ఆడోల్లని బత్కనియ్యరా?

జూపాక సుభద్ర
ఈ వారం పదిరోజుల్లో పేపర్ల నిండా, ఛానల్లనిండా ఆడవాల్లమీద దాడులు, హత్యల వార్తలే. ఆడోల్ల మీద అత్యాచారాలే గాదు ఈ మధ్య ఆడోల్లని బత్కనివ్వక పోవుడు మగ ఉన్మాదం, కౄరత్వం పెచ్చరిల్లుతోంది. యిది ఒక జెండర్‌ని మిగలకుండా జేసే జినోసైడ్స్‌ దుర్మార్గం. ఈ చంపడంకూడా యిదివరకు గొంతుకోయడం, నరకడం కిరోసిన్‌ పోయడం ఈ మధ్య పాతగైందేమో! చంపే పద్ధతుల రకాలు మారినయి. ఆసిడ్‌ దాడులు, పెట్రోలు దాడులు విచ్చల విడైనయి. కొత్తగా పైనించి తోసేసి కూడా చంపొచ్చు అని అర్షద్‌ అనేవాడు సమీరని చార్మినార్‌నుంచి దొబ్బేసిండు. యివన్ని చూస్తుంటే గుండె గాయమైతది. మైండు పచ్చి పుండయితది. అరే.. ఆడోల్లని సమాజంల ఎంత నలగ్గొట్టాలో అంత నలగొట్టిండ్రు. ఏ స్వతంత్రం లేదు, సౌఖ్యం లేదు. ఆడోల్లయినందుకే ఎలాంటి మనిషి హక్కులు లేకుండా బతుకుతుండ్రు. అది కింది కులం ఆడోల్లకాంచి పెద్ద కులం ఆడోల్లదాకా. యింట్ల బువ్వ కుంటే కింది కులం మొగోల్లు గూడ బైటికి బోనియ్యకపోయేటోల్లు. కూలికి బొయొ చ్చినా కూలి పైసల మీద ఆడోల్లకు స్వతంత్రమే వుండది. యింతింత హింసలు యింట్లా బైట అనుభవిస్తున్నా డక్కా ముక్కిగ బతుకుతూనే వున్నరు. అట్ల గూడా బత్కనిస్తలేదు యీ మగజాతి.
అరే.. ఈ ఆడోల్లను యిట్లా ఆగంజేస్తుండ్రు? కనీసం బత్కనిస్త లేరెందుకు? ఈ చట్టాలేమైనియి, పోలీసులేంజేస్తుండ్రు, కోర్టు లెటుబొయి నయి. యివన్ని వుండిగూడ ఏడబడితే ఆడ, ఎట్లబడితే అట్ల యీ ఆడమేధం జరుగవట్టే.. ఆడోల్లని చంపాలనే ఉన్మాదాలు జరుగవట్టే… ఆడోల్లని చంపాలనే ఉన్మాదాలు కౄరత్వం ఎందుకు పెరుగుతున్నయి యీ మగవాల్లకు ఎక్కడ లోపం ఏంటి కారణం అని కడుపుల కార్జాలు కమిలిపోతున్నయి.
కొందరు సామాజిక మేధావులు యిట్లా జరగడానికి కల్చర్‌ ప్రధానంగా పని చేస్తుందని చెప్తారు. ఏ కల్చర్‌, ఎవరి కల్చర్‌? ఎవరు పెంచి పోషిస్తుండ్రు ఈ కల్చర్‌ని యీ కల్చర్‌కి అగ్గివెట్ట్ట. మనిషి విలువల్లేని యీ కల్చర్‌ని ప్రచారం జేసే మీడియాలు ఎవరివి? సమాజంలో ఏ గ్రూప్‌లు, ఏ వర్గాలు కల్చర్‌ నిర్ణయిస్తున్నారు, నిర్వచిస్తు న్నారు? కల్చర్‌ని కంట్రోల్‌ చేస్తున్నదెవరు? కల్చర్‌ని వ్యాపారం చేస్తున్నదెవరు? ఎ కులాలు, ఏ వర్గాలు అనేది ప్రశ్న, చర్చ.
మన రాజ్యాంగం సాంఘికంగా, జెండర్‌ పరంగా అణగారిన వారిని గుర్తించి వారికి కొన్ని సంరక్షణల్ని కల్పించింది. ఆయిచ్చిన సంరక్షణల్ని హక్కుల్ని చట్టాల్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద పెట్టింది. ప్రభుత్వ యంత్రాంగంలోని పరిపాలన, పోలీసు, న్యాయవ్యవస్థల్లోని అధికారులు ఉద్యోగులు రాజ్యాంగం, చట్టాలు అందించిన స్ఫూర్తితో బాధితుల పక్షాన పనిచేయాల్సి వుంది. కాని అది జరగడం లేదు. అణగారిన జెండర్‌ సాంఘిక పరమైన చట్టాలు వచ్చినా ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారుల, ఉద్యోగుల దృక్ఫధం మారలేదు. వీరు సమాజంలోని అణచివేతల్ని పుణికి పుచ్చుకొని చట్టం అమలులో వివక్ష దృస్టితోనే వ్యవహరిస్తున్నారు.
సమీరను చార్మినార్‌ నుంచి తోసేసిన ఉదంతం లో కూడా నిందితుడు వడ్డీవ్యాపారి. ఆమె పేదరికాన్ని ఆసరాగ జేసుకుని జరిగిన బెదిరింపులు ప్రలోభాల వాస్తవాలు ఒక వైపువుంటే, అవన్ని పక్కన బెట్టి నిందితున్నే పోలీసులు భుజానేసుకున్నారు.
యిక యివ్వాల 22.6.09నే సికింద్రాబాద్‌ లేబర్‌ అడ్డా మీద కూలికోసం నిల్చున్న ఆదివాసీ మహిళ మీద జరిగిన ఆసిడ్‌ దాడికి మీడియా, పోలీసులు పెద్దగా స్పందించకపోవడానికి న్యాయం జరగక పోవడానికి ఆమె ఆదివాసి అయినందుకే గదా! సమాజంసై ఆధిపత్యం చెలాయిస్తున్న సోషల్‌ సమూహాల నుంచి వచ్చిన వారే ప్రభుత్వల్లో ఆధిపత్యంగా వున్నారు. అందుకనే వాళ్లుబాధితుల పట్ల వివక్ష దృష్టే అమలు చేస్తున్నారు. సమాజంలో స్త్రీలను సెక్స్‌ సింబల్‌గా చూస్తే కిందికులాల స్త్రీలను వల్నరేబుల్‌ సెక్స్‌గా చూసే దృష్టినే పోలీసుల కున్నది. పోలీసు యంత్రాంగంలో వున్న వారు అణగారిన జెండర్‌, అణగారిన సమూహాల పట్ల మానవీయ బాధ్యతతో వ్యవహరించకపోగా హత్యలు, దాడులు, అత్యాచారాలు చేస్తున్న నిందితుల్ని కాపాడు తున్నారు. యిప్పటిదాకా ఒకటి ఆరా తప్ప స్త్రీల మీద జరిగిన ఏ దాడులు, హత్యలు నేరాలుగా రుజువు కాలేదు. సమాజంలో స్త్రీల వ్యక్తిత్వాల పట్ల వున్న దృష్టే అంటూ ఆమె ప్రవర్తన మంచిది కాకుంటే అత్యా చారం చేయొచ్చు చంపొచ్చు. ఏమైనా నేరం కాదు అనే దృష్టే చట్టాలు అమలు జరిపే వారిలోనూ కొనసాగుతోంది వీరికి బాధిత మహిళలపట్ల, బాధితకులాల జాతులవారి పట్ల సానుకూలంగా ప్రవర్తించేటట్లు సాను కూలంగా ప్రవర్తించేటట్లు ప్రభుత్వమే శిక్షణ నివ్వాల్సిన అవసరం వుంది తన యంత్రాంగానికి. రాజ్యాంగ స్ఫూర్తితో జెండర్‌, సోషల్‌ ట్రైనింగులనివ్వాలి.
మీడియాలు ప్రచారం చేసే వ్యాపార కల్చర్‌కి ప్రత్యామ్నాయంగా శ్రమ సమూ హాల సంస్కృతుల్ని పెంపొందించాలి. చట్టం విఫలమైనకాడ నిందితుల్ని సమాజంలోని బాధిత సమూహాలకొప్ప జెప్పాలి. అట్లాకాకుంటే మగ దురహంకారం యాసిడ్‌ స్ఖలనాలకు పాల్పడుతూనే వుంటది.

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

7 Responses to ఆడోల్లని బత్కనియ్యరా?

  1. Praveen says:

    స్త్రీల పై హింసకి వ్యతిరేకంగా నేను వ్రాసిన కథ “వెన్నెల దారి” http://sahityaavalokanam.net/kathanilayam/2009/july/vennela_daari.html

  2. @ ప్రవీణ్: ఎప్పుడో నువ్వు నీ వయసు 26 సం. అని చెప్పినట్లు గుర్తు. ఆ విషయం మనసులో ఉంచుకునే నీ కన్నా పెద్దవాడిగా సలహా ఇస్తున్నట్లుగా భావించు.

    నీ కధలు చదివాను. అవి చాలా అపరిపక్వంగా ఉన్నాయి. నువ్వు రాసిన మూడిటిలో రెంటిలో అన్న (లేదా తండ్రి) తమ భార్యలని హింసిస్తే తమ్ముడు లేదా కొడుకు ఆ వివాహితను లేపుకుపోయినట్లు రాసావు. ఇది ఏ రకమైన స్త్రీవాదం. నాకు తెలిసి నీ మనస్థితి బాగా లేకపోవటమో లేదా చిన్న వయసు కావటం వల్లనో ఇలా ఆలోచిస్తున్నావు. ఇక మూడో కధ నాకు గుర్తులేదు కానీ ఇలాంటి పెడవరుసలోనే ఉన్నదని మాత్రం గుర్తుంది.

    కధలో నీ ధోరణి ఇలా వెర్రితలలు వెట్టగా, కధనం కూడా చాలా చెప్పగా ఉంది. చంద్రకాంత సీరియల్ అంటావు… వదినను ఊహించుకుంటున్నాడంటావు… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాతలు చాలా వెగటుగా ఉన్నాయి. .

    ఇక శిల్పం. నువ్వేదో పక్కవాడికి కధను చెప్పటం లేదు. రాస్తున్నావు. రాసే టప్పుడు భాషలో కానీ భావవ్యక్తీకరణలో గానీ నీదైన శైలి ఉండాలి. అవిలేకపోవటం వల్ల నీ కధ ఈ టి.వి. నేరాలూ-ఘోరాలూ కామెంట్రీ విన్నట్లుంది. నీకు తెలుసో లేదో నీ ఈ పెడసరి మనస్తత్వంతో నువ్వు బ్లాగ్లోకంలో ఇప్పటికే నవ్వులపాలయ్యావు. ఇక నుండైనా నీకు చేతనైన, నీ లబ్ది చేకూర్చే విషయాలపై (చదువైనా, బిజినెస్ అయినా) దృష్టి పెట్టు. నీ తరహా కధల వల్ల నువ్వు అపప్రధని మూట కట్టుకోవటం తప్పితే ఒరిగేదేం లేదు.

    నీ కన్నా పెద్దవాడిగా బ్లాగ్లోకంలో నిన్ను ఎరిగిన వాడిగా నీ మంచికోరి చెప్తున్నాననుకో

  3. ప్రవణ్: ముందుగా స్త్రీవాదం అంటే ఏమిటో తెలుసుకోండి. ఆ తరువాత ఇప్పటికే స్త్రీవాద సాహిత్యం పేరుతో ఉన్న సాహిత్యాన్ని చదవండి.

  4. ప్రవీణ్, నీ సాహిత్యావలోకనానికి comment moderation ఉండుటచే ఇది ప్రచురింపబడలేదు. నేను నీకు చేసిన విన్నపం ఇదీ:

    “ప్రవీణ్ ఇది వరకు నువ్వు నీ బ్లాగింగ్ అంతా మీ అమ్మగారి కనుసన్నలలోనే జరుగుతుందని చెప్పినట్లు గుర్తు. నువ్వొకసారి కధలు ప్రచురించే ముందు ఆ కధలను మీ అమ్మగారికి వినిపించి/చదివిపించి వారి అభిప్రాయాన్ని తీసుకోవటం మంచిది. వారి అభిప్రాయాన్ని మా అందరితో తదుపరి టపాలో పంచుకుంటావని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నువ్వు ప్రచురించిన ఈ మూడు కధలపై కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేయి. (కధను పూర్తిగా వినిపించు. సారాంశం మాత్రమే చెప్పి అభిప్రాయాన్ని రాబట్టకు)”

  5. Praveen says:

    నేను ఆ కథలలో ఎక్కడా కొడుకులు గురించి అలా వ్రాయలేదు. కథలు పూర్తిగా చదవకుండా అబద్దాలు వ్రాయడం ఎందుకు?

  6. sashi says:

    ప్రవీణ మిమ్మల్ని నిరుత్సాహ పరిచే వాళ్ళని పట్టించుకోకండి. కథలు రాస్తు ఉంటే మీకే ఎలా రాయాలో తెలుస్తుంది ప్రయత్నించండి.

    ఈ బ్లాగుల్లో రాసే రాతలన్నీ ఉబుసుపోక రాసే కబుర్లే వాటి వల్ల వీసమెత్తు లాభం లేదు.
    పనికిరాని కవితలను కబుర్లను ప్రోత్సాహించే వారికి మిమ్మల్ని విమర్షించే అధికారం లేదు.

    అసలు మీరు కవితలు రాయండి బాగా రాయగలరని నా నమ్మకం. మీ పదప్రయోగాలు ఇక్కడ బ్లాగుల్లో కవితలు రాసే వారిని మించిపోయాయి.

  7. Praveen says:

    నేను కూడా ఒక కవిత వ్రాసాను. http://sahityaavalokanam.net/?p=160

Leave a Reply to Praveen Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.