Category Archives: పచ్చి పసుపు కొమ్ము

అమ్మాయిల కల్లలైన కలలకు కారకులెవరు? – పి. ప్రశాంతి

ఇరవయ్యేళ్ళ మనోజ చురుకైన పిల్ల. పదో తరగతి వరకు చదువులో, ఆటపాటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో.. అన్నిట్లో ముందుండేది. ఆరోతరగతి నుంచి హాస్టల్లోనే చదువుకున్నా ఇంటి పనుల్లో అమ్మకి సాయం చేయడం, పొలం పనుల్లో నాన్నతోపాటు నడుం వంచి పనిచేయడం చేసేది. సెలవులకి ఇంటికి వస్తే ఒక్క క్షణం తీరిగ్గా కూర్చునేది కాదు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఏది మార్గం??? – పి. ప్రశాంతి

పాతికెకరాల మాగాణి, ఏడెకరాల మెట్ట సాగుతో పాటు పాడి పశువులు, ఎడ్లు ఉన్న ఆసామి రంగయ్య. ఊర్లో అందరూ గౌరవించే పెద్దమనిషి. ఎవరికీ హానిచేయని మనస్తత్వం. ఆయనకి సరిజోడి జానకమ్మ. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినా ఆది దంపతుల్లా ఉన్నారంటారు చూసినవాళ్ళంతా. వాళ్ళకి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ కుసుమ.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

గర్భసంచి మహిళలకి లైఫ్ లైన్ – పి. ప్రశాంతి

‘పండగలంటే పల్లెటూళ్ళలోనే చూడాలి. మరీ ముఖ్యంగా దసరా పండక్కి తెలంగాణా పల్లెల్లో రకరకాల పూలతో బతుకమ్మల్ని చేసి అందమైన ఆటపాటలతో సాగానంపడం చూడాల్సిందే. ఆంధ్రా పల్లెల్లో అయితే సంక్రాంతి పండక్కి నెల ముందునించే ముంగిళ్ళలో ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెడ్లు, హరిదాసులు…. చెప్పడం కాదు చూసి తీరాల్సిందే’ పరవశంగా చెప్పుకు పోతున్నాడు నరేంద్ర.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

నా గమ్యం వేరు… నా గమనం వేరు… – పి. ప్రశాంతి

పదినేనేళ్ళ రవళికి లోకమంతా ఇంద్రధనస్సు రంగుల్లో కనిపిస్తోంది. ధనుర్మాసపు మంచుతెరలు ప్రకృతికి వేసిన మేలిముసుగులా అనిపిస్తోంది. బంతి, చామంతి, ముళ్ళగోరింట, డిసెంబరు పూలు, అరవిచ్చిన గులాబీలు లేత ఎండలో సొగసులొలికిస్తున్నాయనిపిస్తోంది.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

మాతృత్వమా మశానమా.. – పి. ప్రశాంతి

కరుణ మంచం మీద అచేతనంగా పడుంది. పక్కనే కూర్చున్న భాగ్యమ్మ బిడ్డని ఆందోళనగా చూస్తూ ‘ఏమైంది బిడ్డా, పెయ్యంతా సల్లగయితాంది, మూడు దినాలాయె మూత్రంజేసి.. పొయ్యి బిడ్డా కడుపు తీసేస్తది..’ అంటూ ఎత్తుగా ఉబ్బిన కరుణ పొట్ట మీద చెయ్యి వేసింది. అంతే, అంతెత్తున ఎగిరి పడిరది కరుణ. ఆమె వేసిన గావుకేకకి ఇంటిల్లిపాదీ పరిగెత్తుకొచ్చారు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

అనవసరపు గర్భాశయ ఆపరేషన్లూ కానరాని హింసే – పి. ప్రశాంతి

‘‘అత్తా.. అత్తా..’’ లోగొంతుకతో పిలుస్తూ గుమ్మంలో నిలబడి లోపలికి తొంగి చూసింది అనిత. కిటికీలోంచి పడుతున్న కొద్ది వెలుతురులో మంచం మీద ముడుచుకు పడుకున్న మల్లమ్మను చూసి ‘‘ఏమైందత్తా’’ అంటూ లోపలికొచ్చింది. ‘మూడు దినాలుగా దినమంతా నిల్సొని పత్తి పీకుడయితాంది. కాళ్ళు, నడుము ఒకటే గుంజుడు, లేవనీకి కావట్లేదు. ఒకటే నీరసం.. వయసైతాన్దిగా బిడ్డా!! సరేగాని, … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

గర్భసంచిని రక్షిస్తే మహిళల జీవితాల్ని సంరక్షించినట్లే – పి. ప్రశాంతి

టైమ్‌ 11 అవుతోంది. అపార్ట్మెంట్‌ సెల్లార్‌లో ఉన్న ఆఫీసు రూమ్‌లో దాదాపు 20 మంది మహిళలు ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా రావలసిన దోస్తుల కోసం వచ్చేయండంటూ కొందరు ఫోన్లు చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళకి ఆటవిడుపు.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

పిల్లలు పుట్టేశాక బిడ్డసంచి దండుగేనా – పి. ప్రశాంతి

నొప్పితో మెలికలు తిరిగిపోతోంది భారతి. కాసేపు కూర్చుంటోంది, కాసేపు ముడుచుకు పడుకుంటోంది, ఇంకాసేపు విరుచుకుని కూలబడుతోంది… నొప్పి భరించలేక ఆయసంతో పాటు గొంతులోంచి బాధతో కూడిన మూలుగు తన్నుకు వస్తోంది. కళ్ళల్లోంచి సన్నగా నీళ్ళు కారుతున్నాయి. తను కూర్చున్న చాప మీద పక్క చిందరవందరగా ఉంది. ఒకపక్క అన్నం తింటూ వదిలేసిన కంచం, సగం నీళ్ళతో … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఏది శిలా? ఏది వల? -పి. ప్రశాంతి

దసరా పండుగ ఇంకో రెండు రోజుల్లో ఉంది. ఊరంతా సందడిగా ఉంది. ప్రతి ఇల్లూ హడావిడిగా కనిపిస్తోంది. ఇంట్లో సామాన్లన్నీ శుభ్రం చేయడం, మరీ ముఖ్యంగా పండగలకి, పబ్బాలకి ఉపయోగించే ఇత్తడి, రాగి పాత్రలని అటకమీద నుంచి దించి, మెరిసేలా తోమి ఎండకి ఆరబెట్టి

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

అమ్మాయిలు బూతులు మాట్లాడితే రౌడీలా…!! -పి. ప్రశాంతి

జెండర్‌ ట్రైనింగ్‌ తీసుకున్న ఒక కళాజాత టీమ్‌ ఆ రోజు దగ్గర్లోని గ్రామంలో సామాజిక అంశాలపై అవగాహనా కార్యక్రమాల్లో భాగంగా కళారూపాలు ప్రదర్శిస్తున్నామని రమ్మని పిలిస్తే వెళ్ళింది శాంతి. రాత్రి సుమారు 8 గంటల సమయం. గ్రామం చేరుకునేసరికి కరెంటు పోయి కళారూపాల ప్రదర్శన ప్రారంభంలోనే ఆపాల్సి వచ్చిందట. అక్కడికొచ్చిన గ్రామస్థు లందరూ గుంపులు

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

తల్లిదండ్రులు కొరగాని వాళ్ళు కాదు -పి. ప్రశాంతి

పోలీస్‌స్టేషన్‌ నుంచి కాల్‌ వస్తే మాల, గోపీ ఇద్దరూ ఆతృతగా వచ్చారు. వాళ్ళని చూసి రిసెప్షన్‌లో కానిస్టేబుల్‌ ఎస్‌హెచ్‌ఓ గదివైపు చూపించింది. ఇన్‌స్పెక్టర్‌ గదిలోకెళ్ళారు. ‘రండి మీ కోసమే చూస్తున్నా’ అంటూ కుర్చీలు చూపించాడు ఇన్‌స్పెక్టర్‌. అప్పటికే అక్కడ కూర్చొనున్న

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

వివిధ జెండర్‌ అస్థిత్వాలూ ఒక వాస్తవమే -పి. ప్రశాంతి

ఇంటిముందు పార్కులో పున్నాగ చెట్టు క్రింద తలపట్టుకుని కూర్చుంది మోహన. చల్లటిగాలి శరీరాన్ని తాకుతున్నా సాంత్వనగా లేదు. కళ్ళల్లో నీళ్ళు చెంపలమీదుగా కారిపోతున్నా చలనం లేకుండా కూర్చుంది. ఉరుములు, మెరుపులతో వర్షం మొదలయ్యే సరికి పెద్ద గొడుగుతో

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఏది నిజం? – పి. ప్రశాంతి

ఎప్పుడూ చలాకీగా ఉండే బిందు నిర్లిప్తంగా, నిస్తేజంగా కనబడిరది. నిన్న సాయంత్రం కూడా అలాగే ఉంది. అపార్ట్‌మెంట్‌లో అందరితో కలివిడిగా ఉండే బిందుతో కాస్త ఎక్కువ స్నేహమే శాంతికి. ఎదురెదురు ఫ్లాట్స్‌ అవడం వలనా, ఇద్దరిదీ దాదాపు ఒకే వయసు కావడం వల్ల కూడా. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా ఐదారేళ్ళుగా రెండు మూడు రోజులకొకసారైనా కాసేపు … Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ప్రగతి అంటే ప్రకృతి విధ్వంసం కానే కాదు – పి. ప్రశాంతి

పని ఒత్తిడిలో అలిసిపోయి, పడుకోగానే నిద్రపోయిన రాణికి అర్థరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చేసింది. కారణం ఏంటా అని ఆలోచించేలోపే ఘాటైన వాసనతో ఊపిరి పీల్చుకోవడమే కష్టమైపోతున్నట్లుంటే లేచి కిటికీ తలుపులు మూసేసి వచ్చి మళ్ళీ పడుకుంది. కానీ ఆ వాసనలు ఆగితేనా. మెల్లిగా కళ్ళు

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

కల్లోల కడలిలో యువత – పి. ప్రశాంతి

రమ ఓ సామాజిక కార్యకర్త. మహిళలపై హింసకి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలో ఫీల్డ్‌ కో`ఆర్డినేటర్‌గా నారాయణపేట జిల్లాలో పనిచేస్తోంది. ముగ్గురు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఉన్న కొద్దిపాటి భూమిలో తనే వ్యవసాయం చూసుకుంటూ పిల్లల్ని చదివించింది. ఐదో తరగతితో బడి మానేసిన రమకి చదువంటే మహా ఇష్టం. హైస్కూల్‌కి

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

ఎక్కడమ్మా నువ్వు లేనిది -పి. ప్రశాంతి

అదో చిన్న ఆదివాసీ గ్రామం. రోడ్డుకి రెండు వైపులా మాత్రమే ఇళ్ళున్నాయి. కొండవైపున్న ఇళ్ళు రెండు వరసల్లో, ఆవరణలో పెద్ద పెద్ద చెట్లతో నిండున్నాయి. కొండ దిగువకి ఉన్న ఇళ్ళు ఒక వరసే ఉన్నాయి. ఆ ఇళ్ళ వెనగ్గా కొండల్లో పైనించి వస్తున్న జలాపాతాల్లాంటి నది.

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment