Monthly Archives: November 2013

హమారీ జిందగీ… హమారే హత్‌ మే లేలేంగే…

భూమిక సంపాదకీయం రాయడం అంటే మెదడును తొలుస్తున్న, గుండెను పిండుతన్న ఏదో ఒక అంశాన్ని తీసుకుని ఒక్కోసారి కళ్ళల్లో నీళ్ళధార కట్టినపుడు కూడా రాసేది. కళ్ళు తెరుచుకుని ఉన్నంత సేపు అక్షరాలలో కానీ, దృశ్యంలో కానీ, చర్చల్లోకానీ, సమావేశాల్లో కానీ వొలికే దుఃఖాన్ని వొడిసి పట్టుకుని, గుండెల్లో ఇంకించుకుని ఇంక ఆగలేక రాసేదే ఈ సంపాదకీయం.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

పనిచేసే చోట మహిళలపై వేధింపుల నియంత్రణ చట్టం (2013)పై రాష్ట్రస్థాయి సంప్రదింపుల సదస్సు

19.10.2013న పని చేసే చోట మహిళలపై వేధింపుల నియంత్రణ చట్టం (2013)పై సంప్రదింపుల సదస్సు పబ్లిక్‌ గార్డెన్‌లోని జూబ్లీహాల్‌లో జరిగింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆక్స్‌ఫామ్‌ ఇండియా వారి సహకారంతో భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ మరియు ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ సంయుక్తంగా నిర్వహించారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

అచ్చమాంబ (వరంగల్‌) – మనకు తెలియని మన చరిత్ర

నా పేరు సుశీల ఇంటి పేరు రేగళ్ళ. జగ్గారెడ్డి గారు తండ్రిపేరు. మా ఊరు గొల్లచెర్ల. మానుకోట తాలూకా. వ్యవసాయం చేసుకునేటోళ్ళం. మాది కూడా చాలా బీద కుటుంబం. ఇగప్పుడు నైజం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం వచ్చింది. అందులో స్త్రీలంతా ఏదో సంతోషపూర్వకంగా ఉయ్యాల పాటలు – అదీ ఇదీ అనుకుంట వస్తుండేది. ఇగ అదే … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

కుంభమేళాలో చిన్న కోడలు (1906)

– బంగ మహిళ (రాజేంద్ర బాలా ఘోష్‌) బంగ మహిళ గురించిన మరిన్ని వివరాలు: ఇరవయ్యవ శతాబ్దం మొదటి దశకంలోని హిందీ కథా రచయితల్లో బంగ మహిళ ఒక్కతే ఇతరుల రచనల్లోంచి పూర్తిగా కానీ, ఆంశికంగా గానీ ఏమీ దొంగిలించలేదని, ఛాయానువాదం చేసిన రచనల విషయంలో కూడా ఆమె మూల రచయితల పేర్లు ఇచ్చిందని, మూల … Continue reading

Share
Posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు | Leave a comment

పున్నాగపూల తోటల్లో దొంగాటలాడుకొంటుంటే..

– కుప్పిలి పద్మ ఆశ్వయుజ మాసం మొదలవ్వబోతోన్న సమయంలోనే మా యింటి ముందున్న పున్నాగ పూల చెట్టు విప్పారిన పువ్వులతో సువాసనభరితంగా అభిషేకిస్తుంది భూదేవి ని. అది మొదలు రాసులురాసులుగా పువ్వులే పువ్వులు. చెర్రి బ్లోసమ్‌ సీసన్‌లో అనేక మంది యాత్రికులు ఆ పూల సౌందర్యాన్ని కన్ను లారా చూడాలని జపాన్‌కి వస్తారు. అప్పుడు అక్కడ … Continue reading

Share
Posted in కొన్ని పూలవనాలు... కాసిని తేనెచుక్కలు | Leave a comment

సవాల్‌

– సి.హెచ్‌.మధు ”అవును నేను చంపేసాను” ”నేనే చంపేసాను” ”నాకు న్యాయవాది అవసరంలేదు” ”నాది తప్పు కాదు” 

Share
Posted in కథలు | Leave a comment

వహ్వా – జాతీయ మహిళా కమిషన్‌

– జూపాక సుభద్ర ప్రభుత్వాలు మహిళల్ని ఏదో వుద్దరిస్తున్నట్లు కనిపించే దానికి మహిళ కమిషన్స్‌ వేస్తున్నయి. అదేంటో యిప్పటి దాకా వేసిన మహిళా కమీషన్స్‌లో దళిత ఆదివాసి, బీసి, మైనారిటీ మహిళలు కనిపించలేదు.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

తాజా ఆడపిల్ల!

– శైలజా మిత్ర ఆడపిల్లండి తాజా ఆడపిల్ల! అమ్మకానికో ఆడపిల్ల

Share
Posted in కవితలు | 1 Comment

కరువు – పేద స్త్రీలు – సమస్యలు

– ఆచార్య తోట జ్యోతిరాణి, డా|| హజారీ గిరిజారాణి కరువు కాటకాలు బీదబిక్కీ జీవితాలను దుర్భరం చేస్తున్న పరిస్థితిపై రోజు రోజుకూ తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒరిస్సా, బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ మొదలైన రాష్ట్రాలలో కరువు పేదజనాన్ని కాటేస్తున్నది.

Share
Posted in వ్యాసం | Leave a comment

”గ్రేవ్‌ ఆఫ్‌ ది పైర్‌ ప్లైస్‌”

– సామాన్య ఈ కాలమ్‌ కోసమని ”గ్రేవ్‌ ఆఫ్‌ ది ఫైర్‌ ప్లైస్‌” రాయాలనే ఆలోచన నా తలలోకి వచ్చిందో లేదో నా మనసు ఆ ఆలోచనని తీవ్రంగా ఖండించి వేసింది. తెలిసి తెలిసీ ఆ సినిమా మళ్ళీ చూసి దుఃఖాన్ని పునరావృతం చేసుకుంటావా అని నాకో ప్రశ్న కూడా వేసింది. నిజానికి ఆ సినిమాలో … Continue reading

Share
Posted in సినిమా లోకం | Leave a comment

మరుగునపడిన చరిత్రలు

– ఊర్వశి బుటాలియ స్త్రీల చరిత్రల గురించి నాకెప్పటి నుంచి అవగాహన కలిగిందనే విషయాన్ని నేను ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. ‘ఎప్పటి నుంచి అవగాహన’ అని ఎందుకంటున్నానంటే, ఈ క్రమం అంతా కూడా ఒక రకంగా ఎన్నో విషయాల కలయికగా వుంటుంది. ఈ కథలన్నీ కూడా నా మనసులో ఇంకుతూ వచ్చా యి. అలా ఒక … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

సాకేత్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు తీర్పు

– వేములపల్లి సత్యవతి దామిని, నిర్భయ కల్పిత నామధేయంతో దేశప్రజలందరిని వేదనతో కుదించివేసి విదేశాలలో కూడా చర్చనీయాంశమైన జ్యోతిసింగ్‌ పాండే అత్యాచారకేసులో నేరగాళ్లకు ఉరి శిక్ష విధిస్తూ సాకేత్‌ ఫాస్ట్‌ కోర్టు న్యాయాధీశులు యోగేశ్‌ ఖన్నా 13-9-2013న తీర్పు చెప్పారు. 20 పేజీల నేరగాళ్ల నేర చరితను చదివి వినిపించారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

మేం తప్పు చేశాం

– కారుసాల వెంకటేశ్‌ మేం తప్పు చేశాం. మా కూతురి జీవితాన్ని మేమే చేతులారా కాజేశాం. ఒక్కగానొక్క కూతురు. ఈ ఊళ్లో ఏ ఆడపిల్ల పెళ్ళవుతున్నా, పండగనాడు కొత్త బట్టలు కట్టుకొని ఏ అమ్మాయి కనపడినా నా కూతురే గుర్తొస్తుంది. అంటూ కన్నీరు పెట్టుకుంది చంద్రమ్మ.

Share
Posted in Uncategorized | Leave a comment

పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకోవటం నేరం

మన సమాజంలో స్త్రీల పట్ల వివక్షత ఉందనటంలో సందేహం లేదు. ఆడవాళ్ళు చదువకోటానికి లేదు, మంచి ఆహారం పెట్టరు, జబ్బు చేస్తే త్వరగా వైద్యం చేయించరు. ఈ వివక్షత జనాభాలో స్త్రీ, పురుషుల నిష్పత్తిలో స్పష్టంగా కనపడుతుంది.

Share
Posted in ప్రకటనలు | Leave a comment

ఆంధ్రప్రదేశ్‌ వివాహాల తప్పనిసరి నమోదు చట్టం-2002

‘ఆంధ్రప్రదేశ్‌ వివాహాల తప్పనిసరి నమోదు చట్టం’ 2002లోనే గవర్నర్‌ ఆమోదం పొంది, అదే నెలలో గెజెట్‌లో ప్రచురితమైనప్పటికి, 2006 నుండి అమలులోనికి వచ్చింది. ఇది రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. ఈ పెళ్ళిళ్ళ తప్పనిసరి నమోదు చట్టం రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాలకు, తెగలకు, సాంప్రదాయాలకు వర్తిస్తుంది.

Share
Posted in సమాచారం | Leave a comment

ఎన్ని ‘ఉరులు’ ఆపగలవు – అనుదిన అత్యాచారాల్ని?

– నంబూరి పరిపూర్ణ మన ఢిల్లీ రాజధానిలో అత్యంత కిరాతకంగా, హేయంగా జరిగిన లైంగిక హింస,జంటహత్యల దుర్ఘటన జరిగిన పది నెలల తరవాత దానికి కారకులైన నలుగురికీ కఠిన శిక్ష విధింపబడినందుకు – దేశ ప్రజలంతా తీవ్ర ఉద్వేగంతో, కసితో, ఉరి ఒక్కటే వాళ్లకు తగిన శిక్ష అని ఆక్రోశిస్తూ ఆనందించింది.

Share
Posted in వ్యాసం | Leave a comment