Daily Archives: March 6, 2013

పోరాటరూపాలకు పదును పెట్టాల్సిందే!!

మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినం ను మళ్ళొకసారి తలుచుకునే సమయం వచ్చింది. మహిళా పోరాట దినంగా అన్ని దేశాల స్త్రీలు జరుపుకునే ఈ దినం గొప్ప స్ఫూర్తిని మహిళోద్యమానికి అందించింది. వందేళ్ళకుపైగా ఈ స్ఫూర్తి కొనసాగుతూనే వుంది. హక్కులకై ఉద్యమిస్తున్న స్త్రీలు పోరాట దినంగా చూస్తే, ప్రభుత్వాలు మార్చి ఎనిమిదిని పండగలా మార్చాయి.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

చెయ్‌

రోజూలాగే నిద్ర లేచి అమ్మకోసం తన గదిలోకి వెళ్ళాను. తను లేదు. అప్పుడే లేచేసినట్టుంది. తనని వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళాను. మార్గశిరమాసపు చలి సర్రుమని కోస్తున్నట్టుంది. ఆ చలిలో వంటిమీద శాలువాయేనా కప్పుకోకుండా ఒక్కొక్క మొక్కముందూ నిలబడి ”చెయ్‌! చెయ్‌!” అంటూ నడుస్తోంది. నా గుండెల్లో సన్నటి బాధ. అమ్మకి కొద్దిగా మతిస్థిమితం తప్పింది. తనని … Continue reading

Share
Posted in కథలు | 2 Comments

ప్రమీలాతాయి

(గత సంచిక తరువాయి) ఎట్లాగో మొత్తానికి పెట్రోలు సంపాయించి నేను వాళ్ళను షెల్టరుకు చేర్చాను. కాని అప్జల్‌గంజ్‌ వంతెన దాటటమంటే అదో పెద్ద సాహసం అన్నమాట. కారుకి పర్దాలు కూడా లేవు. మేం దుప్పట్లు పట్టుకోని కూర్చున్నాం. అవేమో గాలికొకటే తపా తపా కొట్టుకోవటం రాజ్‌, జవాద్‌ కారులో కింద అంటుకోని కూర్చున్నారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

ఒక నిశ్శబ్ధ సంగీత మధురిమ

రమాహరిత నేను సాధారణంగా జీవిత చరిత్రలు చదవటానికి ఇష్టపడుతుంటాను. అవి జీవితానికి అతి చేరువలో వుంటాయని నా అభిప్రాయం. మనిషి జీవితంలో ఎంతో తపనతో, స్వయం కృషితో ఉన్నత శిఖరాలు పొందటానికి చేసే ఆ ప్రయత్నం మనలో చైతన్యం కలిగిస్తుంది.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు సంబంధించిన సమగ్ర సమాచార దర్శిని

గత ముఫ్ఫె సంవత్సరాలుగా మహిళల అంశాలమీద పనిచేస్తున్నాం. 1993 నుండి స్త్రీవాద పత్రిక భూమికను నడుపుతున్ప్పటి నుండి ఎంతో సమాచారాన్ని సేకరిస్తూ వున్నాం.

Share
Posted in ప్రకటనలు | Leave a comment

‘దేవుడు మరణిస్తాడా?’

‘మరణిస్తాడు, తనను నమ్మిన వాళ్ళని నట్టేట ముంచిన మరుక్షణంలో దేవుడు మరణిస్తాడు….’ దేవుడు మరణించిన మరుక్షణమే మృత్యువు గుండె నిండా తొలిశ్వాస తీసుకుంటుంది. గర్భవిచ్ఛిత్తిగా, రక్తస్రావంగా, సిగరెట్‌ పీకల నిప్పు మచ్చలుగా, చీకటిబిలాలుగా మృత్యుశ్వాస తుఫానులై కమ్ముకుంటుంది.

Share
Posted in కిటికీ | 2 Comments

పితృస్వామ్య సమాజపు నమూన – మలేన

గండవరపు సామాన్య నిర్భయ ఘటనకంటే దాదాపు ఆరునెలల ముందు ముంబయ్‌లోని ‘పల్లవి పుర్కాయస్త’ అనే యువతిపై ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ గార్డ్‌ అత్యాచార యత్నం చేసి, హత్య చేశాడు. ఆమె ఉన్నత విద్యావంతురాలు, స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన చక్కటి అమ్మాయి.

Share
Posted in సినిమా లోకం | Leave a comment

ఇది కథ కాదు

డా. కె. సీత ఎండాకాలం సెలవుల్లో మేము సిమ్లా వెళ్ళడానికి ప్లాన్‌ చేసుకున్నాము. న్యూఢిల్లీ – కాల్కా ట్రేన్‌ ఎక్కడానికి ఇంకా రెండు గంటలు టైమ్‌ వుండడం వల్ల వెయిటింగ్‌ రూమ్‌లో కూర్చున్నాము. ఇంతలో మా ఆయన వాటర్‌ బాటిల్‌ తెస్తానని బయటకు వెళ్ళారు.

Share
Posted in కథలు | Leave a comment

ఆధునిక సాహిత్యంలో గురజాడ పాత్ర – ఒక పరిశీలన

జాలిగం స్వప్న పరిచయం: ”ఎందరో మహానుభావులు అందరికీ వందనములు” ”అడుగుజాడ గురజాడది అది భావికి బాట” అన్న ఒకే వాక్యంతో శ్రీశ్రీ ఆధునిక యుగకర్తగా తెలుగు సాహిత్య చరిత్రలో గురజాడ స్థానం గూర్చి తీర్పు ఇచ్చారు. గురజాడగా ప్రసిద్ధి పొందిన వీరి పూర్తిపేరు గురజాడ వెంకట అప్పారావు.

Share
Posted in వ్యాసం | 1 Comment

బాలల హక్కులు – ఒక పరిశీలన

ముత్తన్న గారి రాజేందర్‌ రెడ బాలల హక్కులు అనేవి మానవ హక్కుల్లో ఒక భాగం. మానవ హక్కులు అంటే మనిషికి గాలి, నీరు, అవాసం ఎంత అవసరమో మనిషికి స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అంతే అవసరం, అందువల్లనే మానవ హక్కులకు ప్రాముఖ్యత ఆదరణ ఏర్పడింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

‘సాహిత్య సమాలోచన’లో అందెవేసిన చెయ్యి ఆశాజ్యోతి

మల్లవరపు విజయ ఈ వసుదైక సాహితీ స్రవంతిలో ఎందరో రచయితలు, వ్యాసకర్తలు, కవులు, భాషాపరమైన లిపి మొదలైన క్షణం నుండి అక్షర రూపాల్లో పొందుపరిచిన వారి భావాలు కోకొల్లలు. పోతన, కాళీదాసు నుండి ఈనాటి అక్షర శిఖామణులు, వేమన, విశ్వనాథ, దుర్గానంద్‌, శ్రీశ్రీ, జాషువాల వరకు తెలుగు సాహితీ ఉద్యానవనాన ఆవిర్భవించి, అక్షర సముద్రాల జ్ఞానాన్ని … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

యువతరం పరుగు ప్రతిభ వైపా, పతనం వైపా?

నంబూరి పరిపూర్ణ ఏ దేశ భవిష్యత్తయినా, సంపద వృద్ధయినా ఆ సమాజపు సామరస్య సహకార వైఖరి అయినా – ఆ దేశ యువతరం యొక్క ప్రతిభ, ప్రజ్ఞ, సృజనాత్మకత మీదనే ఆధారపడతాయి అన్నది అందరూ ఆమోదించి, ఆశించే విషయం. ఇందుకు భిన్నంగా ఎవరూ ఆలోచించరు.

Share
Posted in వ్యాసం | Leave a comment

గురజాడ – మనజాడ

మల్లాప్రగడ రామారావు మనిషిని, మనిషిగా చూడడం మనవల్లకాదన్నది ”నినద భీషణ శంఖము దేవదత్తమే”నన్నంత నిజమని వేరే చెప్పాలా? మనకేమో, ఇంట్లోనే కాదు బయట వ్యవహారాలలో కూడా, కొందరు ”ఒరే”, ”ఒసే”, కొందరేమో ”ఏమోయ్‌”,

Share
Posted in వ్యాసం | Leave a comment

నలుగురు కలిసేవేళ

ఇంద్రగంటి జానకీబాల ఏ నలుగురు స్నేహితులు కలిసినా, నాలుగు మాటల తర్వాత వచ్చే విషయం తెలుగు టి.వి.ఛానల్స్‌లో ప్రసారమవుతున్న డైలీ సీరియల్స్‌ గురించే-, వాటి గురించి ఆహా! ఓహో! అని చెప్పుకోవడం వుందా అంటే అనుమానమే.

Share
Posted in గల్పికలు | Leave a comment

నే దూకుతా! నే గెంతుతా!

శారదా శ్రీనివాసన్‌ ఒక వూళ్ళో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. అతని

Share
Posted in పిల్లల భూమిక | 1 Comment

మహిళలు : సోషలిజం

డా|| మానేపలి ఆగస్ట్‌ బెబెన్‌ (1840-1913) ప్రముఖ జర్మన్‌ మార్క్సిస్టు విప్లవకారుడు. మార్క్స్‌ ఏంగిల్స్‌లకు సమకాలికుడు. 1869లో జర్మన్‌ సోషల్‌ డేమోక్రసీ (పార్టీని) విల్‌హెల్మ్‌ వీబ్నిష్ట్‌తో కలిసి వ్యవస్థాపించాడు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment