”చీరనెరజాణ”
భూమిక | July 21, 2007
- పోడూరి కృష్ణకుమారి కళ్యాణమండపం గేటు దగ్గర నిలబడి పూలతో ఏర్పాటైన ఆర్చి, దానిమీద అందంగా తీర్చిన వధూవరుల పేర్లు చూస్తూ ఓ నిమిషం అలాగే నిలబడింది లత. కళాత్మకంగా తీర్చిదిద్దబడి, ఆహూతులతో కళకళలాడి పోతున్న ఆ హాలు అందాలు, సందడి చూసేందుకు రెండు కళ్ళు చాలవనిపించింది.