Monthly Archives: April 2007

“ఫ్రెష్‌” మార్కెట్ల వెనక క్రష్‌ అవుతున్న మహిళల జీవనోపాధి

పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది. ఫుడ్‌ బజార్లు ప్రవేశించి ఎన్నో సూపర్‌బజార్లను మింగేసాయి. జెయింట్‌లు, బిగ్‌ బజార్లు వచ్చి ఫుడ్‌ బజార్లను దెబ్బతీసాయి. ఇపుడు తాజా కూరగాయలు, తాజా పండ్లు అందిస్తాం అంటూ తాజాగా మార్కెట్‌లో ప్రవేశించిన “ఫ్రెష్‌” సూపర్‌ మార్కెట్లు, నగరంలో ఎక్కడెక్కడ కూరగాయలు అమ్మే స్థలాలున్నాయో, అక్కడే తమ దుకాణం తెరిచి … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన

దీర్ఘకాలంగా జైళ్ళల్లో మగ్గుతున్న జీవిత ఖైదీల విడుదలకు గత కొన్ని నెలలుగా ఆశలు కల్పించిన ప్రభుత్వం ఎట్టకేలకు 2007 జనవరి 26న జి. ఒ. నెం. 314, 315లను జారి చేసి తిరిగి వాటిని జి.ఒను నిలుపుదల చేయడం వలన ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు, మానసిక క్షోభకు గురవుతున్నారు. మా ఈ … Continue reading

Share
Posted in ఎడిటర్‌కి లేఖలు | Leave a comment

పునరుజ్జీవనం

– చల్లపల్లి స్వరూపరాణి సునీత బియస్సీ, బియ్యీడీ చేసి హైదరాబాదులోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్‌ స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తోంది. కర్నూలు దగ్గర కోడుమూరు తన స్వగ్రామం. హైదరాబాదు నుంచి యింటికెళ్ళాలన్నా, యింటినుంచి హైదరాబాదు వెళ్ళాలన్నా మధ్యలో కర్నూల్‌లో దిగి తన ఫ్రెండ్స్‌ అరుణ, విమలలను కల్సి ఒకటీ రెండు రోజులుండి మళ్ళీ గమ్యస్థానానికి చేరడం సునీతకి … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

సంస్కృతి, సృజనల మేళవింపు హేమలతాలవణం

– శిఖామణి హేమలతాలవణం. తెలుగు వారికి చిరపరిచితమైన పేరు. అటు సాహిత్య ప్రియులకు మహాకవి పద్మభూషణ్‌ గుర్రం జాషువా కుమార్తెగా తెలుసు. ఇటు సామాజికులకు సంఘ సంస్కర్త గోరాగారి కోడలిగా, సర్వోదయనాయకులు లవణంగారి అర్ధాంగిగా తెలుసు. సంస్కరణ, సాహితీ రంగాలలో తనదైన వ్యక్తిత్వంతో, సొంత ముద్రతో నిలిచిన హేమలతాలవణం సామాజికరంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా పొట్టి … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

చిలుక జోస్యం

– ఎల్‌. మల్లిక్‌ (అది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని అసెంబ్లీ భవన సముదాయ పరిసర ప్రాంతం. అక్కడ ఒక చోట ఇద్దరు చిలుక జోస్యం వాళ్ళు, తమ చిలుకల పంజరాలను పక్కపక్కన పెట్టి, ఆ ప్రక్కనే ఉన్న టీ బడ్డీ వద్ద టీ తాగుతున్నారు. అప్పుడు ఆ చిలుకలు రెండూ ఒకదానితో ఒకటి సంభాషించడం … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

నేను మనుషుల్ని ప్రేమిస్తాను

– రోష్ని పూలన్నింటినీ నేను ప్రేమిస్తాను రంగు, వాసన, ముళ్ళు- ఇవేవీ నా ప్రేమకు అడ్డురావు నేను ప్రేమిస్తాను నాకు తెలిసిన మనుషుల్ని

Share
Posted in కవితలు | 1 Comment

నానీలు

– కందేపి రాణీప్రసాద్‌ కుటుంబానికి కేందబ్రిందువు పేరు హౌస్‌ వైఫ్‌ గుర్తింపు లేని జాబ్‌

Share
Posted in కవితలు | Leave a comment

అద్దం

– సుజాతా చౌదరి ఎవరన్నారు సీతకి అద్దం చాలా అవసరమని? అద్దం లేకుండా ఆమె బతకలేదని?

Share
Posted in అనువాదాలు, కవితలు | Leave a comment

దృశ్యా దృశ్యం

– తమ్మెర రాధిక సంకురుమయ్య దేనిమీదొచ్చాడు? ఎంతో క్యాజువల్‌ పశ్న్ర జవాబూ అంతే.. అలవోక.. ఇప్పుడో?

Share
Posted in కవితలు | Leave a comment

ఎలా

– సత్యభాస్కర్‌ మనలో ఒకరిని వెలివేసి వెలయాలంటే ఎలా!? పుట్టుకతో అందరం శరీరాలమే! సంఘం సృష్టించిన చకబ్రంధంలో చిక్కి శల్యమవుతోన్న శవాలమే!

Share
Posted in కవితలు | Leave a comment

దీప భ్రమర న్యాయం

– డి. కామేశ్వరి పూలనించి రంగులడిగి, మనసనే కలం ముంచి రాస్తున్నాననను నీ జ్ఞాపకాలలో నిద్రించాను, నీ కలలతో మేల్కొన్నానని పేమ్రలేఖలు రాయను నిన్ను నా పేమ్ర సామాజ్య్రానికి రాణిని చేస్తానని, నీ కోసం తాజ్‌ మహల్‌ కట్టిస్తాననను నీవంటే నాకిష్టం అది నీవు నమ్మితే నా దానివికా అంటాను

Share
Posted in కవితలు | Leave a comment

చిక్కటి అడవిలో రెక్కవిప్పుతున్న చైతన్యం

– కె. సత్యవతి లయోలా ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ చింతూరు మండలం కాటుక పల్లి వారి తరఫున వారు జరుపబోయే అంతర్జాతీయ మహిళాదినం సమావేశంలో పాల్గొన వలసిందిగా ఆహ్వానించ డానికి మోహన చంద్రగారు నా దగ్గరికి వచ్చినపుడు నేను కొంత తటపటాయించాను. అయితే ఈ సమావేశం దట్టమైన అడవిలో రెండు వేలమంది పైగా గిరిజన … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆంధ్రప్రదేశ్‌ హెచ్‌ఐవి/ఎయిడ్స్‌

అల్లిగూడెం నుండి వచ్చిన రాములమ్మ రెండో తరగతి చదివి మానేసి వ్యవసాయం చేసేది. తల్లిదండ్రులు చదివించడానికి అంగీకరించ లేదు. లిడ్స్‌లో చేరి చదువు కొనసాగిస్తోంది. ఆటలంటే ఇష్టమని చెప్పింది. నేషనల్‌ కబాడీ పోటీలకు చత్తీస్‌గడ్‌ వెళ్ళింది.జాతీయ స్థాయిలో ఆడింది రాములమ్మ.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

పదునెక్కిన పద శక్తి

(దక్షిణాసియా దేశాల రచయిత్రుల సదస్సు) ఓల్గా విమెన్స్‌ వరల్డ్‌ (ఇండియా) మూడు రోజులు. ఐదు దేశాలు. అనేకానేక ఆలోచనలు అనుభవాలు, అనుభూతులు. ఢిల్లీలో ఫిబ్రవరి 21-23 వరకు దక్షిణాసియా దేశాల రచయిత్రులు తమ జీవితానుభవాలను, వాటిలో నుంచి పుట్టిన సాహిత్య స్రవంతులను కలబోసుకున్నారు. భిన్న నేపధ్యాలలో, సంక్లిష్ట సందర్భాలలో రచనను ఒక రాజకీయ చర్యగా భావించి, … Continue reading

Share
Posted in సాహిత్య వార్తలు | Leave a comment

దీర్ఘాయువు గుట్టు చెప్పిన అక్క

– రాజేశ్వరి దివాకర్ల వచనాలను పలికిన స్త్రీ శరణులలో అక్క మహాదేవి అగ్రగణ్యురాలు. ఆమె ఆలోచనాత్మకాలైన అనేక వచనాలను పలికింది. ఆమె జీవితంలో ఎన్నో మహత్తరమైన సంఘటనలు జరిగాయి. ఆమె అపారమైన ధైర్య సాహసాలను ప్రదర్శించింది. అక్కమహా దేవి చెన్న మల్లికార్జునుడిని వలచింది. అనంత ప్రకృతిలో అంతటా అతనిని చూచింది. అతనిని చేరుకోవాలని సకల భోగభాగ్యాలనూ, … Continue reading

Share
Posted in వ్యాసాలు | 1 Comment

నరాల్లో సుడి తిరగిన వ్యధకి అక్షర రూపం

– పంతం సుజాత ప్రతి రోజూ వెన్నెల్ని చూసి చూసి అమావాస్య వస్తే మనసు భారమవడం ఖాయం. అలాగే ఒకేసారి ఇన్ని మంచి కథలు చదివి చదివీ పుస్తకం మూసాక ఆలోచన చెమ్మగిల్లుతుంది. గొరుసు జగదీశ్వర రెడ్డి కథలు ‘గజ ఈతరాలు’ చదివితే ప్రతి పాఠకుడికీ అదే భావన కలుగుతుంది. మూడు ప్రాంతాల భాషల మీద … Continue reading

Share
Posted in కథలు | Leave a comment