ఫాన్స్‌లో మళ్ళీ రెక్కలు విప్పిన రెవల్యూషన్‌! – ఎస్‌. జయ

 

(1968లో ఫ్రాన్స్‌లో మొదలైన తిరుగుబాట్లను ఏంజిలా కాట్రోచ్చి ”బిగినింగ్‌ ఆఫ్‌ ది ఎండ్‌” పేరుతో గొప్ప పొయెటిక్‌ శైలిలో రికార్డు చేశారు. దాన్ని శ్రీ శ్రీ ‘రెక్క విప్పిన రెవల్యూషన్‌’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకం ‘విరసం’ ప్రచురణల్లో ప్రముఖమైనది. ఇప్పటికీ దొరుకుతుందనుకుంటాం – ఎడిటర్‌)

ఫ్రాన్స్‌లో విప్లవం మరోసారి రెక్క విప్పింది. రెక్క విప్పిన విప్లవజ్వాల పొరుగు దేశాలకు వ్యాపించింది. ఫ్యాషన్లే కాదు, విప్లవాలూ పుట్టేది ఫ్రాన్స్‌లోనే. ”అన్నమే కాదు, గులాబీలూ కావాలంటారు” అక్కడి ప్రజలు. ఫ్రాన్స్‌లో జరిగిన తరతరాల విప్లవ పోరాటాలను గుర్తుకు తెస్తున్నారు ఇప్పటి ”ఎల్లో వెస్ట్‌” నిరసనకారులు. ఆర్క్‌ డి ట్రియోంఫ్‌ (ూతీష-సవ-్‌తీఱశీఎజూష్ట్రవ) మ్యూజియం గోడ మీద ఒక నినాదం ఇలా రాశారు ”లూయీ 16 = మాక్రోన్‌” అని. లూయీ 16కి వ్యతిరేకంగా జరిగిన 1789 విప్లవం రాజరిక పాలనకు చరమగీతం పాడింది. అప్పుడు ఫ్లోర్‌ (టశ్రీశీబతీ, గోధుమపిండి) కోసం తిరుగుబాట్లు జరిగితే, ఇప్పుడు ఫ్యూయల్‌ (ఖీబవశ్రీ, డీజిల్‌, పెట్రోల్‌) కోసం జరుగుతున్నాయి. అప్పుడు రాజరికానికి అంతం పలికితే ఇప్పుడు గ్లోబలిస్ట్‌ నిరంకుశానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ఆనాడు ఆకలి అందరినీ కలిపింది. ఆకలికి కుడి, ఎడమల (రైట్‌, లెప్ట్‌) తేడా లేదు. ఇప్పుడూ అంతే. ఫ్యూయల్‌ ధరలు అంటే ఆకలే. అదే అందర్నీ కలిపింది. ”నెల జీతాలు మూడో వారం రాకముందే అయిపోతున్నాయి. మేము జీవించడం లేదు, చావలేక బతుకులు ఈడుస్తున్నాం” అంటున్నారు.

ఉద్యమకారులు 1968 తిరుగుబాటును కూడా గుర్తుచేసుకుంటున్నారు. ఆనాటి పోరాట విద్యార్థులు నేడు తండ్రులుగా, తాతలుగా, అమ్మలుగా, అమ్మమ్మలుగా మళ్ళీ రోడ్లమీదకు వచ్చారు. తమ పిల్లలతో, కొడుకులు, కూతుళ్ళతో, మనుమలు, మనుమరాళ్ళతో కలిసి.

ఆయిల్‌ మీద ఎకో-పన్నులు (జుషశీ ్‌aఞవర) విధించడంతో ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయని, ఈ ధరలు కేవలం ఆయిల్‌కే పరిమితం కావని, అన్ని వస్తువుల ధరలను ప్రభావితం చేస్తున్నాయని, ఆహారం, నిత్యావసర సరుకుల ధరలూ విపరీతంగా పెరిగాయని, ధరలను తగ్గించాలని డిమాండ్‌తో లక్షలాది మంది రోడ్లమీదకు వచ్చారు. నవంబర్‌ 17న శనివారం దేశవ్యాప్తంగా జరిగిన రెండు వేలకు పైగా నిరసన ర్యాలీలలో లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. పారిస్‌ నగరంలోనే ”ఎల్లో వెస్ట్స్‌” ధరించిన మూడు లక్షల మందితో నిరసన ర్యాలీ జరిగింది. చీకట్లోనైనా కనిపించే విధంగా ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండడం కోసం డ్రైవర్లు ఫ్లోరొసెంట్‌ కలర్‌ వెస్ట్‌ని ధరించడం ఆనవాయితీ. వాహనాలు నడిపే వారుగా, ఆయిల్‌ ధరలు తగ్గించాలనే నినాదంతో వీరు ఈ డ్రెస్‌ కోడ్‌తో ప్రదర్శనలకు దిగారు.

పర్యావరణ పరిరక్షణ నిధుల కోసం కార్బన్‌ టాక్స్‌ విధించింది అధికారంలో ఉన్న సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ ప్రభుత్వం. ”ఫ్రాన్స్‌ డిక్లరేషన్‌” ను ప్రపంచ దేశాల ముందుకు తీసుకువచ్చి, పర్యావరణాన్ని రక్షించే ఛాంపియన్‌గా నిలబెట్టింది మాక్రోన్‌ ప్రభుత్వం. కొన్ని సంవత్సరాలకు రానున్న ముప్పును దృష్టిలో పెట్టుకొని ఈ పన్నులు వేస్తున్నామంటున్నారు. ”నెల గడవడం గురించి ఆందోళన చెందుతున్నాం. ముందు ఆయిల్‌ ధరలు తగ్గించండి” అని నినాదాలు చేస్తూ ఉద్యమకారులు రోడ్లు ఆక్రమించారు. నవంబర్‌ 24 శనివారం రెండోసారి జరిగిన నిరసన ప్రదర్శనలో 2 లక్షల 30 వేల మంది పాల్గొన్నారు. డిసెంబర్‌ 1 శనివారం మూడో ప్రదర్శన జరిగినప్పుడు లక్షన్నర మంది పాల్గొన్నప్పటికీ కొన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆర్క్‌ డి ట్రియోంఫ్‌ మ్యూజియంను ముట్టడించి కొన్ని స్మారక చిహ్నాలను ధ్వంసం చేశారు. సంపన్నుల నివాసాల ముందున్న కార్లకు నిప్పు పెట్టారు. ఈ పనులు చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయాలు వెల్లడయినప్పటికీ ఈ నిరసన ప్రదర్శనలకు ఆ దేశ ప్రజలు 80% మంది తమ మద్దతు ప్రకటించారు. ”ప్రభుత్వం వినిపించుకోవడం లేదు. హింస లేకుండా విప్లవం సంభవించదు” అని ఉద్యమంలోని ఒక యాక్టివిస్టు అంటాడు. ఈ సంఘటనలతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌ ఆయిల్‌ ధరలు తగ్గిస్తున్నట్టు, ఉద్యోగులకు కనీస వేతనం పెంచుతున్నట్లు ప్రకటించాడు.

కానీ, మరునాడే అంటే డిసెంబరు 3, 4 తేదీల్లో విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న హైస్కూళ్ళను, యూనివర్శిటీలను బహిష్కరించారు. విద్యా విధానంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వందలాది విద్యార్థులు అరెస్టయ్యారు. అరెస్టు సమయంలో పోలీసులు విద్యార్థులతో వ్యవహరించిన తీరుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసులు అరెస్టు చేసిన విద్యార్థుల చేతులు వెనక్కి విరిచి కట్టి, గోడలవైపు ముఖం పెట్టించి, మోకాళ్ళపై కూర్చునేట్టు నిర్బంధించారు. ఆ తరువాత జైళ్ళకు పంపారు.

మూడో శనివారం జరిగిన నిరసన ప్రదర్శనల్లో విద్యార్థులే కాకుండా టీచర్లు, నర్సులు, రైతులు, అనేక రంగాల్లో పనిచేస్తున్న శ్రామికులు వచ్చి చేరారు. ఈ ఉద్యమం ఏ యూనియన్లు, రాజకీయ గ్రూపుల ప్రమేయం లేకుండా సోషల్‌ మీడియా ద్వారా రాజుకుంది. దీనికి ఏ నిర్మాణమూ లేదు, నాయకులూ లేరు. ఇదో కొత్త తరహా ఉద్యమం. ప్రజలు లెఫ్ట్‌-రైట్‌ పార్టీల కింద విభజింపబడి ఉన్నంతకాలం ప్రభుత్వాలకు గట్టి సవాళ్ళు ఎదురు కావు. ఏ ఆటంకాలు లేకుండా తమ విధానాలను సజావుగా కొనసాగించుకోవచ్చు. ఫ్రాన్స్‌లో అధికారంలో ఉన్నది పేరుకు సోషలిస్టు పార్టీ, సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ. కానీ ఇది సంపన్నుల కోసం పనిచేసే ప్రభుత్వమని, మాక్రోన్‌ రాజీనామా చేయాలని ఉద్యమకారులు నినాదాలు చేశారు. మూడో అంకంగా డిసెంబరు 1న జరిగిన నిరసన ర్యాలీలో హింస చోటు చేసుకోవడానికి కారణం ఉద్యమంలోని అతివాద రైట్‌ వింగ్‌ శక్తులని కొందరు అంటే, కాదు కాదు మిలిటెంట్‌ లెఫ్ట్‌ వింగ్‌ శక్తులని కొందరు అన్నారు. ఈ ఉద్యమంలో రైట్‌ వింగ్‌ ఉందా, లెఫ్ట్‌ వింగ్‌ ఉందా అని పరిశీలనలు మొదలయ్యాయి. పన్నులు తగ్గించాలనేది రైట్‌ వింగ్‌ నినాదమైతే, జీవన వ్యయం (షశీర్‌ శీట శ్రీఱఙఱఅస్త్ర) తక్కువగా ఉండాలనేది లెఫ్ట్‌ వింగ్‌ నినాదం. ఇప్పుడు ఈ రెండూ జమిలిగా వినిపిస్తున్నాయి. ఆకలి అందర్నీ ఏకం చేస్తోంది. ఆకలి కేకలు పేద ప్రజల నుంచే వస్తాయనుకుంటారు. మధ్య తరగతి ప్రజలు మర్యాదస్తులు, బయటికి చెప్పుకోరు అనుకుంటారు. అయితే, ఈ ఉద్యమంలో అత్యధికులు మధ్య తరగతి అనబడే ప్రజలే. ఈ మధ్య తరగతి ప్రజలు కూడా తమకు నెల గడవడం కష్టంగా ఉందని, పెళ్ళి చేసుకోవాలన్నా, పిల్లల్ని కనాలన్నా భయపడుతున్నామని, తమది మధ్య తరగతి అనుకోవడం అపోహ అని, తాము పేదలమే అని అనుకోవడం వల్లే ఈ ఉద్యమం చేపట్టారు. ప్రజల కొనుగోలు శక్తి విపరీతంగా పడిపోయింది. ఇది ఫ్రాన్స్‌కు మాత్రమే పరిమితం కాదు.

సంస్కరణల పేర దగా దగా :

ప్రపంచమంతటా గత ముప్ఫై, నలభై ఏళ్ళుగా సాగుతున్న నయా ఉదారవాదం లేదా గ్లోబలైజేషన్‌ ధనిక, పేద అసమానతలను మరింత పెంచి పోషించింది. సంస్కరణల పేర దేశాలన్నీ సామాజిక భద్రత (సోషల్‌ సెక్యూరిటీ)కు తిలోదకాలిచ్చాయి. పబ్లిక్‌ సర్వీసులను ఉపసంహరించుకున్నాయి. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (పబ్లిక్‌ రవాణా)ను నిలిపేశాయి. పబ్లిక్‌ స్కూళ్ళను, యూనివర్శిటీలను నీరుగార్చి, ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వ వైద్యశాలల స్థానే ప్రైవేటు కాలేజీలకు, ఆసుపత్రులకు, ప్రైవేటు ఆరోగ్య భీమా పథకాలకు అనుమతులిచ్చాయి. చివరికి పెన్షన్లను కూడా రద్దు చేయడమో, ప్రైవేటు సంస్థలకు అప్పగించడమో జరుగుతోంది. ప్రభుత్వాలు ప్రజల కోసం చేయాల్సిన పనులను వదిలివేస్తున్నాయి. ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన జాతీయ ప్రభుత్వాలు వ్యాపార సంస్థలకు సేవ చేస్తున్నాయి. క్రూరమైన గ్లోబలిజానికి ప్రజలు బలవుతున్నారు. సంపన్నులు మాత్రం మరిన్ని సంపదలు పోగేసుకుని ‘నయా మోనార్క్‌’లుగా అవతారమెత్తారు.

జరిగిన మోసం కనిపెట్టి మొదట తిరగబడుతున్న ఫ్రాన్స్‌ ప్రజలు తమ విప్లవ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని ప్రపంచ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆయిల్‌ ధరలు తగ్గించి, కనీస వేతనాలు పెంచుతున్నట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ప్రకటించగానే నిరసనలు ఆగిపోవాలి. కానీ ఒకటి, రెండు డిమాండ్లతో ఫ్రాన్స్‌ ప్రజలు రోడ్లమీదకు రాలేదు. వారు ప్రకటిస్తున్న డిమాండ్లు 40కు పైగా ఉన్నాయి. ముందు ముందు ఇంకా కొన్ని పుట్టుకు రావొచ్చు. ఆ డిమాండ్లలో గూగుల్‌, అమెజాన్‌ లాంటి అంతర్జాతీయ కంపెనీలపై పన్నులు పెంచాలని, సంపన్నుల సంపదను పంచాలనేవి కూడా ఉన్నాయి.

ఆయిల్‌పై ఎకో టాక్స్‌ ఎత్తివేసి ధరలు తగ్గించాలనే డిమాండ్‌తో మొదలైన ఈ ఉద్యమం పర్యావరణ పరిరక్షణ

ఉద్యమానికి వ్యతిరేకమైనదని, వాతావరణ మార్పులను ఈ ఉద్యమ కారులు పరిగణనలోనికి తీసుకోవడం లేదని ఒక అపవాదు బయలుదేరింది. వెంటనే, ఉద్యమకారులకు మద్ధతుగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు తమ బ్యానర్లతో వచ్చి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఆయిల్‌ వాడకాన్ని తగ్గించాలి, ఫ్రాన్స్‌ ప్రభుత్వం దానికి సరైన చర్యలు తీసుకోలేకపోయింది. శ్రామికులు తమ పని ప్రదేశానికి ఉచితంగా ప్రయాణించేలా జర్మనీ తరహాలో పబ్లిక్‌ రవాణా వ్యవస్థను రూపొందించాల్సింది. ఆర్థిక, సామాజిక సమ న్యాయం జరక్కుండా పర్యావరణాన్ని కాపాడతాం అనడం అభూత కల్పన. సంపద, సాంకేతికత చాలా పెరిగింది. ఇప్పుడు దాన్ని న్యాయబద్ధంగా పంపిణీ చేసి, అసమానతల్ని తొలగించడం ద్వారా మాత్రమే మానవ వనరులను, పర్యావరణాన్ని ముందు తరాల కోసం కాపాడగలం.

పారిస్‌లో జరుగుతున్న నిరసన ప్రదర్శన :

వారం చివర్లో ప్రతి శనివారం జరుగుతున్న నిరసన ప్రదర్శనలు ఇప్పటికి నాలుగైదు జరిగాయి. ఉదయం పది గంటలకంతా మూడు రంగుల జాతీయ జెండాను పట్టుకొని ”మార్సిల్లయిస్‌ (వీaతీరవఱశ్రీశ్రీaఱరవ)” అంటూ జాతీయ గీతం ఆలపిస్తూ వేలాదిమంది ఒక్కసారిగా అధ్యక్ష భవనం ఉండే ”చాంప్స్‌ ఎలిసీస్‌ (జష్ట్రaఎజూర జుశ్రీవరవవర) ప్రాంతానికి వస్తారు. ఇది చాలా పొడవైన, విశాలమైన కూడలి. ఇక్కడ మిలిటరీ కవాతులు మాత్రమే కాదు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలూ జరుగుతుంటాయి. ఉద్యమకారులకు ఎదురుగా పోలీసులు. పోలీసుల చేతుల్లో… ఒక చేతిలో లాఠీ, మరో చేతిలో తమ రక్షణ కోసం నిలువెత్తు ప్లాంక్‌, కొందరి చేతుల్లో టియర్‌ గ్యాస్‌ డబ్బీలు (టిన్స్‌), వారితో కలిసి వాటర్‌ కానన్‌ ముందుకు సాగుతూ ఉంటుంది. నిరసనకారుల చేతుల్లోకి ఉన్నట్టుండి తలుపు రెక్కలు, కిటికీ రెక్కలు, విరిగిన కుర్చీలు, బల్లలు, ఇనుప రేకులు, ఇంటి ముందుండే ఇనుప గేటు రెక్కలు, పార్క్‌ల చుట్టూ కంచెకు వేసే రైలింగ్‌లు… ఒక్క మాటలో చెప్పాలంటే చేతికందిన అన్ని పాత సామాన్లతో తమ ముందు బారికేడ్లు కట్టుకుంటారు. ఈలోగా ఫుట్‌పాత్‌పై రాళ్ళు పెళ్ళగించబడతాయి. పోలీసులు దాడి చేయడానికి వస్తే చేతికందిన రాళ్ళతో రాళ్ళ వర్షం కురిపిస్తారు. రాళ్ళ వర్షానికి వెనక్కు పరుగులు పెడతారు పోలీసులు. వాటర్‌ కానన్‌ సహాయంతో పైపులోంచి ఫోర్స్‌గా నీరు నిరసనకారుల మీద పడుతుంది. అదే సమయంలో పోలీసులు టియర్‌ గ్యాస్‌ డబ్బీలు విసిరేస్తారు. అవి కూడా ప్రదర్శనకారులపై వర్షంలా కురుస్తుంటాయి. యువకులు కొందరు తమమీద పడబోయే టియర్‌ గ్యాస్‌ డబ్బీలను ఒడుపుగా పట్టుకొని తిరిగి పోలీసుల మీదకు విసురుతుంటారు. ”నిమిషానికి 5 వేల టియర్‌ గ్యాస్‌ డబ్బీలు వేసినట్లు, ఇంతలా ఎప్పుడూ వేయలేద”ని ఒక పోలీసు అధికారి చెప్పుకున్నాడు. అలుముకున్న ఆ పొగల్లో ఏం జరుగుతోందో ఒక్కోసారి చూడలేకపోతాం. జర్నలిస్టులు చుట్టుముట్టిన పొగల్లోంచి బయటికి వచ్చి కళ్ళు తుడుచుకుంటూ, రొప్పుకుంటూ అక్కడి దృశ్యాలను చూపిస్తూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. రోడ్ల మీద జరిగే ఈ పోరాటాలు ఉదయం ఏ పది గంటలకో మొదలయితే సాయంత్రం 5 గంటలదాకా కొనసాగుతాయి. వీథిలైట్లు వెలగడం చూస్తాం. ఆర్టీ న్యూస్‌ (=్‌ అవషర. =్‌ అక్షరాలు గ్రీన్‌ కలర్‌లో ఉంటాయి), గ్లోబల్‌ న్యూస్‌ ఛానల్స్‌ పారిస్‌లో రోజంతా జరిగే ఈ పోరాటాల్ని ప్రసారం చేస్తాయి. ఈ ఛానల్స్‌ చేసిన ప్రసారాలు యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయ్యాయి. ఇప్పటివరకు 4,500 మంది అరెస్టు కాగా 500 మంది దాకా గాయపడ్డారు. ప్రమాదాల కారణంగా నలుగురు మరణించారు. జర్నలిస్టులు, పోలీసులు, పోలీసు అధికారులు కూడా చాలామంది గాయపడ్డారు.

పారిస్‌ నగరంలోనే కాక, ఫ్రాన్స్‌లోని అనేక నగరాల్లో, పట్టణాల్లో శనివారం నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భవనాల ముందు బ్యారికేడ్లు పెట్టి అడ్డగించడం, సూపర్‌ మార్కెట్‌ దారులను మూసివేయడం, జాతీయ రహదారులను, జంక్షన్లను మూసివేయడం వంటి చర్యలు చేపట్టి దేశవ్యాప్తంగా రోడ్లపై రాకపోకల్ని స్తంభింపచేస్తున్నారు.

ఈ పోరు జ్వాలలు ఫ్రాన్స్‌ పొరుగున ఇటలీ, బ్రెజిల్‌, నెదర్లాండ్స్‌ దేశాలకు కూడా వ్యాపించాయి. అక్కడ కూడా ఇదే నమూనాలో ”ఎల్లో వెస్ట్‌”లు ధరించి ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈజిప్టులో ఏకంగా ”ఎల్లో వెస్ట్‌”లు అమ్మకానికి పెట్టవద్దని ప్రభుత్వం బట్టల దుకాణాలపై ఆంక్షలు విధించింది. గ్లోబలిజం ఎక్కడెక్కడ తన కోరలు చాచిందో అక్కడంతా ఈ విప్లవ జ్వాల ఒక దావానలంలా వ్యాపించే అవకాశం ఉంది. ”ఎల్లో వెస్ట్‌”లు ఇప్పుడు ప్రభుత్వాలను, గ్లోబలిస్టులను భయపెడుతున్నాయి.

తాజా కలం: ఈ వ్యాసం ముగించే సమయానికి, ఈ రోజు డిసెంబర్‌ 5వ తేదీ, శనివారం. ముందస్తుగా పోలీసులు 12 మందిని అదుపులోనికి తీసుకున్నారు. పారిస్‌, చాంప్స్‌ ఇలిసీస్‌ కూడలిలో 8,000 మంది పోలీసులు మోహరించారు. వారికి సహాయంగా 14 సాయుధ శకటాలు, వాటర్‌ కెనాన్‌ ఉన్నాయి. ఉద్యమకారులూ వేలాది మంది కూడలికి చేరుకొని అధ్యక్షుడు మాక్రొన్‌ రాజీనామా చేయాలని నినదిస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని అన్ని నగరాలలోనూ జరుగుతున్న నిరసన ప్రదర్శనల్లో లక్షల మంది ఉద్యమకారులు పాల్గొన్నారు.

(రస్తా వెబ్‌మ్యాగజైన్‌ సౌజన్యంతో)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.