కుల మత వికృతులు కూలిపోయే వరదలు రావాలి -జూపాక సుభద్ర

కేరళ వరద బీభత్సాలు, ముంపులు జిల్లాలు కొట్కపోయిన వార్తలు చదివి మా కేరళ దోస్తులు ఎట్లా వున్నారో అని ఫోనులు మెస్సేజ్‌లు పంపినా యింకా రిప్లయి రాలేదు వాల్ల నుంచి. వాల్లు రచయితలు, దళితులు వాల్ల నుంచి రావాలి వార్తలు అని ఎదురుచూస్తున్నం ఆందోళనగా! ఆ మధ్య కేరళలో కొచ్చిన్‌కు బోతే ఆ బిల్లింగ్‌లు చూసి నంక కండ్లు తిరిగినయి ఆ అభివృద్ధికి. సముద్రం పక్కనే (అరేబియా) ఎంత పెద్ద పెద్ద అంతస్తులో…. ఎన్ని పాష్‌ షాపింగ్‌ కాంప్లెక్సులో…. బహుళ ప్రాజెక్టులుగా నివాస కాలనీలుండడం చూసి వామ్మో… ఏందీ…. కాంక్రీట్‌ ప్రపంచం అని విస్తుబోయినం. ఓ దిక్కు సముద్రం దాని పక్కనే ఆకాశాన్నందుకుంటున్న అత్యాధునిక నిర్మాణాలు.

కేరళ అంటే నిత్య పచ్చికతో పచ్చగా ఆకుబట్టిన అడివికోనగా నీల్లు, పచ్చటి కొబ్బరి వనాలతో నవ నవలాడే నాగరిక భూమి. కానీ అట్లాంటి కేరళ యీ రోజు దాదాపు రెండు వారాలు వానలు, వరదలుగా అల్లకల్లోలమైంది. వందల మంది చచ్చిపోయిండ్రు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని, ప్రకృతిని ధ్వంసం చేసినందువల్ల యీ విపత్తులని పర్యావరణ శాస్త్రవేత్తలు చెపుతుంటే ప్రభుత్వాలు బేఖాతరు చేస్తున్నయి. కేరళ కొండల్ని, పచ్చికల్ని, వాగుల్ని, నదుల్ని ధ్వంసం జేసిన కాంక్రీటు కట్టడాల వల్లనే యీ విపత్తులు జరుగుతున్నాయి. …. నిజానికీ వరదలు విపత్తులు ప్రకృతి నుంచి జరిగినాయి కాదు. మానవ అభివృద్ధి వికృతే. ప్రకృతితో ఆడిన చెలగాటమే ఈ ప్రాణ సంకటాలు. పట్టణీకరణలు నదుల నడ్డివిరిచే నిర్మాణాలు ప్రకృతి విలయాల ముందు దూది పింజాలు యీ అభివృద్ధి నిర్మాణాలు, పట్టణీకరించే శక్తులే బాధ్యులు. యీ వ్యాపారశక్తులకి ప్రకృతి, పర్యావరణం పట్టదు. వారికి వ్యాపార విలువలే అభివృద్ధి విలువలుగా వున్నాయి.

పర్యావరణాన్ని ధ్వంసం జేసే వాల్లు వేరు, దానివల్ల బాధితులుగా వున్నకొంప, గోడు, ప్రాణాలు, కుటుంబాన్ని పోగొట్టుకునే బాధితులు అణగారినకులాలు. అణగారిన మహిళలు. సహాయ శిబిరాల్లో కూడా కులాల వారిగా శిబిరాలు ఏర్పాటు చేయడం కుల దుర్మార్గం. ఎన్ని వరదలొచ్చినా మొత్తం కొట్కపోయినా కులం కొట్కపోదేమో / కుల మతాల్ని ముంచెత్తే వరదలు రావాలి.

హైదరాబాద్‌లో కూడా వరదలు రావని చెప్పలేము. చిన్నవానకే బస్తీలన్ని మునిగిపోతున్న నిర్మాణాలు చూస్తునే వున్నాం. హైద్రాబాద్‌లో కొన్ని వేల చెరువులు బొయి యిండ్లు కట్టడాలు వెలిసినయి. కాలువలు, చెరువులు, కుంటలు, గుట్టలు, లోయలు ఎగుడుదిగుడుగా భూమి సోయగమంతా మాసిపోయింది. పర్యవసానంగా చినుకుపడితే చాలు రోడ్లన్ని, జలమయమైతున్నయి, కాలనీలన్ని, బస్తీలన్ని మునిగిపోతున్నయి………. యీ ప్రకృతి విద్వంసంలో, ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమ కట్టడాల్లో, ఆధునిక అభివృద్ధి పేరుతో జరిగే వాటితో అణగారిన జనానికి ఏ సంబంధంలేదు……….. కేరళలో వరద బాధితుల పరిస్థితి చాలా దయనీయంగా వుంది. యిండ్లు కూలిపోయి కుటుంబంలోఎవరు ఎటుకొట్కపోయిండ్రో తెలవని స్థితి, అనేక ప్రాణనష్టం జరిగింది. సహాయక శిబిరాల్లో దాదాపు ఎనిమిది లక్షల మంది తలదాచుకున్నారంటే వరద బీబత్సము ఎంత అతలాకుతలము చేసిందో వూహించొచ్చు.

యిట్లాంటి విపత్తు బాదితుల పట్ల సాటిమానవ స్పందన ప్రపంచ వ్యాప్తంగా వెల్లువవుతుంటే ….. భారతదేశ మతవాదులకు, మత ఉన్మాదులకు కేరళ బాధితుల పట్ల విషపూరిత ప్రచారం చేస్తున్నరు. ప్రకృతిని ధ్వంసం చేసిన కారణాలు చెప్పకుండా కేరళవాల్లు ఎద్దు మాంసం తిన్నందుకు వరదలు ముంచెత్తినయనీ, వాల్లు అయ్యప్ప దేవునికి విరుద్దంగా ఆడవాల్లను ఆలయాల్లోకి అనుమతించినందువల్ల వరదలు ముంచెత్తినయనీ ఒక అవాస్తవమైన, అశాస్త్రీయ, అమాననీయ ప్రచారం చేయడం హేయమైనది. యిట్లాంటి వాల్లను ప్రభుత్వాలు, సంస్థలు ఏమి చేయవు. కాని అరబ్‌ దేశంలో ఒక ఉద్యోగి వరద బాదితులనుద్దేశించి ‘వీల్లు టాయిలెట్‌కి ఎట్లా పోతరు’ అని సోషల్‌ మిడియాలో పెడితే ఆ సదరు ఉద్యోగిని కంపెనీ నుంచే తీసేసిన చర్యలు యిక్కడ కనిపించవు. కేరళను వరదలు ముంచెత్తిన వార్త ధన ప్రాణ నష్టాలకు సంబంధించినవి, ఉత్తర భారతంలో పెద్దగా వార్త కూడా కాలేదని తెలిసి అసహ్యం బుట్టింది. మత వికృతులకు వరదలకు వరదలొచ్చి కొట్కపోతే…. బాగుండు.

కేరళలో జరిగిన యింత బారీ ప్రాణనష్టంను, విపత్తును, పంటలు, యిండ్లు నాశనమైన కూడా యిది జాతీయ విపత్తు కాదట. కేరళ అంత దారుణంగా ధ్వంసమైతే… అది జాతీయ విపత్తు కాదని ఓ 500 కోట్లు యిచ్చి దులుపుకున్నది. కాని తమ పబ్లిసిటీకోసం విదేశీయాత్రల కోసం వేల కోట్లు రూపాయాలను వ్యర్థం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అణగారిన పేద జనం తమ రేషన్‌ బియ్యాన్ని, చిన్న ఉద్యోగులు కూడా తమ వేతనాలు యిచ్చి ఆదరించడంను హాట్సాఫ్‌ చెప్పాలి. పాకిస్థాన్‌ నుంచి, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాలు కేరళ బాధితులకు ఆపన్న హస్తం అందిస్తుంటే…. భారత ప్రభుత్వం’ విదేశీ సాయం వద్దంటూ…. విదేశాలన్ని తిరుక్కుంట అలాయి బలాయిలతో అప్పులడుక్కున్నడు ఎట్లా ముద్దు?

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో