Monthly Archives: April 2016

సీత మూర్తి – జి. వ్యుహిత, 7వ తరగతి

చిన్నతనంలో చిట్టి చిట్టి అడుగులేసి పాపాయి పెరిగి పెద్దయి అన్ని బాధ్యతలను తీసుకున్న అమ్మాయి అన్నిటిలో ఎవరికీ తక్కువ కాదు అని తన ప్రతిభను చాటి చెప్పే అమ్మాయి మన చెల్లాయి.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

”ఏదీ సాధికారత?” – తాటికోల పద్మావతి

మహిళా మణులు మట్టిలో మాణిక్యాలంటారు – ”ఎక్కడ స్త్రీలు పూజించబడితే అక్కడ దేవతలు దీవిస్తారని స్త్రీలను గౌరవిస్తే సిరి సంపదలు తాండవిస్తాయని స్త్రీలను పవిత్రంగా పూజించే ఈ భారతావనిలో పొగడ్తలనే పోరెక్కువగా ఉంది. అన్ని రంగాలలోనూ స్త్రీలదే పై చెయ్యి హలం పట్టి పొలం దున్నినా, కలం పట్టి సాహిత్యం పండించినా ఎందులోనూ తీసిపోరు. ఆటోల … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

మహిళా రాజకీయాల తల్లి వేరు – వై.హెచ్‌. మోహన్‌రావు

ఆమెకు తెలంగాణా పుట్టినిల్లు, పల్నాడు మెట్టినిల్లు. ఆమెధీర. కేవలం ఒక రైతు కుటుంబ ఆడబిడ్డ. ఎలాంటి రాజకీయ, రాచరిక వారసత్వంలేని సాధారణ మహిళ. అందునా కుటుంబ సభ్యులనందరినీ కోల్పోయిన ఒంటరి. పసుపు కుంకుమలు చేజారిన వైధవ్య జీవితం. వీటన్నింటినీ అధిగమించి, విశాల దృక్కోణం, కృషి, పట్టుదలతో ప్రజలకు అత్యంత చేరువై, రాచకుటుంబ ఆశీస్సులతో మహామంత్రిణిగా ఎదిగిన … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

పి. సత్యవతిగారి ఇల్లలకగానే… కథలు – కుటుంబం స్త్రీ – డా|| ఓరుగంటి సరస్వతి

తెలుగులో అభ్యుదయ సాహిత్యోద్యమం తర్వాత పేర్కొనదగ్గ బలమైన సాహిత్యోద్యమాల్లో స్త్రీవాద సాహిత్యోద్యమం ఒకటి. సమాజంలోనూ, కుటుంబంలోనూ, పనిలోనూ స్త్రీలు గురౌతున్న అణచివేత దోపిడీకి సంబంధించిన అవగాహన కల్గి ఉండి ఈ పరిస్థితి మార్చడానికి స్త్రీలూ, పురుషులూ కలిసి చేసే చైతన్యవంతమైన కార్యక్రమమే ”ఫెమినిజం”.

Share
Posted in వ్యాసం | Leave a comment

చీకట్లో వెలుగు రేఖ కన్నడ మూలం : డా|| కె.ఎస్‌. చైత్రా అనుసృజన : వి. కృష్ణమూర్తి

‘క్షౌరికుడు తన పనిని ప్రారంభించాడు. ఒత్తుగా పెరిగిన జడ వెంట్రుకలను కత్తిరించి రాశి పోశాడు. ఒక క్షణంలో వయ్యారంతో నవ్వుతున్నాయేమోనన్న తల వెంట్రుకలు యిపుడుకొచ్చి మట్టి పాచి లాగ ఒక చోట రాశి పడినది. హిందూ ధర్మం నిలబడినది. పరలోకంలోని భర్తకు ఆహారానికి తోడుగా భూలోకంలోని భార్య తల వెంట్రుకలలోని నీరు కలిసి పోవడం తప్పినది. … Continue reading

Share
Posted in వ్యాసం | Leave a comment

బహుప్రాణుల బలికోరే యుద్ధధర్మ బోధనలు – నంబూరి పరిపూర్ణ

ఒక దేశమని అనగానే – అది ఒక వివిధ జాతుల, తెగల, కులాల నివాస భూభాగమని అర్థమవుతుంది. దానిలో మళ్లీ వివిధ మతాలనూ, సంప్రదాయ సంస్కృతులనూ, ఆచారాలనూ పాటించే జనసమూహములుంటాయి. ఆ విధంగా ఉన్నప్పటికీ – అంతా కలసిమెలసి బ్రతుకుతూ, ఆ దేశపు జాతిగా గుర్తింపబడుతుంటారు.

Share
Posted in వ్యాసం | Leave a comment

మహిళలపై జరిగే అత్యాచారాలకు మహిళలే కారణమా? – జి. ప్రియాంక

ఇటీవల కాలంలో హిందూమత ప్రబోధకుడు, మత ఛాందస వాది అయినటువంటి గరికపాటి నరసింహారావు విద్యార్థులకు విరాట పురాణం వివరిస్తూ చేసిన వ్యాఖ్యలివి. ఆడవాళ్ళపై అత్యాచారాలు నేరాలు, ఘోరాలు జరగటానికి ఆడవాళ్ళ వేషధారణే కారణమన్న డిజిపి గారి వ్యాఖ్యలను బలపరుస్తూ అమ్మాయిల వస్త్ర వేషధారణను దుమ్మెత్తి పోసాడు.

Share
Posted in వ్యాసం | 1 Comment

యుక్త వయస్సు బాల బాలికల ఫోరమ్‌ – భూమిక క్షేత్ర బృందం

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మద్దూరు, దామరగిద్ద మండలాల్లో భూమిక చేపట్టిన త్వరిత మరియు బాల్య వివాహాలపై ప్రాజెక్ట్‌లో భాగంగా తేది 10/2/16 రోజు మద్దూరు మండలం ఎంపిడిఒ కార్యలయంలో యుక్త వయస్సు బాలబాలికల ఫోరం మీటింగ్‌ నిర్వహించటం జరిగింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

సఖి సెంటర్ల కౌన్సిలర్లకు శిక్షణ

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 2006 నుండి గృహహింస నిరోధక చట్టం 2005 అమలులోకి వచ్చింది. స్త్రీ శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐ.సి.డి.ఎస్‌ ప్రాజెక్ట్‌ డైరక్టర్‌ రక్షణాధికారిగా డి.వి.సెల్స్‌ అన్ని జిల్లాల్లోను ఏర్పాటయ్యాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల కన్నా ఇక్కడ మెరుగ్గానే ఈ డి.వి.సెల్స్‌ పని చేస్తున్నాయి. ఇద్దరు కౌన్సిలర్‌లతో ఈ సెంటర్‌లు బాధిత మహిళలకు సహకారాన్నందించేవి.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

మహిళలు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు రెండవ ప్రపంచ మహిళల సదస్సు – ఖాట్మండు తీర్మానం – మార్చి 17, 2016 – వి. సంధ్య, POW

అసమానతలు, దోపిడీ, పీడనలు లేని సమాజం కోసం కలలు కంటూ దానిని వాస్తవీకరించుకోవడానికి అట్టడుగు వర్గాల మహిళలు కదంతొక్కిన సదస్సు రెండవ ప్రపంచ మహిళా సదస్సు. మహిళల జీవితాలను ఛిద్రం చేసే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, నయా వలస వాదానికి వ్యతిరేకంగా గర్జించిన సదస్సు. సామ్రాజ్యవాదానికి, వారి దోపిడికి, వారు సృష్టిస్తున్న యుద్ధాలకి వ్యతిరేకంగా గళమెత్తిన అర్థప్రపంచపు … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

హృదయ వీణ (భూమిక నిర్వహించిన కథ, కవిత్వం పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – అంబల్ల జనార్దన్‌

డోర్‌ బెల్‌ కిచ కిచ మంది. దయాకర్‌ నిద్రలేచి సెల్‌ఫోన్లో సమయం చూస్తే ఉదయం ఐదు గంటల ఎనిమిది నిమిషాలు! ఇంత ప్రొద్దున ఎవరొచ్చారబ్బా అని విసుగ్గా లేచి కీ హోల్‌ నుంచి చూస్తే తమ ఊరు సారమ్మ. ఆమె ఇద్దరు కొడుకులతో ద్వారం బయట నుంచుని ఉంది. తను తలుపు తెరవగానే ”అన్నా! నాకిక … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

కవన భూమిక

రోహితా… రోహితా – మిత్ర రోహితా రోహితాని అమ్మ నిన్ను పిలిచెనా నవమోహన రూపాన్ని దేశం పరిగాంచెనా ఏ వెలివాడల రూపమూ ఎవడార్పలేని దీపమూ ఏ మనువాదుల శాపమూ ఏ కులనీతి కూపమూ రోహితా రోహితా నువు తిరుగరాయి ఈ చరితా ||రోహితా||

Share
Posted in కవితలు | Leave a comment

కవన భూమిక

అక్షరాలకు ఆయువు పోసిన మా అమ్మ – కత్తి పద్మారావు చీకటి విరబూస్తుంది కనురెప్పలు మూస్తే స్మతి ప్రపంచం కదులాడుతోంది అమ్మ నడిపిస్తున్నట్టే ఉంది

Share
Posted in కవితలు | Leave a comment

కవన భూమిక

”పేరు” – ఎస్‌. కాశింబి వెన్నెలలా పుట్టి…వన్నెలతో అలరిస్తావు పువ్వులా పెరుగుతూ…నవ్వులు పండిస్తావు మమతలతో పెనవేసి…మాటలతో మురిపిస్తావు మల్లెలా ఇల్లంతా…అనుక్షణం గుబాళిస్తావు!

Share
Posted in కవితలు | Leave a comment

కవన భూమిక

మహిళ – యం. శాంతిరావు మహిళా ఓ మహిళా! మహిలోని మణిపూసా మహిలోని ఆణిముత్యానివా? సృష్టికర్తా బ్రహ్మా బిడ్డకు జన్మనిచ్చిన అమ్మా

Share
Posted in కవితలు | Leave a comment

కవన భూమిక

గురివింద గీతలు – తాటిశెట్టి రాజు మహిళా దినోత్సవ కవితకేముందిలే సారూ…!

Share
Posted in కవితలు | Leave a comment