వంటిల్లు – విమల

 

ఎంత అద్భుతమైందీ వంటగది

రుచులు రుచులుగా పరిమళాల్ని వెదజల్లుతూ

తెరిచిన తినుబండారాల దుకాణంలా

ఎంత నోరూరిస్తుందో!

తాలింపు ఘుమాయింపులతో

పూజా మందిరం అగరొత్తుల సువాసనల్తో

మా వంటిల్లు నిత్యం శ్వాసిస్తూ ఉంటుంది.

వసారాలో చల్ల చిలికే చప్పుడుతోనో

అంట్ల గిన్నెలు తోమే చప్పుడుతోనో

రోజూ ఉదయమే మా వంటిల్లు మేల్కొంటుంది.

అలికి ముగ్గులు దిద్దిన పొయ్యి

మండేందుకు ముస్తాబవుతుంది

వంటింటి పోపు డబ్బాలో చిల్లర పైసలు

దాచుకుతిన్న మిఠాయి ఉండలు

పప్పు బెల్లాల్తో ఉత్తుత్తి వంటా – వడ్డనలు,

అమ్మా – నాన్నా ఆటలు –

ఈ వంటిల్లొక వదలని మోహమై

నా బాల్యాన్నంతా చుట్టేసుకుంది.

నాకు మా వంటిల్లొక అద్భుత మాయా బజారు.

ఇప్పుడు వంటిల్లొక ఆటస్థలం కాదు

మెల్లిగా బాల్యపు ఛాయలు వదిలిపెడుతుండగానే

ఇక్కడే నన్ను తీర్చిదిద్దడం మొదలైంది.

‘వంటింటి తనాన్ని’ ఇక్కడే నేర్పారు నాకు

మా అమ్మ, మా అమ్మమ్మా

ఇంట్లో అమ్మలంతా ఇక్కడే ‘స్త్రీ’ లయ్యారట

గిన్నెలు, డబ్బాలు బస్తాలతో

రకరకాల శవాలు నిండిన శ్మశానంలా

మా వంటిల్లు –

తడి కట్టెల పొగమేఘాల మధ్య

మా వంటిల్లు వేలాడుతూ ఉంటుంది.

భయం భయంగా, నిశ్శబ్దంగా, నిరాశగా

మా అమ్మొక ప్రేతంలా తేలుతూ ఉంటుందిక్కడ

అసలు మా అమ్మే నడుస్తున్న వంటగదిలా ఉంటుంది

ఏడ్చి, ఏడ్చి ఆమె కళ్ళు ఎక్కడో కారిపోయాయి

తోమి, తోమి ఆమె చేతులు అరిగిపోయాయి.

మా అమ్మకి చేతులు లేవు –

ఆమెను చూస్తే –

ఒక గరిటెగానో, పెనం లానో

మా వంటింటిని అలంకరించిన ఒక పరికరంలానో ఉంటుంది

ఒక్కోసారి ఆమె మండుతున్న పొయ్యిలా కూడా ఉంటుంది

అప్పుడు బందీ అయిన పులిలా ఆమె

వంటగదిలో అశాంతిగా తిరుగుతుంది.

నిస్సహాయతతో గిన్నెలు ధడాలున ఎత్తేస్తుంది.

ఎంత తేలికో – గరిట తిప్పితే చాలు

వంట సిద్ధం అంటారంతా!

తినేందుకు తప్ప ఇటుకేసి రారు ఎవ్వరూ –

ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి –

అయినా, చివరకు వంటింటి గిన్నెలన్నిటిపైనా

మా నాన్న పేరే!

అదృష్టవశాత్తు నేనో మంచి వంటింట్లో పడ్డానన్నారంతా!

గ్యాసు, గ్రైండర్లు, సింకులు, టైల్సు…

అమ్మలా గారెలు, అరిసెలు కాక

ఇప్పుడు కేకులు, పుడ్డింగులు చేస్తున్నాను నేను.

ఇంకా గిన్నెలపై పేర్లు మాత్రం నా భర్తవే!

కుక్కరు కూతతోనో, గ్రైండరు మోతతోనో

నా వంటిల్లు మేల్కొంటుంది.

నేనొక అలంకరించిన వంట గదిలా,

కీ ఇచ్చిన బొమ్మలా ఇక్కడ తిరుగుతూ ఉంటాను.

నా వంటిల్లొక యంత్రశాలలా ఉంది.

రకరకాల చప్పుళ్ళతో ఈ వంటిల్లొక కసాయి

దుకాణంలా ఉంది.

కడిగిందే కడిగి, ఏళ్ళ తరబడి వండీ, వండీ

వడ్డిస్తూ, ఎంగిళ్ళెత్తేసుకుంటూ…

చివరకు నా కలల్లోనూ వంటిల్లే –

కళాత్మకమైన వంటింటి కలలు.

మల్లెపూవుల్లోనూ పోపు వాసనలే!

ఈ వంటింటిని తగలెయ్య

ఎంత అమానుషమైందీ వంటగది!

మన రక్తం పీల్చేసి, మన ఆశల్నీ, కలల్నీ కాజేసి

కొద్ది, కొద్దిగా జీవితాంతం పీక్కుతింటున్న

రాకాసి గద్ద ఈ వంటిల్లు.

వంటింటి సంస్కృతి; వంటింటి ముచ్చట్లు

వంటలక్కలమైన మనం,

మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం

‘గరిట తిప్పటం’గా చేసిన ఈ వంటిళ్ళను

ధ్వంసం చేద్దాం రండి!

ఇక గిన్నెలపై ఎవరి పేర్లూ వద్దు.

వేరు వేరు సొంత పొయ్యిలను

పునాదులతో సహా తవ్వి పోద్దాం రండి!

మళ్ళీ మన పాపలు ఈ ఒంటరి వంటిళ్ళలోకి

అడుగిడబోతున్నారు.

మన పిల్లల కోసం,

ఒంటరి వంట గదులు కూల్చేందుకు రండి. (నీలిమేఘాలు పుస్తకం నుండి…)

Share
This entry was posted in దారి దీపాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో