వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన కొండపల్లి కోటేశ్వరమ్మ గార్కి,

గౌరవంతో నమస్కరిస్తూ. గాజు పలకలో విశ్రాంతి తీసుకుంటున్న మిమ్మల్ని చూసి కన్నీళ్ళు ఆగలేదు. దుఃఖం తన్నుకొచ్చింది. నూరేళ్ళ మీ పుట్టినరోజును ఈ మధ్యే మీ అభిమానులందరి మధ్యనా జరపడం ఫేస్‌బుక్‌లో చూసాను. ఎంత నిర్మలంగా, హాయిగా ఉన్నారో… చిరునవ్వును మీ బలహీనపడిన శరీరం ఏ మాత్రం చెరపలేదు. నేనప్పుడు అమెరికాలో ఉన్నాను. అందుకే రాలేకపోయాను. లేకుంటే నేను కూడా సత్యా వాళ్ళతోపాటు ఆ వేడుకలో తప్పకుండా ఉండేదాన్ని. ‘నిర్జన వారధి’… ఆ పేరు నాకెంతో ఇష్టమైన పేరు. మీరు మొత్తం అక్షరాల రూపంలో అందరికీ కనిపించిన పుస్తకమది.

మీ శరీరాన్ని మెడికల్‌ స్టూడెంట్స్‌కి చెందేలా చెయ్యడంతో మీ చివరి దానం, త్యాగం పూర్తయ్యాయి. సుదీర్ఘమైన మీ జీవితానుభవాలు ఎందరెందరికో పాఠాలుగా మిగిలిపోయాయి. నిజంగా చెబ్తున్నాను. మీరంటే అనంతమైన ప్రేమ నాకు. మనం కలిసిన సందర్భాలు తక్కువే కావచ్చు. కానీ మిమ్మల్ని ప్రేమించిన క్షణాలు మాత్రం ఎక్కువే. ఒక పోరాట యోధురాలిగా, మీరు సాధించిన విజయాలు సైతం సామాన్యం కావు. శరీరం అంత బలహీనపడినా, మీకు సహకరించకపోయినా, మీ కళ్ళల్లో వెలుగుతుండే ఆత్మ విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. ఆ కళ్ళు ధీమాతో, ధైర్యంతో వెలిగే కళ్ళు. ఎందరికో ప్రేమను, స్నేహాన్ని, త్యాగాన్ని నేర్పిన కళ్ళు, ఎప్పటికీ నా కళ్ళముందు అలాగే పరుచుకొని ఉంటాయి. మరణమంటే తాత్కాలిక రూపం కనబడకపోవడమే కదా! శాశ్వతంగా నా మనసులో ఉన్న మీరు ఎక్కడికీ పోలేదు. మరింత లోలోతుకు నా మదిలోకెళ్ళి కూర్చున్నారంతే అనుకున్నాక నా దుఃఖపు తీవ్రత కొంత మేరకు తగ్గింది.

ఒకసారి వైజాగ్‌లో మనం కలిసినపుడు మాట్లాడుతూ మనం చాలా దూరపు చుట్టాలమట అని నేనంటే, అవన్నీ అనవసరం మనం సాహిత్య చుట్టాలం మాత్రమే, స్నేహితులమంటేనే నాకు తృప్తి అన్నారు. మనుమరాలు అనురాధతో వచ్చారా మీటింగ్‌కి.

ఆత్మాభిమానం నిండిన మీరు, చాలా సందర్భాల్లో వ్యక్తీకరించిన తీరు నాకెప్పటికీ ఆదర్శనీయమే. ఒక స్త్రీగా, ఒక మనిషిగా, ఒక పోరాట యోధురాలిగా, ఒక ప్రేమికురాలిగా, ఒక స్నేహితురాలిగా, ఒక నిర్ణయ ప్రకటన శక్తిగా, ఒక దయామయిగా, ఒక త్యాగశీలిగా, ఒక ఉత్తమ వ్యక్తిత్వ నిరూపిణిగా సదా మీరు రేపటి తరంలో సైతం వెలుగుతూనే ఉంటారు. మీ మీద ఒక ప్రత్యేక సంచికను తేవడం, దాన్నా రోజు మీరు ఆప్యాయంగా చేతుల్తో తడమడం గుర్తొస్తే సంతోషంగా ఉంది. నిండు నూరేళ్ళు ఒక సాహసోపేతమైన మీ ప్రయాణంలో చివరి స్టేషన్‌లో దిగిపోయారు. కానీ మీ బతుకు రైలు శరీర దిశను మార్చుకొని జ్ఞాపకాల బండి రూపంలో వెనక్కు తిరిగి వస్తోంది. మీ సహ ప్రయాణికులమందరం మీతోపాటు రైలు బండిలో ఉన్నాం. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక స్టేషన్‌లో కొందరు కలవడం, మనతో, మన భావాలతో ప్రయాణించడం, మధ్య మధ్యలో కొందరు ప్రయాణ విరమణ చేయడం, ఆగిపోవడం, మళ్ళీ బయల్దేరడం… ఇంతే కదా జీవితం. ఇదే కదా మీ ‘నిర్జన వారధి’. ఒక ప్రశాంత సముద్రంలా విశ్రమించిన మీరు, కల్లోల సముద్రాన్ని ఈదిన తీరును గుర్తు చేసుకుంటూ మీ ఆరాధకురాలినైన నేను, ప్రస్తుతానికి కామా పెడుతూ…

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో