విడి విడి ఆకులు
Posted By భూమిక on March 21, 2007
- ఆర్.వి.ఎం.ఆర్.రత్నా రావు, పిఠాపురం
బోల్ తలాక్ తలాక్ తలాక్
ఇద్దరి విరసపు చరమాంకంలో చెరొక దారికై తలొక ఆకు
బేక్ర్ ది లాక్, టు షేక్ ది లా, ఇవ్వొక షాక్
ఇది బానిస బత్రుకు నుంచి బైటకు వనిత చేసే వాక్
సతతం పతి సతాయింపు సహించే సహచరిణీ
తొలగించుకో నీ చుట్టూ వున్న మరమేకులన్నీ
లోకులు అందరు కలిసి కాకులైనా కానీ
తల బరువు దింపుకో తల్లడిల్లే తరుణీ
బాధ్యతే లేని నీ పవిత బంధాన్ని
జీతమివ్వని నీ జీవిత యజమాని ఇగోయిజాన్ని
నేర్పించు నిజమైన ఒక నీతి పాఠాన్ని
నైతిక బాధ్యత వహించేలా ఈ సమాజాన్ని
Comments
Leave a Reply