ప్రతిస్పందన

నేను ”భూమిక” ప్రేమికను. రజతోత్సవ సంచిక చదవగానే నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. మరొకవైపు భూమిక పుట్టి పెరగడానికి తన 25 ఏండ్ల ప్రయాణంలో పడ్డ కష్టాలు, ఎదిగిన తీరు తెన్నులను వివరించిన కె.సత్యవతిగారి వివరణ చాలా చాలా బాగుంది.

అసలు రజతోత్సవ సంచిక ”కూర్పు”లోనే చాలా చాలా ”మార్పు”లున్నాయి. ఎంతో పొందికగా, ఎన్నో, ఎన్నెన్నో విషయాలు, రచయితల ఇంటర్వ్యూలు, ప్రతిస్పందనలు, కథలు, వ్యాసాలతో భూమిక ఆధ్వర్యంలో నడుస్తున్న సపోర్ట్‌ సెంటర్స్‌ సమాచారంతో, వ్యాసాలతో ముఖ్యంగా అన్నింటికన్నా మహిళలు-చట్టాలు, సహాయ సంస్థలు అనే అంశాలతో పరిపూర్ణంగా వచ్చింది.

”మారుమూల పల్లెల్లో మట్టి కుటుంబంలో పుట్టిన మనిషి ప్రయాణం… భూమిక ప్రయాణం” సూపర్‌ కాప్షన్‌. ఇది భూమికకే హైలెట్‌, పచ్చి వాస్తవం కూడా. 1992లో అన్వేషి చర్చలతో 1993లో భూమిక తొలి సంచిక రావడం, సత్యవతిగారు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి భూమికనే ప్రేమించి, అక్కున చేర్చుకున్న విధానం వివరణ బాగుంది. ‘హెచ్‌.ఐ.వి, ఎయిడ్స్‌’ ప్రత్యేక సంచిక నన్ను కూడా కదిలించింది.

‘రమా మేల్కోటే’ గారి పరిచయం ఆమె తెలుగు నాట స్త్రీల ఉద్యమాలలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌పై పరిశోధన చేసి అనేక మహిళా సమస్యలపై ఆమె శోధించి, సాధించిన అంశాలను ఒక పుస్తక రూపంలో తీసికొని రావడం, అది ఇతర దేశాల్లో కూడా మహిళా ఉద్యమాలపై ప్రభావం చూపడం, అక్కడ కూడా ఒక పుస్తకం రావడం విశేషం. ఆహారపు హక్కుపై, మహిళల, దళితుల సమస్యలపై లోతుగా అధ్యయనం చేసిన విధానం చాలా అబ్బురపరచింది.

వసంత కన్నాభిరాన్‌ – ఆమె ‘అస్మిత’ 25 సంవత్సరాల ప్రయాణం ”సెన్సార్‌షిప్‌”పై ప్రాజెక్టు గురించి చెప్పిన వివరాలు స్త్రీల

ఉద్యమాల గురించి, సాధికారత, జెండర్‌ గురించి వివరించిన తీరు, ఆమె రచనల గురించి చాలా చక్కగా వివరించారు. ఇంటర్వ్యూ చేసిన ఆకెళ్ళ పద్మ, కె.సత్యవతిగారి తీరు బాగుంది.

కామేశ్వరి జంధ్యాల – క్షేత్రస్థాయి మహిళల పోరాటాలు ఆమెను ప్రభావితం చేసిన తీరు, సామాజిక పరిస్థితులు, కుటుంబాల నేపథ్యాల గురించి చెప్పిన తీరు ఎంతో ముచ్చటగా ఉంది. అమ్మా నాన్నల నుండి అనేక విషయాలు నేర్చుకున్న తీరు, ప్రెసిడెన్సీ కాలేజి లైఫ్‌, అమెరికాలో చదువు అనుభవాలు చక్కగా వివరించారు. మహిళా సమత కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించి, బాలికల విద్యపై అనేక పరిశోధనలు చేసినట్లు వివరించారు. స్ఫూర్తిదాయకంగా ఉంది.

విజయ భారతి – ఆమె బాల్యం వివరణలోనే ఆమె గొప్ప వ్యక్తిత్వం బయటపడింది. తండ్రి బోయి భీమన్నగారి జీవితంతో ముడిపడి తాను నేర్చుకున్న ఎన్నో విషయాలను వివరించారు. తెలుగు అకాడమీలో రీసెర్చ్‌ ఆఫీసర్‌గా జాయిన్‌ కావడం ‘సాహిత్య కోశం’ ప్రాజెక్టులో ఎంతో శ్రమపడి వర్క్‌ చేసినా, కులం కారణంగా ఆమె ఎదుర్కొన్న అవమానాలు కంటనీరు పెట్టించాయి.

ముదిగంటి సుజాతారెడ్డి – ఆమె బాల్యం గురించి చెప్పిన తీరు ఎంతో ముచ్చటగా ఉంది. రజాకార్ల ఉద్యమ విషయాలు, ఆంధ్రకు వెళ్ళడం, తిరిగి రావడం వంటి అనేక విషయాలను వివరించారు. ఒక స్త్రీగా, అంత ధైర్యంగా రజాకార్ల ఉద్యమ విషయాలు రాయడం తెలంగాణా రచయితలకే గర్వకారణం.

అనిశెట్టి రజిత – ఉద్యమాలే ఊపిరిగా జీవనం సాగించిన రజితగారు తన బాల్యాన్ని, చదువును చక్కగా వివరించారు. ఇంటి పరిసరాలలోని తగవులు, వారి భార్యలను కొట్టడం, పరిసరాల జీవితాలు, ప్రభావితమైన తీరు బాగా చెప్పారు. ఇవి చూసి వివాహ వ్యవస్థమీద వ్యతిరేక భావాలు ఒక కసి ఏర్పడిందని, అప్పటినుండే హింసమీద ప్రతిఘటన ఏర్పడిందని పేర్కొన్నారు. ఉద్యమాలలో పాల్గొనడం, నిరసనలు తెలపడం జై తెలంగాణ ఉద్యమం నుండే మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్రమంతా తిరగడం, సమస్యలు తెలుసుకోవడం, కవితలు వ్రాయడం, ప్రసంగాలు చేయడం తన ఊపిరిగా ఉండేవని తెలిపారు. దగాపడ్డవారు దళితులేనని, మహిళలకు, దగాపడ్డ వారికి ప్రత్యేక సెషన్లు నిర్వహించే స్థాయికి ఎదిగిన తీరు బాగుంది.

అబ్బూరి ఛాయాదేవి – చేరాగారన్నట్లు తెలుగు నవలా రచయితగా ఆమె ఎంతో ప్రతిభావంతురాలు. యదార్థ జీవన దృశ్యాలే వారి రచనల ఇతివృత్తం. అనుభవాలతో గుండెల్ని కదిలించేలా అక్షర రూపంలో కథనం చేయడం ఆమె స్వంతం. ఆమెకు తల్లిదండ్రులు ఛాయాదేవి అని పేరు పెట్టిన తీరు వివరించడం ఆమె నిష్కల్మషానికి ఒక మచ్చుతునక. తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్న అగ్రశ్రేణి రచయితగా, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతగా మంచి పేరు తెచ్చుకున్నారు.

అన్ని వ్యాసాలు, కథలు ఆణిముత్యాలు అనడంలో అతిశయోక్తి లేదు. రాసినవారికి, మాకు అందించిన ‘భూమిక’కు ధన్యవాదాలు.

మాకు తెలియని, అందరికీ తెలియవలసిన మహిళలు, పిల్లల కోసం భూమిక ఆధ్వర్యంలో నడుస్తున్న ”సపోర్ట్‌ సెంటర్స్‌” వివరణ చాలా చాలా బాగుంది. సఖి కేంద్రం / వన్‌స్టాప్‌ సెంటర్‌ – భారతదేశంలో 186 కేంద్రాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నట్లు భిన్నంగా, మన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలను ఎంపిక చేసి ”సఖి” కేంద్రాలకు అప్పగించినట్లు తెలిపారు, ధన్యవాదాలు.

ఇకపోతే కవితలన్నీ ఆణిముత్యాలే. ప్రథమ స్త్రీ వాద చరిత్ర కారిణి ”భండారు అచ్చమాంబ” గారి గురించి చాలా అమూల్యమైన (మాకు తెలియని) విషయాలు తెలుసుకున్నాం. కుటుంబ హింసకు గురయిన వారితో వ్యవహరించాల్సిన విధానం గురించి ”సిబాన్‌ లాయిడ్‌” వ్యాసం చాలా బాగుంది. నిజంగా అందరం తెలుసుకోవాలి.

తొలి మేజర్‌ ఫెమినిస్ట్‌ ”మేరీ ఊల్‌స్టన్‌ క్రాఫ్ట్‌” అని స్త్రీ వాదులంతా అంగీకరించడంలో అతిశయోక్తి లేదు. అందించిన పి.సత్యవతి గారికి ధన్యవాదాలు.

మొత్తంగా ”రజతోత్సవ సంచిక” అందించిన కె.సత్యవతి గారికి ధన్యవాదాలు. సంపాదక వర్గానికి, సహ సంపాదకురాలు పి.ప్రశాంతికి కృతజ్ఞతలు.

Share
This entry was posted in ప్రతిస్పందన. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.