| October 6, 2007

ఎన్. వేణుగోపాల్,హైద్రాబాద్ గౌరవనీయ మిత్రులు కొండవీటి సత్యవతి గారికి, భూమిక సెప్టెంబర్ 2007 సంచికలో ‘మానవీయ భాష నేటి అవసరం’ అని మీరు రాసిన సంపాదకీయం స్పూర్తితో పూర్తిగా ఏకీభవిస్త మీ ఆవేదనలో, ఆందోళనలో భాగం పంచుకుంటున్నాను.

Share

ప్రతిస్పందన

| September 7, 2007

జులై నెల ‘భూమిక’లో ”యుద్ధ సమయంలో రాయటమంటే” అన్న అమీనా హుసేన్ (శ్రీలంక) వ్యాసం అద్భుతంగా వుంది. స్త్రీలు రాస్తున్నపుడు ఎంత సెన్సార్షిప్ వుంటుందో మనందరికీ తెలుసు.. దీని గురించి మనమంతా యిదివరకే చర్చించి వున్నాం కూడా…

Share

ప్రతిస్పందన

| August 10, 2007

డా. సమతారోష్ని సత్యవతిగార్లకు మీరు జూన్ సంచికలో రవాణాశాఖమంత్రిగారికి రాసిన ఉత్తరం చదివాను. అందులో రాసిన విషయం మంత్రి గారికిగాని ఆర్టిసి వారికి గాని అతి మాములు విషయం. వారినించి ఏలాంటి సమాధానం రాదు. ఒక వేళ వచ్చినా ఆ డిపో మేనేజరుకు ఎంక్వయిరీ చేయమని వస్తుంది. డిపో మేనేజర్ ఆ రోజు బస్సులో ఉన్న కండక్టరును విచారిస్తారు. కండక్టరు అలాంటిది ఏమి జరగలేదని అంటారు. అప్పుడు మీకు ఒక ఉత్తరం వస్తుంది. మీ వద్ద ఏమైనా [...]

Share

ప్రతిస్పందన

| July 21, 2007

జూన్‌ సంచికలో కల్పనా శర్మ మీద రాసిన సంపాదకీయం చాలా బావుంది. హిందూ పేపర్‌లో ఆమె కాలమ్‌ నేను రెగ్యులర్‌గా చదువుతాను. ఇక ముందు ఆ కాలమ్‌ వుండదంటే (తను రిటైర్‌ అవుతోంది కాబట్టి) బాధగా వుంది. ఆమె గురించి సంపాదకీయం రాసినందుకు అభినందనలు.

Share

ప్రతిస్పందన

| May 2, 2007

ఏప్రిల్ 07 లో రాసిన సంపాదకీయం ‘ఫ్రెష్ మార్కెట్ల వెనుక క్రష్ అవుతున్న మహిళల జీవనోపాధి” అనేది నేడు ఎంతో కీలకమైన సమస్య. గత కొద్ది మాసాలుగా, ముఖ్యంగా ఈ విశాఖ పట్నంవంటి మహా పట్టణాల్లో వెలుస్తున్న ‘సూపర్’ ‘డాపర్’ తాజా మార్కెట్లు చూస్తున్నప్పుడల్లా, మనసులో ఏదో ఒక బాధ, భయం తొలిచేస్తున్నాయి. అసలు సామాన్యుడు ఈ దేశంలో కనీస జీవనోపాధినైనా పొందగలిగే అవకాశం, ఆ ఆదాయ మార్గం ఇంకా ఏమైనా మిగిలి ఉంటుందా?? ఇన్ని వేల [...]

Share

రచయిత/రచయిత్రులకు విజ్ఞప్తి

| May 2, 2007

కొంతమంది రచయిత్రులు, పాఠకులు అర్ధం కాని చేతిరాతతో తమ రచనలు, ఉత్తరాలు పంపుతున్నారు. దీనివల్ల తప్పులు దొర్లడమే కాక టైపు చేయడం చాలా కష్టంగా ఉంటోంది. కాబట్టి ఇకనుంచి తమ రచనలనుగాని, ప్రతిస్పందన శీర్షికకు పంపే ఉత్తరాలు, స్పష్టంగా అర్ధం అయ్యే విధంగా కాగితానికి ఒక వైపునే రాసి పంపించాల్సిందిగా కోరుతున్నాం.

Share

ప్రతిస్పందన

| April 1, 2007

దీర్ఘకాలంగా జైళ్ళల్లో మగ్గుతున్న జీవిత ఖైదీల విడుదలకు గత కొన్ని నెలలుగా ఆశలు కల్పించిన ప్రభుత్వం ఎట్టకేలకు 2007 జనవరి 26న జి. ఒ. నెం. 314, 315లను జారి చేసి తిరిగి వాటిని జి.ఒను నిలుపుదల చేయడం వలన ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు, మానసిక క్షోభకు గురవుతున్నారు. మా ఈ ఆవేదనను మానవతా దృక్పథంతో తిలకించి ఖైదీల విడుదలకు సహకరించవలసిందిగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రచయితలు, మేధావులు, దయార్ద్ర హృదయుల్ని [...]

Share

ప్రతిస్పందన

| March 21, 2007

అభినందనలతో వ్రాయునది జనవరి-07 పత్రికలో కొడవటిగంటి కుటుంబరావు కథలోని స్త్రీ పాత్రలు – ఎలసాని వేదవతిగారు వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. ఒక్కొక్క కథలోని స్త్రీ పాత్రల విశ్లేషణ వేదవతిగారు బాగా చేశారు. లిడియో శాఖో గురించి ఆలోచించండి – ఓల్గాగారి రిపోర్టు చాలా బాగుంది.

Share

ఎడిటర్ గారికి

| February 11, 2007

ఎడిటర్ గారికి, జనవరి సంచికలో ప్రచురితమైన రేణుక అయోలగారి కథ ‘డైరీ’ బాగుంది. మొదట ధోరణి కొంతవరకూ ఈనాడు అసంఖ్యాకంగా వస్తున్న స్త్రీవాద కథల మాదిరిగానే అనిపించినా చివర ఆ డైరీ పడవలసిన వారి చేతులోనే పడడం అన్న ట్విస్ట్ కథకు ఒక కొత్తదనాన్ని సంతరించింది. అయితే ఫోనుల్లో పలికే హెల్ప్‌లైనుల గురించి రచయిత్రి ఆపార్ధం చేసుకున్నట్లనిపిస్తుంది.

Share