నేను పుట్ల హేమలతను కావాలి

అమ్మతో అదే చివరి సభ అని, అదే చివరి ఫోటోలు తీసుకోవడం అని, అవే చివరి మాటలు అని, అవే చివరి నవ్వులని ఏ మాత్రం ఊహించలేదు. అమ్మ ప్రరవేతో ముడిపడినప్పటినుంచీ ఏ సభనూ మానలేదు. ప్రయాణాలు తన ఆరోగ్యాన్ని ఎంత క్షీణింపచేసినా ఆమెకు స్నేహితులను కలుసుకోవడం, వారిని చూసిన వెంటనే హత్తుకోవడం, మాటలు కలబోసుకోవడం, పాత జ్ఞాపకాలు తలచుకుని పడీ పడీ నవ్వుకోవడం… ప్రరవే కోసం అమ్మ ప్రయాణాలను, ఆరోగ్యాన్ని లెక్క చేయలేదు. అమ్మది అంతా మా తాతయ్య పోలిక. అదే తెగువ, అదే తెలివి, అదే పట్టుదల, దీక్ష, కార్యసాధకురాలు. నేనే చాలా నెమ్మది.

అమ్మని ఆస్పత్రిలో చేర్పించే ముందు రోజు కూడా మేము ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము. తుంబాండ్‌ సినిమాలో కొన్ని సీన్లు చూపించాను. ఇలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని ఆ సినిమాను కొట్టిపారేసింది. ఆసుపత్రిలో కూడా ఎప్పటిలానే మేము ఏవేవో విషయాలు చెప్పుకుని నవ్వుకుంటూనే ఉన్నాము.

చెప్పాల్సినవి, వినాల్సినవి, ఎన్నో చేయాల్సినవి ఉండగా నా కోసం ఉండాల్సిన సమయంలో తను నన్ను వదిలి పెట్టేసింది. అమ్మ మీద చాలా కోపంగా ఉంది. తనకి తెలుసు నాకిప్పుడు తనెంత అవసరమో. చివరి దశలో అమ్మ ఇచ్చిన మనోధైర్యాన్ని, జీవితాన్ని ఎంత తేలిగ్గా తీసుకోవాలి ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి అని చెప్పినవి ఇప్పుడు నేను బలంగా ముందుకు అడుగులు వేయడానికి అవసరమవుతున్నాయి. బహుశా ఇందుకే చెప్పిందేమో.

అమ్మ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నా వెంటే ఉండి నాకు ఒక ధైర్యం ఇచ్చిన మా మల్లేశ్వరి అక్కకి, చూడాలనిపిస్తోంది అనగానే నా కోసం పరిగెత్తుకు వచ్చిన నా స్నేహితులు మహి బెజవాడ, కాశీ నాగేంద్ర, అమ్మ కోసం, మా కోసం వచ్చిన ప్రతి ఒక్కరినీ నేను మర్చిపోలేను. ఫేస్‌బుక్‌్‌, వాట్సప్‌లలో సాంత్వన కలిగించే మిత్రుల కామెంట్స్‌ చదువుకుంటూ కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నన్న ఓదార్చడానికే అమ్మకి ఇంతమంది మిత్రులు ఉన్నారా అనిపిస్తుంది. అమ్మ చివరి యాత్రలో ప్రరవే సభ్యులు పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం మా అందరినీ కన్నీటి సంద్రంలో ముంచింది.

అమ్మలేనితనం ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నా అక్కడ కూడా అందంగా ముస్తాబై కూర్చుంది కులం. ఆరోగ్యం బాలేక జరిగిన అమ్మ చావులో కూడా కుల వివక్షను వెతికే కులగజ్జి దళితులకు ఎప్పుడు వదులుతుంది అని అనుకోవచ్చు. మేం వెతకం, కులమే మా వెంటపడుతుంది. మమ్మల్ని పుట్టుకలోనైనా, చావులోనైనా వేదనకు గురిచేస్తుంది. ఇంటి గుమ్మం తొక్కనివారిని చూశాను. తొక్కినా అన్నం ముట్టనివారినీ చూశాను. రెండూ చేసిన పెద్ద కులాల పెద్ద మనసులనీ చూశాను. మాకంటే పెద్ద కులస్తులైన మా అపార్ట్‌మెంట్‌ వాచ్‌మేన్‌ భార్య, అమ్మను సమాధుల తోటకు తీసుకుపోగానే అరిచిన నిష్టూరపు అరుపులకు సాక్ష్యంగా మిగిలిన మా బంధువులే మర్నాడు అమ్మ కొత్త చీరలు తీసుకున్నా మైలపడని అదే వాచ్‌మేన్‌ భార్య గొప్ప మనసుకి కూడా సాక్ష్యాలుగా మిగిలారు. భోజనాలు అయ్యాయని వాకబు చేసుకుని పరామర్శించడానికి వచ్చేవాళ్ళు, అప్పటిదాకా ఉన్నవాళ్ళు ఖాళీ కడుపుతో మాయమవ్వడాలు, ఎంతో సన్నిహితులు అనుకుని దుఃఖం దిగమింగి గుర్తుపెట్టుకుని కబురుపెట్టినా రానివాళ్ళు… అమ్మ ఇప్పుడు కూడా నాకు కులపాఠాలు నేర్పిస్తున్నట్లే ఉంది. ఆఖరికి మా అమ్మకి సమాధుల తోటలోనే సమానత్వం దొరికింది. అక్కడ ఏ గొడవలూ లేకుండా పూర్తి శాతం రిజర్వేషన్‌ మాకే.

అమ్మకు విద్యార్థులు కన్న పిల్లలే. పెద్ద కూతురు వినోదిని అక్క, పెద్ద కొడుకు ఇక్బాల్‌ చంద్‌ అన్నయ్య. డాడీ దగ్గర మొదటి పిహెచ్‌డి చేసినవారు. వీళ్ళిద్దరూ గొప్ప రచయితలని, ఏవేవో పురస్కారాలు అందుకుంటారని, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారన్న స్పృహ మాకు ఉండదు.

చివరిసారిగా పెట్టెలో ఉన్న అమ్మను చూసి పిడికిట్లో ఉన్న మట్టి వెయ్యమన్నారు. నేను, వినోదిని అక్క, చెల్లి ఒకేసారి వేయడం అత్యంత బాధాకరం, మరువలేనిది. పేర్లు రాయలేను కానీ ఎంతోమంది విద్యార్థులు, స్నేహితులు అమ్మ ప్రేమను పొందారు. మాకంటే కూడా అమ్మ మనసులో పెద్ద స్థానం సంపాదించుకున్నారు.

మమ్మీకి ఎంత అనారోగ్యం ఉన్నా నాకు ఇంత దుఃఖం మిగిల్చి వెళ్తుందని కలలో కూడా ఊహించలేదు. ప్రయాణం చేసిన ప్రతిసారీ తానొక యుద్ధమే చేసేదని ఇప్పుడు అర్ధమవుతోంది. ఆరోగ్యాన్ని ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. తన వైధవ్యం శేష జీవితాన్ని ఊహించాను కానీ ఇది తట్టుకోలేని, కోలుకోలేని దెబ్బ.

తను స్థాపించిన విహంగ పత్రిక, మనోజ్ఞ సాహిత్య సాంస్కృతిక అకాడమీ, తాను వేయాలనుకున్న పుస్తకాలని తీసుకురావడంలో కాస్త మనశ్శాంతిని వెతుక్కుంటున్నాం. నా కథల పుస్తకం మిళింద కోసం, డాడీ వ్యాసాల పుస్తకాల కోసం తన రచనలను వెనుక పడేసింది. మా కోసం తన కష్టమంతా వెచ్చించింది. మా కోసమే అంకితమైంది.

మమ్మీ లేకుండా నేను బతకాల్సి వస్తుందని నమ్మడం మొదలుపెట్టాలి. నేను పుట్ల హేమలతను కావాలి.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో