అక్టోబర్ 2026

అక్టోబర్ 2026

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

భారతదేశంలో మహిళలను రైతులుగా గుర్తించడం: న్యాయం, సమానత్వం కోసం ప్రయాస – ఉషా సీతాలక్ష్మి

2026వ సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ-ఆహార వ్యవస్థలలో మహిళల పాత్రకు పెరుగుతున్న గుర్తింపు నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చినప్పటికీ, ఇది భారతీయ వ్యవసాయ రంగంలో మహిళల పరిస్థితి మరియు హోదాపై మరింత లోతైన మరియు క్లిష్టమైన పరిశీలన చేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతోంది Continue reading →

Share
Posted in గెస్ట్ ఎడిటోరియల్ | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

(గత సంచిక తరువాయి…)
` అనువాదం: ప్రభాకర్ మందార
అన్ని రకాల ప్రభుత్వ వ్యవస్థల పట్లా వామపక్షాలు చాలా మొండిగా, తీవ్రమైన విముఖత చూపించేవి. ఆంధ్ర ప్రదేశ్‌లో ఒకానొక దశలో అయితే` ఎంఎల్ కార్యకర్తలు ప్రభుత్వం తమ మీద బనాయిస్తున్న క్రిమినల్ కేసుల్లో తమ తరఫున వాదించేందుకు న్యాయవాదులను నియమించుకోవటాన్ని కూడా వాళ్లు నిరాకరించారు. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

పొన్నుతాయి – తమిళ కథ ` బామ

అనువాదం: డా॥ జిల్లెళ్ళ మెర్సీ విజేత
పొన్నుతాయికి దగ్గర దగ్గర ముప్పయి లేదా ముప్పయి రెండేళ్ళు ఉంటాయి. బలమైన మనిషి. పెళ్ళెí ఏడెనిమిది ఏళ్ళయింది. ఈ మధ్యలో ఆమెకి ఒకరి తర్వాత ఒకరు నలుగురు మగ పిల్లలు పుట్టారు. పొన్నుతాయి నల్లనిది. ఎంత నలుపంటే చీకటి కంటే నల్లనైనది. కాని ఆమె చూడటానికి బాగుంటుంది. Continue reading →

Share
Posted in కథలు | Leave a comment

భయం అంచున జీవితం – మకాం

యావత్మాల్‌లోని బుల్గడ్ జిల్లాకి చెందిన మంగళ, కవదు బోతునెలను కలుద్దాం. వారు ప్రత్యేకించి దుర్బలతకు గురవుతోన్న ఆదివాసీ తెగ కోలామ్‌కు చెందినవారు. రైతులైన వారిద్దరూ బుల్గడ్ చెరువుకు, తిప్పేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యం సరిహద్దులకూ మధ్య ఒదిగి ఉండే తమ ఐదు ఎకరాల పొలంలో చాలా కష్టపడి పని చేస్తారు. Continue reading →

Share
Posted in మహిళా రైతుల జీవన పోరాటాలు  | Leave a comment

వనితా థుతుర్కర్ పట్టుదలతో కూడిన ప్రయత్నం – మకాం

“నేను పత్తి ఏరడంలో చాలా చురుగ్గా ఉంటాను”, ఆమె చేతులు వేగంగా కదులుతూ, ఆగకుండా పత్తిని ఏరుతుండగా అన్నారు వనిత. “నేను రోజుకి 50 కిలోలకు పైగా పత్తి ఏరుతాను.” తన నైపుణ్యంపై నమ్మకం ఉన్న ఆమె సాధారణంగా ఉండే స్థిరమైన రోజువారీ వేతనంపై కాకుండా గుత్తా పని ప్రాతిపదికన పని చేస్తారు. Continue reading →

Share
Posted in మహిళా రైతుల జీవన పోరాటాలు  | Leave a comment

జీవన పోరాటాల నడుమ కొడిశాల గీతా దృఢత్వం – మకాం

పొలం పనిచేయటం కన్నా బీడీలు చుట్టడమే నాకిష్టం, అలవాటైన నేర్పుతో చుట్టిన బీడీలను కట్టలుగా కడుతూ చెప్పారు గీత. “నేని ఈ పనిని ఇంట్లో కూర్చొని చేయగలను. రోజంతా పొలంలో పనిచేయటం కంటే ఇది చాలా సులభమైన పని.” అయితే, బీడీలు చుట్టటం ఆమె ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతోంది. Continue reading →

Share
Posted in మహిళా రైతుల జీవన పోరాటాలు  | Leave a comment

గొంతెత్తలేనివారి కోసం గొంతు విప్పిన వీర్ పాల్ కౌర్ – మకాం

“భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత, అతను తన భార్యకు మిగిల్చి వెళ్లే కష్టాలను ఎవరు పరిగణనలోకి తీసుకోరు” అంటారు. వీర్‌పాల్ కౌర్, ఆమె తండ్రి, మామ, భర్త, వీరందరు అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్య చేసుకున్నవారే. Continue reading →

Share
Posted in మహిళా రైతుల జీవన పోరాటాలు  | Leave a comment

నాగలి పట్టిన చేతులు ఆశ నిండిన గుండెలు – మకాం

వ్యవసాయక సంక్షోభంతో పోరాటం చేస్తున్న మహిళా రైతులు ఎదుర్కొన్న సాగుబడి సవాళ్లు
పెట్టుబడిగా పెట్టిన శ్రమతో పోలిస్తే ప్రత్యేక రాబడి అతి తక్కువగా వస్తున్నప్పటికీ, మహిళా రైతులు తమ పొలాలను ఎందుకు సాగు చేస్తూనే ఉంటారని అడిగినప్పుడు, వాళ్లు వెంటనే “కనీసం మా కుటుంబానికి తిండి గింజలు లభిస్తాయి కదా”, అని సమాధానం ఇస్తారు. Continue reading →

Share
Posted in మహిళా రైతుల జీవన పోరాటాలు  | Leave a comment

జాతీయ మహిళా రైతుల దినోత్సవాన్ని జరుపుకుందాం ! అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం సందర్భంగా అక్టోబర్ 15 వ తేదీన

అక్టోబర్ 15వ తేదీని ఐక్యరాజ్య సమితి 2007లో అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. ఆహార భద్రత మరియు గ్రామీణ పేదరిక నిర్మూలనలో గ్రామీణ మహిళలు పోషించే కీలకమైన పాత్రను గుర్తించి, ప్రోత్సహించటం దీని ఉద్దేశం. Continue reading →

Share
Posted in కరపత్రం | Leave a comment

శ్రీమతి దర్భా భాస్కరమ్మ గారితో నా అనుబంధం ఒక మధుర జ్ఞాపకం – శంభు ప్రసాద్

సుమారు మూడు దశాబ్దాల క్రితం నేను సంగీత దర్శకుడిగా చురుకుగా పనిచేస్తూ, అనేక భక్తి గీతాల ఆల్బమ్‌లకు సంగీతాన్ని అందిస్తున్న రోజులు. నా తండ్రికి స్వామి రామానంద గారితో పరిచయం ఉండేది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక ఆశ్రమంలో నివసించే స్వామీజీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మా ఇంట్లోనే బస చేసేవారు. Continue reading →

Share
Posted in జ్ఞాపకాలు | Leave a comment

భాస్కర కిరణాలు – ప్రొ. సి.హెచ్. సుశీలమ్మ

కవయిత్రి, రచయిత్రి అనే పదాలకు అర్థం తెలియని నా పదేళ్ల వయసులో మా పక్క ఇంట్లోనే ఉన్న ఒక అద్భుతమైన మహిళామణి శ్రీమతి దర్భా భాస్కరమ్మగారు. వారి భర్త గారి పేరు పిల్లల పేర్లు తెలిసినా, ఆ రోజుల్లో వారంతా కేరాఫ్ భాస్కరమ్మగారే. బదిలీ దృష్ట్యా వారు నాగార్జునసాగర్, కావలి వెళ్లిపోయినా వారి నాల్గవ అమ్మాయి నా స్నేహితురాలు సుభాషిణి అప్పుడప్పుడు కలుస్తూ ఉండేది. Continue reading →

Share
Posted in జ్ఞాపకాలు | Leave a comment

ఆధ్యాత్మికత, ప్రకృతి ప్రేమల కలనేత దర్భా భాస్కరమ్మ గారు రచించిన ‘నా ఉత్తర దేశ యాత్ర’ – సింగరాజు రమాదేవి

సాహిత్య ప్రక్రియలలో యాత్రా సాహిత్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. యాత్రా సాహిత్యం మనకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త ప్రాంతాలని, ప్రసిద్ధ క్షేత్రాలని, దర్శనీయ స్థలాలని పరిచయం చేస్తుంది. తెలుగులో యాత్ర సాహిత్యంలో మొదటి యాత్రా గ్రంథంగా ప్రసిద్ధి పొందినది ఏనుగుల వీరాస్వామి 1838లో రాసిన ‘కాశీయాత్ర చరిత్ర’. ఇది ఆ కాలపు భారతదేశ సామాజిక సాంస్కృతిక పరిస్థితులను తెలుసుకోవడానికి ఒక ప్రామాణిక చారిత్రిక ఆధారంగా నిలుస్తుంది. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

‘ప్రసన్న భారతి’ సాహిత్యం ` జీవితం – డా. లక్ష్మి సుహాసిని

తూర్పు గోదావరి జిల్లాలోని నడిపూడి అనే గ్రామంలో కళా శరభయ్య గారు, లక్ష్మికాంతమ్మ గార్ల రెండో కూతురు భాస్కరమ్మ గారు. ఈమె 1827వ సం॥ అక్టోబర్ 23న దసరా పండుగలలో దుర్గాష్టమి రోజు జన్మించారు. Continue reading →

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

అబలా బోస్ – డా. నాగసూరి వేణుగోపాల్

మహిళలకు సైన్సు విద్యాగంధాన్ని తొలుత వెదజల్లిన

శాస్త్రవేత్త మాత్రమే కాదు సంస్కరణవాది, తొలి స్త్రీవాది, మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడిన వ్యక్తి, వితంతు వివాహాలకు ఉద్యమించిన శక్తి… మాత్రమే కాదు; స్త్రీలు చదువుకోవాలని, సైన్స్ చదువులు కొనసాగించాలని కాంక్షించి శ్రమించిన తొలి మహిళా కెరటం అబలాబోసు. ఆమె పేరు అబల కావచ్చు గాని, కానీ చాలా రకాలుగా ఆమె సబల. Continue reading →

Share
Posted in సైన్స్ ఆకాశంలో సగం | Leave a comment

‘అబద్ధపు’ కేసులు : క్షేత్ర స్థాయి పరిశోధనలు ఏం చెప్తున్నాయి? – ఎ. సునీత

గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా, టెలివిజన్‌లలో ఆడవాళ్ళూ, దళితులూ తమపై జరిగే హింస, వేధింపుల గురించి పెట్టే కేసులన్నీ అబద్ధపు కేసులేనన్న వాదనలు ఊపందుకున్నాయి. భార్య అబద్ధపు కేసు పెట్టటంతో నష్టపోయి బాధ తట్టుకోలేక చనిపోతున్నానే అతుల్ సుభాష్ వంటి భర్తల వీడియోల ఆధారంతో ఈ చట్టాలని నేర స్మ్రుతి నుండి తీసేయాలని, వీటికుండే కఠినతరమైన శిక్షలని తీసేయాలని, కోర్టుల్లో కేసు నిరూపణ కాకపోతే ఫిర్యాదు చేసిన వారిని తప్పని సరిగా శిక్షించాలనే వాదనలు, ఇంకో పక్క వేధింపుల కేసులు ఎదుర్కుంటున్న ఆధిపత్య కులాలు, మగవాళ్లందరినీ సమర్ధించే సంఘాల వాదనలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment