా సంఘాల సహకారం అడిగారు. మహిళా సంఘాలు ఏప్రిల్‌ 15న నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వీరంతా హాజరయ్యారు. పరిశ్రమలో తమ స్వంత అనుభవాలను వివరిస్తూ, ఏదో విధంగా పని సంపాదించుకోవడానికి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సినిమా ఇతర రంగాలవారి కామవాంఛలకు బలవుతూ వీరు ఎటువంటి వాతావరణంలో పనిచేస్తున్నారో వింటున్న వారందరి కళ్ళు చెమర్చాయి. వారు లైంగిక దోపిడీతో పాటు తాము అనుభవిస్తున్న ఆర్థిక దోపిడీ గురించి కూడా వివరంగా చెప్పారు. సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని సినీరంగంలో పాతుకున్న దళారులకు క్రమం తప్పకుండా సమర్పించుకోవలసి ఉంటుందని చెప్పారు. వారి కష్టాలను అర్థం చేసుకోవడానికి మనందరినీ ఒక్క క్షణం వారి స్థానంలో నిలబడి ఆలోచించమని కోరారు.

తెలుగు సినీ రంగంలో ఎంట్రీ కావాలంటే ఈ తరగతి ఆర్టిస్టులకు ”సెక్స్‌” కోసం చేసే ఒప్పందం బట్టే సినిమాలలో వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి ఒప్పందాల తర్వాత కూడా అవకాశాలు రావడం తగ్గిపోయాయి. చాలావరకు స్థానిక ఆర్టిస్టులను పక్కన పెట్టి, సన్నగా, తెల్లగా ఉన్న ఉత్తరాది ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వడం ఎక్కువైంది, తల్లి, అత్త వంటి పాత్రలకు కూడా. అంటే లైంగిక దోపిడీ తరువాత కూడా పని దొరుకుతుందనే గ్యారంటీ లేదన్నమాట.

లైంగిక వేధింపుల సమస్య లేవనెత్తిన నేపథ్యంలో పరిశ్రమలో కొందరు పెద్దలు, మహిళా ఆర్టిస్టులు తమ సమస్యలను మీడియా ముందు బహిర్గతం చేయడం సరికాదని, అన్యాయం జరిగితే పోలీసు కంప్లైంట్‌ ఇవ్వడం సమంజసమని వ్యాఖ్యానించారు. అప్పటికే నిరసన ధ్వజమెత్తిన ఆర్టిస్టులకు ఈ మాటలతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. తమ సమస్యలు తీర్చాలంటే నిజాయితీగా ఆలోచించి, దీర్ఘకాలంలో నిలబడే నిర్ణయాలను, ఒక కార్యాచరణను తయారు చేయాలని వీరు డిమాండ్‌ చేశారు. క్రిమినల్‌ కేసులు పెట్టినంత మాత్రాన తమ సమస్యలు తీరవన్నారు. నెలలో కనీసం పది రోజులు పని దినాలు, ప్రత్యేక శౌచాలయాలు, షూటింగ్‌ లొకేషన్‌లో దుస్తులు మార్చుకునేందుకు సరైన మరుగు, దళారుల జోక్యానికి పూర్తిగా స్వస్తి చెప్పడం వంటి తమ కనీస డిమాండ్లు చెప్పారు.

ఏప్రిల్‌ 12వ తేదీన నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా స్వయంగా జోక్యం కలిగించుకుని కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని టీవీ ఛానల్స్‌లో వచ్చిన ఇంటర్వ్యూలు, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ ఒత్తిడి వలన ఫిల్మ్‌ ఛాంబర్‌

వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విషయాలపై మాట్లాడవలసి వచ్చింది. స్త్రీలపై జరిగే వేధింపులకు పరిష్కారంగా ఒక కమిటీ (క్యాష్‌) ఏర్పరుస్తామని హామీ ఇచ్చి, శ్రీరెడ్డిపై తాము విధించిన ఆంక్షలను నిశ్శబ్దంగా వాపసు తీసుకున్నారు.

గత ఏడాది హాలీవుడ్‌ పరిశ్రమ ఒక భారీ ప్రొడ్యూసర్‌ హార్వే వెన్‌ స్టెన్సే లైంగిక వేధింపుల ఆరోపణలతో అల్లకల్లోలమైంది. మన దేశంలో మళయాళం సినీ పరిశ్రమలో కొందరు మహిళా నటులు ఒక కలెక్టివ్‌గా ఏర్పడి, తమకు రక్షణ, అన్ని లావాదేవీలలో పారదర్శకత, మహిళలకు ఉపయుక్తమైన నిబంధనలు కావాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేపిన నిరసనలు పెద్ద హోదాలేని కంపెనీ, డైలాగ్‌ ఆర్టిస్టుల ఆధ్వర్యంలో జరగడం విశేషం. ఒక రకంగా చూస్తే అట్టడుగు వర్గం న్యాయం, గౌరవం కోసం

ఉద్యమించిందని చెప్పవచ్చు.

ఇంతటి చారిత్రాత్మకమైన నిరసన నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ చాలా పేలవంగా, నిస్సారంగా స్పందించింది. ఒక అంతర్గత కమిటీ వేస్తామని, వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తామని చెప్పడం చాలా నీరసంగా ఉంది. ఇటువంటి హామీలతో నిజమైన, దీర్ఘకాలిక మార్పులు సాధ్యం కావని గ్రహించిన మహిళా సంఘాలు, తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి, లైంగిక వేధింపులు, ఇతర ఆరోపణలను పరిశీలించాలని డిమాండ్‌ చేశాయి. లోతుగా పాతుకుపోయిన ఈ లింగ వివక్ష ధోరణులు అనేక కారణాలవల్ల కొనసాగుతున్నాయి. మహిళా ఆర్టిస్టులకు, మగ ఆర్టిస్టులకు వేతనాల్లో తేడాలు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు, జూనియర్‌ ఆర్టిస్టులకు, ఇతర ఆర్టిస్టులకు మధ్య ఉన్న వ్యత్యాసాలు, పోటీలు, వ్యవస్థీకరమైన దళారీ జోక్యం, కొన్ని పెద్ద కుటుంబాలకి పరిమితమైన పరిశ్రమ ముఖ్య కారణాలు కావచ్చు.

సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులకు తగిన గుర్తింపు, హోదా రావడం తేలిక కాదు. మహిళలు ప్రస్తుతం లేవనెత్తిన డిమాండ్లని అర్థం చేసుకుని పరిష్కరించాలంటే సమయం పడుతుంది. అయితే మార్పు దిశగా ముందడుగు వేశారు శ్రీరెడ్డి, అపూర్వ, పవిత్ర, శృతి, హేమ, ఇంకా అనేకమంది ఇతర ఆర్టిస్టులు. వీరు లైంగిక దోపిడీ, వేధింపులపై తెర తీసి సినీ పరిశ్రమలో మార్పునకు స్వాగతం పలికారు.

రచయితలు –

ఎ.సునీత, వసుధ నాగరాజ్‌, కె.సజయ, తేజస్విని మాడభూషి.

తెలుగు అనువాదం: బి.శ్యామసుందరి

(ప్రజాతంత్ర సౌజన్యంతో…)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.