Daily Archives: September 1, 2014

Share
Posted in Uncategorized | Leave a comment

సంపాదకీయం – ఎందుకిలా?

ఐదు సంవత్సరాల క్రితం ఓ సమావేశంలో పాల్గోవడం కోసం హైదరాబాదు వచ్చిన ఓ దళిత మహిళ హఠాత్తుగా సమావేశ ప్రదేశంలోనే చనిపోవడం అప్పట్లో నన్ను చాలా బాధించింది. ఆమె మామూలు కార్యకర్త కాదు. ఒక స్వచ్ఛంద సంస్థ బాధ్యురాలు. క్షేత్ర స్థాయిలో దళిత మహిళలతో పనిచేస్తున్న వ్యక్తి. ఆ రోజు ఆమె శవం చుట్టూ కూర్చుని … Continue reading

Share
Posted in సంపాదకీయం | 1 Comment

మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి)

మా అక్క కొన్ని బాగా చెప్తది, ఏం సాధించాం మనం ఆస్తిహక్కు విషయంలో, మహిళా సంఘాల్లో తీరుగలేదు. ఆస్తిహక్కు గురించి, యింపార్టెన్స్‌ ఎందుకివ్వలేదు? మనం పేదవాళ్ళకోసం పన్జేస్తున్నం గదా, ఆస్తి ఎక్కడిది, మా సంఘంల రెండుమూడుసార్లు పెట్టిజూసినం. మా అక్కగారు ఆస్తిహక్కు లేకుండా మహిళా సంఘమేంటని చాలా తీవ్రంగా వాదించింది. వర్గపోరాటం అని, అప్పర్‌క్లాస్‌, మిడిల్‌క్లాస్‌ … Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

మౌనమా.. మార్చుకో నీ చిరునామా – భవానీ ఫణి

శ్రావణి అన్య మనస్కంగా వంట చేస్తోంది. ఇందాక శ్రీధర్‌ ఆఫీస్‌ నించి ఫోన్‌ చేసినప్పటి నుండీ ఆమెకి కొంచెం కంగారుగా ఉంది. హరీష్‌కి హాస్టల్‌లో ఏదో సమస్య వచ్చిందనీ రూం వెకేట్‌ చేసి ఇక్కడికి వస్తున్నాడనీ అతని మాటల సారాంశం.

Share
Posted in కథలు | 1 Comment

ఆ ఫోటో – రమాసుందరి బత్తుల

23 ఏళ్ళ క్రితం ఒక రోజు పొద్దున్నే (1991 ఆగస్టు 8) న్యూస్‌ పేపర్లో వార్తతో బాటు ఒక ఫోటో చూశాను. చుండూరులో రెడ్లు, బలిజలు కలిసి ఎనిమిది మంది దళితులను చంపి పంట కాలువలో, తుంగభద్రలో తొక్కి వేసిన కధనం. పత్రికలు కొన్ని విలువలను పాటిస్తున్న రోజులవి. శవాల నోటి మీద ఈగలు చూయించలేదా … Continue reading

Share
Posted in moduga poolu | 2 Comments

పరజా – డా|| గోపినాథ్‌ మహంతి – ఉమామహేశ్వరి నూతక్కి

సామాజికంగా, సాంకేతికంగా మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నది. కానీ, ఇప్పటికీ ఈ అభివృద్ధికి నోచుకోని సమాజం దాదాపుగా ప్రతి రాష్ట్రంలో ఉంది. వాళ్ళలో ఎక్కువ శాతం మంది గిరిజనులే. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తెగ పేరుతో పిలవ బడినా, వారి ఆచార వ్యవహారాలు

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ధీరమహిళ భన్వరిదేవి – వేములపల్లి సత్యవతి

రాజస్థాన్‌ అనగానే మనకు రాణాప్రతాప్‌, రాణీ పద్మిని – భీమసింగ్‌ మొదలగు క్షత్రియరాజులు, త్యాగశీలి దాయిపన్నా గుర్తుకొస్తారు. కాలం మారింది. సామాన్య ప్రజల జీవన చిత్రణకు చరిత్రలో స్థానం లభించింది.

Share
Posted in వ్యాసం | Leave a comment

వర్తమాన లేఖ – శిలాలోలిత

పియమైన సుమతీ, ఎలా ఉన్నావ్‌? ఇల్లు ఖాళీచేసి నగరంలోకి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, మనం కలుసుకునే క్షణాలే లేకుండాపోయాయి. నిన్ను చూసి చాల్రోజులు అయిపోయింది. చూడాలనివుంది. కానీ నీ చుట్టూ ఉన్న బాధ్యతల వలయంలో తిరుగుతూనే ఉన్నావు. ఆ వలయం ఆగదు. మనకు కాలం దొరకదు. అంతే సమాధాన పడి పోవాలి.

Share
Posted in వర్తమాన లేఖ | Leave a comment

విన్నీ మండేలా ! – ఉదయమిత్ర

లేదు లేదోయమ్మ.. లేదోయమ్మ.. ఇట్లాంటి మాయమ్మలో కానలేదమ్మ అయినోల్లు దూరమైనా… కేసులెన్ని జుట్టుకున్నా…

Share
Posted in కవితలు | Leave a comment

పడకూడదు ఏ తల్లి నీ శోకాన్ని – జి. సరిత

చిట్టి పొట్టి నా మాటలతో మిమ్ము అలరించాలనుకున్నాను పై చదువులెన్నో చదివి మీ పేరు నిలపాలనుకున్నాను అదృష్టమని భావించాను ఎపుడెప్పుడని నే ఎదురుచూసాను అంతలోనే ఈ అఘాయిత్యమా ఏంటమ్మా నే చేసిన తప్పు

Share
Posted in కవితలు | Leave a comment

అమ్మ – డా|| బండారి సుజాత

‘అమ్మ అనే మాటతో అలరించును భూగోళం ‘అమ్మ’ పిలుపులోని కమ్మదనం ఆస్వాదించునీ లోకం అమ్మ తోనె జీవితం, అమ్మే మన ఆనందం అమ్మే మన తొలి గురువు. మమతల కోవెల ‘అమ్మే’

Share
Posted in కవితలు | Leave a comment

రాజకీయ నాయకులు – జె. రాజు

స్వచ్ఛమైన సమాజంలో నిద్రించు మానవులు ఇలానే ఉండాలని ఊహించు కనురెప్ప తెరచే లోపల ర్యాలీలు, ధర్నాలు, యుద్ధాలు, అరెస్ట్‌లు నాకు నేనే అదిరి పడ్డా

Share
Posted in కవితలు | Leave a comment

మహిళా ఉద్యమాలు దృక్పథం – గమనం – కాత్యాయని విద్మహే

నూతన సహస్రాబ్దిలో స్త్రీలపై వేధింపులు ఆత్మ హత్యల వైపు నెట్టే అనివార్యతను కల్పించే స్థాయికి చేరాయి. 2000 జూన్‌ 14న సంగీతాశర్మ ఆత్మహత్య ఆ కోవలోదే భర్తనుండి విడాకులు తీసుకొని కొడుకుతో వుంటూ లాయరుగా ప్రాక్టీసు చేసుకొంటూ సీనియర్‌ న్యావాదిపెట్టే లైంగిక వేధింపులకు, ఒత్తిడికి తట్టుకోలేక మీర్‌ కౌన్సిల్‌ దృష్టికి

Share
Posted in వ్యాసం | Leave a comment

పూలన్‌ స్ఫూర్తి చైతన్యాలు బత్కాలె – జూపాక సుభద్ర

2001 జూలై 25న పార్లమెంట్‌ మెంబర్‌గా వున్న పూలన్‌ దేవిని హత్యచేసినపుడు ఏ మహిళా సంగాలు, విప్లవ సంగాలు, కుల సంగాలు ఎవరూ పెద్దగా స్పందించలేదు, ఖండించలేదు. కాని ‘అన్వేషి’ పూలన్‌దేవి హత్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున మీటింగ్‌ పెట్టింది. మా ఆఫీసుల మీటింగు పెడ్దామంటే ఆడవాల్లు మగవాల్లు ‘అమ్మో వద్దు’

Share
Posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది | Leave a comment

గడ్డి పరక- తమ్మెర రాధిక

ప్రతాపరావు బస్సు దిగి ఊళ్ళోకి వస్తుం టే ఎదురు పడ్డ వాళ్ళు ఒకరిద్దరు మొహం తిప్పుకుపోవడం అతని కనుసన్నల్నించి దాటిపోలేదు. సాయంకాలం కను చీకటిపడు తోంది. అతను ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్‌ బల్ల మీద పడేసి, తల్లి పడుకున్న మంచం కేసి చూసాడు.

Share
Posted in కధలు | Leave a comment

తెలుగు సాహిత్యంలో మానవ వాదం – శ్రీమతి మోసర్ల శ్రీ అంజని

మానవ వాదులు పరిపక్వత కలిగిన వ్యక్తులు. ప్రతి వ్యక్తి ఏకాంతతను కలిగి ఉండే హక్కును వారు గుర్తిస్తారు. వాళ్ల ఆకాంక్షలను తీర్చుకోవటానికి, లైంగిక వ్యాపారంలో ఇష్టమైన వాటిని పొందటానికి, సంతానం విషయంలో ఎంపిక చేసుకునే హక్కును కలిగి ఉండటానికి, సమగ్రమైన, జ్ఞానయుతమైన ఆరోగ్య రక్షణను ఆశించటానికి గల హక్కులను

Share
Posted in వ్యాసం | Leave a comment