ప్రకృతి అందాలు, మానవ సంబంధాలు కలబోసుకున్న మధురానుభూతులమయమైన రచయిత్రుల కేంప్

భూమిక ఆధ్వర్యంలో నర్సాపూర్‌లో రచయితుల్ర కేంప్ అని తెలవగానే వరంగల్లో వున్న రజిత, నేను బోలెడంత సంబరపడి వెంటనే మా సంసిద్ధత వ్యక్తం చేశాం. అప్పటినుండి ంరోజూ దాన్ని గురించి చర్చించుకుంటూ పొందబోయే ఆనందాన్ని ఊహించుకున్నాం. చివరగా చెప్పాల్సింది ఆపుకోలేక ముందే చెప్పేస్తున్నాను. ఊహించిన దానికన్నా ఎక్కువ ఆనందోత్సాహాలతో తిరిగొచ్చాం.

సరిగ్గా నెలరోజుల క్రితం ముందుగా నిర్ణయించుకున్న పక్రారం రజిత, నేను వరంగల్ నుండి హైదాబ్రాద్ చేరుకొని నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ టైమ్ కు నాంపల్లి స్టేషన్ చేరుకున్నాం. రైలెక్కాక అందరం కలుసుకోవడం, తీపి, పరిమళాలతో పరస్పర పరిచయాలతో పయ్రాణం మొదలయింది. రాతి్ర 12 గంటల దాకా మాటలు, పాటలు, కలుసుకోబోయే వ్యక్తుల గురించి, చెయ్యబోయే కార్యక్రమాల గురించి చర్చలు, టూర్ షెడ్యూల్, ఎవరెక్కడుండాలో తెలిపే కాయితాల పంపిణీతో సహా అంతా హడావుడి. యాణం పొడుగునా పరచిన పచ్చదనపు తివాచీలపై అమాంతం రైల్లోంచి దూకి వాటిపై దొర్లాలనిపించేంత ఉత్సాహం, ఉద్వేగం. నర్సాపూర్లో రైలుదిగి వై.ఎన్. కాలేజీ గెస్ట్‌హౌస్‌‌కి వెళ్ళడం, అక్కడినుండి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం, అక్కడ వారి ఆప్యాయతను పంచుకోగలగడం ఒక మధుర ఘట్టం. పేరుపాలెం బీచ్‌లో కెరటాల మధ్య కేరింతలు, కడలి తరంగాలతో కలసి చెట్టాపట్టాలేసుకొని ఆడుకోవడం, చిరుజల్లులలో ఐస్‌క్రీమ్‌ తింటూ ఆనందించడం, నవ్వులు, అరుపులు – ఇలా అందరి శరీరాలు, మనసులు ఉల్లాసభరితం. ఆరోజు జరిగిన పడవ ప్రయాణమూ గొప్ప అనుభూతే.

మర్నాడు వై.ఎన్. కళాశాలలో నిర్వహించిన ‘సాహితీ సదస్సు’లో పాల్గొనడం, పుస్తకావిష్కరణలు, అక్కడి రెండు కాలేజీల నిర్వాహకులు, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు కురిపించిన పేమ్రానురాగాలు పది కాలాలపాటు పదిలపరచుకోదగిన ఆనందానుభూతులు.

లేస్ పార్క్ సందర్శన, సీతారామపురం తోటల్లో విహరించడం, అక్కడందరినీ కలుసుకొని మాట్లాడడం చక్కటి అనుభవాలు. సాయంకాలపు నీరెండలో అంతర్వేది దర్శనం మరొక మధురమైన అనుభూతి.

ఆ మర్నాటి పాపికొండల ప్రయాణం మొత్తం కేంప్లో ప్రధాన ఘట్టం. పట్టిసీమలో లాంచ్ ఎక్కడం నుండి దాదాపు 9 గంటలు గోదావరి ఒడిలో కూర్చొని ప్రయాణం చేయడం. నిజంగా ఆ అనుభూతిని అనుభవించాలే తప్ప చెప్పడానికి రాదనిపిస్తుంది. నేనయితే నన్ను నేను గిల్లి చూసుకున్నాను నిజంగా ఇది కలా నిజమా అని. చల్లని గాలులు, వర్షపు తుంపరల మధ్య వేడి వేడిగా టీ తాగ్రుతూ, మిర్చీలు, పకోడీలు తింటూ, చక్కటి విందారగిస్తూ పరస్పర భావాలను పంచుకుంటూ, మనసులు విప్పి మాట్లాడుకుంటూ జలపాతాల సోయగాలను, పక్రృతి అందాలను తిలకిస్తూ ఒక్కొక్కసారి మాటలు రాక మౌనం వహిస్తూ, కొన్నిసార్లు ఆపుకోలేక అభిపాయ్రాలను వ్యక్తం చేస్తూ సాగిన ఆ ప్రయాణం ప్రతిక్షణం ఉత్సాహం, ఉద్వేగభరితమే. ఎటుచూసినా పరవశింపజేసే దృశ్యాలే.

ఇక సాంస్కృతిక కార్యక్రమాలు, పోలవరం పాజ్రెక్టు గురించి, ముంపు గురించి, గిరిజనుల సాధక బాధకాల గురించి, పోడు వ్యవసాయం గురించి, రాయాల్సిన వాటి గురించి, మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి, భవిష్యత్ కార్యక్రమాల గురించి ఆసాంతం సాగిన చర్చోపచర్చలు ఆలోచించాల్సినవి, ఆచరణాత్మకమైనవి. ఇన్ని విషయాలు ఒక్కసారి, ఒక్కచోట మనం కూడి మాట్లాడుకునే అవకాశం కల్పించిన గోదారి తల్లికి, మన సత్యవతిగారికి కృతజ్ఞతలు చెప్పుకోడానికి మాటలు రావే. ఎలా? మళ్ళీ మళ్ళీ తలపింపజేసే ఈ ఆనందానుభూతులన్నింటినీ గుండెలనిండా నింపుకున్నాం. ఫోటోల్లోనూ బంధించాం ( కొన్నింటిని). రాజమహేంద్రవరంలో శీధ్రర్‌గారింట్లో లభించిన ఆత్మీయ ఆతిథ్యం మరింత ఆనందాన్నిచ్చింది. ఇలా అన్నిటికన్నీ జ్ఞాపకాల చిరుజల్లులే. ఒకవేపు పెనవేసుకున్న హాయైన స్నేహానుబంధం, మరోవైపు అప్పుడే విడిపోతున్నామన్న బాధావీచికల భావనా పరంపరలతో ఎవరి గూటికి వాళ్ళం చేరాం. మొత్తంమీద రచయితుల్ర కేంప్ దిగ్విజయానికి సూత్రధారి, పాత్రధారి అయిన సత్యవతిగారికి మరొక్కసారి శుభాకాంక్షలతో – మళ్ళీ యిలాంటి కలయికకోసం ఎదురుచూస్తూ స్నేహంతో…

-కొమర్రాజు రామలక్ష్మి, వరంగల్

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో