Monthly Archives: March 2007

మార్చి ఎనిమిది మార్గంలో…

సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళి అక్కడే మకాం పెట్టిన ఈ రోజుల్లో కూడా ఆడవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన రోజు వుండాలని మీరింకా ఎందుకనుకుంటున్నారు? అంటూ ఇటీవల ఒక విలేఖరి నన్ను ప్రశ్నించాడు. అంతర్జాతీయ మహిళా దినం మార్చి ఎనిమిది గురించి నన్ను ఇంటర్వ్యూ చేస్తూ అతను పై ప్రశ్న వేసాడు. సునీత అంతరిక్ష యానం … Continue reading

Share
Posted in సంపాదకీయం | 1 Comment

ప్రతిస్పందన

అభినందనలతో వ్రాయునది జనవరి-07 పత్రికలో కొడవటిగంటి కుటుంబరావు కథలోని స్త్రీ పాత్రలు – ఎలసాని వేదవతిగారు వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. ఒక్కొక్క కథలోని స్త్రీ పాత్రల విశ్లేషణ వేదవతిగారు బాగా చేశారు. లిడియో శాఖో గురించి ఆలోచించండి – ఓల్గాగారి రిపోర్టు చాలా బాగుంది.

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

2006లో వినిపించిన కవయితుల్ర గుండె చప్పుళ్ళు

– శీలాసుభద్రాదేవి   ఒకప్పుడు ఏడాదికి అతి తక్కువ సంఖ్యలో కవితా సంపుటాలు వెలువడేవి. అందులోనూ కవయిత్రుల పుస్తకాలు మరీ తక్కువ. ఇటీవల ఏడాదికి కవయిత్రుల పుస్తకాలే అయిదారుకు తక్కువ కాకుండా వస్తున్నాయి. కవయిత్రుల కవిత్వం పట్ల చూపుతున్న ఆసక్తినీ, సృజనాత్మకతనీ, పోటీపడి ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకొంటూ సమాజంలోని అనేక సమస్యల పట్ల తమ … Continue reading

Share
Posted in వ్యాసాలు | 1 Comment

సరికొత్త దృశ్యం

– నంబూరి పరిపూర్ణ బి.కాం. ఫైనలియర్లో వున్న సుజాతకు చదువు తప్ప మరే లోకంతోనూ పన్లేదు. ఫస్టు క్లాసు ఓ లెక్కలోది గాదామెకు. అంతకు మించిన మెరిట్ మార్కుల్తో పాసవ్వాల్సిందే. తండ్రి రంగనాధరావు పి.డబ్ల్యులో సెక్షనాఫీసరు. సంపాదన పరిమితమే అయినా సంతానం చదువుల గూర్చిన శ్రద్ధ అపరిమితం. పిల్లలు సైతం చదువుల్లో దిట్టలు.

Share
Posted in కథలు | 5 Comments

సూర్యచందుల్న్రి మమేకం చేసిన కాంతిగోళం

ఆమె మార్గంలో నడుద్దాం- సావితిబ్రాయి ఫూలే – కత్తి పద్మారావు ప్రపంచవ్యాప్తంగా తాత్వికులకు, ఉద్యమకారులకు పోరాట వీరులకు బాసటగా నిలచిన స్త్రీలలో సావిత్రిబాయి ఫూలేది అద్వితీయ చరిత్ర. మార్క్స్కు జన్నీ ఎంతో సహకారాన్ని అందించింది. అయితే అది తాత్విక రంగంలోనే ఎక్కువగా జరిగింది. కానీ సావిత్రిబాయి ఫూలే మొత్తం పోరాటంలోనే భర్తకి అండగా నిలిచింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఫీమెల్ యూనక్

– పి. సత్యవతి “ఏప్రిల్ యాష్లే” పుట్టింది మగ పుట్టుకే. అతని శరీర నిర్మాణం అంతా పురుష శరీర నిర్మాణమే. అయితే వచ్చిన చిక్కేమిటంటే అతనికి పురుషుడిగా వుండడం ఇష్టం లేదు. స్త్రీగా బ్రతకాలని చచ్చేంత కోరిక. అట్లా అని స్త్రీల పట్ల వ్యామోహమూ లేదు. పోనీ స్వలింగ ప్రేమ అంతకన్నా లేదు. అతని గోలంతా … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మానవీయ విలువల మంచుముత్యాల పతాకం

“పుస్తకంలోని ఒక మాట మీ జీవిత గమ్యాన్ని నిర్దేశించవచ్చు”- సరిగ్గా ఈ మాట ‘అంబికా అనంత్’ రాసిన ‘మంచుముత్యాలు’ (కథాసంపుటి) కు వర్తిస్తుంది. ఇందులో 14 కథలున్నాయి. ఇది పధ్నాలుగు జీవిత పార్శ్వాలు. ఏ ఒక్క కథా మరో కథలా వుండదు. విభిన్న కోణాలతో రచనా దృష్టిని చేస్తూ మానవీయ దృక్పథమే ప్రధానంగా ఈ రచయిత్రి … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆగమ్మ

– ఇంటర్వ్యూ: జె. సుభద్ర (వరంగల్ జిల్లాలో సర్పంచిగా పనిచేస్తున్న దళితురాలు ఆగమ్మ. పేరుకి ఆమె సర్పంచిగాని అధికారమంతా ఆమె కొడుకుదే. ఆగమ్మతో సుభద జరిపిన ఇంటర్వ్యూ.) ప్రః చెప్పమ్మా ఎప్పుడు ఎన్నికయ్యావు నువ్వు, ఎవరు నిల్చోబెట్టారు, మీ పంచాయితీ గురించి చెప్పు…? పంచాయితీ సంగతి కొడుక్కి తెలుసు గద నాకేం దెలుత్తది నన్ను నిలబెట్టుకున్నడు … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | 2 Comments

నా సంతోషం సొరకాయకూర వండడంలో లేదు సూర్యోదయంలో వుంది

వంట చెయ్యడమంటే నాకు పరమ చిరాకు. దాన్నొక వృత్తిగా మలచి విశ్వవిద్యాలయాలు నడిపిస్తూ ఏటేటా వేలాది మంది సంస్థాపరమైన వంట నిపుణుల్ని దిగుమతి చేస్తున్నా సరే అవి నాకేమాత్రం ఆసక్తిని కలిగించలేకపోయాయి. మూడు తరాల ఆడపిల్లలు కలలు కన్న ఎయిర్ హోస్టెస్ (గగన సఖి) ఉద్యోగం కూడా వంటకి అనుబంధమైన వడ్డన వుండటం వల్లనే అనాకర్షణీయంగా … Continue reading

Share
Posted in వ్యాసాలు | 2 Comments

హెచ్.ఐ.వి హైకూలు

మూడో పప్రంచ యుద్ధం సూదితో మొదలైందా! నెత్తుటి బొట్టు నుంచున్న పళాన ఒణికిస్తోంది కొమ్ములతో కోరలతో భయపెట్టే పాతకాలంవాడు కాదు ఈ శతువ్రు జలుబుతో దగ్గుతూ క్షీణించిన కొద్దీ భయపెడతాడు

Share
Posted in కవితలు | 1 Comment

విడి విడి ఆకులు

– ఆర్.వి.ఎం.ఆర్.రత్నా రావు, పిఠాపురం బోల్ తలాక్ తలాక్ తలాక్ ఇద్దరి విరసపు చరమాంకంలో చెరొక దారికై తలొక ఆకు బేక్ర్ ది లాక్, టు షేక్ ది లా, ఇవ్వొక షాక్ ఇది బానిస బత్రుకు నుంచి బైటకు వనిత చేసే వాక్

Share
Posted in కవితలు | Leave a comment

కళ్ళెర్రజేయవే చెల్లెమ్మా!

– డా. ఎస్వీ సత్యనారాయణ మాయమాటలు నమ్మి చెల్లెమ్మా! – నువ్వు మోసపోవద్దింక చెల్లెమ్మా! పొగుడుతున్నారనీ చెల్లెమ్మా!- నువ్వు పొంగిపోవద్దింక చెల్లెమ్మా! ||మాయ||

Share
Posted in కవితలు | Leave a comment

బాల్యం బంతాట

– పంతం సుజాత తనిఖీ కొచ్చిన తాసిల్దారులా వస్తున్న హెడ్మిసెస్ని చూసి చదువుతున్న వారపతిక్రను తిరగేసి దాచిన జాణతనం టీచరొస్తున్న అలికిడై గార్డెన్లో కోసిన ముద్దబంతిని యూనిఫాంలో దాచుకున్న గడుసుతనం ఏమైపోయిందో తెలీదు!…

Share
Posted in కవితలు | Leave a comment

ప్రకృతిని ప్రేమించే బాలప్రేమికులు

విద్యార్థుల పర్యావరణ కాంగెస్ర్లో కలిగిందొక వింతైన అనుభూతి బాలబాలికలే పార్లమెంటు సభ్యులు ఓ సీతాకోక చిలుక స్పీకరమ్మ అవతారంలో

Share
Posted in కవితలు | 2 Comments

అమ్మ

– రేష్మ, డి.జి.టి మొదటి సంవత్సరం పెదవులు కలుసుకున్న పత్రిసారీ గుర్తుకొచ్చేది నువ్వే… కనురెప్పలు మూసుకున్న పత్రిసారీ వినిపించేది నీ జోలపాటలే… శ్వాసపీల్చుకున్న పత్రిసారీ శాంతతనిచ్చేది నీ కమ్మని మాటలే… నిజం తెలుసా అమ్మ!

Share
Posted in కవితలు | Leave a comment

ఆడదిక్కు

– లతాశర్మ (అనువాదం: ఆర్. శాంతసుందరి) “అమ్మా! తొమ్మిదిన్నరవుతోందే, ఇంకా ఎంతసేపిలా ఆకలితో కూర్చునుండాలి?” రమ ఎంతో సౌమ్యంగా అడిగింది. “ఇదిగో, ఐదే ఐదు నిమిషాలు!” అమ్మ చటుక్కున లేచి వెళ్ళి బాత్రూమ్ తలుపు మళ్ళీ తట్టింది.” ఒరే అమర్, త్వరగా రారా!… అక్క యింకా ఏమీ తినకుండా కూర్చునుంది!” అంది.

Share
Posted in కథలు | 4 Comments