కొన్నాళ్ళైతే… అన్నీ సర్దుకుంటాయా?! – పి. ప్రశాంతి

 

పీప్‌…పి…పీప్‌… హారన్‌ మోతకి బస్సు కిటికీకి తలానించి నిద్ర పోతున్న శాంతికి ఒక్కసారిగా మెలకువచ్చింది. గతుకుల కంకర్రోడ్డు మీద ఒళ్ళు హూనమవుతున్నా, పొలాలమీంచి వీస్తున్న పైర గాలికి హాయిగా ఉండి కళ్ళు మూతలు పడుతున్నాయ్‌. ఏదో ఊరు దగ్గరికొచ్చినట్టుంది. ఆ ప్రైవేటు బస్సు డ్రైవర్‌ ఒకటే హారన్‌ వేస్తున్నాడు. తర్వాతి ఊళ్ళోనే దిగాలని సర్దుకుని కూర్చుంది పన్నెండేళ్ళ శాంతి. వేసవి సెలవలకి నాయనమ్మగారింటి కెళ్తానంటే టికెట్టుక్కావ ల్సిన చిల్లరతోపాటు మూడు పది రూపాయల నోట్లిచ్చి బస్సెక్కిం చారు శాంతి వాళ్ళ నాన్న. ఊర్లో చెల్లితోను, తన పాత నేస్తాలతోను, సెలవలకి ఊరికొచ్చే కజిన్స్‌తోను కలిసి ఆడుకోబోయే ఆటలు, చెరువులో ఈతలు, చేల గట్లమీద రైలాటలు, తాటి తోపుల్లో ముంజికాయలు, ఈతపళ్ళు… తను చేయ బోయేవన్నీ గుర్తొచ్చి హుషారు పెరిగింది. ఈసారైనా చెరువు కట్టమీది చింత చెట్టుమీంచి లక్ష్మితో పాటు డైవ్‌ చేసి ఈత కొట్టాలని మహా సరదాగా ఉంది. కానీ తన ప్రియనేస్తం లక్ష్మి ఇక తమతో ఈ ఆటలకి రానట్టేనా… బస్సు ఊరి దగ్గరికొచ్చేసరికి గబగబా బ్యాగు తీసుకుని బస్సు వెనకవైపున్న గేటు దగ్గరకెళ్ళేసరికి ఊరి మొదట్లో ఉన్న చెరువుగట్టు మీదకొచ్చి ఆగింది. ఎర్రటి మట్టి మేఘం ఒకటి బస్సుని దాటుకుని ముందుకెళ్ళిపోయాక దిగి అటూ ఇటూ చూసేలోపే ఇంకో మట్టి మేఘాన్ని సృష్టించి ముందుకెళ్ళిపోయింది బస్సు.

సెలవలిచ్చిన దగ్గర్నుంచి ఊళ్ళో తమ నేస్తాలెవరొస్తారా అని ప్రతి బస్సునీ చూస్తున్న పిల్లల్లో కొందరు ‘హేయ్‌… శాంతొ చ్చిందీ… శాంతక్కొచ్చిందీ…’ అని కలగా పులగంగా అరుచుకుంటూ తలో పక్కనుంచీ రయ్యిన దూసుకొచ్చేశారు శాంతి దగ్గరికి. తోపుళ్ళు, పలకరింపులు, కౌగలింతలు అయ్యాక నాన్నమ్మ ఇంటేపు బయల్దేరింది ఆ పిల్ల గుంపంతా గోలగోలగా. శాంతి మనసు మాత్రం లక్ష్మి గురించే ఆలోచిస్తుంది. ఇంతలో చెరువుకి ఆ పక్కనున్న ఇంకో దార్లోంచి ‘అక్కాయ్‌… అక్కాయ్‌…’ అంటూ పరిగెత్తు కొచ్చిన వీణ శాంతిని చుట్టేసింది. ఇద్దరూ కలిసి రెండు, మూడు గుండ్రాలు తిరిగాక ఇంటికి బయల్దేరారు. అక్కడుండబోయే రెండు వారాల్లో ఏమేమి చెయ్యొచ్చో… ఒకర్తో ఒకరు పోటీ పడ్తూ కలగాపులగంగా మాట్లాడుకుంటూ మొత్తానికి 10 నిమిషాలకి కూతవేటు దూరంలో ఉన్న ఇంటికి చేరారు. ‘శాంతమ్మా.. రా… రా…’ అంటూ ఎదురొచ్చింది నాయ నమ్మ. ‘ఓయ్‌… కోతిమ్తకా… దాన్ని కాళ్ళు చేతులు కడుక్కు రానివ్వండర్రా… ఆ అరుగుమీద కూర్చోండందరూ పుల్లట్లేస్తా… తిందురుగాని’ అంటూ వంటింట్లోకెళ్ళింది.

నాయనమ్మ పెట్టిన పుల్లట్లు తిని ఆ వాడకట్టులో అందర్నీ పలకరించుకుంటూ శివాలయం పెద్దరుగు దగ్గర చేరి మళ్ళీ నాలుగింటికల్లా చెరువు కట్టమీది చింతచెట్టు దగ్గర కలుసుకుందామని చెప్పుకుని ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయారు. శాంతికి మాత్రం గమ్మత్తైన లక్ష్మి అల్లరి గుర్తొస్తోంది.

అన్నం తిని అక్కచెల్లెళ్ళిద్దరూ తర గని కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారి పోయారు. మెలుకూవచ్చేసరికి మూడు దాటింది. ముఖాలు కడుక్కొచ్చి, గౌన్లు మార్చు కుని, నాయనమ్మ పెట్టిన సున్నుండలు, పప్పు చెక్కలు తిని ఆడుకోటానికెళ్తున్నామని చెప్పి చెరువు కట్టకేసి బయల్దేరారు. ఫర్లాంగు దూరం వెళ్ళగానే ‘ఏ శాంతీ… ఎప్పుడొచ్చావ్‌?’ అని సంభ్రమంగా కేకేసింది సన్నజాజులు కోస్తున్న లక్ష్ష్మి… గోడమీదుగా దూకేసేదే… కాని బల్లదిగి గేటు తీసుకుని పరిగెత్తుకొచ్చింది. నాలుగిళ్ళ దూరం… అంతలోని తూలి పడబోయింది అంతగా అలవాటు లేని చీరకుచ్చిళ్ళు కాళ్ళ కడ్డం పడి. తమాయించుకుని వచ్చి శాంతిని వాటేసుకుంది. ఆనందంతో తబ్బిబైంది శాంతి. తనకంటే ఏడాదిన్నర పెద్దదైనా లక్ష్మి, శాంతిది ఘాటైన స్నేహం. నెల్లాళ్ళకిందటే లక్ష్మి వాళ్ళ ముత్తవ్వకి ప్రాణం మీదకొస్తే లక్ష్మి పెళ్ళి చూడాలన్న ఆమె చివరి కోర్కె తీర్చాలని, రెండిళ్ళవతల దగ్గర సంబంధముంటే పదేళ్ళ తేడా ఉన్నా పెళ్ళి చేసేశారు. ఈ ఏడాది పదో తరగతి ఫస్ట్‌ క్లాస్‌లో పాసవ్వాలని పట్టుమీదున్న లక్ష్మి ఆశలు నీరుకారిపోయాయి. సరిగ్గా పరీక్షల్నాటికే పెళ్ళి, శోభనం, పదహార్రోజుల పండగ…

”వీణా నువ్వెళ్ళి ఆడుకో, మేమిద్దరం మాట్లాడుకోవాలి చాలా రోజులైంది” అని లక్ష్మి బతిమాలుతున్నట్లం టుంటే ‘సరే అక్కా… సాయంత్రం వస్తాలే’ అంటూ రివ్వున పరిగెత్తిపోయింది ఆడుకోడానికి.

పెద్దమనిషై ఏడాదన్నా కాలేదు… శోభనమంటే తెల్లచీర, మల్లెపూలు, పట్టె మంచం, పాలగ్లాసు అనుకుంటున్న లక్ష్మికి అది చీకటి రాత్రని, తన ఇష్టాయిష్టాలతో పనిలేదని, ఏ రాత్రైనా నరకమేనని… చచ్చి పోవాలనిపిస్తోందని ఏడుస్తూ చెప్తోంటే శాంతి క్కూడా ఏడుపాగలేదు. ‘అమ్మతో చెప్తే బాధ పడ్డా, నీ వయసులో నేనూ అంతేనమ్మా, తట్టుకో…అంతా సర్దుకుంటుంది అని ఓదారు స్తుందంతే’ అంటూ దుఃఖపడింది లక్ష్మి. తను మాత్రం బాగా చదువుకుని, ఉద్యోగం చేసేవరకూ పెళ్ళి చేసుకోవద్దని గదమాయించి చెప్పింది శాంతికి. ఎన్ని మాట్లాడుకున్నారో… ఎంత కష్టమొచ్చినా చావొద్దని ఎన్ని ఒట్లు పెట్టుకున్నారో… ఆ సెలవుల్లో.

రెండేళ్ళు దాటినై. ఒకటీ అరా ఉత్త రాలు రాసుకున్నా కలుసుకున్నది మాట్లాడు కున్నది లేదు. లక్ష్మి ప్రసవానికొచ్చి, కనలేక చచ్చిపోయిందని, బెజవాడ పెద్దాసుపత్రిలో

ఉన్నామని లక్ష్మి వాళ్ళన్న కబురు చేస్తే నమ్మలేకపోయిన శాంతి అమ్మతోపాటు ఆసుపత్రికెళ్ళింది. లక్ష్మిని చూస్తుంటే ఏడుపాగట్లేదు.

ఎదగని శరీరం, బలపడని గర్భ సంచి, ఒంటబట్టని తిండి, మానసిక దిగులు, బలవంతపు సంసారం, బయటపడనివ్వని పరువు ప్రతిష్ట, ఆటపాటల వయసులో పని బరువు… మూకుమ్మడిగా లక్ష్మిని చంపేశాయి. వయసుడిగిన ముత్తవ్వ చివరికోరిక పేరుతో తన బిడ్డ గొంతు కోశారని, దగ్గర బంధువుల పేరుతో అన్నీ కలిపేసుకోడానికే తన బిడ్డని పావుని చేశారని, కొన్నాళ్ళైతే అన్నీ సర్దు కుంటాయని వాళ్ళమ్మ ఎంత ఏడ్చినా కానీ లక్ష్మి బతికి తిరిగొస్తుందా? ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకోడం కాదా? తన ఆక్రందన ఎవరితో చెప్పాలి? ఈ విషయాలెవరికి తెలియవు? అయినా ఎందుకింకా జరుగు తూనే ఉన్నాయ్‌? ఎవరు ఎవరికి చెప్పాలి? ఎవరు ఎవరి మాట వింటారు?

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో