హేమ తలపోతలో – సుహాసిని

‘రెప్పపాటు ఈ జీవితం’ అంటే ఇదేనా… నాల్గో తారీకుదాకా కలిసి ఉన్న పిల్ల నాల్గు మాటలైనా చెప్పకుండా ఇలా అర్థాంతరంగా తనది కాని స్టేషన్‌లో హడావిడిగా దిగేసినట్లు బతుకుబండి దిగేసింది. పేరులో బంగారాన్ని, పలుకులో సిరుల మూటని పొదువుకున్న నవ్వుల నజరానా మా హేమ గురించి ఏం చెప్పను… ఎక్కడ ప్రారంభించాలి. ”శుభోదయం సుహాస్‌” అంటూ ఆప్యాయంగా పిలిచిందంటే నన్ను అభినందించడానికే అని అర్థం. ”అక్కా పనిలో ఉన్నావా” అంటూ మొదలుపెట్టిందంటే నా సలహాలో, చిట్కాలో కావల్సినంత అనారోగ్యంతో సతమతమౌతోందని అర్థం. ఒంటరితనంతో విసుగ్గా ఉందనుకో ”కొత్తగా పాటలేం రాస్తున్నారు” అంటూ మొదలుపెట్టేది. పాటలు వినడానికి సిద్ధంగా ఉందన్నమాట. నా పాటలని ఎంతో ఇష్టపడేది. నెల్లూరులో మా ఇంటికొచ్చింది నా చేత పాడించుకుని 10 పాటలు రికార్డు చేయించుకుంది. యూ ట్యూబ్‌లో అంతదాకా పెట్టనందుకు కోప్పడింది. తను అప్‌లోడ్‌ చేస్తానంది. మా తరం వాళ్ళు టెక్నాలజీని అందుకోవడంలో వెనుకబడడాన్ని సున్నితంగా మందలించింది. కాళ్ళ నొప్పులతో, అనారోగ్యంతో నెల్లూరులో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నేను తరచూ తన దగ్గరికి వెళ్ళేదాన్ని. రోజంతా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. చిన్న చిన్న ఆసనాలు, అప్పర్‌బాడీ ఎక్సర్‌సైజులు, డైటరీ అడ్వయిజ్‌లు లాంటి మాటల నుంచి ప్ర.ర.వే ఆంధ్ర యూనిట్‌ను ఎలా నిర్వహించాలి, కొత్త సభ్యులని ఎలా చేర్చుకోవాలి అనేదాకా చర్చించుకునేవాళ్ళం.

సాయంత్రందాకా మాట్లాడుకుంటూనే ఉన్నా వెళ్తానంటే మాత్రం ”అప్పుడే వెళ్ళిపోతావా” అంటూ బుంగమూతి పెట్టేది. ఓ రోజు దళిత సాహిత్యం మీద మీ వ్యాసమేం రాలేదు అంది. నేను నెల్లూరులో ఉన్నా, ఇక్కడేం లేదంటే ”ఇప్పుడు రాయండి” అంది. ఇప్పటికిప్పుడంటే ఇంక దళిత వాగ్గేయకారుల మీద రాయాల్సిందే అంటే ”ఆ… దానికే ఫిక్సయిపోండి. ఎవ్వరూ రాయలేదు. అది మీరు మాత్రమే వ్రాయగలిగిన వ్యాసం. రేపటికి పంపేస్తారా” అంది. తనే వికీపీడియా నుంచి నాకు లింకులు పంపేసింది. మర్నాటికల్లా నా చేత వ్యాసం రాయించుకుంది. గతంలోనూ జానపదాల మీద అలాగే ఏ రోజైనా రాత్రి ఏ పది గంటలకో ఫోన్‌ చేసి ”కొత్తగా బొమ్మలేం వేశారు. ప్రస్తుతం మన రికార్డుల స్కోరెంతోయ్‌” అంటూ అడిగిందంటే తను కంప్యూటర్‌ ముందు కూర్చుని ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూకి రెడీ అయిపోయిందనీ, తెల్లారి లేచేసరికి నా ఇంటర్వ్యూ అప్‌లోడ్‌ అయిపోతుందని భావం. ఇప్పటికి ‘విహంగ’లో నావి నాల్గుసార్లు ముఖాముఖిలు ప్రచురించడమే కాదు, నా ఐదో ముఖాముఖి ఈ మార్చి 8 కోసం ఎప్పుడో సిద్ధం చేసి పెట్టుకుంది. ఈ వారం నుంచి నా ”స్మృతివల్లరి” బయోస్టోరీస్‌ సీరియల్‌గా ప్రచురిస్తానని సెలెక్ట్‌ చేసి పెట్టుకుంది. ఇప్పుడిలా తన స్మృతులు నేను రాయాల్సి రావడం ఏమిటి? మనసంతా శూన్యంగా ఉంది. హైదరాబాద్‌ వచ్చేస్తాను, కలిసి పనిచేద్దాం అంది. చాలా ప్లాన్‌ చేసుకుని, చివరికిలా అన్‌ ప్లాన్డ్‌గా జీవితాన్ని ముగించడం ‘సాహిత్య లోకానికి’, ‘ప్రరవే’కి, ‘విహంగ’కి తీరని లోటు. డి.లిట్‌ చేస్తూ విషయ సేకరణ కోసం రాజమండ్రి వస్తున్నానంటే సుధాకర్‌, హేమ ఎంత బాగా ఆహ్వానించారో, ఎంత బాగా చూసుకున్నారో. లైబ్రరీలో నాకు కావలసిన పుస్తకాలు తెచ్చుకోవడం నుంచి అవి అన్నీ జెరాక్స్‌లు చేసి స్పైరల్‌ బైండింగ్‌ చేయించి ఇచ్చేదాకా ఎంతో సాయం చేశారు. సుధాకర్‌ మా ఇద్దరి కోసం వండిపెడితే, తను నన్ను గంగాధరం లైబ్రరీకి తీసుకుని వెళ్ళి రెండు గంటలపాటు నేను నోట్‌ చేసుకునేదాకా తనూ ఉండి సహకరించింది. రాజమండ్రికి పిలిచి ‘ఆత్మీయ పురస్కారాన్ని’ ఇచ్చినా, ‘నా స్నేహితులు – వాళ్ళ రచనలు’ అంటూ మా కవిత్వం చదివే స్కోప్‌ కోసం ఒక వాట్సప్‌ గ్రూప్‌ సృష్టించినా తనదైన స్నేహపూర్వకమైన ముద్రతోనే. తనొకటి ప్రతిపాదించిందంటే కాదనలేమన్నంత కన్విన్సింగ్‌గా చెప్పడం, మృదువుగా వ్యవహరించడం తాను మానవ సంబంధాలనెంత సజీవంగా కాపాడుకుంటుందో తెలియజేస్తుంది.

ఒక దశాబ్దకాలపు బంధం ఎన్నెన్నో తీయని జ్ఞాపకాలని, తరగని కన్నీటిని మిగిలించి ఇలా ముగిసిపోవడాన్ని జీర్ణం చేసుకోలేక సతమతమౌతూ అబద్ధమైతే బాగుండునని నూట ఒకటోసారి అనుకుంటూ ఈ అక్షర నివాళి (పుట్ల హేమలతకు) నా చెలికి… చెల్లికి…

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.