Monthly Archives: August 2014

Share
Posted in Uncategorized | Leave a comment

సంపాదకీయం – యువ కెరటాలు : ఇలాగే ఎగిసి పడాలి

అనకాపల్లి వెళ్లింది ఓ అవార్డ్‌ పంక్షన్‌లో అతిధిగా పాల్గోడానికి. ‘సమాలోచన’ సంస్థను నడిపే చక్రధర్‌ నెలరోజుల క్రితం ఫోన్‌ చేసి జూలై 20న అనకాపల్లి రావాలని, బాషా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించే అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొనాలని ఆహ్వానించాడు. అవార్డు వివిరాలు అడిగితే… చాలా చిన్న వయసులో చనిపోయిన బాషా అనే అబ్బాయి, మంచి … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ప్రతిస్పందన – శారదా అశోకవర్ధన్‌

‘ఉందిలే మహిళలకు మంచికాలం ముందుముందున…’ ప్రియమైన సత్యవతికి అభినందన మాలిక! భూమిక స్థాపించినది మొదలు నేటిదాకా, అబ్బూరి ఛాయాదేవి, ఓల్గాలాంటివారూ, సంపాదకవర్గంలోనివారూ, అడ్వయిజరీ కమిటీ సభ్యులు, ఇంకెంతమందో భూమికకి తమ రచనలు పంపి స్త్రీశక్తి ఏమిటో, ఎలా వుండాలో వారివారి ఆలోచనలతోనూ, అనుభవాలతోనూ వివరిస్తూ చేస్తూన్న రచనలు, మహిళల మహోన్నతికి వేస్తున్న సోపానాలు అంటే అతిశయోక్తి … Continue reading

Share
Posted in ప్రతిస్పందన | Leave a comment

విజ్ఞప్తి

2010లో భూమిక చట్టాలు – స్త్రీలు పేరుతో ఒక ప్రత్యేక సంచిక తెచ్చిన విషయం మీకు తెలుసు. ఆ సంచిక కాపీలు కావాలని చాలా సంస్థలు, వ్యక్తులు కోరుతున్నారు. మా దగ్గర ఆ కాపీలు లేవు. ప్రస్తుతం అమలులోకి వచ్చిన అన్ని చట్టాలను చేరుస్తూ సమగ్రంగా ప్రత్యేక సంచిక తేవాలని సంకల్పించాం. కాపీలు కావలసిన వారు … Continue reading

Share
Posted in ప్రకటనలు | Leave a comment

రాజ్యాంగ నైతికత – సొరాజ్జెం నవల – Volga

సామాన్యంగా రచయితలకు గ్రామీణ జీవితం మీద వల్లమాలిన వ్యామోహమూ మమకారమూ ఉంటుంది. కొడవటి గంటి కుటుంబరావు వంటి కొందరు రచయితలు తప్ప గ్రామీణ జీవితాన్ని చిన్నచూపు చూసిన, అందులో పురోగతి గానీ అభ్యుదయం గానీ లేదని చెప్పిన రచయితలు తక్కువ. సాహిత్యంలోనూ, మన సాంఘిక భావజాలంలోనూ బేషరతుగా గ్రామాలను గ్లోరిఫై చేసే ధోరణి మనకు జాతీయోద్యమ … Continue reading

Share
Posted in ప్రత్యేక వ్యాసాలు | Leave a comment

చుక్క సావిత్రి – ఆచంట హైమవతి

”మీ దగ్గర ఇలాంటి కళాకృతులు మంచివి దొరుకుతాయని మా పేపర్లో వేస్తాం! అందువల్ల చాలామందికి తెలిసి కొనుక్కుంటారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసినందుకు మా పత్రికకీ మీలాంటివారిని ప్రోత్సహిస్తున్న పేరు లభిస్తుంది. మీకు ఆర్థికంగానూ లాభిస్తుంది” అన్నాడు సంభాషణ ప్రారంభిస్తూ పత్రికా విలేకరి. ”చుక్కమ్మ” అని చెప్పి… నాలిక్కరు చుకుని ”కాదు…కాదు”

Share
Posted in కథలు | Leave a comment

మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి)

ఆ పోరాటం అట్లా రూపొందించబడి చివరికి భూముల పంపకం అనేదానికి తగులుకున్నది. దానంతటదే గుత్పల సంఘం యెప్పుడైతే యేర్పడ్డదో ఈ గుత్పల సంఘానికే ఈ రౌడీలకు పోరాటం మొదటిదశలో- మనం యెంతమందిని సమీకరిస్తే అంతమంది అవుట్‌ కావటం, యెదుర్కుంటే దెబ్బలు తినటం మల్ల వీళ్ళు తప్పుకోవాల్సి రావటం, వెంటనే పోలీసులు ప్రవేశించిన్రు. నిజాం పోలీసు ప్రవేశం … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

వర్తమాన లేఖ – డా|| శిలాలోలిత

డియర్‌ గీతా ! ఎలా ఉన్నావ్‌? నిన్న నీ వుత్తరం చూసాక చాలా సంతోషంగా అన్పించింది. ఎంత బాగా రాసావో తెల్సా? నిన్ను చూడక చాలా రోజులైందన్న దిగులంతా పోయింది. నిజం ! అక్షరాలా నిన్ను చూసాను. నీ మాటల్లో ఆత్మీయతను చూశాను. నిజమైన స్నేహితులు మన పక్కనుంటే అంతకు మించిన సిరిసంపదలేముంటాయి చెప్పు. ‘జయకాంతన్‌’ … Continue reading

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

పోలవరం నిర్మాణం – జీవన్మరణ సంక్షోభం – అనిశెట్టి రజిత

అస్తిత్వ పోరాటాలు ఎల్లప్పుడూ ఉంటాయి. వాటికి ముగింపు అంటూ లేదు అని చరిత్ర కాల పరిస్థితులు తెలియజేస్తున్నవి. ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా అణగారిన ప్రజల గాథల బాధలన్నీ ఒక్కటే. వారు రెడ్‌ ఇండియన్లా.. నల్ల జాతీయులా లేక మన దేశంలోని గిరిజన ఆదివాసీలా? ఎవ్వరైనా వారి వెనుకబడిన తనం, పేదరికం, లోకజ్ఞానం లేనితనం, వెలివేతలు … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

‘జోహార్‌ మహిళోద్యమ కెరటమా’ – ఝాన్సీ కె.వి. కుమారి

మనిషి గుండెలోని చీకటి కోవిరాలను చూస్తే నీకెంత కోపమో వెలుగు రేకవై ఉదయించావు పేదగొప్ప, కులము మతము స్త్రీలు పురుషులు, నిచ్చెనమెట్లు ఎన్నెన్ని అసమానతలు…

Share
Posted in కవితలు | Leave a comment

బిట్టర్‌ చాక్లెట్‌ – పింకీ విరానీ – ఉమామహేశ్వరి నూతక్కి

”పిల్లలూ దేవుడూ చల్లని వారే, కల్లకపటమెరుగనీ కరుణామయులే, ఈ పాట మనమందరమూ వినే ఉంటాము. నిజమే పసిపిల్లలు దేవుడితో సమానం. కానీ ఈ సమాజంలో కొంత మంది రాక్షసులున్నారు. వాళ్ళు కోరల్లేని రాక్షసులు. కొమ్ములేని మృగాలు పట్ట పగలు తిరిగే కొరివి దెయ్యాలు. కళ్ళ నిండా కోరికలు పులుముకున్న కామ పిశాచాలు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

తెలంగాణ సగాల సమాయత్తాలు- జూపాక సుభద్ర

ఈ మధ్య ప్రొ|| జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా విద్యావంతుల వేదిక (ఆడ విద్యావంతుల్లేని) నిర్వహించిన మీటింగుకి ముఖ్యఅతిథిగా వచ్చిన అమితాబ్‌ పాండే ఉత్తరాఖండ్‌ రిటైర్డ్‌ అయ్యేయెస్‌ ఆఫీసర్‌ చాలా మంచి మాటలు, గొప్ప సంగతులు మాట్లాడిండు. అవి తెలంగాణ మగ విద్యావంతుల చెవికి, మైండ్‌కి యెక్కవు. ఆ ఆఫీసర్‌ మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఏర్పడినాక

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

నిరాడంబర కథన శైలితో రచనలు చేసిన డి. కామేశ్వరి – పి. సత్యవతి

స్వాతంత్య్రానంతర తొలి దశాబ్దా లలో రచన ప్రారంభించి విస్తృతంగా కథా నవలా రచనలు చేసి పాఠకుల ఆదరణ పొందిన రచయిత్రులలో డి. కామేశ్వరి ఒకరు. పందొమ్మిది వందల అరవైలలో రచన ప్రారంభించిన దూర్వాసుల కామేశ్వరి దాదాపు మూడువందల కథలతో పది కథాసంపుటాలు, ఇరవై యొక్క నవలలు ఒక యాత్రాకథనం, ఒక కవితా సంకలనం ప్రచురించారు. అనేక … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

రేపు మాతం నీదే! – శైలజా మిత్ర

అమ్మవై బాధ్యతలను పంచుకుంటావు చెల్లివై నీకేమి కావాలో అరచి తెప్పించుకుంటావు చెలివై నీకెవరూ సాటిలేరని అనిపించుకుంటావు అత్తవై కోడలిని శాసిస్తావు ఆడబడచువై వదినను ఆరళ్ళు పెడతావు మరెందుకు నువ్వు మౌనంగా కూర్చుంటావు?

Share
Posted in కవితలు | 1 Comment

సహజ పవ్రాహం – అల్లూరి గౌరీలక్ష్మి

నలుగురితో నారాయణా .. అది సామాజిక బంధం పది మందితో పదరా.. అదే ఆనంద మంత్రం కష్టమొస్తే కళ్ళు సానుభూతికై ఆశగా చూస్తాయి ఇతరుల చల్లని సేద దీర్పును ఆశిస్తాయి సిన్మా కెళ్తే హాలంతా నిండితేనే బావుంటుంది

Share
Posted in కవితలు | Leave a comment

కాగితం – ఎస్‌. స్రవంతి

ఈ తెల్లని కాగితం అందరికి కావాలి కాగితం మాత్రం ఎవ్వరికి కనిపించడం లేదు సిరామరక మాత్రమే కనిపిస్తుంది. అందరికి…

Share
Posted in కవితలు | Leave a comment