దార్శనికత

 యం. వసంతకుమారి
”ప్రపంచంలో ఏదైనా మార్పు తీసుకొని రావాలని స్త్రీలు నిశ్చయించుకుంటే, రేపటికల్లా మార్చగలరు. పురుషులకన్నా స్త్రీలే ఎక్కువగా త్యాగం చేయగలరు. సంప్రదాయాలను నిలబెట్టే స్త్రీ జీవితాన్ని అవగాహన చేసుకోవాలంటే, తన మానసిక ధోరణిని మార్చుకోవాలి” అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు.
 మన సంస్కృతీ సంప్రదాయాలను స్త్రీలే నేటివరకూ పరిరక్షిస్తున్నారంటే వారి శక్తి అమోఘం. కాని ఆ సంప్రదాయాలను నిల్పే స్త్రీలు, వారు ఆ శక్తిని తమ జీవితాలకు అన్వయించుకుంటూ, తమ చుట్టూ వున్న ప్రపంచాన్ని అవగాహన చేసుకునే పరిజ్ఞానాన్ని పెంచుకోగల్గాలి. వారి జీవితాలను చైతన్యవంతంగా మల్చుకునే అవగాహనా సామర్థ్యాన్ని పెంచుకోగల్గాలి.
 మనలో చాలామంది మనకున్నదే మనకు రాసిపెట్టి వుందనుకుంటాం. మనకు ఎంత రాసిపెట్టివుంటే అంతే దొరుకుతుంది అంటూ కర్మ సిద్ధాంతం వల్లిస్తుంటారు. ఇటువంటి సిద్ధాంతాలనుండి బయటపడి ప్రతి వ్యక్తీ తన శక్తేమిటో తాను తెలుసుకోగల్గాలి. ఆ శక్తికి తగినట్లుగా తన మానసిక వికాసానికి, ఒక సామాజిక ప్రయోజనానికి గానీ మనం ఏదో ఒక సంకల్పం లేదా లక్ష్యం ఏర్పరచుకోవాలి. అందుకు ఒక ఉదాహరణగా షీలా కోట్స్‌ జీవితంలో కొన్ని విషయాలు తెల్సుకుందాం.
 షీలాకోట్స్‌ సాధారణమైన స్త్రీ కాదు ఇప్పుడు. ఒకప్పుడు ఆమె మామూలుగా అందరి ఆడవాళ్లలాగే ఇంట్లో అందరికీ వండి వార్చిపెట్టడం పెళ్లైన ఇరవైఏళ్ల నుండి ఆలోచించకుండా చాకిరీ చేస్తూనే వుండేది. ఒక అలవాటుగా జీవితంలో భాగమైంది. ఇదే జీవితమన్నట్టుగా బతికింది. ఒకరోజు…
 ”ఇంకా ఎన్నాళ్లిలా వాళ్లకి తిండిపెడ్తావు?” ”వాళ్లకి తిండి ఇలా చేసి పెడుతునే వుంటావా?” అని ఆమె చెల్లెలు అడిగింది.
 ”ఏమీ అర్థం కాలేదు.”
 ”నీ కొడుక్కెన్నేళ్లు” అడిగింది చెల్లెలు.
 ”16” అన్నది కోట్స్‌.
 ”ఇంకా పసిపాప అనుకుంటున్నావా? ఎందుకు చేస్తున్నావు?” ఆ క్షణంలో షీలాకోట్స్‌ మేల్కొంది. తనేమిటో తెలుసుకుంది. తన చెల్లెలు పదిహేనేళ్లు చిన్నదైనప్పటికి తనను సవాలు చేసిందేనని తనను తాను ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నించుకోవడమే తన జీవితాన్నే మార్చివేసింది.
 కోట్స్‌ అమెరికాలోని ప్రఖ్యాత న్యాయవాదులలో ఒకరుగా మారిపోయారు. కోట్స్‌ వంటగది నుండి వైట్‌హౌస్‌ వరకు తన ప్రభావాన్ని పెంపొందించుకున్న మహిళగా ఎదిగింది.
 కోట్స్‌ తన పాతరోజులు తల్చుకుంటూ ”నా జీవితాన్ని తిరిగి తరచి చూసుకున్నాను. నా జీవితంలో ఇంత అలజడి, అసంతృప్తి వుందని గుర్తించలేదు. అంతేకాకుండా నా ముగ్గురు కొడుకులను స్త్రీల మీద ఆధారపడడం నేర్పించాను” అని గుర్తుచేసుకుంది.
 ఆ రోజు తన చెల్లెలుతో జరిగిన చర్చ తన జీవితాన్నే తిరగరాసింది. తన జీవితాన్ని సీరియస్‌గా తీసుకుని పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ లా చదివి అమెరికాలోనే శక్తివంతమైన ఔజిబిబీది ఇళిళీబిదీ ఏదీరిశిలిఖి తీళిజీ జుబీశిరిళిదీ కి నాయకురాలిగా ఏఐ, ్పుబిదీబిఖిబి, జుతీజీరిబీబి వివిధ దేశప్రజలకు సేవలు అందిస్తున్నారు. బలహీన ప్రజలందరికి చేయూతనిస్తారు.
 ప్రపంచంలో 80% మంది ఫాలోయిర్స్‌ కావాలనుకుంటారు, 20% నాయకులు కావాలని, 10% మంది మాత్రమే వాళ్లలోని శక్తిని గుర్తించి చుట్టూ వున్న వనరులను వుపయోగించుకుని ఒక దార్శనిక దృష్టితో ఇతరులను ప్రభావితం చేస్తారు. అందులో కోట్స్‌ ఒకరు.
 యాంత్రిక జీవితంలో పడి ఇది చేస్తే ఏమౌతుందో అది చేస్తే ఏమౌతుందోనన్న సంకోచాలతో సతమతమౌతారు. ఇది వీడినప్పుడే దృఢ సంకల్పంతో ముందుకు పోగలరు.
 ”ఆలోచించడానికి టైం ఎక్కడుంది, పిల్లలకు పాఠాలు చెప్పాలి, వంట చెయ్యాలి……….. కొన్నిసార్లు రోజువారీ జీవితంలో తలమునకై కుటుంబాన్ని సంతోషపెట్టడంలోనే తాపత్రయపడి సమయాన్ని గడిపేస్తుంటాం. మనం మన గురించి ఆలోచించడం మానేస్తాం.  మనకున్నదే మనకు రాసిపెట్టి వున్నదనుకుంటాం. ఉద్యోగం, సంసారమే ముఖ్యమనుకుని మనకు మనమే గిరిగీసుకుంటాం. ఈ క్రమంలో నిజంగా అవసరమైనవాటిని విస్మరిస్తాం. ఎవరికి ఎంత రాసుంటే అంతే దొరుకుతుందని మనల్ని మనను నమ్మించుకుంటాం. కాని కొందరు గీసుకున్న గీతల్ని దాటడానికి సిద్ధపడతారు. వారినే దార్శినికులంటాం. ప్రయత్నిస్తే మీకూ ఆ కొత్తలోకాలు కనిపిస్తాయి. అంటే నోబెల్‌ ప్రైజ్‌ గెల్చుకోవడమో, మరో ఘనకార్యమో సాధించాలని కాదు. ఆఫీసులో నిచ్చెనలెక్కి పైకి పోవాలని కాదు. ఈ జీవితంలో నీకు ఏమి కావాలో తెల్సుకోవటం ముఖ్యం. అది సాధించటంలో ఎవరు అడ్డు తగలకుండా చూసుకోవాలి. ఇది అనుభవజ్ఞానం. అనేక అవకాశాలున్నప్పుడు మనకు కావల్సింది ఎంపిక చేసుకోగల్గాలి. ఆత్మసంయమనం, ఆత్మపరిశీలన కూడా అవసరమే.
 ఆత్మవిశ్వాసం మరీ ముఖ్యం. మనకు అనేక పనులు చేయగల సామర్ధ్యం వుంటుంది. కాని వాటిలో ఏదో ఒకదానిని మాత్రమే బాగా చేయగలం. అది చేస్తే మనసుకు సంతోషంగా వుంటుంది. ఏదో సాధించినట్టుగా గర్వంగా వుంటుంది. అది కీలకం. ఇదంతా మానసిక ప్రక్రియ. మంచులో ఆడే ఆటలు గానీ, ఆఫీసు వ్యవహారాలు గానీ, పరిస్థితులను తట్టుకోగల్గడం అవసరం. అలసిపోయామనుకున్నప్పుడు, కాసేపు విశ్రాంతి తీసుకుని, పునఃసమీక్ష చేసుకోవాలి. అనుకున్నది సాధించడం కష్టమే. కాని అది నీ కల. స్వప్నం. కలలను భద్రంగా పదిలపరచుకోవాలి. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రేరణ పొందిన ఈ శరీరం ఇప్పటికన్నా యాభైరెట్లు ఎక్కువ పని చేయగలదు. ఈ దార్శనికతను మరింత బలపరిచేది  తపన.
 నిచ్చెన ఎక్కుతున్నప్పుడు ఒక చేయి తాడును పట్టుకుని, ఒక కాలు మెట్టు మీద ఆన్చి, మన దృష్టిమాత్రం రెండు మెట్లపైన కేంద్రీకరిస్తాం. అది గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యవిషయం.

Share
This entry was posted in చర్చ. Bookmark the permalink.

6 Responses to దార్శనికత

 1. M.vasanthakumari says:

  కొందవీటి సత్యవతి గారు,
  భూమిక చూసాను ఆలస్యంగా .నా ఆర్టీకల్ వెసారు ధన్యవాధాలు సత్యవతి గారు.
  షికాగొ.

 2. వసంతకుమారి గారూ,
  కోటీస్ గారు చదవడం మొదలు పెట్టాక వాళ్ళింట్లో వంట ఎవరు చేసేవారో చెప్పలేదు కదా? అప్పట్నించీ ఇప్పటి వరకూ ఇంట్లో అందరూ కలిసే వంట చేసుకుంటున్నారా? ఆ వివరాలిస్తే అభివృద్ధి అనేది ఎలా సాధ్యమవుతుందో తెలిసేది. మా కంపెనీలో పని చేసే స్త్రీలందరూ (ఇంజనీరు ఉద్యోగాలు చేసేవారు కూడా) ఇంటికి వెళ్ళాక వాళ్ళే వంట చేస్తారు మరి. పైపెచ్చు, “మా ఆయనకి వంట రాదని” కొందరూ, “ఆయన్ని వంటిట్లోకి రానిస్తే, అంతా గజిబిజి చేస్తారని” కొందరూ, “మా ఆయన గ్రోసరీ పనులూ, ప్లంబింగు పనులూ చేస్తారని” కొందరూ గొప్పగా చెప్పుకుంటూ వంట చేస్తారు. ఈ చదువులూ, ఉద్యోగాలూ అదనపు పనులై పోతున్నాయి స్త్రీలకు.

  ఈ కింద వాక్యం ఏ భాషకి చెంది వుంటుందీ?
  “ఔజిబిబీది ఇళిళీబిదీ ఏదీరిశిలిఖి తీళిజీ జుబీశిరిళిదీ కి నాయకురాలిగా ఏఐ, ్పుబిదీబిఖిబి, జుతీజీరిబీబి ”

  “నాయకురాలిగా” అన్న పదం తప్ప ఒక్క మాట అర్థం కాలేదు ఈ మాంత్రిక భాషలో.

  సావిత్రి

 3. సావిత్రి గారూ
  మీరు రాసిన గజి బిజి వాక్యము ఇంగ్లీషు లో ఉంది.యూనికోడు లోకి మార్చేటప్పుడు పొరపాటున అలాగే ఉండి పోయింది.దానిని మారుస్తాను.
  మీ అభిప్రాయాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు.

  సత్యవతి
  ఎడిటరు
  భూమిక

 4. M.vasanthakumari says:

  సావిత్రి గారు,
  వంట ఎవరు ఛెస్తున్నారని కాదు,వంటే జీవితమ కాకూడదు.ఒక్క సారి మానసికంగా ఏదిగిన తర్వాత మనిషిగ, వ్యక్తి గా తానెమిటొ తెలుసుకున్నకా
  ఏమి ఛేసినా పర్వలెదు. గజిబిజి వాక్యము గురించి సత్యవతి గారు వివరణ ఇఛ్ఛారుకదా.. మీ అభిప్రాయలు తెలియ చెసినందుకు దన్యవాదాలు.
  రచ యిత్రి.
  వసంతకుమారి.

 5. వసంతకుమారి గారూ,
  మీ అభిప్రాయం ప్రకారం, ఒక స్త్రీ తన తెలివితేటలు తను గుర్తించి, ఇంట్లో వంటలూ, గట్రా చేస్తూనే, ఇంకో పక్క కష్టపడి చదువుకుని, పెద్ద ఉద్యోగం సంపాదించి, ఇంట్లో వాళ్ళకి (ముఖ్యంగా పురుషులకి) ఎక్కువ డబ్బు కూడబెడుతూ, బయట గుర్తింపూ, కీర్తీ పొందుతూ వున్నప్పుడు, ఆ స్త్రీ ఇంట్లో వంట లాంటి ఇంటి పనులు ఎవరు చేస్తారు అనేది పట్టించుకోకూడదు అని అర్థం కదూ? ఇదెక్కడి అన్యాయం అండీ? ఒక స్త్రీ తానేమిటో తాను తెలుసుకున్నందుకు శిక్ష, ఇంట్లో పనులు ఎవరూ పంచుకోకపోవడమా? ఇంటి చాకిరీ ఎవరు చేస్తే ఏమిటీ అన్న వాక్యంలోనే అసమానత్వం కనిపిస్తోంది. ఒక స్త్రీ బయటి పనుల్లో ఉన్నప్పుడు, ఇంటి పనులు ఆ స్త్రీకి అదనపు బాధ్యత కాకూడదు. స్త్రీ పురుషుడి లాగా బయట కూడా పని చేస్తున్నప్పుడు, ఆ పురుషుడు ఇంటి పని కూడా ఎందుకు చెయ్యకూడదూ? స్త్రీలయితే ఇంటా, బయటా పని చెయ్యాలా? పురుషులయితే బయట మాత్రమే పని చేసి, (సుతారమైన ఇంటి పనులు బాధ్యత లేకుండా చేస్తూ) ఊరుకుంటారా? ఇదెప్పటికీ స్త్రీకి అభివృద్ధి కాదు. ఇంట్లో వంట ఎవరు చేస్తారన్నది చాలా ముఖ్య విషయం స్త్రీ అభివృద్ధి విషయంలోనూ, సమానత్వం విషయంలోనూ.
  – సావిత్రి

 6. ramnarsimhareddy says:

  దార్షనికత –

  చర్చకు దారితీయడం అభినందనీయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో