చేతన ప్రాజెక్టులో అమ్మాయిల అనుభవాలు

 ఏలూరుపాడు సెంటర్‌

నా పేరు జ్యోతి. మా వూరి పేరు ఏలూరుపాడు.  పదవ తరగతి చదువుకున్నాను. చేతన టివి గురించి  నాకు అది అంకురంగా వున్నప్పటినుంచి తెలుసు. నాకు ఈ ప్రాజెక్ట్‌ గురించి జ్యోతి మేడమ్‌ గారు చెప్పారు. తర్వాత మొదట్లో ట్రైనింగు యిచ్చినప్పుడు వచ్చాను.
ప్రొజెక్ట్‌ చేతన మీడియా ల్యాబ్‌ ఆసియా మరియు బైర్రాజు  ఫౌండేషన్‌ వారి ప్రోత్సాహంతో నడపబడుతోంది. దీని ద్వారా గ్రామాలలోని ప్రజల సమస్యలను  ముఖ్యంగా మహిళల సమస్యలను ప్రోగ్రామ్‌ చేసి, వారిని చైతన్యపరచడంద్వారా మహిళా సాధికారత సాధించవ్చని నా నమ్మకం.
క్రమేపి నేను మహిళలలో కలిసి చేసిన ప్రోగ్రామ్స్‌ ద్వారా వారిలో వచ్చిన మార్పు నాకు నచ్చింది.  నేను చేసిన ప్రోగ్రామ్‌ ద్వారా ఎంతో కొంతమంది మార్పు జరగడం నాకు బాగా నచ్చింది.
ఈ ప్రాజెక్ట్‌లో నేను కెమెరా, కంప్యూటర్‌లో ఫోటోషాప్‌ వర్క్‌ నేర్చుకున్నాను. ఎక్కడ ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటున్నాను.
ఉదాహరణకి అమలాపురంలో ట్రైనింగు ఇచ్చినప్పుడు చిన్నపిల్లల గురించి మహిళల గురించి చేయాలని చెప్పారు. తర్వాత మా శ్రీకాంత్‌గారు తల్లిపాల గురించి చెప్పారు బాగుంది అన్నాము. ఈ ప్రోగ్రామ్‌ చేస్తాము సార్‌ అని చెప్పాము. తల్లిపాలు గురించి ఎందుకు సెలక్ట్‌ చేసుకున్నామంటే ముర్రుపాలు అంటే ఏంటో, ముర్రుపాల విలువ ఏంటో చాలామందికి తెలియదు. పోతపాలు ఇవ్వటం వల్ల పిల్లలు ఎటువంటి అనారోగ్యానికి గురిఅవుతారో సరిగ్గా తెలియదు. పైగా పిల్లలకు పాలు ఇవ్వటం వల్ల బిడ్డకే కాకుండా తల్లికి కూడా అనేక లాభాలు వున్నాయి.
ముఖ్యంగా : ముర్రుపాలు బిడ్డపుట్టిన వెంటనే తాగించాలని, ముర్రుపాలలో వ్యాధిని నిరోధించే శక్తి ఎక్కువ వుంటుందని,  బిడ్డకు కావలసిన ప్రోటీన్స్‌, విటమిన్స్‌ వుంటాయని చాలామందికి తెలియదు. బిడ్డ పుట్టిన ఆరునెలలవరకు తప్పనిసరిగా పాలు ఇవ్వాలి అని సరిగ్గా అందరికీ తెలియదు.  బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా రొమ్ము కాన్సర్‌ వంటి జబ్బులు రాకుండా వుంటాయి. బిడ్డకు పాలు యిచ్చేటప్పుడు కూర్చుని ఇవ్వాలని, ఇచ్చేటప్పుడు శుభ్రంగా వుండాలని, బిడ్డకు పాలు ఇచ్చిన తర్వాత బిడ్డను పైకి ఎత్తుకుని బిడ్డ వీపుపైన నిమరాలని వారికి తెలియదు. ఇలా చేయటం వల్ల బిడ్డకు సరిగ్గా జీర్ణం అవుతుంది. వాంతులు, విరోచనాలు కాకుండా వుంటాయి. దీని ద్వారా బిడ్డలు ఆరోగ్యంగా పెరుగుతారు.
ఇవన్నీ చిన్న చిన్న సమస్యలుగానే వుంటాయి.
బిడ్డకు తల్లిపాలు ఇవ్వటం వల్ల బిడ్డలో ఇమ్యూనిటీ పవర్‌ వుంటుంది. కాబట్టి పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. పోతపాలలో బిడ్డకు కావలసిన ప్రోటీన్స్‌, విటమిన్స్‌ సరిగ్గా అందవు. కాబట్టి పోతపాలు తాగిన బిడ్డలో ఇమ్యూనిటి పవర్‌ ఎక్కువగా వుండదు.
ఈ ప్రోగ్రామ్‌ ద్వారా నేను చెప్పాలనుకున్నది.
గ్రామంలో వున్న అపోహలు పోగొట్టి పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు త్రాగించాలని. తల్లిపాలలో అనేక విటమిన్స్‌, ప్రోటీన్స్‌ వుంటాయని. బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని చెప్పాలనుకున్నాను. మన చుట్టూ వున్న సమస్యలపై వారికి అవగాహన తీసుకురావటానికి ఈ ప్రోగ్రామ్స్‌ చేస్తున్నాం. వారిలో మార్పు తీసుకురావటానికి. మార్పు ఒక్కసారిగా రాదు. కాని ఇలా వీడియోస్‌ చేయటం వల్ల వారికి సమస్యపై అవగాహన ఏర్పడుతుంది. మన చుట్టూ వున్న సమస్యలు వారికి తెలియదు. తెలిసినవారికి చిన్నచిన్నగా వుంటాయి. అటువంటి విషయాలను తీసుకుని ప్రోగ్రామ్‌ గురించి చూపించాలి. చూపించిన తర్వాత ఓ చిన్న సమస్యవల్ల ఇంత నష్టం జరుగుతుంది, అని చెప్పడానికి వీడియోస్‌ అవసరం. మనం మాటల్లో చెప్పలేనిదాన్ని వీడియో ద్వారా చూపించవచ్చు. ఈ వీడియో ద్వారా వారి సమస్యలను మనం తెలుసుకోగలుగుతాం. తెలుసుకున్న సమస్యలు వారితో డిస్కషన్‌ చేసి మంచి థీమ్‌ సెలక్షన్‌ చేసుకుని మంచి ప్రొడక్షన్‌ ఇవ్వగలుగుతాం. మహిళలకి చూపించడం, వారిలో మార్పు తీసుకురావడం, వారి అభిప్రాయాలను తెలుసుకోవటం. గ్రామంలో మార్పు తీసుకురావటానికి. గ్రామంలో వున్న అధికారులకు చూపించి, పరిష్కారం గురించి ఆలోచించడం. ఒక సమస్య గురించి వీడియో చేసి చూపించినప్పుడు మరల అది రిపీట్‌ కాకుండా చూడటం. ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయని నాకు అనిపించింది.

వై. సావిత్రి, లంకలకోడేరు
నా పేరు  ఏనుగుపల్లి సావిత్రి, నాది లంకలకోడేరు (చిన్నపేట).  ఔ.్పుళిళీ. (కంప్యూటర్స్‌)చదివాను. నాకు తండ్రి లేడు. తల్లి అరుణకుమారి. అయిదుగురు అక్కాచెల్లెళ్ళం. ఒక సోదరుడు.మా గ్రామ సమస్యలగురించి, అందరికి తెలియ పరచాలనే ఉద్దేశ్యంతో, మా గ్రామ మహిళా వాలంటీర్లతో చాలా వీడియోలు తయారు చేశాం. ఈ వీడియోలను గ్రామ మహిళలకే కాక, ఇతర గ్రామస్థులకి, పంచాయితీ సభ్యులకి కూడా చూపించాం.   అయితే, మేము  తీసే వీడియోలు ఎక్కువగా మహిళల గురించి మరియు బాలబాలికల సమస్యలు – అభివృద్ధి గురించి కాబట్టి ఈ వీడియోలు చూపించడంద్వారా నేను మహిళలలో సమస్యలపై అవగాహన కల్పిస్తూ, ఆయా సమస్యల పరిష్కార మార్గాలను మేము నిర్వహించే ఫోకస్‌ గ్రూప్‌లద్వారా అందరికీ అర్ధమయ్యేలా చెప్తుంటాను. ఈ పరిష్కార మార్గాలను మేమందరం గ్రామ పంచాయతీవారికే, ఇతర  సంబంధింత ప్రభుత్వ ఉద్యోగులకీ చూపిస్తాం.
 అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి వారిని అందులో భాగస్వాములుగా చేయడం. వారికి తెలియని విషయాలను తెలియచేయడం. వారికి కావలసిన సమయాన్ని అందుబాటులో చేయడం.
 వారిలో నిర్ణయాత్మక శక్తిని ఆత్మసంతృప్తిని పెంపొందించడం. మహిళా సాధికారత, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌కు బాగా ఉపయోగపడుతుంది. వారిలో చైతన్యాన్ని పెంపొందించడం. వారిలో చైతన్యం కలిగి వారి సమస్యలు మరి తెలుసుకుని, పరిష్కరించుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది.
 దాహం దాహం
27-4-09 లంకలకోడేరు ‘కీవాడ’రోడ్డులో ఐబీజీలిలిదీరిదీవీ  జుజీజీబిదీవీలి చేసాను.  ‘చేనేత శ్రామికులు’ మీద సినిమా సిడి చూపించాను. నేను రోజున వాలంటీర్లు కలిసి ఇద్దరం వెళ్ళాము. దానికి సంబంధించి ఫోటోస్‌ అన్నీ తీసుకున్నాను. కానీ స్త్రీలందరి సమస్యలు తీసి చూపిస్తున్నారు. మన గ్రామంలో ఇంకా ఉన్న సమస్యలు అవి తీయండి అని చెప్పింది పద్మ. సరే ఏంటి మీ సమస్య అని అడిగాను. ఆమె నీకు తెలీదా! ఈ ఊరే కదా నీది. వేసవికాలంలో నీళ్ళు లేక చచ్చిపోతున్నాం అంది. సరే అని ఈ విషయం గురించి శ్రీకాంత్‌ సర్‌తో మాట్లాడాను. నేను సెలవులో ఉన్నాను. ప్లాన్‌ చేసుకోండి అని చెప్పారు. సరే సార్‌ అని  ‘కోసలీ’కి వెళ్ళాను. వాళ్ళు ఒక్కటే గొడవ! నీళ్ళు లేవు. నేను వెళ్ళేసరికి పైపుల దగ్గర బారులు తీరిన జనం. నీళ్ళకోసం కూర్చుని ఉన్నారు. వారి స్పందన, సమస్య కనుక్కుని వచ్చి జిన్నూరు నుండి  ఈ ఙ ఊబిచీలిరీ తీసుకుని వచ్చాను.
ఉ. చళిఖిలిజీతి లో షూటింగు మొదలుపెట్టాను. అక్కడ లీకై ‘పైపు నుండి వాటర్‌’ రావడం జరిగింది. జనం వాటర్‌ పట్టుకోవడం. నీళ్ళు డ్రిఫ్ట్సులుగా రావడం. అన్ని రీనీళిళిశి చేసుకున్నాను. కానీ ఇంకా రీనీళిళిశిరిదీవీ ఉంది. శ్రీకాంత్‌ సర్‌కి ఫోన్‌ చేసి చెప్పాను.
 స్త్రీలు నీళ్ళకు రావడం. నీళ్లు ఎన్ని బిందెలు వస్తున్నాయి. ఎంతమందికి సరిపోతున్నాయి. ఏయే టైంలో వాటర్‌ ఇస్తున్నారు?
”అసలు ఎందుకు వాటర్‌ సరిపడా ఇవ్వడం లేదు అని గ్రామ సర్పంచ్‌” గారిని అడుగుతున్నారు. ఆ రోజు షూటింగు చేసుకున్నాం. గ్రామపంచాయితీకి వెళ్ళాను. కాని సర్పంచ్‌ లేరు. సెక్రట్రీని కలిసాను. దీని గురించి ప్రెసిడెంట్‌ని కలవాలి, సర్పంచ్‌గారు, ఉదయం10 నుంచి 11 వరకు ఉంటారు. ఆ టైములో రండి! అని చెప్పారు. గ్రామపంచాయితీకి వెళ్ళాను. సర్పంచ్‌ని కలిశాను. ఉండడానికి ఇంత పెద్ద చెరువు ఉన్నా గ్రామప్రజలకు ఎందుకు నీరు అదడం లేదు సర్‌ అని సర్పంచ్‌ గారిని అడిగాం.
సర్పంచ్‌ 30 ఎకరాల చెరువు బాగుచేస్తున్నాం. అందులో నీరు లేదు. గవర్నపేట నుంచి నీరు సప్లయ్‌ చేస్తున్నాం. అందువల్ల నీరు కొరతగా ఉంది. కొద్దిరోజులలో నీరు సప్లయ్‌ చేయిస్తాం. అన్నారు. నేను మీరు ఎప్పుడో చేస్తే వేసవికాలం నీరు లేక అల్లాడిపోతున్నారు. ఏం చేస్తారు మీరు అని అడిగాను. సరే ఏదో ఒకటి చేస్తాం. అన్నారు, పంచాయితీ సెక్రటరీ, సర్పంచ్‌. మళ్ళారోజు వెళ్ళి కలిసాను. బోరులు వేయిస్తున్నాం. వెళ్ళి షూట్‌ చేసుకో అన్నారు. సరే అని వెళ్ళి షూట్‌ చేసుకున్నాను.
నా పేరు విస్సా విజయలక్ష్మి (్పు.ఊ.ఙ.)
మా గ్రామం పేరు అంతర్వేదిపాలెం. నేను ఇంటర్‌వరకు చదువుకున్నాను.
ప్రోజెక్ట్‌ చేతన గురించి బైర్రాజు ఫౌండేషన్‌ ద్వారా తెలిసింది.  జులై 17న 2008 జాయినింగు అయ్యాను. చేతన శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా గ్రామీణ ప్రజలను అభివృద్ధిపదంలో నడిపించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించబడింది. (ఐ.సి.టి. ఫర్‌ ఉమెన్స్‌ ఎంపవర్‌మెంట్‌ ఎండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌) గ్రామీణ మహిళలను, పిల్లలను జాగృతం చేయాలన్నదే దీని లక్ష్యం. ఎడిటింగు, వాలంటీర్లను తయారుచేయడం, గ్రామస్థాయిలో కార్యక్రమాలను రూపొందించడం, వాలంటీర్లకు మీడియా ప్రొడక్షన్‌లో శిక్షణ ఇవ్వడం, ఫోటో తీయడం, స్క్రిప్ట్‌ రాయటం, వీక్షకుల నుండి ఎలా అభిప్రాయాలు సేకరించాలో నేర్చుకున్నాము.
చేతన కమ్యూనిటి టివిలో చాలావరకు లబ్ధి పొందాను. నాకు అసలు వీడియోవర్క్‌ గురించి ముందు అసలు ఏమి తెలియదు. కాని ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను. ఎడిటింగు చేస్తున్నాను. అనూ స్క్రిప్ట్‌లో తెలుగు టైప్‌ చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అభివృద్ధి కార్యక్రమాల పట్ల గ్రామప్రజల్లో అవగాహన పెంచి వారిని అందులో భాగస్వాములను చేయడం. వారికి కావలసిన సమాచారాన్ని అందుబాటులో ఉంచి వారిలో నిర్ణయాత్మక శక్తిని ఆత్మసంతృప్తిని పెంపొందించడం నా ధ్యేయం. మేం తయారు చేసే వీడియోలు కేబుల్‌ టీవీ ద్వారా చూపించాలనేది మా ధ్యేయం. కాని ఊరికి దూరాలన్న ఉండే పేటలో, అక్కడ ఉండే వారి ఇళ్ళల్లో టీివీ లుండవు. ఈ పరిస్థితి గురించి ఆలోచించి, మేము తయారు చేసిన వీడియోలను మా దగ్గరుండే ల్యాప్‌టాప్‌లో ఎక్కించి, ఈ పేటలకు వెళ్లి, సాయంత్రం వేళలో చూపిస్తున్నాము. ఇలా మేము మాకున్న టెక్నాలజీ, పరికరాలను వినియోగిస్తున్నాం. కమ్యూనిటీ టీివీని కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ లేని ప్రాంతంలో కూడా, ల్యాప్‌టాప్‌లద్వారా చూపించాలనేది మా ధ్యేయం. ప్రతి ల్యాప్‌టాప్‌ స్క్రీనింగు తరువాత పాల్గొన్న మహిళలలోగాని, బాలబాలికలలో గాని ఒక ఫోకస్‌ గ్రూప్‌ని నిర్వహిస్తాం. ఈ ఫోకస్‌ గ్రూప్‌ద్వారా వారు అభిప్రాయాలను తెలియపరుస్తారు. ఈ అభిప్రాయాలే ఆ ప్రాజెక్టుకి మూల స్థంబాలు.వారికి సంబంధించిన ప్రోగ్రామ్‌ ల్యాప్‌టాప్‌ ద్వారా చూపించి వారిలో చైతన్యం కల్గి వారి సమస్య వారు తెలుసుకుని పరిష్కరించుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది.
మంచి అలవాట్లు
ఒకరోజు అంతర్వేదిపాలెంలో అంగన్‌వాడికి వెళ్ళాను. అంగన్‌వాడి టీచర్‌కి చేతన ప్రాజెక్ట్‌ గురించి చెెప్పాను. అక్కడున్న వారికి ”బాలికల ఆరోగ్యం” చూపించాము. అప్పుడు అంగన్‌వాడి టీచర్‌ దుర్గ ప్రోగ్రామ్‌ చాలా బాగుంది అని చెప్పారు.  వారు 1 సం|| పిల్లల నుండి 10 సంవత్సరాల పిల్లలదాకా వస్తారు. వాళ్ళ తల్లులు పిల్లల్న్లి అసలు శుభ్రం చేయరు. మరీ చిరాగ్గా ఉంటారు. పిల్లల శుభ్రత కోసం ప్రోగ్రాం తీస్తే చాలా బాగుంటుంది అని చెప్పారు. నేను అంగన్‌వాడి లోపలికి వెళితే నాకు ఒక పేపరు దొరికింది. అది చిన్నపిల్లల అలవాట్ల మీద ఉంది. అప్పుడు దుర్గ గారికి చూపించాను. అప్పుడు ఆవిడ అంది ఇలాంటి ఎన్నో బుక్స్‌ ఉన్నాయి. వాళ్ళకు అర్థం కాదు. మీరు ప్రోగ్రామ్స్‌ చేసి చూపిస్తే అలా చూస్తారు. వీడియో తీస్తే బాగుంటుంది అన్నారు.  అప్పుడు మేము ”మంచి అలవాట్లు” అన్ని ఒక పేపరు మీద వ్రాసుకుని ఒక్క స్క్రిప్ట్‌ కింద తయారుచేసినాము. ”మంచి అలవాట్లు-|” ”మంచి అలవాట్లు-జిజి” రెండు పార్ట్‌ల క్రింద చేశాము. వాయిస్‌ ఒవర్‌ అయింది. చాకలిపాలెం అనే విలేజ్‌కి వెళ్ళి ఒక బాబుది, ఉదయం నుండి సాయంత్రం వరకు చేసే అలవాట్లు గూర్చి తీసాం. దంతవ్యాధులు పిల్లలకు ఎందుకు వస్తామో డాక్టర్‌ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఇలా మంచి అలవాట్లమీద, ఒక డాక్టర్‌నే కాకుండా, మహిళలను, ముఖ్యంగా తల్లును ఇంటర్వ్యూ చేసి వీడియోలను చేస్తాం. ఇలా గ్రామంలో ఏ సమస్య గురించి అయినా మనం దానిని ఒక వీడియో తీసి చూపిస్తే అది పదిమందికి తెలుస్తుంది. అవగాహన పెరుగుతుంది. సమస్య గురించి చర్చ మొదలవుతుంది. సమస్య పరిష్కార మార్గాలను కూడా గ్రామ ప్రజలే చెప్తారనేది మా గట్టి నమ్మకం. కొందరి జీవితాలలో జరిగే సంఘటనలు అలా వేరొకరికి జరగకుండా ఉండాలి అని వీడియో తీస్తున్నాము.  గ్రామంలో ఒక చైతన్యం తీసుకురావచ్చు.
పేరు :కల్పన, పొడగట్లపల్లి, ఔ.జు. (ంఉ)
 నేను కల్పన, పొడగట్లపల్లిలో  సెంటర్‌ ప్రొడ్యుసర్‌లో పనిచేస్తున్నాం. వేసవిలో చాలామంది పిల్లలు ఇంట్లో ఏం చేయాలో తోచక, సందుల్లో ఉన్న మట్టితో ఆడటం చూశాను. గ్రామాల్లో చాలా మంది  తల్లిదండ్రులకు పట్టణాల్లో ఉండే తల్లిదండ్రులకు ఉండే అవకాశాలుండవు. పట్టణాల్లో అయితే, ఎంచక్కా ఏ సమ్మర్‌ కాంప్‌కో పంపిస్తారు. ఇది గమనించి మేం వేసవిలో సరదాగా అనే వీడియో తీయాలనుకున్నాం.

 మీకు ఒక ప్రోగ్రాం ఇస్తాను. వేసవిలో సరదాగా ప్రోగ్రామ్‌ మీరు చెయ్యండి అన్నారు. ఆ ప్రోగ్రాం ఎలా చేయవచ్చో డిస్కస్‌ చేసాము.  నేను స్కూలుకి వెళ్ళి మాస్టారుతో మాట్లాడాను.  మా ప్రోగ్రాం ఒక అమ్మాయితో యాంకర్‌ చెప్పించి తరువాత క్లాస్‌లోకి వెళ్ళి ఒక్కొక్కరుతో నీవు వేసవి సెలవులలో ఏమి చేస్తావు అని ఆ పిల్లలతే అడిగి వాళ్ళు అమ్మమ్మ ఇంటికి వెళతాము అని చెప్పారు  మేం ఒక   ఒక గేమ్‌ లాంటిది 15 మందికి నేర్పించారు.ఇలా పోగ్రాం చేస్తే ఉపయోగం ఉండదని, 15 మంది అమ్మాయిల మేము గేమ్స్‌ నేర్పించి, ఆడించాము. వాళ్ళతో మాట్లాడించాము. వాళ్ళకి 3 గేమ్స్‌ నేర్పించాము. (1) సర్కిల్‌ గేమ్‌, (2) రైస్‌ అండ్‌, రసం, (3) మెమరీ గేమ్స్‌ ఆడించాము.అవి షూట్‌ చేసాము. అలా వీడియోకి కావలసిన సమాచారం సేకరించాను.

ప్రియమైన అమ్మకు
 
 నేను, మా సెంటర్‌లో  ఇంకో ప్రొడ్యూసర్‌ హరిబాబు చాలా వీడియోలు తయారు చేస్తాం. అయితే అన్నిటికన్నా మాకు  బాగా పేరు తెచ్చిన వీడియో ”ప్రియమైన అమ్మకు” ఈ వీడియో మాకు ”వీడియో వాలంటీర్స్‌” వారి బెస్ట్‌ ఎడ్యుకేషన్‌ అవార్డు” వచ్చింది. మా గ్రామాల్లో చాలామంది మహిళలు, గల్ఫ్‌ వెళ్లి పోతున్నారు. గ్రామంలో సరైన పనిలేక, కుటుంబం అప్పు తీర్చలేక, ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లిపోతున్నారు. ఇలాగే, చాలా మహిళలు వారి భర్తలను, పిల్లలను వదిలి గల్ఫ్‌ వెళ్లిపోతున్నారు. ఈ వలస వెళ్ళటంవలన ఎన్నో కుటుంబ సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి ఇంట్లో ఉన్న పిల్లలపై చాలా ప్రభావం చూపిస్తుంది.  ముఖ్యంగా తల్లి లేనప్పుడు   ఆడపిల్లలు ఎదురయ్యే సమస్యలు ఇన్నీ అన్నీ కావు. ఇది గమనించిన మేం ఈ అంశాన్ని అందరికీ చెప్పాలనే ఉద్దేశ్యంతో”ప్రియమైన అమ్మకు” వీడియో తయారు చేశాం. దీనిలో ఒక అమ్మాయి, తన గల్ఫ్‌లో ఉన్న తల్లికి తన సమస్యలను ఒక ఉత్తరం ద్వారా రాసి, తల్లి చిరునామా తెలియక, ఇంట్లోనే దాచిపెట్టు కుంటుంది. ఈ వీడియో మేం మా గ్రామాంలోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా చూపించాం.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.