Monthly Archives: February 2014

Share
Posted in Uncategorized | Leave a comment

రచయిత్రులు, ఆత్మీయమితృలతో కలగలిసి చేసిన ప్రయాణం

భూమిక ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న సాహితీ యాత్రలు… ప్రతిసారీ ఓ కొత్తప్రాంతం, ఓ కొత్త అనుభవం, కొత్త కొత్త వ్యక్తులతో దిగ్విజయంగా సాగుతున్నాయి. పాపికొండలతో మొదలై, ఉత్తరాంధ్ర, తలకోన, నల్లమల అడవుల్లోంచి… ఈసారి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ అడవులు, జలపాతాలు, గోండుల స్థావరాలు కలియ తిరుగుతూ కొనసాగింది

Share
Posted in సంపాదకీయం | Leave a comment

భూమిక వార్షిక పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ

 ఇదో రకం పోరాటం – ఈనాటి పోరాటం మెటర్నిటీ లీవ్‌ అయిపోయింది. ఆ రోజు డ్యూటీలో చేరాల్సిన రోజు శర్మిష్ఠకి చాలా ఉత్సాహంగా ఉంది. దాదాపు ఏడాది తర్వాత తన టేబుల్‌ దగ్గరికి వెళ్తోంది. పాత రోజులు మళ్లీ వస్తున్నాయన్న ఆనందం, తోటి ఉద్యోగులందర్నీ కలుసుకుంటానన్న ఉత్సాహంలో, బ్యాగ్‌ని పొద్దున్నే సర్దుకుంది. తొందరగా తయారయింది.

Share
Posted in కథలు | Leave a comment

భూమిక వార్షిక పోటీలలో ప్రథమ బహుమతి పొందిన వ్యాసం

 ”మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు” -భావరాజు పద్మిని స్త్రీ హృదయం పువ్వుకన్నా కోమలమైనది. ఒక అందమైన పువ్వును చూసినప్పుడు, కాసేపు ఆ సౌందర్యానికి ముగ్దులై చూస్తూ ఆనందించేవారు కొందరు. ఇందులో గొప్ప మానవత ఉంది.

Share
Posted in వ్యాసం | Leave a comment

జాగలేదు – టైము లేదు

కొత్త సంవత్సరమొచ్చిందంటె తెలంగాణ ఉద్యోగ, కార్మిక టీచర్స్‌, లాయర్స్‌ యింకా సబ్బండ సంగాలు డైరీ ఆవిష్కరణ సభలు జాతర జరిగినట్లే జరుగుతుంటయి. తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు కూడా ఉద్యమంగా నడిచినయి. తెలంగాణ ప్రకటన తర్వాత డైరీ సభలు జోరుగ సాగినయి.

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

మహిళా ఉద్యమాలు : దృక్పథం – గమనం

– కాత్యాయనీ విద్మహే ఐదవ పంచవర్ష ప్రణాళికా కాలంలో (1974-79) ఎస్సీల, బిసిల, మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పరచిన ప్రభుత్వం ఆరు (1980-85) ఏడు (1985-90) ప్రణాళికా కాలాలలో సామాజిక సేవా పథకాలకు ప్రాధాన్యత నియ్యటం పెద్ద వైరుధ్యం. ఇది దళితులకు, వెనకబడిన వర్గాలను, మహిళలకు అభివృద్ధి చట్రం వెలుపల తారట్లాడే తాత్కాలిక ఉపశమనాలనే … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

భూమిక వార్షిక పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కవిత

ఈ – తరం నినాదం వై – తరుణి ??? – బి. కళాగోపాల్‌ చీకటి రాత్రులలో తొమ్మిది నెలల ధ్యానముద్ర. ఒక చైతన్యపు మొలక ఊపిరి పోసుకుంది జిగురు ప్రపంచంలో.

Share
Posted in కవితలు | Leave a comment

మేడారం జాతర

  – హిమజ అడివి తల్లీబిడ్ల పండుగకు గిరి పుత్రలే పెద్దలు కొండా కోనలే విడిది సెలవులు

Share
Posted in కవితలు | Leave a comment

విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ సమావేశం

భూమిక పత్రిక వార్షిక పోటీల విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. ఇందులో ఎందరో కవయిత్రులు, రచయిత్రు లు పాల్గొన్నారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

సగాలు రెండూ సమానమేనా?

 – రమా సుందరి బత్తుల పొద్దున్నే ఏదన్నా రాద్దామని ఒకసారి నన్ను నేను విదుల్చుకొని కూర్చొన్నానా! నాలో ఉండి, ఎప్పుడు ముచ్చటగా అచ్చరాలు కాగితం మీద పూయించే సిరా ఎందుకో మొరాయించి, మొండికేసింది. అచ్చరాలు రాయదంట. ఏమయ్యిందే నీకియ్యాల?” విసుక్కొన్నాను.

Share
Posted in moduga poolu, Uncategorized | 4 Comments

తాతటమనవడు.కాం ఆవిష్కరణ

26.11.2013వ తేదీ శ్రీ త్యాగరాయగానసభలో ప్రముఖ రచయిత్రి డా. సి. భవానీదేవి రచించిన బాలల కథాసంపుటి ”తాతట మనవడు.కాం” ను ప్రముఖ కవి, సెంట్రల్‌ సాహిత్య అకాడమీ అవార్డ్‌ గ్రహీత డా.ఎన్‌. గోపి ఆవిష్కరించి ప్రసంగిస్తూ

Share
Posted in ప్రకటనలు | Leave a comment

బ్రిజ్‌రాణి(హైదరాబాద్‌)

చాల వెనకబడ్డ కుటుంబం మాది. నాకు మాత్రం ఏదైన సోషల్‌ ఆర్గనైజేషన్‌లో పాల్గొనాలని వుండేది. మాది హైదరాబాదే. సరోజనీనాయుడు ప్రభావం నామీద వుండేది. పేపర్లో ఆమె చేసే పనుల గురించి చదివితే ఆమెలాగే మనం కూడా ఏమైన చేస్తే బాగుంటుందనిపించేది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

తెలుగు సినిమా స్వర్ణయుగంలో మెరిసిన సువర్ణ సుందరి – మహానటి అంజలీదేవి

– ఇంద్రగంటి జానకీబాల నటనైనా, నాట్యమైనా, గానమైనా, కవిత్వమైనా, ఏ కళైనా, కళాకారుని (కళాకారిణి) స్వభావంలోంచి, పుట్టుకతో వచ్చిన వాసన వల్లే సమకూరుతుంది. అలా అబ్బిన కళకి కృషివల్ల మెరుగులు దిద్దుకుని మెలకువలు నేర్చుకుని కొందరు సాటిలేని మేటి కళాకారులుగా తమని తాము తీర్చిదిద్దుకుంటారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

ఉన్నత విద్యా సంస్థల్లో స్త్రీలపై లైంగిక దాడులు (స్థితిగతులు)

సర్వం శక్తి మయం. శక్తి స్త్రీ స్వరూపం. ఈ అనంత విశ్వానికి మహిళనే మూలాధారం. ప్రాచీన కాలం అనగా భారత ఇతిహాసాలలో మహిళలకు విశిష్ట స్థానం ఉంది. భారతీయ మహిళ గర్భంలో పిండ దశ నుండే అడుగడుగునా గండాలు, సామాజిక అవాంతరాలను ధైర్యంగా ఎదుర్కొంటూ రాణిస్తున్న ధైర్యవంతురాలు.

Share
Posted in వ్యాసం | Leave a comment

తెలుగు సాహిత్యంలో ముగ్గురు ప్రముఖ మహిళల్ని వరించిన అవార్డులు

కాత్యాయని విద్మహే కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌. ప్రసిద్ధ విమర్శకురాలు. నిరంతర శ్రామికురాలు. సాహిత్య వ్యవసాయమే ఆమె నిత్యవృత్తి. విద్యార్ధులతో విభిన్నాంశాలపై పరిశోధన చేయించడం ఆమెకిష్టమైన పని.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

భూమిక హెల్ప్‌లైన్‌ రివ్యూ మీటింగ్‌

సౌదామిని జనవరి 18న భూమిక హెల్ప్‌లైన్‌ రివ్యూ మీటింగ్‌ హిమాయత్‌నగర్‌లోని హోటల్‌ ఉడ్‌ల్యాండ్‌లో జరిగింది. సత్యవతి గారు భూమిక ఆవిర్భావం వెనుక గల ఆంతర్యం మొదలుకొని ఇప్పటి వరకు దాని ప్రస్థానాన్ని దాని వెనుక ఉన్న కృషి తమ అనుభవాలను వివరంగా వివరించారు.

Share
Posted in రిపోర్టులు | Leave a comment