హెచ్.ఐ.వి హైకూలు

Posted By on March 21, 2007

మూడో పప్రంచ యుద్ధం సూదితో మొదలైందా!
నెత్తుటి బొట్టు నుంచున్న పళాన ఒణికిస్తోంది

కొమ్ములతో కోరలతో భయపెట్టే పాతకాలంవాడు కాదు
ఈ శతువ్రు జలుబుతో దగ్గుతూ క్షీణించిన కొద్దీ భయపెడతాడు

నిగహ్రమూ లేదు విశ్వాసమూ లేదు
తొడుగు ఒక్కటే దాంపత్యాన్ని రక్షిస్తుంది

ఎంత పేమ్రతో వచ్చావో చెప్పకు
ఎన్ని తొడుగులు తెచ్చావో చెప్పు

తాళి కడుతున్నది వరుడనుకొని తలవంచుకుంది
వైరస్ అని తెలీదు

శరీరాలు వేరు పేమ్రలు వేరు
రెండిటినీ ఒక కిమ్రి విడదీస్తుంది

ఆమె కలియుగ చందమ్రతి
చేసిన కాపురానికి కాటి సుంకం చెల్లించింది

పతివత్ర మంగళసూత్రం కట్టిన వాడి తర్వాత
కత్తెర పట్టిన వాడికీ కనిపిస్తుంది

శీలం ఒక బలహీనమైన దీపం
తలుపులు మూస్తే ఊపిరాడదు, తెరిస్తే గాలికాగదు

గాజురాయి కింద రెపరెపలాడే రిపోర్టు
ఇంటికి తీసుకెడుతుందో, ఊరినుంచి తరిమికొడుతుందో

దాహానికైనా దహనానికైనా మిగిలున్నది దేహమే కదా
దేహాలు లేని గామ్రం చూపించండి

పాపకు అమ్మా నాన్నలింకా పేరు పెట్టలేదు
హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్గా డాక్టర్లు బారసాలె చేశారు

బల్లమీది వృద్దురాలి గుండె లబ్డబ్ అనడం లేదు
నెగెటివ్వా, పాజిటివ్వా అని కొట్టుకుంటోంది

ఆమెకు కడుపులో పుండు ఎప్పుడో తగ్గింది
భయమే అదే పనిగా సలపరిస్తోంది

నరానికి సూది గుచ్చితే రక్తమే వస్తుంది
నగరానికి సూది గుచ్చితే భయం వచ్చింది

ఆమె ఆస్పత్రి నుంచి అప్పుడే వచ్చింది
గుట్టు విప్పడానికి కౌరవ దుశ్వాసనులు పొంచివున్నారు

శృంగారం జీవ భౌతిక అవసరం
శ్మశానాల్ని సృష్టించడమేమిటి?

కోపాన్నుంచి, అపనమ్మకాన్నుంచి, భయాన్నించి, బాధనుంచి
దిగ్భ్రాంతినుంచి, దుఃఖానికి- దశలవారీగా దహనం చేసే దాని పేరేమిటి?

రక్తం పంచుకుని ఎందుకు పుట్టావంటూ
కన్నతల్లి కుమిలిపోతోంది

బాబు రిపోర్టు కోసం ఏణ్ణార్ధం ఆగాలి
క్లోరోఫారంలో పడేసిన కప్పలాగా ఎదురుచూస్తోందామె

అతడు పోయాకే తెలిసింది
నాటి పోయిన విషవృక్షపు నీడ

ఇక ఆ తల్లికి పురుటి నొప్పుల్లేవు
కడుపునిండా కత్తికోతలే

Share

Comments

One Response to “హెచ్.ఐ.వి హైకూలు”

  1. sarath says:

    మొన్నామధ్య పులిరాజాకు AIDS అంటూ రాసిన కవిథ చాలా బాగుంది. నేను మా స్నేహ బృమదము అదిఒ చదివి చిన్నపాటి shak కు లోనైనాము. ఈ కవిత చూడగానే అదే గుర్తుకొచ్చింది.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో