‘ఉరి ఆర్డినెన్స్‌’ను ముందు అధికారుల మీద అమలు చేయాలి – జూపాక సుభద్ర

‘ఆసిఫా’ ఈ పేరు ఆ పాలుగారే పసితనంతో, అన్నెం పున్నెం, పాపం పుణ్యం తెలియని ఆ అమాయకపు ఫోటో రెండు వారాల నుంచి జాతీయ, అంతర్జాతీయ సమాజాల్ని నిద్రబోనియ్యని సలుపులు వెంటాడుతున్నయి. ఎనిమిదేండ్ల ఒక పసిబిడ్డను పశువులు గాస్తున్నప్పుడు ఎత్కబోయి, గుడిలో వారం రోజులు మత్తుమందిచ్చి అత్యాచారం జేసి సంపేసిన ఘటన ప్రపంచాన్ని కుదిపేస్తూంది.

ఈ ఘటన జరిగిన (జనవరి 2018) మూడునెల్లగ్గానీ బైట సమాజానికి తెలువలే. చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో ప్రపంచమంతా పాకే అడ్వాన్స్‌డ్‌ సమాచార వ్యవస్థ ఉన్న ఈ కాలంలో కూడా ఇంతటి క్రూర వార్త బైటకి పొక్కడానికి మూన్నెల్లు పట్టిందంటే… సమాచార, మీడియా వ్యవస్థల మీద ఎంత పగడ్బందీ సమాధులున్నయో అర్తమైతుంది.

ఎనిమిదేండ్ల అసిఫా తల్లి తండ్రులు, తోబుట్టువులు, చుట్టాలు, పక్కాలు, ఎండా, వానలు, మంచుకొండలు, వాగులు, నదులు, చెట్టుచేమలు, పశువులు, పక్షులు, వాటి మేతలు, వాటి కాతలు, సంచార జీవిత బలగం ఉన్న జమ్ములోని కతువా జిల్లాలోని రసాన గ్రామ బకర్వాల్‌ ముస్లిం ఆదివాసీ తెగకు చెందిన పసిబిడ్డ. ప్రకృతి పర్యావరణం తప్ప కులమతాల తేడాలు, క్రూరత్వాలు తెలువని పాలకారే పసికూన. కానీ హిందూత్వ గూండాలకు, రౌడీ పూజార్లకు, హిందూ క్రూర పోలీసులకు ఎనిమిదేండ్ల ఆసిఫా హిందూ వ్యతిరేకిగా, హిందూ మత ధ్వంసకారిగా, పాకిస్తాన్‌ ఏజెంట్‌గా, జమ్ము ఆక్రమిత ముస్లిం తీవ్రవాదిగా కనబడింది.

జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో జమ్మూలో హిందువులు 1% కూడా లేరు. కానీ కతువాలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో హిందువులు మైనారిటీలు. అయినా వీరు ముస్లింల మీద చేసే ఆగడాలకు అంతులేనిదిగా ఉందని వార్తలుంటుంటాయి. కానీ ఆసిఫా మీద ఇంత క్రూరత్వానికి ఒడిగట్టడం వారి అమానవీయతలకు పరాకాష్ట. రోజూలాగానే రెండు చిన్న గుర్రాలను కాసుకునేందుకు బైటి పచ్చికల్లోకి వచ్చిన ఎనిమిదేండ్ల పసిబిడ్డను అపహరించి ఒక పూజారి, అతని చుట్టాలు, నలుగురు పోలీసులు హిందూత్వాలకు పవిత్రమని చెప్పుకునే గుడిలో మత్తుమందిచ్చి ఏడు రోజులు అత్యాచారం చేసి, ఇంకా క్రూరంగా బండతో బాది చంపేసిండ్రు.

జమ్ములో చలికాలం కొండ దిగువన, ఎండాకాలం కొండ ఎగువన పశువులు కాసుకొని పొట్టపోసుకునే అమాయకులు ఆసిఫా తల్లిదండ్రులు. వాల్లకు పాకిస్థాన్‌తో, ముస్లిం ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపనలు కూడా లేనివాల్లు. హిందుత్వ క్రూరత్వాలతో ఈ పశువులు కాసుకొనే సంచార బకర్వాల్‌ ఆదివాసీ ముస్లిమ్‌లను భయభ్రాంతులకు గురిచేసి వెల్లగొట్టడానికి ఈ హిందూ దుర్మార్గులు ఆసిఫానే ఎంచుకున్నరు.

‘ఆసిఫా తెలివికల్లది డాక్టర్‌గా చూడాలనుకున్న నా బిడ్డను’ అని బిడ్డ కోసం కలలుకన్న ఆ కన్నతల్లి దుక్కాలు ఎట్లా సల్లార్తాయి. బిడ్డను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసి చంపేస్తే నిలబడి కొట్లాడలేని అసహాయులు. గ్రామాన్నుంచి పారి పోయేటట్టుగా భయభ్రాంతుల్ని చేసిండ్రు హిందూ క్రూరులు. పశువులు మేపుకుంటూ బతికే సంచార ముస్లిమ్‌ల మీద కచ్చగట్టి వాల్ల పసికూనను బీభత్సంగా చేసి చంపేసి భయభ్రాంతుల్ని చేసినయి హిందూ శక్తులు.

నిత్యం దేశంలో మహిళలమీద అదుపులేని అత్యాచారాలతో సమాజమంతా సతమతమవుతున్న సందర్భంలో ఈ మధ్య పసిపిల్లల మీద అత్యాచారాలు పెరగడం మానవజాతికి ఇంతకన్నా పతనావస్థ ఉంటదా! పసిపిల్లల మీద రేపులు, చంపడాల్లో అధికారంలో ఉన్నవారు కూడా ఉండడం మరింత ప్రమాదకరం. కతువాలో ఆసిఫా సంఘటనలో అధికారంలో ఉన్న హిందూత్వ మంత్రులు కూడా ఎనిమిదేండ్ల బాలికను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసి చంపడాన్ని న్యాయమని నిందితుల తరపున మద్దతుగా వీథుల్లో ప్రదర్శనలు చేయడం సిగ్గుచేటు. నేరగాల్లే అధికారంలో ఉంటే ప్రజలకు రక్షణ ఎట్లా దొర్కుతది. న్యాయం వైపు నిలబడాల్సిన న్యాయవాదులు హిందుత్వ క్రూరత్వాలుగా మారి కనీసం ఛార్జిషీటు కూడా వేయకుండా అడ్డుకోవడాన్ని ఇంతకన్నా సమాజ వ్యవస్థల పతనముంటుందా!

కుల మత జెండర్‌లకు అతీతంగా మనుషుల మాన ప్రాణాల హక్కుల రక్షణలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, పాలకులది. కానీ పాలకులు, ప్రభుత్వ మనుషులే అత్యాచారాల్ని, హత్యలు చేస్తున్న నేరస్థులకు అండగా నిలబడితే ప్రజలకు రక్షణ ఎట్లా? హిందుత్వ ముసుగులో చేసే దుర్మార్గాలను న్యాయ వ్యవస్థ కాపాడుతుంటే ప్రజలు న్యాయం కోసం ఎక్కడికి పోవాలి? అనేది ఈనాడు సమాజాన్ని కలచివేస్తున్న పరిస్థితి. దేశంలో కతువా, ఉన్నావో లాంటి ఘటనల మీద దేశ సమాజాలే కాదు అంతర్జాతీయ సమాజాలు కూడా పెద్ద ఎత్తున హిందుత్వ ప్రభుత్వాన్ని నిద్రబోనియ్యట్లేదు. ఐక్యరాజ్య సమితి కూడా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని భారత ప్రభుత్వానికి సూచిస్తున్నా ప్రధానమంత్రి ఇవేవీ పట్టనట్లు ఏ స్పందన లేక విదేశాల్లో విహరిస్తుంటే ‘గో బ్యాక్‌’ అనే వ్యతిరేకతలు చుట్టుముడుతున్నా అంతా సవ్యమేనన్నట్లుగా ఉండడంను ఏమనాలి?

‘బేటి బచావో’ అంటూనే లోకం క్రూరత్వాలు తెలువని పసిపిల్లల్ని అత్యాచారాలతో హత్యలు చేస్తూన్న దుర్మార్గుల్ని కాపాడుతున్న పాలకుల్కి ఉరిశిక్ష వేయాలి. పోక్సో, నిర్భయ చట్టాలు సరిపోవని పన్నెండేల్లలోపు పిల్లల మీద అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని, జనాల ఆగ్రహాల్ని చల్లార్చినీకి ఆగమేగాలమీద ఆర్డినెన్సు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ ఆర్డినెన్సును ముందు అధికార నేరస్తుల మీద ప్రయోగించండి. అప్పుడే జనాలకు చట్టాల అమలులో కొంతైనా నమ్మకమేర్పడుతుంది. ఆసిఫాలాంటి పసిపిల్లలకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.